Reveal
-
కూతురి పేరును రివీల్ చేసిన ప్రముఖ నటి.. అర్థం అదేనట!
ప్రముఖ బాలీవుడ్ నటి మసాబా గుప్తా (Masaba Gupta) గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 2024 అక్టోబర్‌లో కుమార్తెకు(daughter) స్వాగతం పలికింది. ఈ విషయాన్ని మసాబా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తాజాగా తన ముద్దుల కూతురి పేరును రివీల్ చేసింది. మతారా అనే పేరు పెట్టినట్లు వెల్లడించింది. అంతేకాదు ఆ పేరుకు అర్థాన్ని కూడా వివరించింది మసాబా. తన చేతికి ధరించిన గాజును కూతురి పేరు కనిపించేలా డిజైనా చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.మసాబా తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా ముద్దుల కూతురు మాతారకు అప్పుడే 3 నెలలు. తన పేరు 9 మంది హిందూ దేవతల స్త్రీ శక్తులను కలిగి ఉంది. తన కూతురికి ఆ దేవతల ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. అంతేకాదు మా కళ్లకు నక్షత్రం లాంటిది." అంటూ పోస్ట్ చేసింది.2023లో పెళ్లి..కాగా.. మసాబా గుప్తా (Masaba Gupta), సత్యదీప్ మిశ్రా (Satyadeep Mishra) జనవరి 27, 2023న వివాహం చేసుకున్నారు. కాగా.. గతేడాది ఏప్రిల్ 18న మసాబా గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన భర్త సత్యదీప్‌తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. అక్టోబర్ 10, 2024న కూతురికి జన్మనిచ్చింది.ఎవరీ మసాబా గుప్తా..?కాగా ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురే మసాబా గుప్తా. ఈమె గతేడాది జనవరిలో నటుడు సత్యదీప్ మిశ్రాను రెండో పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ దంపతులు త్వరలో పేరెంట్స్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఇకపోతే మసాబా తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మసాబా మసాబా అనే సిరీస్‌లో నటించింది. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta) -
Magazine Story: తిన్నారో.. చచ్చారే! హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్
-
'నా వాళ్లే అనుకుంటే కేసులు పెడుతున్నారు'.. ఆసక్తి పెంచుతోన్న గ్లింప్స్!
గతేడాది ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ చిత్రంతో ప్రేక్షకులను పలకించాడు నితిన్. ఈ చిత్రంలో అతనికి జోడీగా శ్రీలల నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే నితిన్ ప్రస్తుతం మరో చిత్రంలో నటిస్తున్నారు. వెంకీ కుడుముల డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న ఈ సినిమాను నవీన్ యేర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో పాటు టైటిల్ కూడా రివీల్ చేసేశారు. గ్లింప్స్ చూస్తే ఈ చిత్రం రాబరీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రాబిన్‌హుడ్ అనే టైటిల్ ఖరారు చేశారు. అంతే కాకుండా నితిన్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో 'తమ్ముడు' చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. Unmasking the Con Man from the most entertaining & adventurous world 💥💥 Say hello to your new family member - #ROBINHOOD ❤️🔥 Title reveal glimpse out now! - https://t.co/BoPSPtzMT4#IdhiVere #VN2 @actor_nithiin @VenkyKudumula @gvprakash pic.twitter.com/liAOgVVKwD — Mythri Movie Makers (@MythriOfficial) January 26, 2024 -
క్రికెట్ ఆస్ట్రేలియాపై డేవిడ్ వార్నర్ ఫైర్..!
-
నా ఏజ్ కనిపించక పోవడానికి సీక్రెట్ ఏంటంటే..!
-
శ్రీముఖితో ఉన్న రిలేషన్ ను బయట పెట్టిన సాయి శ్రీ చరణ్...
-
నా సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం ఏంటి అంటే...
-
నా సొంత డబ్బు 25 లక్షలు పెట్టి సెట్ వేస్తే ఆ పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు కూల్చేశారు...
-
శ్రీముఖి తో వున్న రీలేషన్ ని రివీల్ చేసిన సాయి చరణ్..
-
WTC ఫైనల్ కి ముందు కోహ్లి గాయం...అడతాడ లేదా..
-
పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంది.. రవిబాబు షాకింగ్ కామెంట్స్
-
ఆర్ఆర్ఆర్ టైటిల్ ఇదే..
హైదరాబాద్ : మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నిర్దేశకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ వర్కింగ్ టైటిల్ చుట్టూ నెలకొన్న ఉత్కంఠకు చిత్ర రూపకర్తలు త్వరలోనే తెరదించనున్నారు. ఈ చిత్ర టైటిల్‌ను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ అంటే రఘుపతి రాఘవ రాజారాం అని తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల పాత్రల్లో రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు కనిపించనున్న ఈ మూవీకి ఈ టైటిల్ కచ్చితంగా సరిపోతుందని భావిస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజం అజయ్ దేవ్గన్, దేశీ బ్యూటీ అలియా భట్లు కూడా ఈ మూవీలో కీలక పాత్రల్లో నటించనుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇక అలియా భట్ త్వరలోనే చిత్రీకరణలో పాల్గొంటారని, ఆమె పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణతో దాదాపు మూవీ షూటింగ్ పూర్తవుతుందని భావిస్తున్నారు. ఇక వీఎఫ్ఎక్స్కు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉండటంతో ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీని వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు. మరోవైపు చరణ్, తారక్‌ల ఫస్ట్ లుక్‌లను మార్చి 27, మే 20 తేదీల్లో వారి బర్త్‌డే రోజున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. చదవండి : ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న మరో మల్టీస్టారర్..! -
జియో ప్లాన్స్ అప్ డేట్!
రిలయన్స్ జియో తన ప్రైమ్ యూజర్లకు ఇస్తున్న ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ ప్లాన్స్ ను అప్ డేట్ చేసినట్టు తెలిసింది. ఇప్పటివరకు కేవలం మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ ను మాత్రమే కంపెనీ తన వెబ్ సైట్ లో పేర్కొంది. కానీ ప్రస్తుతం జియో తన వెబ్ సైట్ లోని ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ ప్లాన్స్ ను ఎక్కువ డేటాతో అప్ డేట్ చేసిందని తెలిసింది. ముందస్తు చెప్పిన మాదిరిగా 19 రూపాయల నుంచి 9999 రూపాయల వరకు జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉంటాయి. అదేవిధంగా పోస్టు పెయిడ్ ప్లాన్స్ 309, 509, 999 డినామినేషన్లో ఉండనున్నాయని కంపెనీ తన వెబ్ సైట్లో పేర్కొంది. రూ.303, రూ.499 ప్లాన్స్ ను రూ.309, రూ.509 తో రీప్లేస్ చేసినట్టు కంపెనీ అంతకమునుపే పేర్కొన్న సంగతి తెలిసిందే. రూ.309, రూ.509 ప్లాన్స్ కేవలం ప్రీపెయిడ్ యూజర్లకే జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్ డేట్ చేసిన ప్లాన్స్ కింద ధన్ ధనా ధన్ ఆఫర్ ప్రయోజనాలను పోస్టుపెయిడ్ ప్లాన్స్ కు అందిస్తున్నట్టు కంపెనీ తన వెబ్ సైట్ లో తెలిపింది. రూ.309 లేదా ఇతర ప్లాన్స్ కేవలం జియో ప్రైమ్ యూజర్లకే కంపెనీ ప్రకటించింది. కానీ ప్రస్తుతం ఏ రీఛార్జ్ ప్యాక్ నైనా ప్రైమ్ సభ్యత్వం లేని జియో యూజర్లు కొనుగోలు చేసేలా అవకాశం కల్పించింది. జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకునే మొత్తంపై ఆధారపడి ఉంటుంది. 19 రూపాయల ప్లాన్ తో రోజంతా 200 ఎంబీ 4జీ డేటాను ప్రైమ్ యూజర్లకు కల్పించనుంది. అదేవిధంగా నాన్ ప్రైమ్ యూజర్లు అయితే 100 ఎంబీ డేటాను పొందనున్నారు. అదేవిధంగా రూ.49, రూ.96, రూ.149 రీఛార్జ్ ప్యాక్‌లతో ప్రైమ్, నాన్ ప్రైమ్ యూజర్లకు డేటా ఆఫర్లను అందించనున్నట్టు కంపెనీ తన వెబ్ సైట్లో పేర్కొంది. జియో పోస్టు పెయిడ్ ప్లాన్స్ పోస్టు పెయిడ్ జియో కస్టమర్లు రూ.309 ప్లాన్ కింద ఫస్ట్ రీఛార్జ్ మూడు నెలల వరకు 90జీబీ డేటాను పొందనున్నారు. రోజుకు 1జీబీ డేటాను వాడుకోవచ్చు. అదే 509 రూపాయల ఫస్ట్ రీఛార్జ్ తో అయితే 180జీబీ 4జీ డేటాను మూడు నెలల వరకు వాడుకోవచ్చు. అంటే రోజుకు 2జీబీను యూజర్లు పొందుతారు. 999 రూపాయల రీఛార్జ్ తో కూడా 180జీబీ డేటానే పొందవచ్చు. కానీ డైలీ వాడకంపై కంపెనీ ఎలాంటి పరిమితులు విధించలేదు. ఈ మూడు ప్లాన్స్ పైనా ఫస్ట్ రీఛార్జ్ తర్వాత రీఛార్జ్ లపై 60జీబీ డేటాను నెలపాటు పొందుతారు. -
రజనీకాంత్ అసలు రహస్యం చెప్పారు
చెన్నై: తనపై గత కొంతకాలంగా వస్తున్న ఊహగానాలకు ప్రముఖ దక్షిణాది నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తెరదించారు. ఆయన అమెరికా టూర్ వెనుక రహస్యాన్ని స్వయంగా ఓ లేఖలో వెల్లడించారు. దాదాపు రెండు నెలలపాటు అమెరికాలో ఆయన ఎందుకు ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా లేదా అసలు ఏం జరుగుతుందని అటు అభిమానులతోపాటు సినీ వర్గాల్లో సైతం తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఓ లేఖలో అందరికీ సమాధానం చెప్పారు. అందులో ఆయన ఏం చెప్పారంటే.. 'నేను శంకర్ దర్శకత్వం వహిస్తున్న 2.0(రోబో 2) చిత్రం, భావోద్వేగాలు, విప్లవాత్మక అంశాలు నిండిన చిత్రం 'కబాలీ' షూటింగ్లలో వరుసగా పాల్గొన్నాను. దీనివల్ల, కొంత మానసికంగా, శారీరకంగా అలసిపోయాను. దాని నుంచి ఉపశమనం పొందేందుకు విశ్రాంతి అవసరం అని అర్థమైంది. అందుకే నా కూతురు ఐశ్వర్య ధనుష్ తో కలిసి రెండు నెలలపాటు అమెరికా టూర్ కు వెళ్లాను. అక్కడే వైద్య పరీక్షలు కూడా పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు నా మాతృదేశానికి వచ్చాక మళ్లీ కొత్త బలం వచ్చింది. కబాలీ చిత్రం విజయం గురించి విన్నాక మనసు మరింత ప్రశాంతంగా మారింది. ఈ సందర్భంగా నా చిరకాల మిత్రుడు థనుకు, చిత్ర దర్శకుడు రంజిత్ కు మొత్తం చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు చెబుతున్నాను. అలాగే, నా ప్రియమైన అభిమానులకు, ప్రజలకు, మీడియా మిత్రులకు, థియేటర్ల యజమానులకు, పంపిణీదారులకు కూడా పదేపదే ధన్యవాదాలు చెబుతున్నాను' అంటూ రజినీ స్వయంగా లేఖలో రాశారు. -
బాలీవుడ్ బాద్షాకి ఐటీ నోటీసులు
-
బాలీవుడ్ బాద్షాకి ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: ఆదాయం డిక్లరేషన్ పథకం(ఐడీఎస్) లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. గత ఆర్థిక సంవత్సరానికి విదేశీ సంస్తల్లో పెట్టుబడులు తదితర ఆదాయ వివరాలను ప్రకటించని బడాబాబులపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కి ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. బెర్ముడా, బ్రిటిష్ వర్జిన్ దీవులు, దుబాయ్ తదితర ప్రదేశాల్లో ఉన్న అప్రకటిత ఆస్తుల వివరాలను అందించాలని కోరింది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 131 ఈ ఆదేశాలు జారీ చేసింది. భారతీయులకు సంబంధించిన అనేకమంది ప్రముఖుల విదేశీ అప్రకటిత ఆస్తులపై దృష్టిపెట్టిన ఐటీ శాఖ మరికొంతమంది ఇండస్ట్రీ పెద్దలకు కూడా ఈ తరహా నోటీసులు జారీచేసినట్టు సమాచారం. అయితే ఐటీ నోటీసులుపై బాద్ షా బిజినెస్ మేనేజర్, రెడ్ చిల్లీ ఎంటర్ టైన్ మెంట్ కో ప్రొడ్యూసర్ కరుణ బద్వాల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఐడీఎస్ పథకం విజయవంతం కోసం ప్రభుత్వం భారీ ఎత్తున కృషి చేస్తోందని.. అప్రకటిత ఆస్తులను వెల్లడి చేయని వారి పట్ల ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందనే సందేశాన్ని పంపుతోందని సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ దిలీప్ లాఖానీ వ్యాఖ్యానించారు. అయితే ఐటీ నిబంధనలను షారూక్ ఉల్లంఘించారా లేదా అనే దానిపై స్పష్టత లేనప్పటికీ, గత ఏడాది మే నెలలో కోల్కత్తా నైట్ రైడర్స్ షేర్స్ అమ్మకాల విషయంలో ఆర్థిక వ్యవహారాలపై నోటీసులు ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ వివరాలను సేకరించిన సంగతి తెలిసిందే -
బీరు బాబులకోసం ఓ యాప్
లండన్ : మండే ఎండలకి చల్లని బీరు తో చెక్ చెప్పాలనుకునే మందుబాబులకు శుభవార్త. మీరు తాగే బీర్ ఎంత ఫ్రెష్ దో, లేదా ఎంత పాతదో కనిపెట్టేసే స్మార్ట్ పద్ధతి ఒకటి అందుబాటులోకి వచ్చింది. అవును... ఇక కాలం చెల్లిన బీరు కారణంగా పార్టీ పాడవుతుందేమో నని బెంగపడొద్దంటూ పరిశోధకులు మద్యం ప్రియులకు ఒక గుడ్ న్యూస్ అందించారు. బీర్ తాజాదనాన్ని పట్టిచ్చే ఒక సరికొత్త యాప్ ను మాడ్రిడ్ కంప్లుటెన్స్ విశ్వవిద్యాలయ రసాయన శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ యాప్ లోని పాలీమర్ సెన్సర్ ద్వారా బీర్ లోని తాజాదనం కొలిచేందుకు అనుమతించే ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు. స్మార్ట్ ఫోన్ లోని ఈ యాప్ ద్వారా అతి సులువుగా, చవకగా బీర్ నాణ్యతను కొలిచే యాప్ ను ఎలీనా బెంటిటో, పెనామారియా క్రజ్ అనే పరిశోధకులు డెవలప్ చేశారు.ఇప్పటివరకూ బ్రెవరేజ్ కంపెనీలు క్రొమటోగ్రఫీ పద్ధతుల ఆధారంగా ఫర్ ఫ్యూరల్ ( బీర్ లో కలిపే ఒక రకమైన కృత్రిమ, రంగులేని ద్రవం) ఇతర తాజాదనం సూచికలను కొలిచే వారన్నారు. కానీ వారు ఉపయోగించే ఈ పద్ధతి చాలా ఖరీదుతో కూడుకున్నదని, ఎక్కువ సమయం కూడా తీసుకుంటుందని తెలిపారు. అయితే తమ కొత్త యాప్ లోని సెన్సర్ ద్వారా బీర్ ఫర్ ఫ్యూరల్ శాతం, ఇతర నాణ్యతలను చాలా ఈజీగా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. పాత బీరును పరీక్షించినపుడు, పసుపురంగు నుంచి పింక్ రంగుకు మారేలా ఈ సెన్సర్ డిస్క్ ను డిజైన్ చేశామని, దీని ద్వారా డాటాను స్వీకరించి, తద్వారా బీర్ తాజాదనాన్ని కొలవచ్చని పేర్కొన్నారు. కాంటాక్ట్ లెన్స్ లను తయారుచేయడానికి ఉపయోగించే పాలిమర్ నుంచి ఈ సెన్పర్లు తయారు చేసినట్టు తెలిపారు. ఈ డేటా అప్లికేషన్ ఓపెన్ సోర్స్ లో అందుబాటులో ఉందని, ఏ ప్రోగ్రామర్ అయినా దీన్ని తమకనుగుణంగా సవరించుకొని ఉపయోగించుకోవచ్చని చెప్పారు. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆ అప్లికేషన్ ఇపుడు అందుబాటులో ఉందని, త్వరలో ఆపిల్ ఫోన్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. ఎనలిటికల్ కెమిస్ట్రీ జర్నల్ ఇది ఈ పరిశోధన ప్రచురితమైంది. -
మీ చెప్పుల హీల్ సైజ్ మీరేంటో చెప్తుంది!
న్యూయార్క్: మీ గర్ల్ ఫ్రెండ్ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఆమె కాళ్లకు వాడే చెప్పులను గమనిస్తే సరిపోతుంట. సమాజంలో వారిని వారు ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో.. వాళ్లు వాడే చెప్పుల హీల్ సైజ్ ఆధారంగా అంచనా వేయొచ్చని చెబుతున్నారు అమెరికా పరిశోధకులు. భిన్న నేపథ్యాలున్న మహిళల 16,236 ఆన్లైన్ కొనుగోళ్లను పరిశీలించి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధకులు ఈ విషయాన్ని నిర్థారించారు. హీల్ సైజ్ ఎక్కువగా ఉండేలా మహిళలు జాగ్రత్త పడుతున్నారంటే వారు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలనే ఆకాంక్షను వెలిబుచ్చుతున్నట్లేనని పరిశోధకులు వెల్లడించారు. మధ్యతరగతి, పేద మహిళలు సైతం సంపన్న మహిళలలా కనిపించాలని, తమ వాస్తవిక నేపథ్యాన్ని వేరుగా చూపించాలనే కాంక్షను వెలిబుచ్చుతున్నారని పరిశోధకులు తెలిపారు. సమాజంలో ధనిక, పేద వర్గాల మధ్య పెరుగుతున్న అసమానతలు ఈ ఫ్యాషన్ అనుకరణకు దారితీస్తున్నాయని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ కర్ట్ గ్రే తెలిపారు. ఆన్లైన్ ఫ్యాషన్ మార్కెట్ సైతం హై స్టేటస్ ఉన్నట్లు కన్పించే వస్తువులను తక్కువ ధరకు అందించి వినయోగదారులను ఆకర్షిస్తున్నాయని వెల్లడించారు. పురుషుల్లో సైతం వస్త్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్ల విషయంలో ఈ అనుకరణ గమనించొచ్చని చెబుతున్నారు. -
మొసాక్ ఫోన్సెకా గూఢచర్యం
బెర్లిన్: మిలియన్ల కొద్దీ డాక్యుమెంట్ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనానికి సృష్టించిన పనామా పేపర్ల లీక్ వ్యవహారంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.వందమందికి పైగా సభ్యులుగా ఉన్న పరిశోధనాత్మక పాత్రికేయుల అంతర్జాతీయ కూటమి(ఐసీఐజే) పనామా కేంద్రంగా పనిచేస్తున్న పనామా పేపర్స్ మరో విషయాన్ని తేట తెల్లం చేసింది. మొసాక్ ఫోన్సికా వివిధదేశాల్లోని ప్రస్తుత, మాజీ ఉన్నత స్థాయి అధికారుల సేవలను ఏజెంట్లుగా వినియోగించుకున్నట్టు ఒక జర్మన్ వార్తాపత్రిక తెలిపింది. అనేక దేశాల గూఢచారులను మొసాకా విస్తృతంగా ఉపయోగించినట్టు మ్యూనిచ్ ఆధారిత వార్తాపత్రిక వెల్లడించింది. దాదాపు మూడు దేశాలకు చెందిన సీక్రెట్ ఏజెన్సీ అధికారులను వాడుకున్నట్టు తెలిపింది. సౌది అరేబియా, కొలంబియా, రువాండా లాంటి దేశాల అత్యున్నత అధికారులను తమ రహస్య సేవలకు వినియోగించుకున్నట్టు ఈ కథనంలో పేర్కొంది. అనేక దేశాలలో,సీఐఎ వారి మధ్యవర్తుల సహాయంతో పనిచేస్తున్నట్టు పేర్కొంది. ముఖ్యంగా 1990 లో మరణించిన సౌది ఇంటిలిజెన్స చీఫ్ షేక్ కమల్ అదాం 1970 లలో ఫోన్సెకా కు బాగా సహకరించినట్టు తెలిపింది. వివిధ సీక్రెట్ ఏజెంట్లు, వారి ఇన్ ఫార్మర్ల సేవలను సంస్థ వినియోగించుకున్నట్టు తెలిపింది. కాగా ఈ పనామా పేపర్స్ వెల్లడించిన అంశాలతో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయంగా పెను దుమారాన్ని రాజేసింది. విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్న ప్రపంచంలోనే ధనిక, శక్తివంతమైన పలు రాజకీయ నేతల జాబితాను ప్రకటించింది. దీంతో ఐస్ లాండ్ ప్రధాని రాజీనామా చేసిన సంగతి తెలిసింది. -
ధరల విషయంలోనూ లింగ వివక్ష..?!
ధరల విషయంలోనూ లింగ వివక్ష కొనసాగుతోందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. దాదాపు ఒకే ఉత్పత్తి కోసం పురుషులు తక్కువ ధరను చెల్లిస్తుంటే, స్త్రీలు ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని పరిశోధనల్లో తేలింది. ఎనిమిది వందల అంశాల్లో పోల్చి చూసిన అధ్యయనకారులు... పురుషులకంటే మహిళలు ఏడుశాతం ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తున్నట్లు వెల్లడించారు. ఈ ధర వివక్ష ఒక్క రిటైల్ కు మాత్రమే కాదని నివేదికలు తెలుపుతున్నాయి. న్యూయార్క్ సిటీ వినియోగదారుల వ్యవహారాల విభాగం చేపట్టిన అధ్యయనాల్లో ధరల్లో లింగ వివక్ష కొట్టొచ్చినట్లు కనిపించింది. దాదాపుగా ఒకే ఉత్పత్తికి పురుషులకంటే మహిళలు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్ నగరంలోని కొన్ని డ్రైక్లీనర్స్ దుకాణాల్లో స్త్రీ పురుషుల వస్త్రాలపై సర్వే నిర్వహించిన అధ్యయనకారులకు ధరల్లో సారూప్యత లేకపోవడం కనిపించింది. పరిమాణం ఒకేలా ఉన్నా ధరను మాత్రం పురుషులకంటే స్త్రీలకు రెండు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తేలింది. ఒకేలాంటి రెండు వస్త్రాలను పోలిస్తే వాటిలో మహిళల వస్త్రాలకు 7.50 డాలర్లను వసూలు చేయగా... పురుషుల వస్త్రాలకు 2.85 డాలర్లు మాత్రమే వసూలు చేయడం కనిపించింది. అంటే స్త్రీలకు సంబంధించిన ఉత్పత్తులకు దాదాపు మూడు డాలర్లు ఎక్కువగా చెల్లించాల్సి వచ్చింది. ఇటువంటి వివక్ష ఒక్క డ్రైక్లీనర్స్ విషయంలోనే కాదు జీన్స్, వ్యక్తిగత రక్షణ ఉత్పత్తులు, బొమ్మలు, స్కూటర్లు ఇలా అనేక ఉత్పత్తుల విషయంలోనూ కొనసాగుతోన్నట్లు ఈ తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. దీన్నిబట్టి మహిళలు 42 శాతం ఎక్కువగా ధరలు చెల్లిస్తున్నట్లు వెల్లడైంది. అయితే వస్తువుల ధరల విషయంలోనూ లింగ వివక్ష కొనసాగుతుండటం నిజమేనని కన్జూమర్ రిపోర్ట్స్ సీనియర్ ప్రాజెక్ట్ ఎడిటర్ టోడ్ మార్క్స్ అంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా మార్క్స్ ఇదే సమస్యపై పరిశోధన నిర్వహించారు. ముఖ్యంగా మహిళలే ఇటువంటి విషయాల్లో తమను తాము తక్కువ చేసుకుంటున్నారని, అదే విషయాన్ని ప్రయోజనంగా తీసుకొని ఎక్కువ డబ్బును వసూలు చేయడం జరుగుతోందని మార్క్స్ అంటున్నారు. డ్రై క్లీనర్స్ విషయంలో పరిశీలించినప్పుడు.. స్త్రీ, పురుఫుల షర్టులకు వేరు వేరు ధరలను వసూలు చేయడం కనిపించిందని, అదే అడిగితే ఇస్త్రీ మెషీన్ల విషయంలోనూ, మహిళల టాప్ లు ఫిట్టింగ్ విషయంలోనూ అనేక తేడాలుంటాయని, అందుకే అలా వసూలు చేయాల్సివస్తుందని షాపు యజమాని సైఫ్ వివరించారని మార్క్ వెల్లడించారు. అయితే లింగ ఆధారిత ధర దోపిడీ అనేది అమెరికాలో చట్ట విరుద్ధం. దేశ వ్యాప్తంగా 1996 లో జెండర్ ట్యాక్స్ అమల్లోకొచ్చిన తర్వాత సంవత్సరానికి మహిళలు కూడ 1,351 డాలర్లు పన్ను కడుతున్నారు. అయితే చిల్లర వ్యాపారాల్లో ఈ వివక్ష నిరోధించడమే లక్ష్యంగా ఎటువంటి చట్టం లేకపోవడమే పెద్ద సమస్యగా మారింది. రిటైల్ మార్కెట్లో ధరను నిర్ణయించే వెసులుబాటు లేకపోవడమే దీనికి కారణమని ట్రేడ్ లాయర్ మైఖేల్ కోన్ అంటున్నారు. అంతేకాదు మహిళలకు సంబంధించిన వస్తువులు దిగుమతి చేసుకున్నపుడు పురుషుల ఉత్పత్తులకన్నా అధిక ఇంపోర్ట్ టాక్స్ లు పడటం కూడ దీనికి కారణమంటున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే వినియోగదారులే ముందుకు వచ్చి ప్రచారాన్ని చేపట్టాలని ఆయన సూచిస్తున్నారు. -
బావమరిది హత్యకు బావ కుట్ర
గుంతకల్లు: బావమరిదిని చంపాలని బావ పన్నిన పన్నాగాన్ని పోలీసులు పసిగట్టారు. గుంతకల్లు అర్బన్ సీఐ ప్రసాద్‌రావు, టూటౌన్ ఎస్ఐ వలీబాష శుక్రవారం సాయంత్రం వివరాల ప్రకారం... వజ్రకరూరు మండలం బోడిసానిపల్లికి చెందిన మోహన్‌నాయక్ అదే గ్రామానికి చెందిన జయశ్రీని 2013లో ప్రేమవివాహం చేసుకున్నాడు. జయశ్రీ గుంటూరులో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంది. కొన్ని నెలలు వీరి సంసారం సాఫీగానే సాగింది. జయశ్రీ, మోహన్‌నాయక్‌ల మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు ఏర్పడటంతొ వీరి మధ్య దూరం పెరిగింది. దీనికి కారణం తల్లిదండ్రులు, తమ్ముడు భాస్కర్నాయక్ల చెప్పుడు మాటలే అని భావించిన మోహన్‌నాయక్.. బావమరిది హత్య చేయాలని భావించాడు. ఇందుకోసం వజ్రకరూర్కు చెందిన తన స్నేహితుడు మునీంద్ర, పాతగుంతకల్లుకు చెందిన శ్రీనివాసులు ఆలియాస్ గుడ్డిశ్రీను, బోయరాజుతో కాంట్రాక్టు మాట్లాడుకున్నాడు. భాస్కర్‌నాయక్ హైదరాబాద్ నుండి బోడిసానిపల్లికి వస్తున్నాడని తెలుసుకున్న కిరాయి ముఠా హత్య చేసేందుకు శుక్రవారం ఓ హోటల్లో పథకం రూపొందించుకుంటుండగా టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు వేటకొడవల్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
వ్యభిచార కేంద్రాల పై పోలీసుల దాడులు
-
ఒబామా పర్యటన ఖర్చును వెల్లడించలేం
ముంబై: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గత జనవరిలో భారత పర్యటనకు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యయమెంతో చెప్పాలని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన దరఖాస్తును విదేశాంగ శాఖ తిరస్కరించింది. ఇది సున్నిత సమాచారమని, దీనివల్ల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందని స్పష్టంచేసింది. అందువల్ల ఆర్టీఐ సెక్షన్ 8(1)(సీ) కింద ఈ సమాచారాన్ని బహిర్గతపరచలేమని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు, ఆయన వెంట వచ్చిన బృందానికి భారత ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలపాలని ముంబైకి చెందిన అనిల్ గల్గాలి విదేశాంగ శాఖకు దరఖాస్తు చేశారు. -
నల్లధన చట్టంతో ప్రపంచ దేశాల సరసన భారత్
న్యూఢిల్లీ: నల్ల కుబేరులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్రం ప్రతిపాదించిన చట్టంతో భారత్ నల్లధనంపై ఉక్కుపాదం మోపుతున్న సింగపూర్, బ్రిటన్, అమెరికా తదితర దేశాల సరసన చేరనుంది. ఆదాయ వివరాల దాచివేత, విదేశాల్లోని ఆస్తులకు సంబంధించి పన్ను ఎగవేత తదితర నేరాలకు పాల్పడేవారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, 300 రెట్ల జరిమానా తదితర ప్రతిపాదనలతో చట్టాన్ని తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం తెలిసిందే. కాగా, విదేశాల్లో నల్లధనం కలిగివున్న భారతీయులు తమ విదేశీ బ్యాంకు ఖాతాలు లేదా సంపద గురించి ప్రభుత్వానికి తెలియజేసేందుకు చివరి అవకాశమిస్తున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా ఆదివారం పేర్కొన్నారు.