సాక్షి, వరంగల్: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి కేసులో వరంగల్ జిల్లా కోర్టు నిందితులకు రిమాండ్ విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 43 మందికి ఈనెల 15వరకు రిమాండ్‌కు ఆదేశించింది. దీంతో నిందితులను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో ఏ-1గా భాజపా వరంగల్ అర్బన్ అధ్యక్షురాలు రావు పద్మ. ఏ-2గా వరంగల్ రూరల్ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ఉన్నారు. అయోధ్య రామాలయ నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై భాజపా నేతలు, కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. కాగా, ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడికి నిరసనగా టీఆర్‌ఎస్ పార్టీ పరకాల పట్టణ బందుకు పిలుపునిచ్చింది.
ఎమ్మెల్యే ఇంటిపై దాడి కేసులో 43 మందికి రిమాండ్
Published Mon, Feb 1 2021 7:18 PM | Last Updated on Mon, Feb 1 2021 7:41 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment