తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్‌ కృషి | KCR work for development of Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్‌ కృషి

Published Sun, Mar 18 2018 8:52 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM

KCR work for development of Telangana - Sakshi

మోటకొండూర్‌ (ఆలేరు) : తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని అమ్మనబోలులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు. కేసీఆర్‌ ముందుచూపుతో మిషన్‌ కాకతీయ, భగీరథ, పెట్టుబడి సాయం, సాగునీటి ప్రాజెక్ట్‌లు, మహిళా సంక్షేమ పథకాలు, పలు పథకాలతో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. అంతకు ముందు గ్రామపంచాయతీ, మహిళా భవనం ప్రారంభం, సీసీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుంచి 30మంది టీఆర్‌ఎస్‌లో  చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ క్యాసగల్ల అనసూయ, జెడ్పీటీసీ బొట్ల పరమేష్, ఎంపీడీఓ చిలుకూరి శ్రీనివాస్, పంచాయతీరాజ్‌ ఏఈ శ్రీనివాస్, ఆలేరు మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ నాయిని రాంచంద్రారెడ్డి, గ్రామసర్పంచ్‌ శీల స్వరూపయాదయ్య, ఉపసర్పంచ్‌ కృష్టయ్య, ఎంపీటీసీ ఆనంద్, సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు  రవీందర్‌రెడ్డి,  రమేష్,  భాస్కర్,  నరహరి,  బాలయ్య, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement