బావమరిది హత్యకు బావ కుట్ర | murder plan detected by guntakallu police | Sakshi
Sakshi News home page

బావమరిది హత్యకు బావ కుట్ర

Published Fri, Jan 22 2016 8:39 PM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

బావమరిది హత్యకు బావ కుట్ర - Sakshi

బావమరిది హత్యకు బావ కుట్ర

గుంతకల్లు: బావమరిదిని చంపాలని బావ పన్నిన పన్నాగాన్ని పోలీసులు పసిగట్టారు. గుంతకల్లు అర్బన్‌ సీఐ ప్రసాద్‌రావు, టూటౌన్ ఎస్‌ఐ వలీబాష శుక్రవారం సాయంత్రం  వివరాల ప్రకారం... వజ్రకరూరు మండలం బోడిసానిపల్లికి చెందిన మోహన్‌నాయక్ అదే గ్రామానికి చెందిన జయశ్రీని 2013లో ప్రేమవివాహం చేసుకున్నాడు. జయశ్రీ గుంటూరులో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంది. కొన్ని నెలలు వీరి సంసారం సాఫీగానే సాగింది.

జయశ్రీ, మోహన్‌నాయక్‌ల మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు ఏర్పడటంతొ వీరి మధ్య దూరం పెరిగింది. దీనికి కారణం తల్లిదండ్రులు, తమ్ముడు భాస్కర్‌నాయక్‌ల చెప్పుడు మాటలే అని భావించిన మోహన్‌నాయక్.. బావమరిది హత్య చేయాలని భావించాడు. ఇందుకోసం వజ్రకరూర్కు చెందిన తన స్నేహితుడు మునీంద్ర, పాతగుంతకల్లుకు చెందిన శ్రీనివాసులు ఆలియాస్ గుడ్డిశ్రీను, బోయరాజుతో కాంట్రాక్టు మాట్లాడుకున్నాడు.

భాస్కర్‌నాయక్ హైదరాబాద్ నుండి బోడిసానిపల్లికి వస్తున్నాడని తెలుసుకున్న కిరాయి ముఠా హత్య చేసేందుకు శుక్రవారం ఓ హోటల్‌లో పథకం రూపొందించుకుంటుండగా టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు వేటకొడవల్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement