పార్టీలో చేరిన వారికి కండువా కప్పుతున్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి
ఆత్మకూరు(పరకాల) : పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో మిషన్ కాకతీయ కింద పునరుద్ధరిస్తున్న చెరువుపనులతోపాటు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగేళ్లలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందన్నారు. ఏప్రిల్ 15 నాటికి ఇంటింటికీ గోదావరి జలాలు అందించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు.
ఆత్మకూరు మండలంలో 98శాతం భూప్రక్షాళన పూర్తయిందని, త్వరలోనే ఈపాస్‌బుక్కులు అందించడానికి కసరత్తు జరుగుతోందన్నారు. అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని, ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకంగా ఉన్నామని పేర్కొన్నారు. గత పాలకులు అవినీతికి పాల్పడి సొంత పార్టీల వారికే లబ్ధిచేకూర్చారని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపు మల్లికార్జున్, తహసీల్దార్ వెంకన్న, ఎంపీడీఓ నర్మద, టీఆర్‌ఎస్ నాయకులు కానుగంటి సంపత్‌కుమార్, కేశవరెడ్డి, జాకీర్‌అలీ, మాజీ జెడ్పీటీసీ సత్యనారాయణ, ఎన్కతాల్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
కంటికి రెప్పలా కాపాడుకుంటా...
మండలకేంద్రంలో కాంగ్రెస్ నాయకుడు పెరుమాండ్ల భిక్షపతి, వార్డుసభ్యుడు నరహరి, ఎస్‌ఎంసీ చైర్మన్ వేణుతోపాటు పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి అహర్నిషలు కృషిచేయాలని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు.
ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ
మండలకేంద్రంలో తెలంగాణ జానపద కళాకారులకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇన్సూరెన్స్ కార్డులు అందజేశారు. కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తున్నదని చెప్పారు. కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోల్కొండ వెంకన్న, గౌరవ సలహదారుడు బుచ్చిరెడ్డి, భిక్షపతి, కుమార్, రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment