నేడు సీఎం రాక
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- సదాశివనగర్‌లో ‘మిషన్‌కాకతీయ’ ప్రారంభం
- అక్కడే కేసీఆర్ బహిరంగ సభ నిర్వహణ
- సభాస్థలిని పరిశీలించిన మంత్రి ‘పోచారం’
సదాశివనగర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం సదాశివనగర్ మండల కేంద్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
‘కాకతీయ మిషన్’ కార్యక్రమంలో భాగంగా సీఎం ఇక్కడ చెరువు పూడిక తీత పనులను ప్రారంభించనున్నారు. అనంతరం చెరువు వద్ద బహిరంగ సభ ఉంటుంది. హెలీప్యాడ్ వద్ద బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. మైదానాన్ని చదును చేశారు. సీఎం పర్యటన స్థలాన్ని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్‌పీ చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీందర్‌రెడ్డి, హన్మంత్ సింధే, గణేశ్ గుప్తా బుధవారం పరిశీలించారు.
సీఎం కాన్వాయి ట్రయల్ రన్ నిర్వహించారు. వారి వెంట జడ్‌పీటీసీ పడిగెల రాజేశ్వర్‌రావు, ఎంపీపీ బంజ విజయ శివకుమార్, టీఆర్‌ఎస్ మండల కన్వీనర్ నారెడ్డి లింగారెడ్డి, వైస్ ఎంపీపీ రూపేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కమలాకర్‌రావు, దశ రథ్‌రెడ్డి, బాల్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహారెడ్డి, లడ్డు శ్రీను, రాజిరెడ్డి ఉన్నారు.
సీఎం పర్యటన ఇలా
- ప్రగతిన గర్: సీఎం హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి హెలీక్యాప్టర్ ద్వారా ఉదయం 9.55కు బయలుదేరుతారు. 10.30కు సదాశివన గర్ మండల కేంద్రానికి చేరుకుంటారు.
- ‘మిషన్ కాకాతీయ’ పనులను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి 12.20కి మెదక్‌లోని నాచారం లక్ష్మీనరసింహస్వామి గుట్టకు చేరుకుని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 4.40కి మెదక్‌నుంచి బయలుదేరి 5 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.