Sadashivanagar
-
సపర్యలు చేయలేక.. చీరతో ఉరేసి.. కన్నతల్లినే చంపిన కొడుకు
సాక్షి, కామారెడ్డి: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి.. వృద్ధాప్యంలో భారమనిపించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి సేవలు చేయలేక చీరతో ఉరేసి చంపి, ఖననం చేశాడో కొడుకు. మూడు రోజుల కిందట జరిగిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ సీఐ రామన్ తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివనగర్‌కు చెందిన ఇట్టవోయిన బాలవ్వ(80) కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమెకు సపర్యలు చేయడం భారంగా భావించిన కుమారుడు బాలయ్య.. ఈనెల 13న తల్లికి చీర కొంగుతో ఉరి బిగించి చంపాడు. అనంతరం రాత్రి వేళలో గ్రామ శివారుకు తీసుకెళ్లి ఖననం చేశాడు. ఈనెల 13నుంచి తల్లి బాలవ్వ కనిపించడం లేదని, ఆమె పడుకున్న గదికి గొళ్లెం పెట్టి ఉందని ఊళ్లోవాళ్లకు చెప్పాడు. బాలయ్య ప్రవర్తనపై అనుమానం వచి్చన ఎంపీటీసీ సభ్యుడు బీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని అంగీకరించాడని సీఐ రామన్ తెలిపారు. అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న తల్లికి సేవలు చేయలేక చీరతో ఉరి బిగించి చంపానని, అదే రోజు రాత్రి మృతదేహాన్ని గ్రామ శివారుకు తీసుకువెళ్లి ఖననం చేశానని అంగీకరించాడని వెల్లడించారు. చదవండి: భార్య దోసె వేయలేదనే కోపంతో.. -
2 కిలోమీటర్లు లాక్కెళ్లిన లారీ.. ఇద్దరి దుర్మరణం
సదాశివనగర్ (ఎల్లారెడ్డి)/కామారెడ్డి: అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, పదిమంది గాయపడ్డారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి గ్రామ శివారులో 44వనంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామానికి చెందిన గడ్డం మమత (32), గడ్డం లక్ష్మి(41)తో పాటు మరి కొందరు.. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామంలో జరిగిన అంత్యక్రియలకు రెండు ఆటోలు, ఒక తుఫాన్ వాహనంలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పద్మాజివాడి గ్రామ శివారులోకి రాగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న ఓ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలోనుంచి గడ్డం మమత రోడ్డుపై పడిపోగా, ఆమె తలపై నుంచి లారీ వెనుక టైర్లు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. లారీ డ్రైవర్ ఆపకుండా వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. అదే ఆటోలో ఉన్న గడ్డం లక్ష్మి లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోగా, సుమారు రెండు కిలోమీటర్ల వరకు రహదారి వెంట ఈడ్చుకెళ్లడంతో ఆమె కూడా దుర్మరణం చెందింది. ప్రమాదంలో గాయపడిన ఆటో డ్రైవర్ చిన్న బాలయ్య, రాజయ్య, సాయవ్వలను నిజామాబాద్‌కు, ఆవునూరి రాజవ్వ, దోమకొండ లక్ష్మి, గడ్డం బాల్‌రాజ్, లక్ష్మిలను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ నేరుగా సదాశివనగర్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్.శేఖర్ తెలిపారు. చదవండి: హైదరాబాద్: ముగ్గురు మహిళల అదృశ్యం కలకలం -
పెళ్లి దండలతోనే మృత్యుఒడిలోకి!
సదాశివనగర్ (ఎల్లారెడ్డి): ఒకరంటే ఒకరికి ప్రాణం.. తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరని రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.. అయితే ఆ యువజంట ఆనందం కొద్ది గంటలు కూడా నిలవలేదు. రోడ్డు ప్రమాదం రూపంలో నూతన జంటను కాలం బలి తీసుకుంది. తల్లిదండ్రులకు తమ పెళ్లి విషయం చెబుదామని బయల్దేరారు. వారి ఆశీస్సులు తీసుకునే లోపే ఈ జంట మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మోడెగాం గ్రామానికి చెందిన బట్టు సతీశ్ (24), హైద రాబాద్లోని గండిమైసమ్మ ప్రాంతానికి చెందిన మహిమ (22) గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటు న్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబసభ్యులను ఒప్పించా లని అనుకున్నారు. దీంతో హైదరాబాద్‌లో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమ యంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సతీశ్ స్వగ్రామమైన మోడెగాం గ్రామానికి బయ ల్దేరారు. అయితే, సదాశివనగర్ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై రాత్రి 9.30 గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో జాతీయ రహదారి దాటు తుండగా నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. కాగా, వీరు హైదరాబాద్ నుంచి ఏ వాహనంలో వచ్చారో స్పష్టత లేదు. మోడెగాం గ్రామానికి వెళ్తూ పోలీసుల సాయం కోరేందుకు సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన సతీశ్‌ను నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి, మహిమను కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. నవదంపతులిద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సతీశ్ హైదరాబాద్‌లోని ఓ హోటల్లో వర్కర్. -
కారు డోరులో చిక్కుకుని మహిళ మృతి
బెంగళూరు: కొన్ని సార్లు చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద నష్టాలను మిగుల్చుతాయి. అలాంటి సంఘటన ఒకటి కర్ణాటక రాజధాని బెంగళూరులోని సదాశివనగర్లోబుధవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో టెక్కి అయిన నందిని రావ్(45) అనే మహిళ మృతి చెందింది. రివర్స్ గేర్‌లో చెట్టు కింద నిలిపిన కారు వెనకకి రావటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చెట్టు, కారు డోర్ మధ్య ఇరుక్కుని సదరు మహిళ మరణించింది. నందిని రావు(45) కొడుకును ఆడిస్తూ బయటకు వచ్చింది. ఆ సమయంలో రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న కారు డోర్ తీసింది. రివర్స్ గేర్‌లో నిలిపిన విషయం మరిచి పోయి అందులో ఎక్కబోయింది. దాంతో అనుకోకుండా కారు వెనక్కి కదిలింది. అయితే ఆ సమీపంలోనే చెట్టు ఉంది. [ చదవండి: మీ లవర్ మీ మొబైల్ వాట్సాప్ చెక్ చేస్తున్నారా? ఈ టిప్‌తో సేఫ్‌గా ఉండండి ] దీంతో కారు తలుపుకు చెట్టుకి మధ్య నందిని రావు ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సహాయం కోసం కేకలు వేసింది. స్థానికులు వచ్చి ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మరణించింది. కారు పార్కింగ్‌కు అడ్డుగా ఉన్న ఆ చెట్టును తొలగించాలని ఆమె పలుసార్లు చెప్పినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు ఆ ఏరియా ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. -
సదాశివనగర్‌లో మహిళ దారుణ హత్య
నిజామాబాద్(సదాశివనగర్): సదాశివనగర్ మండలం ఆమర్లబండశివారులో మల్లారి రాణి(30) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమెతో పాటు సాయిబాబా(32) అనే మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తి బుధవారం ఉదయం 3 గంటలకు బైక్‌పై వెళ్తున్న రాణి, సాయిబాబాలను హతమార్చాలని పథకం వేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రాణి భర్త విదేశాల్లో ఉంటాడు. సాయిబాబాను దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నేడు సీఎం రాక
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు - సదాశివనగర్‌లో ‘మిషన్‌కాకతీయ’ ప్రారంభం - అక్కడే కేసీఆర్ బహిరంగ సభ నిర్వహణ - సభాస్థలిని పరిశీలించిన మంత్రి ‘పోచారం’ సదాశివనగర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం సదాశివనగర్ మండల కేంద్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ‘కాకతీయ మిషన్’ కార్యక్రమంలో భాగంగా సీఎం ఇక్కడ చెరువు పూడిక తీత పనులను ప్రారంభించనున్నారు. అనంతరం చెరువు వద్ద బహిరంగ సభ ఉంటుంది. హెలీప్యాడ్ వద్ద బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. మైదానాన్ని చదును చేశారు. సీఎం పర్యటన స్థలాన్ని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీందర్‌రెడ్డి, హన్మంత్ సింధే, గణేశ్ గుప్తా బుధవారం పరిశీలించారు. సీఎం కాన్వాయి ట్రయల్ రన్ నిర్వహించారు. వారి వెంట జడ్పీటీసీ పడిగెల రాజేశ్వర్‌రావు, ఎంపీపీ బంజ విజయ శివకుమార్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ నారెడ్డి లింగారెడ్డి, వైస్ ఎంపీపీ రూపేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కమలాకర్‌రావు, దశ రథ్రెడ్డి, బాల్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహారెడ్డి, లడ్డు శ్రీను, రాజిరెడ్డి ఉన్నారు. సీఎం పర్యటన ఇలా - ప్రగతిన గర్: సీఎం హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి హెలీక్యాప్టర్ ద్వారా ఉదయం 9.55కు బయలుదేరుతారు. 10.30కు సదాశివన గర్ మండల కేంద్రానికి చేరుకుంటారు. - ‘మిషన్ కాకాతీయ’ పనులను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి 12.20కి మెదక్‌లోని నాచారం లక్ష్మీనరసింహస్వామి గుట్టకు చేరుకుని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 4.40కి మెదక్‌నుంచి బయలుదేరి 5 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. -
12న సీఎం రాక!
- సదాశివనగర్‌లో ‘మిషన్ కాకతీయ’కు శ్రీకారం - కూలీలతో కలిసి పనులలో పాల్గొననున్న కేసీఆర్ కామారెడ్డి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. ‘మిషన్ కాకతీయ’ పనులకు శ్రీకారం చుట్టేందుకు ఆయన ఈ నెల 12న కామారెడ్డి డివిజన్ ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలో ఉన్న సదాశివనగర్ మండల కేంద్రానికి రానున్నారని తెలిసింది. అక్కడ చెరువు పూడికతీత, పునరుద్ధరణ పనులను సీఎం ప్రారంభిస్తారు. అంతేకాకుండా కూలీలతో కలిసి పనులలో పాల్గొని అక్కడే భోజనం చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు సోమవారం సాయంత్రం జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు అందినట్టు సమాచారం. దీంతో అధికారులు సీఎం పర్యటనకు సంబందించిన అంశంపై అంతర్గతంగా చర్చించుకున్నారు. గత రెండు నెలలలో కామారెడ్డి, బాన్సువాడకు రావలసిన సీఎం అనివార్య కారణాలతో రాలేకపోయూరు. ఎట్టకేలకు సదాశివనగర్‌లో పర్యటన ఖరారైనట్టు విశ్వసనీయ సమాచారం. -
అభివృద్ధిలో ఆదర్శం ‘లింగంపల్లి’
సదాశివనగర్ : ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదు రు చూస్తూ కూర్చోలేదు లింగంపల్లి వాసులు. చేయి చేయి కలిపి.. కలిసి కట్టుగా పనులు చేసుకుంటూ అభివృద్ధి వైపు పయనిస్తున్నారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా నడుంబిగించిన వా ళ్లు మొదట చేయి చేయి కలిపారు. వారంతా కలిసి ఓ సంఘంగా మారారు. గ్రామంలో 301 కుటుంబాలు ఉన్నాయి. అందులో 114 కుటుం బాలు ‘శ్రీ గోపాల మిత్ర గ్రామ రైతు సం ఘం’లో రూ.250 చెల్లించి సభ్యత్వం తీసుకున్నారు. ఈ సంఘాన్ని 2010లో ప్రారంభిం చారు. మొదటగా 20 మంది సంఘ సభ్యులుం డగా, ప్రస్తుతం 114 కుటుంబాలు చేరాయి. రిలయన్స్ సహకారం.. లింగపల్లి గ్రామస్తులు చేపడుతున్న అభివృద్ధి పనులకు రిలయన్స్ సంస్థ సహకారం అందించింది. వెనుకబడిన గ్రామాల అభివృద్ధిలో భాగంగా ఆ సంస్థ గోపాలమిత్ర గ్రామ రైతు సంఘానికి సహకారం అందిస్తోంది. వారి కష్టానికి రిలయన్స్, పంచాయతీ సహకారం తోడు కావడంతో అభివృద్ధి వేగవంతమవుతోంది. సేంద్రియ ఎరువులతో సాగు గ్రామంలోని 114 కుటుంబాల ఇళ్ల వద్ద సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండిస్తున్నారు. ప్రతీరోజు ఒక్కోరకం కూరగాయలు వాడుకుంటున్నారు. గ్రామంలో బయోగ్యాస్‌ను వినియోగించుకుంటున్నారు. పంటలకు ఎరువుగా వర్మికంపోస్టు తయారు చేసుకుని ఉపయోగిస్తున్నారు. తాగునీటికి ఊటబావి తవ్వారు. మినీవాటర్ ట్యాంక్‌ల నిర్మాణం, పంట పొలాలకు వెళ్లేందుకు దారులు, చెట్లు నాటడం.. ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామానికి వెళ్లే రహదారి ఇరుకుగా ఉండటంతో తరచు ప్రమాదాలు జరిగేవి. దీంతో గ్రామస్తులు సంఘం ఆధ్వర్యంలో రహదారికి ఇరువైపుల మట్టి వేయడంతో ప్రమాదాలు తప్పాయి. ఇలా తమకు తాము అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న లింగంపల్లి గ్రామస్తులు ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ఖరీఫ్‌నకు సిద్ధం
సదాశివనగర్, న్యూస్‌లైన్: ఖరీఫ్ సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. వేసవి దుక్కులు దున్నిస్తే పం టల సాగుకు అన్ని విధాల ప్రయోజనం ఉం టుందని రైతులు భావిస్తున్నారు. దీంతో రైతులు ట్రాక్టర్లతో దుక్కులు దున్నించి పంట భూమిని సాగుకు సిద్ధం చేస్తున్నారు. వర్షాలు అనుకూలిస్తే మొక్కజొన్నతో పాటు పత్తి పంట విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంటుంది. రెండేళ్లు గా అన్నదాత ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నా డు. దీనికి తోడు ఏటేటా పెరుగుతు న్న విత్తనాలు, ఎరువుల ధరలు రైతన్నను మరింత కుదేలు చేస్తున్నాయి. ఈ ఏడాది భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవడంతో పాటు విత్తనాలు, ఎరువులు, కూలీల ధరలు పెరగడంతో పెట్టుబడులు అధికమయ్యాయి. ఈ ఖరీఫ్‌లో సదాశివనగర్ మండలంలో 3వేల 250 హెక్టార్లలో పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయాధికారుల అంచనా. అందుబాటులో విత్తనాలు, ఎరువులు నిజామాబాద్ అగ్రికల్చర్ : ఖరీఫ్ సమీపిస్తున్న తరుణంలో రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, సమకూర్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సోయా, మొక్కజొన్న, పెసర్లు, మినుములు, తొగర్లు, జీలుగ, జనుము విత్తనాలను రైతులకు అందుబాటులో పెడుతున్నారు. అందుకోసం వివిధ కంపెనీలతో ఇప్పటికే అధికారులు సంప్రదింపులు జరిపారు. ఏపీఎస్ఎస్డీసీ కంపెనీకి 25 వేల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాల కోసం ఆర్డర్ చేయగా ఇప్పటికే వారు 75 వందల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను సిద్ధంగా పెట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అదే విధంగా హెచ్ఏసీఏకు 20 వేల క్వింటాళ్లకు ఆర్డర్ ఇవ్వగా 6500 క్వింటాళ్లు సమకూర్చినట్లు చెబుతున్నారు. ఏపీ ఆయిల్ ఫెడ్‌కు 25 వేల క్వింటాళ్లకు ఆర్డర్ ఇవ్వగా ఏమీ సమకూర్చలేదని తెలుస్తోంది. అదే విధంగా మొక్కజొన్న విత్తనాలు 3650 క్వింటాళ్లు, తొగర్లు 100 క్వింటాళ్లు, మినుములు 200 క్వింటాళ్లు, తొగర్లు 200 క్వింటాళ్లు, జీలుగ విత్తనాలు 1750 క్వింటాళ్లు, జనుము 340 క్వింటాళ్లు మాత్రమే సమకూర్చినట్లు సమాచారం. ఎంత అవసరం గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని రైతుకు సకాలంలో ఎరువులను అందించేందుకు వ్యవసాయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా యూరియా -135438 మెట్రిక్ టన్నులు, డీఏపీ-21033 మెట్రిక్ టన్నులు, ఫొటాష్(ఎంఓపీ)16811 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్-69403 మెట్రిక్ టన్నులు అవసరం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. నిలువలు యూరియా 10723 మెట్రిక్ టన్నులు , డీఏపీ 2942.350 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 1826.500 మెట్రిక్ టన్నులు మార్క్‌ఫెడ్‌లో నిల్వ ఉండగా పోటాష్ ఏమీ లేదు. {పైవేటు డీలర్ల వద్ద యూరియా 9778.690 మెట్రిక్ టన్నులు, డీఏపీ 4932.200 మెట్రిక్ టన్నులు, పోటాష్(ఎంఓపి)1717 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్14431.200 మెట్రిక్ టన్నులు ప్రవేటు డీలర్ల వద్ద నిల్వ ఉంది. వీటితో పాటు వివిధ కంపెనీల్లో యూరియా 4711 మెట్రిక్ టన్నులు, డీఏపీ 318.800 మెట్రిక్ టన్నులు, పోటాష్(ఎంఓపి)13.200మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్- 13357 మెట్రిక్ టన్నుల నిల్వ ఉన్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. -
‘తెలంగాణ’లో ప్రజలే హైకమాండ్
సదాశివనగర్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలే హైకమాం డని, వారి ఆకాంక్షలకు అనుగుణంగానే పాలన సాగుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. సోమవారం సదాశివనగర్ మండలంలోని మల్లన్నగుట్ట వద్ద ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తామని అన్నారు. రా నున్న కాలంలో కార్మిక సంఘాల్లో గులాబీ జెండాల రెపరెపలు తథ్యమన్నారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేవలం టీఆర్ఎస్సొంతమన్నారు. ఎన్నో త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం సాకారం కాబోతోందన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణ పునర్నిర్మాణానికి బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రై వేట్ పరం చేయాడానికి ఎన్నో ప్రయతాలు చేస్తున్నారని, దానిని అడ్డుకుంటామని అన్నారు. చంద్రబాబు హ యాంలో 51 శాతం నిజాంషుగర్స్ వాటాను అమ్మేశారని, ప్రస్తుత సీఎం కిరణ్ హయంలో ఉన్న 49 శాతాన్ని అమ్మివేయానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. నిజాం షుగర్స్‌ను ప్రైవేట్ పరం చేస్తే తెలంగాణ ప్రాంత కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనిని అడ్డుకుని కార్మికులకు న్యాయం జరిగేలా కృషిచేస్తామన్నారు. ఉద్యమంలో మోతే గ్రామం చరిత్ర పుట్టల్లోకెక్కిందన్నారు. సదాశివనగర్ మండలంలోని గిద్ద గ్రామం కూడా చరిత్ర పుట్టల్లో నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు ఆధ్వర్యంలో అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రిషుగర్స్ ఫ్యాక్టరీ 20 మంది కార్మికులు, రామారెడ్డికి చెందిన పదిమంది, గిద్ద గ్రామానికి చెందిన 20 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. గాయత్రి షుగర్స్‌లో తెలంగాణ మజ్దూర్ యూ నియన్ ఏర్పాటు చేసి తెలంగాణ సత్తాను చాటాలని సూచించారు. ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ప్రజాగాయకుడు దేశపతి శ్రీనివాస్, నాయకులు నల్లమడుగు సురేందర్, నాయకులు ఏలేటి భూంరెడ్డి, పడిగెల రాజేశ్వర్‌రావు, మోహన్‌రెడ్డి, నారెడ్డి లింగారెడ్డి, దశరత్‌రెడ్డి, రాజయ్య, రాంరెడ్డి, సుమిత్రానంద్రావు, జూకంటిరాజు , జగన్‌రెడ్డి, సాయిరెడ్డి, హరినారాయణ, లింగం తదితరులు పాల్గొన్నారు. గాంధారిలో తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ గాంధారి : గాంధారి మండల కేంద్రంలో తెలంగాణతల్లి విగ్రహ ఏర్పాటు కోసం సోమవారం హరీష్‌రావు భూమిపూజ చేశారు. అనంతరం బైక్‌లపై ర్యాలీగా వజ్జపల్లితండాకు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడా రు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ప్రజా గాయకుడు దేశపతి శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తానాజీరావు, నల్లమడుగు సురేందర్, పోతంగల్ కిషన్‌రావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.