guntakallu
-
కాళ్లు మొక్కినా.. ఆత్మభిమానం తాకట్టు పెట్టినా!
రెండుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్టు.. ఐదేళ్లు మంత్రి పదవి, ఈ దఫా ఎన్నికల్లో కర్నూలు ఎంపీ టిక్కెట్.. ఇదీ గుమ్మనూరు జయరాంకు వైఎస్సార్సీపీ ఇచ్చిన ప్రాధాన్యత. బోయ సామాజిక వర్గం కావడంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారు. బోయలు పల్లకీలు మోయడానికి మాత్రమే కాదని.. రాజకీయంగానూ ఎదగాలనే ఉద్దేశంతో గుమ్మనూరుకు పార్టీ అవకాశం కల్పిస్తూ వచ్చింది. ఇదే సమయంలో జిల్లాలో మరికొందరికి కూడా రాజకీయ ఎదుగుదలకు దారులు వేసింది. అలాంటి పార్టీని గుమ్మనూరు జయరాం స్వార్థ ప్రయోజనాల కోసం కాదనుకున్నారు. బీసీలను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పంచన చేరి ఏకంగా కాళ్లు మొక్కడం ద్వారా, బోయల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు. టిక్కెట్ విషయానికొచ్చే సరికి చంద్రబాబు అసలు నైజం బయటపడింది. గుమ్మనూరు కోరుకున్న గుంతకల్లు విషయంలో మూడో విడత జాబితాలోనూ చోటు దక్కకపోవడం, కనీసం ఆలూరునైనా ఇస్తారనుకుంటే ఇప్పటికే మంత్రాలయం బోయలకు ఇవ్వడంతో టీడీపీలో చేరిన ఫలితం అనుభవిస్తున్నాడని ఆయన వర్గీయుల్లో చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి కర్నూలు: తెలుగుదేశంపార్టీ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాను శుక్రవారం టీడీపీ ప్రకటించింది. అందులో గుమ్మనూరు జయరాం పేరు లేదు. టీడీపీలో చేరికకు ముందు, వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి రాజీనామా చేసే సమయంలో గుంతకల్లు టిక్కెట్ తనకు ఇస్తామని చంద్రబాబు చెప్పారని, గుంతకల్లు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానని విలేకరుల సమావేశంలో జయరాం వెల్లడించారు. మంత్రిగా ఉండి పారీ్టలో చేరడంతో గుంతకల్లు టిక్కెట్ వస్తుందనే భావనలోనే అంతా ఉన్నారు. అయితే గుంతకల్లు అభ్యరి్థని ఖరారు చేసేందుకు చంద్రబాబు చేపట్టిన ఐవీఆర్ఎస్ సర్వేలో జయరాంకు ప్రతికూలంగా ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. పైగా గుంతకల్లు టీడీపీ నేతలు స్థానికేతరుడిని తమపై రుద్దడం ఏంటని, జిల్లాలో ఎప్పుడూ లేని సంప్రదాయం తీసుకొస్తున్నారని వాపోయారు. గుంతకల్లు, గుత్తి, పామిడి నేతలతో పాటు అనంతపురం జిల్లాలోని టీడీపీ మాజీ ఎమ్మెల్యేల నుంచి కూడా జయరాంకు మద్దతు లభించలేదని సమాచారం. పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు జితేంద్రగౌడ్‌కు పూర్తిగా మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. రాయదుర్గం అభ్యరి్థగా కాల్వ పోటీ చేయబోతున్నారు. గుంతకల్లులో జయరాంకు టిక్కెట్ ఇస్తే వాలీ్మకుల్లో మరో పవర్ సెంటర్‌గా, తనకు ప్రత్యామ్నాయంగా జయరాం ఉండొచ్చనే ఆలోచనతో కాల్వ పూర్తిగా జితేంద్రకు మద్దతు ఇస్తున్నట్లు చర్చ జరుగుతోంది. జయరాంను వ్యతిరేకిస్తూ జితేంద్ర చేపట్టిన ర్యాలీలో కూడా భారీగా కార్యకర్తలు హాజరయ్యారు. అయితే గుంతకల్లు టిక్కెట్ ఇస్తే రూ.50కోట్ల వరకూ పెట్టుకుంటానని గుమ్మనూరు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. దీంతో చివరి నిమిషంలో ‘డబ్బు మూటల’ బరువు పెరిగి తనకు టిక్కెట్ వస్తుందనే ఆశతోనే జయరాం ఉన్నారు. ఇప్పటికైతే జయరాం అభ్యరి్థత్వాన్ని చంద్రబాబు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఆలూరు టిక్కెట్‌పైనే ఆశలు గుంతకల్లు ద్వారాలు దాదాపు మూసుకుపోయాయనే భావనలో జయరాం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోనే ఆలూరు టిక్కెట్ తనకు ఇవ్వాలని పట్టుదలగా ఉన్నారు. ఇందుకు కోట్ల సుజాతమ్మ మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. టిక్కెట్ విషయంలో తనకు సహకరిస్తే, ఆ ‘రుణం’ తీర్చుకుంటానని జయరాం చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రాలయం టిక్కెట్ వాలీ్మకి సామాజిక వర్గానికి చెందిన రాఘవేంద్రకు ఇవ్వడంతో మరో టిక్కెట్ ఇవ్వలేమని టీడీపీ స్పష్టం చేసినట్లు చర్చ జరుగుతోంది. అయితే జయరాం మాత్రం గుంతకల్లు, ఆలూరులో ఏదో ఒక టిక్కెట్ ఇవ్వాలని నమ్మించి మోసం చేయడం సరికాదనే ఆవేదనలో ఉండటం గమనార్హం. ఎరక్కపోయి వచ్చి.. చంద్రబాబు మాత్రం పార్టీ కోసం పనిచేయాలని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని గుమ్మనూరు జయరాంకు చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రిగా ఉండి, టిక్కెట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేనపుడు రేపు అధికారంలోకి వస్తే తనకేం న్యాయం చేస్తారనే భావనలో గుమ్మనూరు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. పైగా తాను టీడీపీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో రాలేదని, ఆలూరుపై పట్టు కోల్పోకూడదనే భావనతోనే వచ్చానని, గుంతకల్లు టిక్కెట్ తనకు, ఆలూరులో తాను ప్రతిపాదించిన వ్యక్తికి టిక్కెట్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు మాట తప్పుతున్నారని టీడీపీ ముఖ్యనేతలతో గుమ్మనూరు గట్టిగానే మాట్లాడినట్లు తెలుస్తోంది. -
గుంతకల్లులో డ్రగ్స్ కలకలం
గుంతకల్లు టౌన్: గోవా నుంచి హైదరాబాద్‌కు మాదక ద్రవ్యాల ప్యాకెట్లను సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను అనంతపురం జిల్లా గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి రూ.65 వేల విలువజేసే 12.890 గ్రాముల ‘మేథాంపేటామైన్’ అనే నిషేధిత డ్రగ్‌తో పాటు రెండు సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. మంగళవారం వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో సీఐ రామసుబ్బయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరానికి చెందిన ఎరెల్లి దయాకర్, మలికపురం మండలం అడవిపాలెం గ్రామానికి చెందిన రాసిబట్టుల వివేక్ హైదరాబాద్‌కు వెళ్లి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. ఈ క్రమంలోనే వీరిరువురు డ్రగ్స్‌కు బానిసలయ్యారు. హైదరాబాద్‌లో వీరికి పరిచయమైన స్నేహితులకు డ్రగ్స్ గురించి తెలియజేయగా, తమకు కూడా తెచ్చివ్వాలని వారు కోరడంతో గోవాకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసి సోమవారం సాయంత్రం గుంతకల్లుకు చేరుకున్నారు. అయితే రాత్రి వరకు హైదరాబాద్‌కు రైలు లేకపోవడంతో రోడ్డు మార్గం ద్వారా ఏదైనా వాహనంలో వెళ్లేందుకు ఇద్దరు యువకులూ స్థానిక బీరప్పగుడి సర్కిల్లో వేచి ఉన్నారు. అందిన సమాచారం మేరకు పోలీసులు ఇద్దరు యువకుల్నీ అదుపులోకి తీసుకుని విచారించగా అసలు గుట్టు రట్టయ్యింది. స్వా«దీనం చేసుకున్న డ్రగ్ ఒక్కో గ్రాము రూ.5 వేల ధర పలుకుతుందని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. -
పోలీసునంటూ నిరుద్యోగులకు టోకరా! భారీగా వసూళ్లు
గుంతకల్లు: ఖాకీ యూనిఫాం ధరిస్తాడు. బుల్లెట్ బండిపై సవారీ చేస్తాడు. శ్రీసత్యసాయి జిల్లాలో ఓ ఉన్నతాధికారి వద్ద ఏఆర్ కానిస్టేబుల్‌నంటూ అందరినీ నమ్మించాడు. ఉన్నతాధికారులతో తనకు పరిచయాలు ఉన్నాయంటూ మభ్యపెట్టాడు. పోలీస్, ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి భారీగా వసూలు చేశాడు. చివరకు మోసం బట్టబయలై పోలీసులకు దొరికిపోయాడు. ఇదీ అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని కథలవీధిలో నివాసముంటున్న పృథ్వి బాగోతం. ఇతను పృథ్వి, చింటూ, హర్షారెడ్డి తదితర పేర్లతో నిరుద్యోగ యువతతో పరిచయం పెంచుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ ఉన్నతాధికారి వద్ద కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నానంటూ బిల్డప్ ఇచ్చాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఇతని మాటలు నమ్మి గుంతకల్లు పట్టణంలో హెర్బల్ ప్రొడక్ట్స్ అమ్ముకునే ఓ మహిళ ఏకంగా రూ.17 లక్షల దాకా ఇచ్చినట్లు తెలిసింది. అలాగే ఎస్ఎల్వీ థియేటర్ సమీపంలోని ఓ కూల్ డ్రింక్ షాపు యజమాని రూ.8 లక్షలు, తిమ్మాపురం గ్రామానికి చెందిన సంగమేష్ రూ.4.5 లక్షలు, ఓ మహిళా పోలీస్ కూడా తన చెల్లెలి ఉద్యోగం కోసం రూ.లక్ష సమరి్పంచుకున్నారు. ఇంకా ఇతని గాలానికి చిక్కి ఎందరో నిరుద్యోగులు రూ.లక్షల్లో మోసపోయినట్లు సమాచారం. ఆఫీసులకు తీసుకెళ్లి..అందరినీ నమ్మించి.. నిరుద్యోగులను పృథ్వి నమ్మించి మోసగించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కావాలని అడిగారో ఏకంగా ఆ శాఖ కార్యాలయానికి నిరుద్యోగులను తీసుకెళ్లేవాడు. వారిని కార్యాలయం వద్ద కూర్చోబెట్టి ఒక్కడే లోపలికి వెళ్లేవాడు. కాసేపటికి బయటకు వచ్చి పై అధికారితో అంతా మాట్లాడానంటూ నమ్మబలికేవాడు. ఇలా ఒక నిరుద్యోగిని గుంతకల్లు సెబ్ కార్యాలయంలో ఉద్యోగం ఉందని పిలుచుకెళ్లి అక్కడే అడ్వాన్స్‌గా రూ.లక్ష తీసుకున్నాడు. వాస్తవంగా ఇతనికి ఎక్సైజ్ శాఖలో ఎవరూ తెలీదు. ప్రస్తుతం ఇతను గుంతకల్లు టూటౌన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. (చదవండి: కాల్వకు 'జేసీబీ'తో బ్రేక్.. ఈసారి టికెట్ ఆయనకేనా?) -
కొడుకును కడతేర్చిన తల్లి
గుంతకల్లు: నిత్యం మద్యం తాగొచ్చి వేధిస్తున్న కుమారుణ్ని కన్నతల్లే కడతేర్చింది. ఈ ఘటన గుంతకల్లు పట్టణంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ గణేష్, ఎస్ఐ నరేంద్ర, సమీప బంధువుల కథనం మేరకు... పాత గుంతకల్లుకు చెందిన నాగరాజు, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. నాగరాజు హమాలీ పని నిమిత్తం చైన్నెకు వెళ్లాడు. జయమ్మతో పాటు పెద్దకుమారుడు భీమేష్ (20), చిన్నకుమారుడు వశికేరి ఉండేవారు. ముగ్గురూ బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే పెద్దకుమారుడు భీమేష్ మద్యానికి బానిసయ్యాడు. తనకు పెళ్లి చేయాలని, తాగడానికి డబ్బులు కావాలంటూ రోజూ తల్లిని వేధించేవాడు. డబ్బులు లేవంటే నడిరోడ్డుపై గట్టిగా కేకలు వేస్తూ గొడవలకు దిగేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి కూడా అతిగా మద్యం తాగొచ్చి తల్లితో గొడవకు దిగాడు. నిగ్రహం కోల్పోయిన తల్లి చిన్నకొడుకు వశికేరి సహాయంతో భీమేష్‌ను కత్తి పొడిచి, కట్టెలతో కొట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై వేయడానికి ఇద్దరూ కలిసి స్కూటర్‌పై తీసుకెళుతుండగా కుక్కలు గట్టిగా మొరిగాయి. దీంతో భయపడి మృతదేహాన్ని స్కూటర్‌పై నుంచి కిందకు పడేశారు. దీంతో చుట్టుపక్కల వారు గుర్తించడంతో మృతదేహాన్ని అక్కడే పడేసి పారిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నారు. (చదవండి: పావురాలు కొనడానికి వచ్చి...కత్తితో దాడి) -
శాస్త్రీయ పద్ధతులతో సమగ్ర దర్యాప్తు
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: కీలకమైన కేసులకు సంబంధించి శాస్త్రీయమైన పద్ధతుల్లో దర్యాప్తును సమగ్రంగా చేపట్టాలని ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి సూచించారు. శనివారం గుంతకల్లు సబ్ డివిజన్ పోలీసు అధికారులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్ష నిర్వహించారు. నమోదైన కేసులు, నిందితుల అరెస్టు, దర్యాప్తు దశ, చార్జిషీటు దాఖలు వరకు పురోగతిపై ఆరా తీశారు. పోలీస్స్టేషన్ల వారీగా యూఐ కేసులు తగ్గించి నిర్ణిత గడువులోపు పెండింగ్ కేసులకు పరిష్కారం చూపాలన్నారు. నిందితుల అరెస్టు, చార్జ్ షీట్లు దాఖలు, సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసుల ఛేదింపు, నేర నియంత్రణకు దోహదం చేసే నైపుణ్యాలను వివరించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టి నేరస్తులు తప్పించుకునే వీలు లేకుండా న్యాయ స్థానాలలో తగిన సాక్ష్యాధారాలతో ప్రవేశపెట్టి శిక్ష పడే విధంగా చేయాలన్నారు. హత్య కేసులు, మహిళలపై నేరాలు, చిన్నారుల అదృశ్యం తదితర కేసుల్లో అలసత్వం చూపకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. చోరీ కేసుల్లో నిందితులను త్వరగా పట్టుకోవాలని, సొత్తు రికవరీపై దృష్టి సారించాలని సూచించారు. అనధికార ఆన్లైన్ లోన్ యాప్‌ల మోసాలు, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు వివరించి వారు కూడా అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు అమర్చుకునేలా చూడాలన్నారు. రహదారులపై ప్రమాదాలు, నేరాల నియంత్రణకు హైవే మొబైల్ టీంతో నిరంతర గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. గుట్కా, మట్కా, పేకాట, అక్రమ మద్యం రవాణాపై ఉక్కు పాదం మోపాలన్నారు. సమావేశంలో గుంతకల్లు డీఎస్పీ యు.నరసింగప్ప, సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. (చదవండి: జగనన్న కాలనీలో మహిళలకు ఉపాధి) -
YSR-YVR Canteen: రూ.6కే మధ్యాహ్న భోజనం
గుంతకల్లుటౌన్(అనంతపురం జిల్లా): ఒక్కపూట తిండి కోసం అలమటించే ఎందరో నిరుపేదలు, నిరాశ్రయుల ఆకలి తీర్చాలన్నదే తన అభిమతమని, ఇందులో భాగంగా రూ.6కే రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రి పక్కన ఎమ్మెల్యే వైవీఆర్ ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్–వైవీఆర్ క్యాంటీన్’ను బుధవారం ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ప్రారంభించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. చదవండి: గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ? ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైవీఆర్ మాట్లాడుతూ.. దేవుడి దయ, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఉడతాభక్తిగా ఈ చిరు అన్నదాన సేవా కార్యక్రమాన్ని తానుంత వరకూ నిస్వార్థంగా, నిరాటంకంగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. రోజూ మధ్యాహ్నం 500 మందికి రుచికరమైన వేడి భోజనాన్ని రూ.6కే అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైవీఆర్‌ను ఆయన సోదరుడు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, పుర ప్రముఖులు అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భవానీ, వైస్ చైర్పర్సన్లు నైరుతిరెడ్డి, మైమూన్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకియాబేగం, వీరశైవలింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ గుంతకల్లు, పామిడి ఎంపీపీలు మాధవి, మురళీరెడ్డి, వైస్ ఎంపీపీ ప్రభావతి, జెడ్పీటీసీ సభ్యుడు కదిరప్ప, ఏడీసీసీ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎన్.రామలింగప్ప, రామాంజనేయులు, పార్టీ పట్టణ కన్వీనర్లు సుంకప్ప, హుసేన్‌పీరా, సీనియర్ నేతలు శ్రీనివాసరెడ్డి, మంజునాథరెడ్డి, సందీప్‌రెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
భారీ రైలు ప్రమాదం.. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు!!
గుంతకల్లు: ‘అనంతపురం జిల్లాలో భారీ రైలు ప్రమాదం! ఉదయం 10 గంటలకు గుంతకల్లు డివిజన్ పరిధిలోని కొండాపురం రైల్వే స్టేషన్లో దుర్ఘటన!! కంట్రోల్ రూమ్‌కు మెసేజ్.. అప్రమత్తమైన రైల్వే శాఖ.. ఏడీఆర్ఎం సూర్యనారాయణ, 10వ బెటాలియన్ ఎన్డీఎఫ్ఆర్ జవాన్లు హుటాహుటిన కొండాపురం రైల్వేస్టేషన్ చేరుకొని ప్రయాణికులను రక్షించి యుద్ధప్రాతిపదికన ఆస్పత్రికి తరలించారు..’ ఈ వార్త నిజమనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ ప్రమాదం జరగలేదు. ఒకవేళ ఈ తరహా ఊహించని ఘటనలు జరిగితే అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉన్నారో లేదో తెలుసుకొనేందుకు కొండాపురం రైల్వేస్టేషన్లో మంగళవారం మాక్‌డ్రిల్ నిర్వహించారు. అందులో భాగంగా నిజంగా ప్రమాదం సంభవిస్తే జరిగే ఆస్తి నష్టం, ప్రాణనష్టం నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కళ్లకు కట్టినట్లు చూపించారు. రెండు బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కిన ఘటనలో ప్రయాణికులను ఎలా రక్షించాలి? సత్వర వైద్యసేవలకు తరలించే సన్నివేశాలను ప్రదర్శనల ద్వారా చూపించారు. ఈ సందర్భంగా ఏడీఆర్ఎం సూర్యనారాయణ మాట్లాడుతూ రైలు ప్రమాదాలు జరిగినప్పుడు యుద్ధప్రాతిపదికన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై ప్రతి మూడు నెలలకోసారి మాక్‌డ్రిల్ నిర్వహిస్తామన్నారు. -
గుంతకల్లు డీఈ అవినీతి బాగోతం
సాక్షి, అనంతపురం : గుంతకల్లు ట్రాన్స్ కో డివిజనల్ ఇంజనీర్ రవిబాబు అవినీతి బాగోతం బట్టబయలైంది. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల మంజూరు కోసం రైతుల నుంచి డీఈ రవిబాబు లక్షన్నర లంచం తీసుకున్నారు. ఇద్దరు రైతులు కలిసి లక్షన్నర లంచం ఇవ్వగా ఈ సొమ్ము లైన్ మెన్ ద్వారా డీఈకు చేరింది. కాగా రవిబాబు బాగోతాన్ని రైతులు రహస్యంగా సెల్ ఫోన్లో చిత్రీకరించారు. అనంతరం దీనిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో డీఈ రవిబాబు దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా రైతులను వేధిస్తున్నట్లు డీఈ రవిబాబు పై కొంతకాలంగా ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఒక్కొ కొత్త ట్రాన్స్ ఫార్మర్కు 75000 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు దళారుల సహకారంతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
ఓ వర్గాన్ని కించపరిచేలా పోస్టులు!
సాక్షి, అనంతపురం: సోషల్ మీడియాలో ఈ మధ్య కొందరు వ్యక్తులు రెచ్చిపోతున్నారు. సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీసేలా, అలజడులు సృష్టించేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. రెచ్చగొట్టే కామెంట్లతో ఉద్రిక్తతలు రేపుతున్నారు. ఇక, సోషల్ మీడియాలో ఇష్టానుసారం రెచ్చిపోతున్న వ్యక్తుల ఆటకట్టించేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో గుంతకల్లుకు చెందిన ఉదయ్‌చంద్ సుధీర్ కర్వ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ వర్గాన్ని కించపరిచేలా అతను ఫేస్బుక్, వాట్సాప్‌లలో పోస్టులు పెట్టినట్టు తెలుస్తోంది. అతని పోస్టులు పట్ల అభ్యంతరం వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
రైలురోకో కేసులో కె.రామకృష్ణకు ఊరట
సాక్షి, గుంతకల్లు(అనంతపురం) : రైలురోకో కేసులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణకు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు జరిమానా విధించి, కేసు కొట్టేశారు. ఈ మేరకు గుంతకల్లు రైల్వేకోర్టు స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ టి.వెంకటేశ్వర్లు సంచలన తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే.. రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి 2008 జూలై 7న అనంతపురం రైల్వేస్టేషన్లో రైలురోకో చేశారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసులు రైల్వే యాక్టు ప్రకారం అప్పట్లోనే కేసు నమోదు చేశారు. రైలును అడ్డుకున్నందుకు 174/ఏ కింద, ఆర్పీఎఫ్ పోలీసుస్టేషన్లోకి అక్రమంగా ప్రవేశించినందుకు 147 కింద కేసులు నమోదు చేశారు. బుధవారం కోర్టుకు హాజరైన సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె.రామకృష్ణకు రైల్వే కోర్టు జడ్జి వెంకటేశ్వర్లు రూ.700 ఫైన్ విధించి కేసును కొట్టి వేస్తున్నట్లు వెల్లడించారని న్యాయవాదులు చెన్నకేశవులు, యూనస్ తెలిపారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతున్నావ్!
సాక్షి, గుంతకల్లు: ‘‘ఎన్నికలప్పుడు వస్తారు. అవి చేస్తాం.. ఇవి చేస్తామంటూ నమ్మిస్తారు. చేసిందేమీ లేదు. ఐదేళ్లుగా తాగునీళ్లివ్వమని అడుగుతున్నాం. ఒక్కరూ పట్టించుకోలేదే. ఉమామహేశ్వరనగర్, కాల్వగడ్డ, గంగానగర్ తదితర ప్రాంతాల్లో తాగునీళ్లు రావడం లేదు. నెలనెలా కుళాయి, ఇంటి గుత్తలు సక్రమంగా కడుతున్నాం. అయినా నీళ్లు ఇవ్వడం లేదు. ఎండాకాలం మా పరిస్థితి దేవునికే తెలుసు. రోజూ నీళ్లకే రూ.50 దాకా ఖర్చవుతోంది. ఇవన్నీ మీకు పట్టవు.. ఇప్పుడు ఓట్ల కోసం ఏ ముఖం పెట్టుకుని వచ్చారు.’’ అంటూ మహిళలు టీడీపీ పాలనను తూర్పారబట్టారు. దీంతో అట్టహాసంగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ ఎంపీ అభ్యర్థి జేసీ పవన్‌కుమార్‌రెడ్డి బిక్కచచ్చిపోయారు. మంగళవారం ఆయన గుంతకల్లు పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేశారు. హనుమేష్‌నగర్‌లో పర్యటిస్తుండగా మహిళలు అడ్డుకున్నారు. ఐదేళ్లలో ఏం చేశారో చెప్పాలని నిలదీయగా.. జేసీ పవన్ నీళ్లు నమిలారు. ఏడాది కాలంగా అనంతపురం పార్లమెంటు పరిధిలోని అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించానన్నారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామంటూ అక్కడి నుంచి జారుకున్నారు. ఏనాడూ మా కాలనీకి రాలేదు .. ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ 2014 ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వచ్చారు. గెలిచిన తర్వాత ఐదేళ్లలో ఏనాడూ మా కాలనీకి రాలేదు. మా సమస్యలు విన్నదీ లేదు. 2019 ఎన్నికలు రావడంతో మీ సమస్యలు పరిష్కారం చేస్తామంటూ రావడం నవ్వులాటగా ఉంది. – శోభ, సీఐటీయూ కాలనీ -
ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చింది వైఎస్సారే
సాక్షి, గుంతకల్లు టౌన్: నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని సినీనటుడు, వైఎస్సార్సీపీ నేత అక్బర్ అలీ అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పామిడి, గుత్తి, గుంతకల్లులో ఆయన ప్రచారం నిర్వహించారు. గుంతకల్లులోని పోర్టర్స్‌లైన్‌లోని హజరత్ గులాంషా ఖాదరీ బాబా దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్సార్సీపీ గుంతకల్లు ఎమ్మెల్యే అభ్యర్థి వై.వెంకటరామిరెడ్డి, ఎంపీ అభ్యర్థి పీడీ రంగయ్యలకు మద్దతుగా అలీ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని కొనియాడారు. ఆయన తనయుడు జగన్ కూడా తండ్రి బాటలో పయనిస్తున్నారన్నారు. ముస్లిం మైనార్టీలకు ఐదు ఎమ్మెల్యే స్థానాలను కేటాయించిన ఘనత కూడా వైఎస్సార్‌సీపీదేనన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో రోడ్‌షో విజయవంతమైంది. వైఎస్సార్సీపీలోకి చంద్రశేఖర్ గుంతకల్లు టౌన్: అవోపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు, ప్రముఖ వ్యాపారవేత్త పువ్వాడి చంద్రశేఖర్ వైఎస్సార్సీపీలోకి చేరారు. రోడ్‌షోలో భాగంగా గుంతకల్లుకు విచ్చేసిన అలీ, గుంతకల్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై.వెంకటరామిరెడ్డిల సమక్షంలో చంద్రశేఖర్ వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. -
నీరు–చెట్టు వెలవెల తమ్ముళ్ల జేబులు గలగల
సాక్షి, గుంతకల్లు: వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీరు–చెట్టు పథకం కింద విడుదలైన నిధులతో తెలుగు తమ్ముళ్లు జేబులు నింపుకున్నారు. పనులు నాసిరకంగా చేయడం, చేసిన పనులనే మళ్లీ చేసినట్లు చూపి కోట్లాది రూపాయాలు కాజేశారు. పథకం ముఖ్య ఉద్దేశం చెరువుల్లో పూడిక తీసి భూగర్భ జలాలను వృద్ధి చేయడం. మొక్కలు పెంపకం, కాలువల్లో పేరుకుపోయిన పూడికతీత, ముళ్లకంపలు తొలగింపు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చెక్‌డ్యాంలు, నీటి సంరక్షణ పనులను చేపట్టారు. అప్పుట్లో పనులు చేపట్టాడానికి టెండర్లు ప్రకటిస్తే..ఇతరులు పోటీకి వస్తారని చంద్రబాబునాయుడు ప్రభుత్వం భావించింది. నామినేషన్ పద్ధతిపై టీడీపీ నేతలు, కార్యకర్తలకు అప్పగించింది. రూ.10లక్షల లోపు పనిని నామినేషన్ పద్ధతిపై ఇవ్వవచ్చు. దీంతో రూ.కోట్ల పనిని కూడా భాగాలుగా విభజించి..చేశారు. ఈ పనులన్నింటిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు కట్టబెట్టారు. నీరు–చెట్టు నిధుల రూపేణ టీడీపీ నాయకులు కోట్లాది రూపాయల ప్రజాధనం భోంచేసారని ప్రజలు ఆరోపిస్తున్నా రు. గుంతకల్లు నియోజకవర్గంలో 2015 నుంచి గత ఏడాది వరకు 254 పనులకుగాను దాదాపు 14 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పనుల్లో కనిపించని నాణ్యత.. నాలుగేళ్ల వ్యవధిలో దాదాపు రూ.14 కోట్ల పైచిలుకు వ్యయంతో గుంతకల్లు మండలంలో నీరు–చెట్టు పథకం కింద పనులు చేపట్టారు. పనుల నిర్వహణలో ఎక్కడ నాణ్యత లేకపోగా జేసీబీల సహా యంతో తూతూ మంత్రంగా పూడిక తీత పనులు చేపట్టి నిధులు కొట్టగొట్టారు. పనుల నాణ్యత లేని కారణంగా బిల్లులు చేయడానికి నిరాకరించిన సందర్భాల్లో అధికార పార్టీ నాయకులు పలు మార్లు మైనర్ ఇరిగేషన్ జేఈని బెది రించడం, స్వయాన గుంతకల్లు జడ్పీటీసీ మాతృనాయక్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆశాఖ అధి కారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. జెడ్పీటీసీని స్వయంగా ఇంటికి పిలిచి . ఎ మ్మెల్యే జితేంద్రగౌడ్ మందలించిన ఆయనలో మార్పు రాకపోగా అదేపనిగా మైనర్ ఇరిగేషన్జేఈని వేధింపులకు గురిచేశాడు. నీరు–చెట్టు పనులు పూర్తిగా ఆయాగ్రామాల జన్మభూమి కమిటీ సభ్యులే చేసుకోవాలని అధిష్టానం ఆజ్ఞాపించినా కేవలం కొంతమంది నాయకులు నీరు–చెట్టు పనులతో నిధులను కొల్లగొట్టారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధులదే హవా ఎంపీపీ రాయల రామయ్య , మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ బండారు ఆనంద్, జడ్పీటీసీ మా తృనాయక్లది ప్రధాన భూమిక కాగా, చెరువుల్లో జరిగిన పనులను మాత్రం తప్పనిసరి పరిస్థితిల్లో ఆయకట్టు ప్రెసిడెంట్లకు అప్పజెప్పారు. దీంతో మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ నాయకులు, కార్యకర్తల మధ్య బేధాభిప్రాయాలు పెరిగిపోయాయి. ఇవేవి పట్టించుకోని ఎంపీపీ, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్, జెడ్పీటీసీలు తమదైన శైలిలో పనులను చేజిక్కించుకొని సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల తీరుపైనా విమర్శలే నీరు–చెట్టు పథకం నిధులు స్వాహాపై అధికారుల్లో స్పందన లేకపోవడం విమర్శలకు తా విç Ü్తుంది. ముఖ్యంగా ఆ శాఖలోని అధికారలకు బదిలీల భయం పట్టుకొని ఏ చిన్నతరం చెప్పినా ఇక్కడి నుంచిళ్లిపొండి అని నేతల నుంచి ఒత్తిడి రావడంతో మిన్నకుండిపోయేవారు. మరికొందుకు అధికారలు మాత్రం నాదేం పోయింది..నీ ఇష్టం వచ్చినట్లు పని చేసుకో..మా ఇవాల్సింది మాత్రం ఇచ్చేయే..అని కాంట్రాక్టర్లు ఇచ్చే ముడపులు తీసుకొని ఈ పథకానికి తూట్లు పోడిచారు. 2015 నుంచి ఇప్పటివరకు నీరు–చెట్టు పథకం కింద మంజూరైన పనులు, విడుదలైన నిధులు మండలం చేసిన పనులు ఖర్చు చేసిన నిధులు గుంతకల్లు 4 5.17 కోట్లు గుత్తి 5 4.52 కోట్లు పామిడి 5 5.02 కోట్లు మొత్తం 54 14.71 కోట్లు ఈ చిత్రంలో కనిపిస్తున్నది గుత్తి చెరువు. ఈ చెరువులో 2015–16లో నీరు–చెట్టు కింద కంపచెట్లు పనులు చేపట్టారు. టీడీపీకి చెందిన నారాయణరెడ్డి నాలుగు దఫాలుగా రూ.20 లక్షలు వ్యయం చేసి ఈ పని పూర్తి చేశారు. పనులు నాసిరకంగా చేయడంతో ముళ్లపొదలు పెరిగి చేపలు పట్టడం ఇబ్బందికరంగా మారింది. లక్షలు ఖర్చుచేశారు కానీ పనులు సరిగా చేయలేదని ప్రజలు వాపోతున్నారు. గుత్తి చెరువుకు ఒరిగిందేమీ లేదు లక్షలాది రూపాయలు వెచ్చించి గుత్తి చెరువు కట్టపై పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనులు చేశారు. అయితే 1087 ఎకరాలు ఉన్న గుత్తి చెరువులో కొంత మేర జంగిల్ క్లియరెన్స్, పూడికతీత పనులు చేస్తే ఎవరికి ప్రయోజనం. కేవలం టీడీపీ నాయకులు, కార్యకర్తల కు నీరు–చెట్టు పథకం ఆదాయ మార్గంగా మారింది. ఈ పనుల నుంచి ఏ ఒక్క రైతుకు, చెరువు బాగుపడలేదు. – నాగిరెడ్డి, ఆయకట్టు రైతు, గుత్తి నిధుల దుర్వినియోగం టీడీపీ నాయకులు నీరు చెట్టు పనులను దక్కించుకొని నిధులు దుర్వినియోగం చేశా రు. పులగుట్టపల్లి ప్రాంతంలోని వంకలో తూతూ మంత్రంగా పూడికతీత పనులు చేశా రు.ఆ పనుల్లో నాణ్యత లేకపోవడంతో యదా స్థితికి చేరుకున్నాయి. లక్షలాది రూపాయలు దండుకొని పథకానికి తూట్లు పొడిచారు. – పి.జయరామిరెడ్డి, నెలగొండ నిధులు మింగేశారు పామిడి మండలంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నీరు–చెట్టు పథకం కింద కోట్ల రూపాయలను అధికారపార్టీ ప్రజాప్రతినిధులు మింగేశారు. మండలంలో గొలుసు కట్టు, పులుసులు కాలువల పూడికతీత, వాటికి గట్లు ఏర్పాటు, కొండల్లోనూ, రోడ్డు కిరువైపులా చెట్ల పెంపకం పనులకు మండలానికి రూ.5 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో కేవలం పామిడి జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. అనుంపల్లి నుంచి కట్టకింద పల్లి వరకూ మొక్కలు నాటారు. వంకరాజుకాల్వ కొండపై ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆర్ జితేంద్రగౌడ్ మొక్కలను నాటించారు. నాటిన మొక్కలు కనిపించలేదుగాని రూ. కోట్లు వారి జేబుల్లో చేరాయి. –తంబళ్ళపల్లి వెంకట్రామిరెడ్డి, పామిడి -
ఉద్యమాల పుట్టినిల్లు...గుంతకల్లు
ఉద్యమాల పుట్టినిల్లుగా గుంతకల్లుకు ప్రత్యేక ఖ్యాతి ఉంది. 1942లో మహాత్ముడి పిలుపునందుకుని బ్రిటీష్ వారిని భారతదేశం వదలి పొమ్మంటూ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమంలో విజయమో.. వీరస్వర్గమో అంటూ ఈ నియోజకవర్గంలోని గుత్తి, పామిడి, గుంతకల్లు వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ సమయంలో మిత్రులతో కలసి గుంతకల్లు రైల్వేస్టేషన్‌ను ధ్వంసం చేసిన ఘటనలో కసాపురానికి చెందిన మహమ్మద్ రసూల్ ఆరుమాసాల జైలు శిక్షను అనుభవించారు. నాటి స్వాతంత్య్రోద్యమం మొదలు నేటి ప్రత్యేక హోదా సాధన పోరు వరకూ గుంతకల్లు నియోజకవర్గ ప్రజలు చూపిన ఉద్యమ స్ఫూర్తి అనితర సాధ్యం. చైతన్యవంతులైన ఈ నియోజకవర్గ ప్రజలు అధికార మార్పు కోరుతూ ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. ఒకసారి గెలిచిన అభ్యర్థిని మళ్లీ ఎన్నికల్లో దూరం పెట్టేస్తూ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ వచ్చారు. అయితే నియోజకవర్గ ప్రజలను దగా చేస్తూ పారిశ్రామిక ప్రగతిని టీడీపీ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో పరిశ్రమలకు కేంద్రంగా భాసిల్లుతున్న గుంతకల్లు నియోజకవర్గంలో కార్మికుల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. గుంతకల్లు.. 1957 నుంచి 2009 వరకూ గుత్తి నియోజకవర్గంలో ఉండేది. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికలు ఈ నియోజకవర్గ ప్రజల చైతన్యానికి ప్రతీకగా నిలిచాయి. 13 సార్లు జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు నాలుగేసి సార్లు గెలుపొందగా, ఒకసారి సీపీఐ, మరో మూడుసార్లు స్వతంత్ర అభ్యర్థులకు పట్టం కట్టారు. కరుడుకట్టిన కమ్యూనిస్ట్ యోధుడు వీకే ఆదినారాయణరెడ్డి 1962లో గుత్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో గుత్తి నియోజకవర్గంలో తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలంలోని సగం పల్లెలు ఉండేవి. అలాగే గుంతకల్లులోని పలు గ్రామాలు ఉరవకొండ నియోజకవర్గంలో ఉండేవి. ఈ గందరగోళానికి తెరవేస్తూ మొత్తం పెద్దవడుగూరు మండలాన్ని తాడిపత్రిలోకి, తాడిపత్రి, ఉరవకొండ నియోజవర్గాల పరిధిలోని పామిడి మండలాన్ని సంపూర్ణంగాను, గుంతకల్లు మండలంలోని పూర్తి పల్లెలను కలుపుతూ 2009లో గుంతకల్లు నియోజకవర్గంగా చేశారు. పరిశ్రమలు కనుమరుగు గుంతకల్లులోని ఏసీఎస్ మిల్లు ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్దదిగా ఖ్యాతి గడించి, రాయలసీమకే తలమానికంగా నిలిచింది. ఇక చలనచిత్రాల డిస్ట్రిబ్యూషన్ కంపెనీలూ గుంతకల్లులో పెద్ద సంఖ్యలో ఉండేవి. చిత్ర పరిశ్రమలో రాయలసీమ సీడెడ్ కంపెనీగా గుంతకల్లు అప్పట్లో విరాజిల్లింది. ఇక స్లీపర్ ఫ్యాక్టరీ, లైఫ్‌బాయ్ సబ్బులు ఫ్యాక్టరీ, ఇతర చిన్నతరహా పరిశ్రమలెన్నో గత ప్రభుత్వాల హయాంలో ఉండేవి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలపై ఇస్తున్న రాయితీలకు మంగళం పాడేసింది. దీంతో నిర్వహణ భారమై పరిశ్రమలు ఒకదాని తర్వాత ఒకటి మూతపడుతూ వచ్చాయి. సెంటిమెంట్ ఫలించేనా? గుంతకల్లు నియోజకవర్గానికి ఓ ప్రత్యేక రాజకీయ సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఒకసారి గెలిపించిన అభ్యర్థికి మరోసారి ఆ అవకాశమివ్వరు. గత ఎన్నికలు పరిశీలిస్తే ఇవే ఫలితాలు స్పష్టమవుతాయి. గత ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి మళ్లీ ఎన్నికల్లో బరిలో నిలిస్తే అతనికే నియోజకవర్గ ప్రజలు ఓటేస్తారు. ఈ తరహా రాజకీయ సెంటిమెంట్ బలంగా ఉన్న గుంతకల్లు నియోజకవర్గం అభివృద్ధిలో మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఒక్క గాదిలింగప్ప తప్ప రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు ఎవరూ లేరు. ఈ రెండు విడతల మధ్యలో ఒక టెర్మ్ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గుత్తి/గుంతకల్లు నియోజకవర్గం నుంచి ఎంపికైన ఎమ్మెల్యేలు వీరే.. మండలాలు : గుంతకల్లు, గుత్తి, పామిడి నియోజకవర్గం : గుంతకల్లు మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు 2,38,0 1,18,7 1,19,2 62 గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయారు. గుంతకల్లులో పాలిటెక్నిక్ కళాశాల, గుంతకల్లు–నాగసముద్రం డబుల్ రోడ్డు, కసాపురం రైల్వే బ్రిడ్జి విస్తరణ, గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు, గుత్తిలో ఫైర్‌స్టేషన్ ఏర్పాటు, గుత్తి కోటకు పర్యాటక కేంద్రం గుర్తింపు తదితర హామీలిచ్చి ఆచరణలో విఫలమయ్యారు. – నియోజకవర్గంలోని చెరువులకు కృష్ణా జలాల మళ్లింపు సాధనలో ఘోరంగా విఫలమయ్యారు. మహిళా ఓటర్లే కీలకం గుంతకల్లు నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే 2019 నాటికి 472 మంది మహిళల ఓటర్ల సంఖ్య పెరిగింది. 2019 జనవరి 11 నాటికి ఎన్నికల అధికారులు ప్రకటించిన మేరకు ఈ నియోజకవర్గంలో 2,38,010 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఐదేళ్లలో 15,745 మంది కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఉన్నారు. కేవలం ఈ మూడు నెలల్లో 18 సంవత్సరాలు పైబడిన యువత 8 వేలకు పైగా ఓటు హక్కు నమోదు చేసుకోవడం గమనార్హం. గత ఎన్నికల్లో 242 పోలింగ్ కేంద్రాలుండగా, ప్రస్తుతం వీటి సంఖ్య 288కు చేరుకుంది. -
బేటీ బచావో .. మోడీ హటావో
గుంతకల్లు టౌన్ : కథువాలో చిన్నారి ఆసీఫాను అత్యాచారం చేసి హత్యచేసిన మానవ మృగాలను ఉరితీయాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గం సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. చిన్నారి ఆసీఫాను హత్యచేసిన దుండగులను కఠినంగా శిక్షించడంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కాగడాల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి గాంధీచౌక్ తిరిగి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. ఈ సందర్భంగా వై.వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ పసిప్రాణాన్ని చిత్రవధలకు గురిచేసి నిర్ధాక్షిణ్యంగా చంపేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన మానవ మృగాలను క్షమించరాదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల రామాంజినేయులు, పట్టణ, మండల అధ్యక్షులు సుంకప్ప, మోహన్‌రావు, కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ ఫ్లయింగ్‌మాబు, కౌన్సిలర్ టి.గోపి, మైనార్టీ విభాగం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అహమ్మద్‌బాషా, ఎంబీ.మౌలా, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏపీ రాష్ట్ర సంచార జాతుల సం ఘం ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసులు, సీపీఎం పట్టణ కార్యదర్శి భజంత్రీశీనా ఆధ్వర్యంలో ప్రజా, ముస్లీం, రాజకీయ సంఘాలు ర్యాలీ నిర్వహించారు. పొట్టిశ్రీరాములు సర్కిల్లో నిందితుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. గుత్తి : కతువాలో అభం, శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై అతి పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ గుత్తిలో మంగళవారం రాత్రి అన్ని మతాలు, కులాలు, పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ఐద్వా మహిళలు,చిన్నారులు, మహిళలు భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఆర్అండ్బీ బంగ్లా వద్ద నుంచి గాంధీ సర్కిల్ మీదగా ఆర్టీసీ బస్టాండ్, రాజీవ్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం గాంధీ సర్కిల్ వద్ద మానవ హారం చేపట్టారు. నిరసనలో సుమారు 1500 మంది పాల్గొన్నారు. గుత్తి ఆర్ఎస్లో : గుత్తి ఆర్ఎస్లో దక్షిణ మధ్య రైల్వే నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి అసిఫా హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. అలాగే గుత్తి షటిల్ క్రీడాకారులు, యువకులు ట్రాన్స్‌కో కార్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో ఘనంగా నివాళులర్పించారు. గుంతకల్లు : జమ్ము కాశ్మీర్‌లోని కథువా ప్రాంతంలో ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫాను ఆత్యాచారం చేసి, హత్య చేసిన మానవ మృగాలను నడిరోడ్డుపై ఉరితీయాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆసిఫా హత్యను నిరసిస్తూ మంగళవారం మజ్దూ ర్ యూనియన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ గుంతకల్లు డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్‌రాజు, విజ య్‌కుమార్, సహయ కార్యదర్శులు కేఎం డీగౌస్, బాలాజీసింగ్, మస్తాన్‌వలి, కోశాధికారి శ్రీనివాసశర్మ, నాయకులు పీ.విజ య్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భార్యపై హత్యాయత్నం
స్థానికుల అడ్డగింపుతో తప్పిన ప్రమాదం పాతగుంతకల్లు(గుంతకల్లు): భార్యపై అనుమానం వికృత రూపం దాల్చింది. తాళి కట్టిన భార్యతోపాటు కడుపున పుట్టిన పిల్లలను రోడ్డుకు ఈడ్చే దుస్సాహసం చేసింది. చివరకు భార్య ఒంటికి నిప్పంటించి హత్య చేసేందుకు పూనుకున్నాడు. ఈ దుశ్చర్యను స్థానికులు అడ్డుకున్నారు. వివరాలు.. పాతగుంతకల్లుకు చెందిన వసికేరప్ప (దివ్యాంగుడు)కు కణేకల్లు మండలం మాల్యం గ్రామానికి చెందిన మంజులతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులున్నారు. అయితే మూడేళ్ల నుంచి ఆమెపై అనుమానం పెంచుకున్న అతడు రోజూ చితకబాదేవాడు. పెట్రోల్ బంకులో పని కూడా మానేసి వసికేరప్ప ఇంటి వద్దనే కాలక్షేపం చేసేవాడు. అయినా మంజుల సర్దుకుపోతూనే సంసారం సాగిస్తుండేది. ఈనేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భార్యతో గొడవకు దిగాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటూ చితకబాదాడు. భార్య మంజుల, పిల్లలు జీవన్‌కుమార్, దయానిధిని రోడ్డుపైకి నెట్టేశాడు. ఆమె ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించగా కోపోద్రిక్తుడైన అతడు కిరోసిన్ చల్లి నిప్పంటించే యత్నం చేశాడు. గుర్తించిన స్థానికులు అడ్డుకుని అతడిని మందలించారు.అతడు ఇంటికి తాళాలు వేసుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడు. మంజుల పిల్లలతో కలిసి ఇంటి వద్దనే కూర్చుండి పోయింది. ఈ ఘటనపై స్థానికులు టూటౌన్ పోలీసులకు సమాచారమందించారు. సంఘటన స్థలికి చేరిన పోలీసులు విచారణ చేపట్టారు. -
రైల్వే కాంట్రాక్టర్‌పై టీడీపీ నేత జులుం
∙కాంట్రాక్ట్ నుంచి తప్పుకోవాలని బెదిరింపులు ∙దుప్పటి పంచాయితీ చేసిన పోలీసులు గుంతకల్లు:గుంతకల్లు రైల్వే డివిజన్లోని ధర్మవరం రైల్వే రన్నింగ్ రూం నిర్వహణ కోసం గత నెల 27న టెండర్ల ప్రక్రియ ముగిసింది. రూ.1.24 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టును రైల్వే శాఖ నిర్ణయించిన ధర కంటే 8 శాతం తక్కువకు కోట్ చేసి ఎస్కే ఎంటర్ ప్రైజెస్ కంపెనీ దక్కించుకుంది. ఇదే కాంట్రాక్టుకు పోటీపడిన ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ అనుచరుడు నరేంద్ర 35 శాతం ఎక్కువ ధరకు టెండర్ కోట్ చేశాడు. సహజంగా 8 శాతం తక్కువకు కోట్ చేసిన ఎస్కే ఎంటర్‌ప్రైజెస్‌కు ధర్మవరం కాంట్రాక్ట్ దక్కింది. ఈ మేరకు ఆ కంపెనీ అధినేత ఎస్కే అహ్మద్ సోమవారం డీఆర్ఎం కార్యాలయానికి వచ్చారు. అధికారులను కలిసి రన్నింగ్ రూం నిర్వహణ పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలనే విషయంపై చర్చిస్తున్నారు. అయితే అనుచరులతో అక్కడికి చేరుకున్న నరేంద్ర రైల్వే కార్యాలయంలోనే ఎస్కే అహ్మద్‌పై విరుచుకుపడ్డాడు. కాంట్రాక్ట్ నుంచి తప్పుకోవాలని, అధికారం తమ చేతుల్లో ఉందనే విషయం మరవద్దని బెదిరించాడు. టీడీపీ నేత హల్చల్ చేస్తున్న సమయంలో సీనులోకి పోలీసులు ఎంటర్ అయ్యారు. ఇరుపక్షాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నరేంద్ర చౌదరి బెదిరింపులపై ఎస్కే అహ్మద్ వన్‌టౌన్ ఎస్ఐ నగేష్ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు దేశం నేత దౌర్జన్యంపై కేసు నమోదు చేయకపోగా సర్దుకుపోవాలంటూ సలహా ఇచ్చారు. మొత్తానికి దుప్పటి పంచాయితీతో ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపారు. ఈ ఘటన కు సంబంధించి పంచాయతీ వ్యవహారాన్ని ధర్మవరంలోనే తేల్చుకుంటామంటూ నరేంద్ర వెళ్లిపోగా, రాజకీయలకు భయపడే ప్రసక్తే లేదని ఎస్కే అహ్మద్ కూడా వెనుతిరిగాడు. ఇదే విషయమై టీడీపీ నేత నరేంద్ర పోలీసులకు వివరిస్తూ తాను బెదిరింపులకు పాల్పడలేదన్నారు. కాంట్రాక్ట్ పనిని తనకు ఇస్తానన్న ఎస్కే అహ్మద్ రూ.2 లక్షలు గుడ్‌విల్ డిమాండ్ చేశాడన్నారు. ఇప్పటికే అతడికి రూ.లక్ష నగదు ముట్టజెప్పానని, డబ్బు తీసుకుని కూడా తనపై కేసు పెట్టేందుకు సిద్ధమయ్యాడంటూ ఎస్కే అహ్మద్‌పై ఆరోపించాడు. అయితే అలాంటిదేంలేదని కాంట్రాక్టర్ ఎస్కే అహ్మద్ కొట్టిపారేశారు. -
బావమరిది హత్యకు బావ కుట్ర
గుంతకల్లు: బావమరిదిని చంపాలని బావ పన్నిన పన్నాగాన్ని పోలీసులు పసిగట్టారు. గుంతకల్లు అర్బన్ సీఐ ప్రసాద్‌రావు, టూటౌన్ ఎస్ఐ వలీబాష శుక్రవారం సాయంత్రం వివరాల ప్రకారం... వజ్రకరూరు మండలం బోడిసానిపల్లికి చెందిన మోహన్‌నాయక్ అదే గ్రామానికి చెందిన జయశ్రీని 2013లో ప్రేమవివాహం చేసుకున్నాడు. జయశ్రీ గుంటూరులో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంది. కొన్ని నెలలు వీరి సంసారం సాఫీగానే సాగింది. జయశ్రీ, మోహన్‌నాయక్‌ల మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు ఏర్పడటంతొ వీరి మధ్య దూరం పెరిగింది. దీనికి కారణం తల్లిదండ్రులు, తమ్ముడు భాస్కర్నాయక్ల చెప్పుడు మాటలే అని భావించిన మోహన్‌నాయక్.. బావమరిది హత్య చేయాలని భావించాడు. ఇందుకోసం వజ్రకరూర్కు చెందిన తన స్నేహితుడు మునీంద్ర, పాతగుంతకల్లుకు చెందిన శ్రీనివాసులు ఆలియాస్ గుడ్డిశ్రీను, బోయరాజుతో కాంట్రాక్టు మాట్లాడుకున్నాడు. భాస్కర్‌నాయక్ హైదరాబాద్ నుండి బోడిసానిపల్లికి వస్తున్నాడని తెలుసుకున్న కిరాయి ముఠా హత్య చేసేందుకు శుక్రవారం ఓ హోటల్లో పథకం రూపొందించుకుంటుండగా టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు వేటకొడవల్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
కొల్హాపుర్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
గుంతకల్లు: గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని హల్‌కట్ట రైల్వేస్టేషన్ (కర్ణాటక)లో క్రాసింగ్ కోసం ఆగివున్న కొల్హాపుర్ ఎక్స్‌ప్రెస్ రైలు(నంబర్ :11303)లో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు నలుగురు దొంగలు మారణాయుధాలతో ప్రయాణికులను బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. బాధితులు, గుంతకల్లు జీఆర్పీ పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా... హైదరాబాద్ నుంచి కొల్హాపుర్ వెళుతున్న రైలు క్రాసింగ్ కోసం వాడి-మంత్రాలయం సెక్షన్ లోని హల్‌కట్ట రైల్వేస్టేషన్లో ఆగింది. జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులను నిలువుదోపిడీ చేసేందుకు ప్రయత్నించారు. బోగీలో ముగ్గురు ప్రయాణికులు మేల్కొని ఉండటాన్ని గమనించి.. అరిస్తే చంపుతామని మారణాయుధాలతో బెదిరించారు. నిద్రలో ఉన్న అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కమలపాడు తండాకు చెందిన గోవిందునాయక్ అనే ప్రయాణికుడి ప్యాంటు జేబు కత్తిరించి రూ. 15 వేల నగదు లాక్కున్నారు. మెడలోని బంగారు గొలుసునూ లాక్కోవడానికి ప్రయత్నించగా.. అతను ప్రతిఘటించి కేకలు పెట్టాడు. దీంతో ప్రయాణికులంతా నిద్రలేచారు. ఈ హఠాత్పరిణామంతో దొంగలు రైలు దిగి పరారయ్యారు. ప్రయాణికులు గుంతకల్లు జీఆర్పీ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
మారణాయుధాలతో బెదిరింపు ఐదు తులాల బంగారం అపహరణ గుంతకల్లు, న్యూస్‌లైన్: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం పాతకొత్తచెరువు రైల్వేస్టేషన్ సమీపాన గురువారం అర్ధరాత్రి పద్మావతి ఎక్స్‌ప్రెస్ (బైవీక్లీ స్పెషల్) రైలులో దోపిడీదొంగలు బీభత్సం సృష్టిం చారు. ప్రయాణికులపైకి రాళ్లు రువ్వి.. మారణాయుధాలతో భయభ్రాంతులకు గురిచేసి ఐదుతులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. బాధితురాలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్ (రైలు నం- 12731) గురువారం రాత్రి 9గంటల సమయంలో తిరుపతి నుంచి బయలుదేరింది. గుత్తి రైల్వేస్టేషన్‌కు రాగానే దొంగల ముఠా సభ్యులు కొందరు రైలులో ఎక్కారు. మరికొందరు పాతకొత్తచెరువు రైల్వేస్టేషన్ సమీపాన కాపు కాశారు. ఎస్6, ఎస్7, ఎస్8, ఎస్9, ఎస్10 బోగీల్లో ప్రయాణిస్తున్న దుండుగులు కొందరు అర్ధరాత్రి ఒంటి గంట సమయానికి రైలు పాతకొత్తచెరువు రైల్వేస్టేషన్ చేరుకోగానే పథకం ప్రకారం చైనులాగి రైలును ఆపారు. బయట ఉన్న దుండగులు లోపలికి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు. తలుపులన్నీ వేసి ఉండటంతో లోనికి రావడానికి వీలుకాక రాళ్లు రువ్వి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. రైలులో ప్రయాణిస్తున్న దుండగులు వెంట తెచ్చుకున్న కత్తులు, పిడిబాకులు చూపి ప్రయాణికులను బెదిరించారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన భవాని మెడలోని 5 తులాల బంగారు ఆభరణాలు లాక్కుని రైలుదిగి పారిపోయారు. బాధితురాలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ రైలు బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ కావడం వల్ల అందులో ఎస్కార్టు పోలీసులు లేరని తెలిసింది. విషయం తెలుసుకున్న గుంతకల్లు జీఆర్పీ సిబ్బంది పాతకొత్తచెరువు రైల్వేస్టేషన్ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. కాగా, ఏప్రిల్ 4వతేదీ రాత్రి కూడా అనంతపురం-పెనుగొండ మధ్య దుండుగులు ఇదేతరహాలో హంపి ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీకి విఫలయత్నం చేశారు. రైళ్లలో దోపిడీలపై చంద్రబాబు ఆందోళన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవలి కాలంలో రైళ్లలో జరుగుతున్న దోపిడీలు, దొంగతనాలపై టీడీపీ అధ్యక్షుడు, సీమాంధ్రకు కాబోయే సీఎం నారా చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా ఘటనలను అరికట్టడంలో అధికారు లు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైళ్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బందోబస్తు వైఫల్యం వల్లే ఇలా జరుగుతోందన్నారు. వారం రోజుల్లో చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో మూడుసార్లు దోపిడీ జరగడం రైల్వే పోలీస్ యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రైల్వేశాఖ ప్రయాణికుల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు.