సదాశివనగర్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలే హైకమాం డని, వారి ఆకాంక్షలకు అనుగుణంగానే పాలన సాగుతుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. సోమవారం సదాశివనగర్ మండలంలోని మల్లన్నగుట్ట వద్ద ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తామని అన్నారు. రా నున్న కాలంలో కార్మిక సంఘాల్లో గులాబీ జెండాల రెపరెపలు తథ్యమన్నారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేవలం టీఆర్‌ఎస్‌సొంతమన్నారు. ఎన్నో త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం సాకారం కాబోతోందన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణ పునర్నిర్మాణానికి బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రై వేట్ పరం చేయాడానికి ఎన్నో ప్రయతాలు చేస్తున్నారని, దానిని అడ్డుకుంటామని అన్నారు. చంద్రబాబు హ యాంలో 51 శాతం నిజాంషుగర్స్ వాటాను అమ్మేశారని, ప్రస్తుత సీఎం కిరణ్ హయంలో ఉన్న 49 శాతాన్ని అమ్మివేయానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
నిజాం షుగర్స్‌ను ప్రైవేట్ పరం చేస్తే తెలంగాణ ప్రాంత కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనిని అడ్డుకుని కార్మికులకు న్యాయం జరిగేలా కృషిచేస్తామన్నారు. ఉద్యమంలో మోతే గ్రామం చరిత్ర పుట్టల్లోకెక్కిందన్నారు. సదాశివనగర్ మండలంలోని గిద్ద గ్రామం కూడా చరిత్ర పుట్టల్లో నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు ఆధ్వర్యంలో అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రిషుగర్స్ ఫ్యాక్టరీ 20 మంది కార్మికులు, రామారెడ్డికి చెందిన పదిమంది, గిద్ద గ్రామానికి చెందిన 20 మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్ లో చేరారు. గాయత్రి షుగర్స్‌లో తెలంగాణ మజ్దూర్ యూ నియన్ ఏర్పాటు చేసి తెలంగాణ సత్తాను చాటాలని సూచించారు. ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ప్రజాగాయకుడు దేశపతి శ్రీనివాస్, నాయకులు నల్లమడుగు సురేందర్, నాయకులు ఏలేటి భూంరెడ్డి, పడిగెల రాజేశ్వర్‌రావు, మోహన్‌రెడ్డి, నారెడ్డి లింగారెడ్డి, దశరత్‌రెడ్డి, రాజయ్య, రాంరెడ్డి, సుమిత్రానంద్‌రావు, జూకంటిరాజు , జగన్‌రెడ్డి, సాయిరెడ్డి, హరినారాయణ, లింగం తదితరులు పాల్గొన్నారు.
గాంధారిలో తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ
గాంధారి : గాంధారి మండల కేంద్రంలో తెలంగాణతల్లి విగ్రహ ఏర్పాటు కోసం సోమవారం హరీష్‌రావు భూమిపూజ చేశారు. అనంతరం బైక్‌లపై ర్యాలీగా వజ్జపల్లితండాకు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడా రు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ప్రజా గాయకుడు దేశపతి శ్రీనివాస్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తానాజీరావు, నల్లమడుగు సురేందర్, పోతంగల్ కిషన్‌రావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
‘తెలంగాణ’లో ప్రజలే హైకమాండ్
Published Tue, Dec 31 2013 6:02 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement
Advertisement