సాక్షి, కామారెడ్డి: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి.. వృద్ధాప్యంలో భారమనిపించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి సేవలు చేయలేక చీరతో ఉరేసి చంపి, ఖననం చేశాడో కొడుకు. మూడు రోజుల కిందట జరిగిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ సీఐ రామన్ తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివనగర్‌కు చెందిన ఇట్టవోయిన బాలవ్వ(80) కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమెకు సపర్యలు చేయడం భారంగా భావించిన కుమారుడు బాలయ్య.. ఈనెల 13న తల్లికి చీర కొంగుతో ఉరి బిగించి చంపాడు. అనంతరం రాత్రి వేళలో గ్రామ శివారుకు తీసుకెళ్లి ఖననం చేశాడు.
ఈనెల 13నుంచి తల్లి బాలవ్వ కనిపించడం లేదని, ఆమె పడుకున్న గదికి గొళ్లెం పెట్టి ఉందని ఊళ్లోవాళ్లకు చెప్పాడు. బాలయ్య ప్రవర్తనపై అనుమానం వచి్చన ఎంపీటీసీ సభ్యుడు బీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని అంగీకరించాడని సీఐ రామన్ తెలిపారు. అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న తల్లికి సేవలు చేయలేక చీరతో ఉరి బిగించి చంపానని, అదే రోజు రాత్రి మృతదేహాన్ని గ్రామ శివారుకు తీసుకువెళ్లి ఖననం చేశానని అంగీకరించాడని వెల్లడించారు.
చదవండి: భార్య దోసె వేయలేదనే కోపంతో..
Comments
Please login to add a commentAdd a comment