Postpaid Tariffs
-
Airtel: ఎయిర్టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్
ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవల ఎయిర్టెల్ ప్రీపెయిడ్ టారిఫ్‌తో పాటు డేటా ధరల్ని పెంచింది. ప్రీపెయిడ్ టారిఫ్‌ను 20 నుంచి 25 శాతం, డాటా టాప్ అప్ ప్లాన్ల మీద 20 నుంచి 21 శాతం పెంచేసింది. ఈ పెరిగిన కొత్త ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అదే సమయంలో ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ సెలెక్టెడ్ ప్లాన్స్‌పై ప్రతిరోజూ 500ఎంబీ డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఆ ప్లాన్స్ ఇలా ఉన్నాయి ప్రతిరోజు ఎయిర్టెల్ అందిస్తున్న 500 ఎంబీ డేటా ఉచితంగా పొందాలంటే సంబంధిత ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీ నంబర్‌పై రూ.265, రూ. 299, రూ. 719, రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్లను రీఛార్జ్ చేసుకుంటే ఉచితంగా 500ఎంబీ డేటాను పొందవచ్చు. అయితే ఇది అన్ని ప్రీపెయిడ్ ప్లాన్లకు వర్తించదని ఎయిర్ టెల్ తన ప్రకటనలో తెలిపింది. రూ. 265 ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల పాటు రోజుకు 1.5జీబీ డేటా, రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్ 2 జీబీ డేటా 28 రోజులు, 84 రోజులకు రోజువారీ డేటాను అందిస్తుంది. రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2.5జీబీ డేటాను 84 రోజుల పాటు పొందవచ్చు. అయితే ఉచిత డేటాను పొందాలంటే పైన ఎంపిక చేసిన ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ టెల్ పెంచిన ధరలు ♦ఎయిర్ టెల్ పెంచిన రూ. 79గా ఉన్న ప్లాన్ రేటు రూ. 99కి చేరింది. ఇది 28 రోజుల వ్యాలిడిటీ, రూ. 99 విలువ చేసే టాక్‌టైమ్, 200 ఎంబీ డేటా, సెకనుకు పైసా వాయిస్ టారిఫ్ ఉంటుంది. ♦ అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్లలో రూ. 149 ప్లాన్ ధర రూ. 179కి పెంచింది. అలాగే రూ. 2,498 ప్లాన్ రూ. 2,999గా మారింది. . ♦ డేటా టాప్ అప్ రూ. 48 ప్లాన్ ఇకపై రూ. 58కి (3 జీబీ డేటాతో), రూ. 98 ప్లాన్ కొత్తగా రూ. 118కి (12 జీబీ డేటా) మారింది. ♦ రూ. 251 డేటా టాప్ అప్ ప్లాన్ రేటు ఇకపై రూ. 301కి (50 జీబీ డేటా) కి చేరింది. చదవండి: హ్హ..హ్హ..హ్హ!..హీరో అక్షయ్ కుమార్ నవ్వుతుంటే, బిగ్బుల్ హాయిగా నిద్రపోతున్నాడే -
రూ.500లోపు బెస్ట్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఇవే!
న్యూఢిల్లీ: కరోనావైరస్ నేపథ్యంలో 2020లో ప్రజలు తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. దింతో ఇంటర్నెట్ వినియోగం మాత్రం విపరీతంగా పెరిగి పోయింది. దింతో వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం టెలికాం కంపెనీలు కొత్త ఆఫర్లు తీసుకొచ్చాయి. కంపెనీలు అపరిమిత కాల్, డేటాతో సరిపెట్టుకోకుండా యూజర్ల కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ తో సహా ప్రధాన ఓటీటీ ప్లాట్ఫార్మ్లను ఉచితంగా యాక్సెస్ చేసుకుందుకు వీలు కలిపిస్తున్నాయి. ప్రస్తుతం టెలికం దిగ్గజ కంపెనీలు రూ.500 లోపు అందిస్తున్న ఉత్తమ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ఒకసారి పరిశీలిద్దాం. జీయో రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్: రిలయన్స్ జియో తన జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్లను రూ.399 నుంచి రూ.1499 వరకు ప్రకటించింది. రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కింద 75 జీబీ డేటాను అందిస్తుంది. ఆ తర్వాత వినియోగదారులకు జీబీకి రూ.10 చొప్పున వసూలు చేస్తారు. ఈ ప్లాన్ 200 జీబీ రోల్ఓవర్ డేటాను తెస్తుంది. ఈ ప్లాన్‌ను కొనుగోలు చేసే వారికి జీయో యాప్ ఉచిత యాక్సెస్ లభిస్తుంది. అదనపు ఖర్చు లేకుండా జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ వినియోగదారులకు షాపింగ్, వినోద ప్రయోజనాలను అందించడానికి రిలయన్స్ జీయో అమెజాన్ ప్రైమ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ప్రణాళికలో భాగంగా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, హాట్‌స్టార్ వంటి ఇతర ఓటిటీ యాప్స్ ఉచితంగా పొందవచ్చు. ఎయిర్టెల్ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్‌లో 3జీ లేదా 4జీ స్పీడ్‌తో 40జీబీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను పొందవచ్చు. ఈ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లో ఉచితంగా ఎటువంటి ఓటిటీ ప్రయోజనాలు లభించవు. ఎయిర్టెల్ వెబ్సైట్లో తెలిపిన నిబంధనలు, షరతుల ప్రకారం 499 లేదా అంతకంటే ఎక్కువ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ఎంచుకునే ఎయిర్టెల్ వినియోగదారులు 'ప్రియారిటీ సర్వీస్' పొందటానికి మాత్రమే అర్హులు. ఈ ప్లాన్ 6 నెలల ప్రామాణికతతో 200జీబీ డేటా రోల్‌ఓవర్‌ను కూడా అందిస్తుంది. వోడాఫోన్ ఐడియా రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్: తాజాగా రీబ్రాండెడ్ చేసిన వోడాఫోన్ ఐడియా(వీఐ) పోస్ట్‌పెయిడ్ రూ.399 ప్లాన్‌లో 40జీబీ డేటాను అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ కాల్స్ ఎస్ టిడీతో పాటు 6 నెలల పాటు 150జీబీ రోల్ఓవర్ డేటా కూడా అందిస్తుంది. వీఐ పోస్ట్‌పెయిడ్ యూజర్లకు ఒటిటి ప్రయోజనాలు ఎయిర్టెల్ విషయంలో మాదిరిగానే రూ.499పై ప్లాన్ లలో లభిస్తాయి. రూ.499 ప్లాన్ కింద Vi మూవీస్ & టీవీ యాప్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లో 75జీబీ డేటా, అన్లిమిటెడ్ ఎస్ టిడీ, లోకల్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. -
జియో: భారత్‌లో తొలిసారి ఇన్–ఫ్లైట్ సేవలు
-
జియో.. పోస్ట్‌పెయిడ్ ప్లస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ టారిఫ్‌లు, బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో ధరల యుద్ధానికి తెరలేపి సంచలనం సృష్టించిన రిలయన్స్‌కు చెందిన టెలికం సంస్థ జియో.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటి వరకు కేవలం రూ.199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌కు పరిమితమైన ఈ కంపెనీ కొత్తగా పోస్ట్‌పెయిడ్ ప్లస్ పేరుతో నూతన సేవలను మంగళవారం ప్రకటించింది. నెల టారిఫ్ రూ.399తో మొదలుకుని రూ.1,499 వరకు ఉంది. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండానే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్, హాట్‌స్టార్ ఎంజాయ్ చేయవచ్చు. ఫ్యామిలీ ప్లాన్, డేటా రోల్ఓవర్ ఆకర్షణీయ ఫీచర్లుగా నిలవనున్నాయి. విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులకు తొలిసారిగా ఇన్‌ఫ్లైట్ కనెక్టివిటీ ప్రవేశపెట్టారు. కస్టమర్ కోరితే ఇంటి వద్దకే వచ్చి సర్వీస్ యాక్టివేట్ చేస్తారు. ప్రీపెయిడ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో 40 కోట్ల మంది కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్నామని జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రతి పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త సేవలను పరిచయం చేశామన్నారు. పోస్ట్‌పెయిడ్ ప్లస్ విశేషాలు.. ఇంటర్నేషనల్ కాలింగ్ చార్జీ నిముషానికి 50 పైసల నుంచి ప్రారంభం. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వైఫై కాలింగ్ ద్వారా భారత్‌కు నిముషానికి రూపాయికే కాల్ చేయవచ్చు. డేటా రోల్ఓవర్ పేరుతో అదనంగా డేటాను ఆఫర్ చేస్తోంది. దీని కింద ఇచ్చినదాంట్లో మిగిలిపోయిన డేటానే తదుపరి నెలకు జమ అవుతుంది. అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ చేసుకోవచ్చు. ప్యాక్నిబట్టి ఫ్యామిలీ ప్లాన్ కింద అదనపు కనెక్షన్లు పొందవచ్చు. ఇలా అదనంగా కనెక్షన్ తీసుకున్న కుటుంబ సభ్యులు ప్యాక్ కింద వచ్చిన డేటాను వాడుకోవచ్చు. ఇవీ నూతన టారిఫ్‌లు..: రూ.399 ప్యాక్‌లో 75 జీబీ డేటా లిమిట్ ఉంది. అలాగే డేటా రోల్ఓవర్ కింద 200 జీబీ ఇస్తారు. 100 జీబీ డేటాతో కూడిన రూ.599 ప్యాక్‌లో డేటా రోల్ఓవర్ 200 జీబీ, ఫ్యామిలీ ప్లాన్ కింద ఒక సిమ్ అదనం. రూ.799 ప్యాక్‌లో 150 జీబీ డేటా, 200 జీబీ డేటా రోల్ఓవర్, ఫ్యామిలీ ప్లాన్‌లో 2 అదనపు సిమ్‌లు పొందవచ్చు. రూ.999 ప్యాక్‌లో 200 జీబీ డేటా, 500 జీబీ డేటా రోల్ఓవర్, 3 అదనపు సిమ్‌లు లభిస్తాయి. రూ.1,499 టారిఫ్‌లో 300 జీబీ డేటా, 500 జీబీ డేటా రోల్ఓవర్తోపాటు యూఎస్ఏ, యూఏఈలో అన్లిమిటెడ్ డేటా, వాయిస్ ఆఫర్ చేస్తున్నారు. -
జియో ప్లాన్స్ అప్ డేట్!
రిలయన్స్ జియో తన ప్రైమ్ యూజర్లకు ఇస్తున్న ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ ప్లాన్స్ ను అప్ డేట్ చేసినట్టు తెలిసింది. ఇప్పటివరకు కేవలం మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ ను మాత్రమే కంపెనీ తన వెబ్ సైట్ లో పేర్కొంది. కానీ ప్రస్తుతం జియో తన వెబ్ సైట్ లోని ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ ప్లాన్స్ ను ఎక్కువ డేటాతో అప్ డేట్ చేసిందని తెలిసింది. ముందస్తు చెప్పిన మాదిరిగా 19 రూపాయల నుంచి 9999 రూపాయల వరకు జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉంటాయి. అదేవిధంగా పోస్టు పెయిడ్ ప్లాన్స్ 309, 509, 999 డినామినేషన్లో ఉండనున్నాయని కంపెనీ తన వెబ్ సైట్లో పేర్కొంది. రూ.303, రూ.499 ప్లాన్స్ ను రూ.309, రూ.509 తో రీప్లేస్ చేసినట్టు కంపెనీ అంతకమునుపే పేర్కొన్న సంగతి తెలిసిందే. రూ.309, రూ.509 ప్లాన్స్ కేవలం ప్రీపెయిడ్ యూజర్లకే జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్ డేట్ చేసిన ప్లాన్స్ కింద ధన్ ధనా ధన్ ఆఫర్ ప్రయోజనాలను పోస్టుపెయిడ్ ప్లాన్స్ కు అందిస్తున్నట్టు కంపెనీ తన వెబ్ సైట్ లో తెలిపింది. రూ.309 లేదా ఇతర ప్లాన్స్ కేవలం జియో ప్రైమ్ యూజర్లకే కంపెనీ ప్రకటించింది. కానీ ప్రస్తుతం ఏ రీఛార్జ్ ప్యాక్ నైనా ప్రైమ్ సభ్యత్వం లేని జియో యూజర్లు కొనుగోలు చేసేలా అవకాశం కల్పించింది. జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకునే మొత్తంపై ఆధారపడి ఉంటుంది. 19 రూపాయల ప్లాన్ తో రోజంతా 200 ఎంబీ 4జీ డేటాను ప్రైమ్ యూజర్లకు కల్పించనుంది. అదేవిధంగా నాన్ ప్రైమ్ యూజర్లు అయితే 100 ఎంబీ డేటాను పొందనున్నారు. అదేవిధంగా రూ.49, రూ.96, రూ.149 రీఛార్జ్ ప్యాక్‌లతో ప్రైమ్, నాన్ ప్రైమ్ యూజర్లకు డేటా ఆఫర్లను అందించనున్నట్టు కంపెనీ తన వెబ్ సైట్లో పేర్కొంది. జియో పోస్టు పెయిడ్ ప్లాన్స్ పోస్టు పెయిడ్ జియో కస్టమర్లు రూ.309 ప్లాన్ కింద ఫస్ట్ రీఛార్జ్ మూడు నెలల వరకు 90జీబీ డేటాను పొందనున్నారు. రోజుకు 1జీబీ డేటాను వాడుకోవచ్చు. అదే 509 రూపాయల ఫస్ట్ రీఛార్జ్ తో అయితే 180జీబీ 4జీ డేటాను మూడు నెలల వరకు వాడుకోవచ్చు. అంటే రోజుకు 2జీబీను యూజర్లు పొందుతారు. 999 రూపాయల రీఛార్జ్ తో కూడా 180జీబీ డేటానే పొందవచ్చు. కానీ డైలీ వాడకంపై కంపెనీ ఎలాంటి పరిమితులు విధించలేదు. ఈ మూడు ప్లాన్స్ పైనా ఫస్ట్ రీఛార్జ్ తర్వాత రీఛార్జ్ లపై 60జీబీ డేటాను నెలపాటు పొందుతారు.