సదాశివనగర్‌లో మహిళ దారుణ హత్య | women murderd in sadshivanagar | Sakshi
Sakshi News home page

సదాశివనగర్‌లో మహిళ దారుణ హత్య

Published Wed, May 6 2015 10:31 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

women murderd in sadshivanagar

నిజామాబాద్(సదాశివనగర్): సదాశివనగర్ మండలం ఆమర్లబండశివారులో మల్లారి రాణి(30) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమెతో పాటు సాయిబాబా(32) అనే మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తి బుధవారం ఉదయం 3 గంటలకు బైక్‌పై వెళ్తున్న రాణి, సాయిబాబాలను హతమార్చాలని పథకం వేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

రాణి భర్త విదేశాల్లో ఉంటాడు. సాయిబాబాను దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement