Challa Dharmareddy
-
ఎమ్మెల్యే ఇంటిపై దాడి కేసులో 43 మందికి రిమాండ్
సాక్షి, వరంగల్: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి కేసులో వరంగల్ జిల్లా కోర్టు నిందితులకు రిమాండ్ విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 43 మందికి ఈనెల 15వరకు రిమాండ్‌కు ఆదేశించింది. దీంతో నిందితులను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో ఏ-1గా భాజపా వరంగల్ అర్బన్ అధ్యక్షురాలు రావు పద్మ. ఏ-2గా వరంగల్ రూరల్ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ఉన్నారు. అయోధ్య రామాలయ నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై భాజపా నేతలు, కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. కాగా, ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ పరకాల పట్టణ బందుకు పిలుపునిచ్చింది. -
ప్రగతి సింగారానికి వచ్చిన సీఎం కేసీఆర్
సాక్షి, వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారానికి వచ్చారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తండ్రి మల్లారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 4న మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం దశ దినకర్మ జరగగా సీఎం కేసీఆర్ వచ్చారు. ఈ మేరకు మల్లారెడ్డి చిత్రపటం వద్ద పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు ధర్మారెడ్డి, ఆయన కుటుంబీకులను ఓదార్చారు. ఆ తర్వాత మల్లారెడ్డి అనారోగ్యంపై ఆరా తీశారు. అనంతరం ధర్మారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి సీఎం కేసీఆర్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి భోజనం చేశారు. గంట పాటు ప్రజాప్రతినిధులతో భేటీ చల్లా ధర్మారెడ్డి ఇంట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. భోజనం చేసిన అనంతరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలను లోపలకు పిలిచారు. ఈ సందర్భంగా జిల్లాలో అభివృద్ధి పనులపై సుమారు గంట పాటు చర్చించారని సమాచారం. కాళేశ్వరం ద్వారా త్వరలో సాగు నీరు వస్తుందని.. దీంతో వరంగల్ దశ మారుతుందని సీఎం ప్రజా ప్రతినిధులకరు చెప్పినట్లు తెలిసింది. కాళేశ్వరం, దేవాదుల ద్వారా సాగు విస్తీర్ణం పెరిగి రైతులు ఆనందం వ్యక్తం చేస్తారని అన్నారు. కాళేశ్వరం ద్వారా ఒక్కో నియోజకవర్గంలో ఎంత సాగు అవుతుందని వివరించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు గుడిమల్ల రవికుమార్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, టీఆర్ఎస్ నాయకురాలు హరి రమాదేవిని సైతం లోపలకు పిలిపించి కేసీఆర్ మాట్లాడారు. భారీ భద్రత ప్రగతి సింగారంలో మల్లారెడ్డి దశ దినకర్మను చల్లా ధర్మారెడ్డి, రఘుపతిరెడ్డి, కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఆ తర్వాత ఆవరణను సీఎం ప్రత్యేక సెక్యూరిటీ అదుపులోకి తీసుకుంది. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యాన డీసీపీ కే.ఆర్.నాగరాజు, ఏసీపీ సునీతామోహన్తో పాటు 450 మంది సిబ్బంది, 15 మంది సీఐలు, 10 మంది ఏసీపీలతో ముడంచెల భద్రత ఏర్పాటు చేశారు. బంధువులందరినీ ఒక పక్కకు పంపించి రోప్‌ను కట్టారు. తొలుత మీడియా వారిని సైతం బయటకు పంపించారు. ఈ విషయమై జర్నలిస్టులు కలెక్టర్, కమిషనర్‌తో చర్చించడంతో ప్రత్యేక రోప్‌ను ఏర్పాటు చేసి బంధువుల పక్కన ఉండి కవరేజీ చేసుకునేలా అవకాశం కల్పించారు. 1.52 గంటల పాటు ప్రగతి సింగారంలో గంట యాభై రెండు నిముషాల పాటు ప్రగతి సింగారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉన్నారు. మధ్యాహ్నం 1.50గంటలకు ప్రత్యేక హెలీక్యాప్టర్‌లో ప్రగతి సింగారానికి ఆయన చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో మధ్యాహ్నం 2.02 గంటలకు చల్లా ధర్మారెడ్డి ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం 3.29గంటలకు చల్లా ధర్మారెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ 3.38గంటలకు హెలీప్యాడ్‌కు చేరుకున్నాడు. అక్కడ 3.42గంటలకు హెలీకాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరారు. -
అండగా ఉంటా.. ఆదరించండి..
నియోజకవర్గంలోని ప్రతి గ్రా మాన్ని అభివృద్ధి చేశానని, మరోసారి తనను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అండగా నిలుస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చల్లా ధర్మారెడ్డి ఓటర్లను కోరారు. నియోజకవర్గంలోని కమలాపురం మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో శుక్రవారం రాష్ట్ర రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పరకాల రూరల్: నియోజకవర్గంలోని ప్రతి గ్రా మాన్ని అభివృద్ధి చేశానని, మరోసారి తనను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అండగా నిలుస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చల్లా ధర్మారెడ్డి ఓటర్లను కోరారు. నియోజకవర్గంలోని కమలాపురం మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో శుక్రవారం రాష్ట్ర రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అమలు చేస్తామని, ఆయా పథకాలను దేశంతోపాటు ప్రపంచదేశాలు మెచ్చుకున్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సుమారు కోటి రూపాయల మేర అభివృద్ధి జరిగిందన్నా రు. గ్రామానికి ఇటీవలే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మంజూ రైందని, ఉగాది వరకు ఆ ప్రాజెక్టు నిర్మా ణం పూర్తి చేసి గ్రామంలోని ప్రతి ఎకరాకు రెండో పంటకు నీరందిచేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. పరకాల నుంచి వెంకటేశ్వర్లపల్లి మీదుగా జమ్మికుంట వరకు బస్సు సౌకర్యం కల్పించడంతోపాటు మల్లక్కపేట నుంచి గ్రామానికి డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో నియోజకవర్గ రూపురేఖలు మార్చి ఇక్కడి నుంచి కొందరు పారిపోయారని కొండా దంపతులను ఉద్దేశించి మాట్లాడారు. నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇంటికి పెద్దన్నలా కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రతి కుటుం»బం లబ్ధిపొందేలా పథకాలను రూపొందించి అమలు చేసినట్లు తెలిపారు. కోటి ఆశలతో సాధించుకున్న తెలంగా ణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే సామర్థ్యం ఒక్క కేసీఆర్‌కు ఎందన్నారు. ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి మరోసారి టీఆర్ఎస్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, ఎంపీపీ నేతాని సులోచన, టీఆర్ఎస్ నాయకులు పాడి ప్రతాప్ రెడ్డి, బీముడి నాగిరెడ్డి, నందికొండ జైపాల్ రెడ్డి , గురిజపల్లి ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
కొండా దమ్ముంటే పరకాలకు రండి !
గీసుకొండ(పరకాల): ‘మూడు నియోజకవర్గాల్లో తమకు గెలిచే సత్తా ఉందని అంటున్న కొండా దంపతులకు దమ్ము, ధైర్యం ఉంటే పరకాల నియోజకవర్గం నుంచి నాతో పోటీకి రావాలి.. వారికి ప్రజలు చెమటలు పట్టించడం కాదు ఈ సారి మట్టి కరిపించడానికి సిద్ధంగా ఉన్నారు.. సంగెం మండల ప్రజలకు ఈ అవకాశం మరోమారు వచ్చింది’ అని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుకొండ మండలం కొనాయమాకులలోని ఓంకార్ గార్డెన్స్‌లో బుధవారం సంగెం మండల టీఆర్ఎస్ నాయకులు,ప్రజాప్రతినిధులు, ముఖ్యకా ర్యకర్తలు, బూత్ కమిటీల సభ్యులతో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయకచవితి నాటికి కొండా దంపతుల వంద తప్పులు పూర్తయ్యాయని, గుండాయిజం, రౌడీయిజం చేసేవాళ్లు, కాళ్లు మొక్కించుకునే నాయకులు ప్రజలకు అవసరం లేదన్నారు. గతంలో వంచనగిరి సమావేశంలో ఊరికో కొండా మురళి పుట్టాలని ఆయన కూతురు చెప్పారని, కానీ ఒక్కరితోనే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఊరికొకరు ఎందుకని ఎద్దేవా చేశారు. తను గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన సందర్భంగా డోలు కొట్టడం, డొమ్మరిగడ్డలు వేయడం తానే వేశానని, ప్రస్తుతం టీఆర్ఎస్ కార్యకర్తలు డోలు కొడితే తాను డొమ్మరిగడ్డలు వేస్తానన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీ బొమ్మల కట్టయ్య, జెడ్పీటీసీ సభ్యురాలు గుగులోతు వీరమ్మ, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కందకట్ల నరహరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గూడ సుదర్శన్‌రెడ్డి, ఏరియా కన్వీనర్ బుక్క మల్లయ్య, కోఆప్షన్ సభ్యులు మసూద్ అలీ, మాజీ ఎంపీపీ వీరాచారి, పసునూరి వజ్రయ్య, సింగిల్‌విండో చైర్మన్ కిషన్, జాగృతి నాయకుడు జున్న రాజు యాదవ్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లెబోయిన కిషోర్, సింగిల్ విండో చైర్మన్ కిషన్, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
ఎక్కువ ఓట్లు వేయిస్తే నగదు నజరానాలు
గీసుకొండ: అధికంగా ఓట్లు వేయించిన కార్యకర్తలు, నాయకులకు రూ.50 వేలు నజరానాలు ఇస్తానని పరకాల తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుకొండ మండలం కొనాయమాకులలో బుధవారం సంగెం మండల టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ కమిటీల సభ్యులతో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికంగా ఓట్లు పడిన గ్రామానికి రూ.లక్ష నగదును నజరానాగా ఇస్తానని ప్రకటించారు. -
పేదల సంక్షేమమే సర్కారు ధ్యేయం
ఆత్మకూరు(పరకాల) : పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో మిషన్ కాకతీయ కింద పునరుద్ధరిస్తున్న చెరువుపనులతోపాటు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగేళ్లలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందన్నారు. ఏప్రిల్ 15 నాటికి ఇంటింటికీ గోదావరి జలాలు అందించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. ఆత్మకూరు మండలంలో 98శాతం భూప్రక్షాళన పూర్తయిందని, త్వరలోనే ఈపాస్బుక్కులు అందించడానికి కసరత్తు జరుగుతోందన్నారు. అర్హులందరికీ డబుల్బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని, ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకంగా ఉన్నామని పేర్కొన్నారు. గత పాలకులు అవినీతికి పాల్పడి సొంత పార్టీల వారికే లబ్ధిచేకూర్చారని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపు మల్లికార్జున్, తహసీల్దార్ వెంకన్న, ఎంపీడీఓ నర్మద, టీఆర్ఎస్ నాయకులు కానుగంటి సంపత్‌కుమార్, కేశవరెడ్డి, జాకీర్‌అలీ, మాజీ జెడ్పీటీసీ సత్యనారాయణ, ఎన్కతాల్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటా... మండలకేంద్రంలో కాంగ్రెస్ నాయకుడు పెరుమాండ్ల భిక్షపతి, వార్డుసభ్యుడు నరహరి, ఎస్ఎంసీ చైర్మన్ వేణుతోపాటు పలువురు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి అహర్నిషలు కృషిచేయాలని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ మండలకేంద్రంలో తెలంగాణ జానపద కళాకారులకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇన్సూరెన్స్ కార్డులు అందజేశారు. కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తున్నదని చెప్పారు. కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోల్కొండ వెంకన్న, గౌరవ సలహదారుడు బుచ్చిరెడ్డి, భిక్షపతి, కుమార్, రమేష్ పాల్గొన్నారు. -
పరకాల ఎమ్మెల్యే కుటుంబానికి కోయదొరల టోకరా
వరంగల్ : వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. పూజలు చేస్తే పదవి వస్తుందంటూ ఎమ్మెల్యే కుటుంబానికి కోయదొరలు టోకరా వేశారు. పూజలు చేస్తే తన తండ్రికి మంత్రి పదవి వస్తుందని... ఎమ్మెల్యే కుమార్తె శ్యాంరెడ్డి మానస రెడ్డి... కరీమాబాద్‌కు చెందిన ఇద్దరు కోయదొరలను సంప్రదించారు. కాశీలో పూజలు చేస్తే మంత్రి పదవి వస్తుందని, అక్కడకు వెళ్ళి పూజలు చేస్తామని అందుకోసం కోసం ఖర్చు అవుతుందని కోయదొరలు నమ్మించారు. ఈ క్రమంలో మానస నుంచి సుమారు రూ.57 లక్షలు వసూలు చేసి, ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయారు. చివరికి మోసపోయామని గుర్తించిన ఆమె ఈ విషయాన్ని ఇంట్లోవారికి తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసిన కోయదొరలు లక్ష్మణరాజు, వంశీరాజులపై 420, 406 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈసీని కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు
-
ఈసీని కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు
హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. కనగానెపల్లె ఎంపీపీ ఎన్నిక సమయంలో మంత్రి పరిటాల సునీత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ నేత చల్లా మధుసూదన్ రెడ్డి ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. ఎంపీపీ ఎన్నికను రద్దు చేయాలని ఈసీని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ విజయ సాయిరెడ్డి రాసిన లేఖను మధుసూదన్ రెడ్డి, ఈసీకి అందజేశారు. ఎన్నికల సమయంలోని వీడియో ఫుటేజీని పరిశీలించి ఎంపీపీ ఎన్నికను వెంటనే రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు ఈసీని విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలంటూ అనంతపురం కలెక్టర్‌ను ఈసీ ఆదేశించారు. -
ఎమ్మెల్యే చల్లా కు తప్పిన ప్రమాదం
జనగామ: హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై జనగామ శివారులో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గా యాలుకాగా... ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎమ్మెల్యే ధర్మారెడ్డి తన భార్య జ్యోతి, కూతుళ్లు మానస, జాహ్నవి, మనవరాలు మూడు నెలల పాపతో కలసి ఇన్నోవాలో హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వస్తున్నారు. వర్ధన్నపేట మండలం రాపర్తికి చెందిన అయిత కుమార్(కారు యజమాని, డ్రైవర్), వెంకటలక్ష్మి... పిల్లలు హరీష్, అభి లు హైదరాబాద్‌లో ఉంటూ జఫర్‌గఢ్‌లో ఓ వివాహానికి హాజరై హైదరాబాద్‌కు ఇండికా కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో జనగామ శివారులోని ఉడుముల ఆస్పత్రి వద్ద వీరి ఇండికా వాహనం వేగంగా వచ్చి ఎమ్మెల్యే చల్లా ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, భార్య జ్యోతి, పెద్ద కూతురు మానస, మానస కూతురైన మూడు నెలల పాప, డ్రైవర్ అడాల సతీష్ స్వల్ప గాయాలతో బయటపడగా.. జాహ్నవి తలకు తీవ్ర గాయమై రక్త స్రావమైంది. ఇండికా కారులో ఉన్న అయితకుమార్, వెంకటలక్ష్మి తల, చేతులకు తీవ్ర గాయాలు కాగా... మానస చేయి విరిగిపోయింది. వెంకటలక్ష్మి కొడుకులు హరీశ్, అభి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెనుక మరోకారులో వస్తున్న టీఆర్ఎస్ జనగామ మండల శాఖ అధ్యక్షుడు కళింగరాజు ప్రమాద ఘటనను చూసి ఎమ్మెల్యేను, ఆయన కుటుంబ సభ్యులను భువనగిరి వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు పంపించారు. -
చల్లా చేరికపై లొల్లి!
* పరకాల టీఆర్ఎస్లో విభేదాలు * సహోదర్‌రెడ్డి, మొలుగూరి వర్గాలు నారాజ్ * వీరికి ప్రాధాన్యం ఇవ్వాలని కేడర్ పట్టు * గులాబీ అధినాయకత్వంపై అసంతృప్తి * ధర్మారెడ్డి చేరిక తేదీపై స్పష్టత కరువు సాక్షి ప్రతినిధి, వరంగల్ : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టీఆర్ఎస్లో చేరే అంశం గులాబీ పార్టీలో కొత్త రాజకీయానికి తెర తీస్తోంది. పరకాల నియోజకవర్గంలోని టీఆర్ఎస్లో ఇప్పటికే మూడు వర్గాలు ఉన్నాయి. సాధారణ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిగా తాము ఎదుర్కొన్న వ్యక్తి ఇప్పుడు తమకు నాయకుడిగా వస్తుండడంపై మూడు వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. టీఆర్ఎస్లోని ద్వితీయ శ్రేణి నాయకత్వం ధర్మారెడ్డి పార్టీలోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టీఆర్ఎస్ అధినాయకత్వం ఆగ్రహానికి గురికావద్దనే ఉద్దేశంతో ధర్మారెడ్డి రాకను బహిరంగంగా ఎవరూ వ్యతిరేకించడం లేదు. అంతర్గతంగా మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వరకు తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టిన ఆయనకు విధేయంగా తాము ఎలా పని చేస్తామని ప్రశ్నిస్తున్నారు. సంగెం, ఆత్మకూరు మండలాల్లో ఇప్పటికే ధర్మారెడ్డికి వ్యతిరేకంగా కొందరు నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ధర్మారెడ్డి ప్రకటించిన రోజే ఈ రెండు మండలాల్లోని కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలోకి రాకముందే ధర్మారెడ్డి ఇంటికి వెళ్లి కొందరు టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలకడంపై వారు ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తిని తమ తో ప్రమేయం లేకుండా టీఆర్ఎస్ జిల్లా నేతలు కలవడాన్ని వీరు తప్పుబడుతున్నారు. సాధారణ ఎన్నికల వరకు పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మొలుగూరి బిక్షపతికి ఆ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. న్యాయవాదుల కోటాలో ముద్దసాని సహోదర్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. గతంలో ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన కొండా సురేఖకు ఇక్కడ ప్రత్యేకంగా అనుచర వర్గం ఉంది. సాధారణ ఎన్నికలు, అంతకుముందు జరిగిన స్థానిక ఎన్నికల్లో ఈ మూడు వర్గాల్లోని ద్వితీ య శ్రేణి నేతలు.. టీడీపీ అభ్యర్థులతోనే పోటీ పడ్డారు. ధర్మారెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్లో చేరితే ఆయనతో పార్టీలోకి వచ్చే వారికే ఆయా మండలాలు, గ్రామాల్లో ప్రాధాన్యం ఉంటుందని గులాబీ శ్రేణులు వాపోతున్నాయి. ఉద్యమంలో మొదటి నుంచి తాము పాల్గొనగా.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చే రిన వారికి ప్రాధాన్యం పెరిగితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కొత్త రాజకీయం షురూ.. సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డి 9,108 ఓ ట్ల మెజార్టీతో గెలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి సహోదర్‌రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పరకాల నియోజకవర్గంలో ఈ పార్టీకి పట్టు ఉంది. సాధారణ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ అనుకూల పవనాలు ఉన్నాయి. ఇ లాంటి పరిస్థితుల్లోనూ పరకాలలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించలేదు. టీఆర్ఎస్లోని మూడు గ్రూపుల రాజకీయంతో నే ఇలా జరిగిందని గులాబీ నేతలే చెబుతున్నారు. మూడు వర్గాలను సమన్వయం చేసే విషయాన్ని పట్టించుకోని టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు ఇతర పార్టీకి చెందిన ఎమ్మెల్యేను చేర్చాలనుకోవడంపై ద్వితీయ శ్రేణి నేతలు ఆగ్రహంగా ఉన్నారు. టీఆర్ఎస్లో చేరితే పరకాల నియోజకవర్గంలోని ఈ పార్టీలో కొత్త రకమైన రాజకీయం మొదలుకానుంది. ప్రస్తుతం పరకాల టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి తానేనని సహోదర్‌రెడ్డి చెబుతుండగా.. మొలుగూరి బిక్షపతి వర్గం ఇదే అభిప్రాయంతో ఉం ది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ధర్మారెడ్డి చేరిన తర్వాత ఆయనే నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉంటారు. దీంతో సహోదర్‌రెడ్డి, బిక్షపతి వర్గాలు భవిష్యత్‌లో తమ పరిస్థితిపై ఇప్పుడే జాగ్రత్త పడుతున్నాయి. మార్చిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశంపై వారు దృష్టి పెట్టారు. వీరిద్దరికి ఏదైనా అవకాశం ఇచ్చిన తర్వాతే ధర్మారెడ్డి పార్టీలో చేరుతారనే అభిప్రాయం టీఆర్ఎస్లో ఉంది. సహోదర్‌రెడ్డి, బిక్షపతి విషయంలో నిర్ణయం జరిగాకే.. చేరితే ఇబ్బంది ఉండదని ధర్మారెడ్డి కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల ముందే టీఆర్ఎస్లో చేరుతారని, టీఆర్ఎస్ అధినాయకత్వం దీన్ని నిర్ణయిస్తుందని ధర్మారెడ్డి సన్నిహితులు చెబుతున్నారు.