ప్రతీకాత్మక చిత్రం
గుంతకల్లు: నిత్యం మద్యం తాగొచ్చి వేధిస్తున్న కుమారుణ్ని కన్నతల్లే కడతేర్చింది. ఈ ఘటన గుంతకల్లు పట్టణంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ గణేష్, ఎస్‌ఐ నరేంద్ర, సమీప బంధువుల కథనం మేరకు... పాత గుంతకల్లుకు చెందిన నాగరాజు, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. నాగరాజు హమాలీ పని నిమిత్తం చైన్నెకు వెళ్లాడు. జయమ్మతో పాటు పెద్దకుమారుడు భీమేష్ (20), చిన్నకుమారుడు వశికేరి ఉండేవారు. ముగ్గురూ బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు.
అయితే పెద్దకుమారుడు భీమేష్ మద్యానికి బానిసయ్యాడు. తనకు పెళ్లి చేయాలని, తాగడానికి డబ్బులు కావాలంటూ రోజూ తల్లిని వేధించేవాడు. డబ్బులు లేవంటే నడిరోడ్డుపై గట్టిగా కేకలు వేస్తూ గొడవలకు దిగేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి కూడా అతిగా మద్యం తాగొచ్చి తల్లితో గొడవకు దిగాడు. నిగ్రహం కోల్పోయిన తల్లి చిన్నకొడుకు వశికేరి సహాయంతో భీమేష్‌ను కత్తి పొడిచి, కట్టెలతో కొట్టి చంపేశారు.
అనంతరం మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై వేయడానికి ఇద్దరూ కలిసి స్కూటర్‌పై తీసుకెళుతుండగా కుక్కలు గట్టిగా మొరిగాయి. దీంతో భయపడి మృతదేహాన్ని స్కూటర్‌పై నుంచి కిందకు పడేశారు. దీంతో చుట్టుపక్కల వారు గుర్తించడంతో మృతదేహాన్ని అక్కడే పడేసి పారిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నారు.
(చదవండి: పావురాలు కొనడానికి వచ్చి...కత్తితో దాడి)
Comments
Please login to add a commentAdd a comment