జియో ప్లాన్స్ అప్ డేట్!
జియో ప్లాన్స్ అప్ డేట్!
Published Tue, Apr 25 2017 4:27 PM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM
రిలయన్స్ జియో తన ప్రైమ్ యూజర్లకు ఇస్తున్న ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ ప్లాన్స్ ను అప్ డేట్ చేసినట్టు తెలిసింది. ఇప్పటివరకు కేవలం మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ ను మాత్రమే కంపెనీ తన వెబ్ సైట్ లో పేర్కొంది. కానీ ప్రస్తుతం జియో తన వెబ్ సైట్ లోని ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ ప్లాన్స్ ను ఎక్కువ డేటాతో అప్ డేట్ చేసిందని తెలిసింది. ముందస్తు చెప్పిన మాదిరిగా 19 రూపాయల నుంచి 9999 రూపాయల వరకు జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉంటాయి. అదేవిధంగా పోస్టు పెయిడ్ ప్లాన్స్ 309, 509, 999 డినామినేషన్లో ఉండనున్నాయని కంపెనీ తన వెబ్ సైట్లో పేర్కొంది.
రూ.303, రూ.499 ప్లాన్స్ ను రూ.309, రూ.509 తో రీప్లేస్ చేసినట్టు కంపెనీ అంతకమునుపే పేర్కొన్న సంగతి తెలిసిందే. రూ.309, రూ.509 ప్లాన్స్ కేవలం ప్రీపెయిడ్ యూజర్లకే జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్ డేట్ చేసిన ప్లాన్స్ కింద ధన్ ధనా ధన్ ఆఫర్ ప్రయోజనాలను పోస్టుపెయిడ్ ప్లాన్స్ కు అందిస్తున్నట్టు కంపెనీ తన వెబ్ సైట్ లో తెలిపింది. రూ.309 లేదా ఇతర ప్లాన్స్ కేవలం జియో ప్రైమ్ యూజర్లకే కంపెనీ ప్రకటించింది. కానీ ప్రస్తుతం ఏ రీఛార్జ్ ప్యాక్ నైనా ప్రైమ్ సభ్యత్వం లేని జియో యూజర్లు కొనుగోలు చేసేలా అవకాశం కల్పించింది.
జియో ప్రీపెయిడ్ ప్లాన్స్
జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకునే మొత్తంపై ఆధారపడి ఉంటుంది. 19 రూపాయల ప్లాన్ తో రోజంతా 200 ఎంబీ 4జీ డేటాను ప్రైమ్ యూజర్లకు కల్పించనుంది. అదేవిధంగా నాన్ ప్రైమ్ యూజర్లు అయితే 100 ఎంబీ డేటాను పొందనున్నారు. అదేవిధంగా రూ.49, రూ.96, రూ.149 రీఛార్జ్ ప్యాక్లతో ప్రైమ్, నాన్ ప్రైమ్ యూజర్లకు డేటా ఆఫర్లను అందించనున్నట్టు కంపెనీ తన వెబ్ సైట్లో పేర్కొంది.
జియో పోస్టు పెయిడ్ ప్లాన్స్
పోస్టు పెయిడ్ జియో కస్టమర్లు రూ.309 ప్లాన్ కింద ఫస్ట్ రీఛార్జ్ మూడు నెలల వరకు 90జీబీ డేటాను పొందనున్నారు. రోజుకు 1జీబీ డేటాను వాడుకోవచ్చు. అదే 509 రూపాయల ఫస్ట్ రీఛార్జ్ తో అయితే 180జీబీ 4జీ డేటాను మూడు నెలల వరకు వాడుకోవచ్చు. అంటే రోజుకు 2జీబీను యూజర్లు పొందుతారు. 999 రూపాయల రీఛార్జ్ తో కూడా 180జీబీ డేటానే పొందవచ్చు. కానీ డైలీ వాడకంపై కంపెనీ ఎలాంటి పరిమితులు విధించలేదు. ఈ మూడు ప్లాన్స్ పైనా ఫస్ట్ రీఛార్జ్ తర్వాత రీఛార్జ్ లపై 60జీబీ డేటాను నెలపాటు పొందుతారు.
Advertisement
Advertisement