bjp activist
-
Lok sabha elections 2024: పథకాలను ఓటర్లకు చేర్చండి: మోదీ
చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తమిళనాడుకు చెందిన బీజేపీ కార్యకర్తలతో నమో యాప్ ద్వారా భేటీ అయ్యారు. ‘ఎనతు బూత్ వలిమయ్యాన బూత్ (నా బూత్ అత్యంత శక్తిమంతమైనది)’ కార్యక్రమంలో పాల్గొని లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బూత్ స్థాయి సన్నద్ధతపై వారితో చర్చించారు. ‘‘రాష్ట్రంలో ఘనవిజయమే మన లక్ష్యం కావాలి. బీజేపీ, ఎన్డీఏ అభ్యర్థుల ఘనవిజయానికి వ్యూహాలు రూపొందించండి’’ అంటూ కార్యకర్తలను ప్రోత్సహించారు. ‘‘తమిళనాట ప్రచారానికి 15 రోజులే మిగిలింది. కనుక ఓటర్లతో నిత్యం అనుసంధానమై ఉండండి. మన పథకాలను, ప్రభుత్వం సాధించిన ఘనతలను వారికి వివరించండి’’ అంటూ దిశానిర్దేశం చేశారు. బీజేపీలో తన తొలినాళ్ల అనుభవాలను మోదీ వారితో పంచుకున్నారు. -
Karnataka assembly elections 2023: కొన్ని పార్టీలకు రాజకీయాలంటే అవినీతి
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ గురువారం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. వారికి దిశానిర్దేశం చేశారు. కర్ణాటకలో ఓటర్లకు ప్రతిపక్ష కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కాంగ్రెస్ వారంటీ ఎప్పుడో ముగిసిపోయిందని, ఆ పార్టీ ఇచ్చే గ్యారంటీలకు అర్థంపర్థం లేదని ఎద్దేవా చేశారు. ఉచిత పథకాలపై మోదీ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పథకాల వల్ల రాష్ట్రాలు దివాలా తీయడం ఖాయమని చెప్పారు. భవిష్యత్తు తరాలకు దక్కాల్సిన ప్రయోజనాలను ఈ ఉచిత పథకాలు మింగేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచితాల సంస్కృతికి తెరపడాలని మోదీ స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులు కోరుతా.. ‘మన దేశంలో రాజకీయాలు అంటే అర్థం అధికారం, అవినీతిగా కొన్ని పార్టీలు మార్చేశాయి. అధికారం కోసం ఆయా పార్టీలు సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నాయి. దేశ భవిష్యత్తు గురించి, కర్ణాటకలోని యువత, మహిళల భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు’అని మండిపడ్డారు. కర్ణాటక ప్రజలు బీజేపీపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, ఈ నమ్మకాన్ని వమ్ము కానివ్వబోమని చెప్పారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాల వల్ల దక్కే లాభాలను బూత్‌స్థాయిలో ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి పని చేస్తానని చెప్పారు. ఒక కార్యకర్తగా కర్ణాటక ప్రజల వద్దకు వెళ్లి, వారి ఆశీస్సులు కోరుతానని వివరించారు. ‘ఫస్ట్ డెవలప్ ఇండియా’ షార్ట్‌కట్‌లను తాము నమ్ముకోవడం లేదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఆత్యాధునిక భౌతిక, డిజిటల్, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు వెచ్చిస్తున్నామని గుర్తుచేశారు. ఎఫ్‌డీఐ అంటే తమకు ‘ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్’ కాదని, ‘ఫస్ట్ డెవలప్ ఇండియా’ అని వివరించారు. ఐదేళ్ల పాలనా కాలం గురించి యోచించడం లేదని, దేశం గురించి ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ కాదు, దేశమే తమకు ముఖ్యమని చెప్పారు. -
చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకున్న బీజేపీ శ్రేణులు
-
సాయిగణేష్‌తో నిశ్చితార్థమైన యువతి ఆత్మహత్యాయత్నం
సాక్షి, ఖమ్మం జిల్లా: ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌తో నిశ్చితార్థం జరిగిన యువతి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.. సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి మనస్థాపంతో ఉన్న యువతి విజయ ఇవాళ మధ్యాహ్నం ఖమ్మంలో సాయి గణేష్ నిర్మించాలనుకున్న బీజేపీ పార్టీకి సంబంధించిన దిమ్మె స్థలంలో అపస్మారక స్థితిలో పడిపోవడంతో స్థానికులు వెంటనే గమనించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. చదవండి: తెలంగాణ సీఎస్‌పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వచ్చే నెల 4వ తేదీ సాయి గణేష్, విజయ వివాహం జరగాల్సి ఉంది. ఈ నెల 14వ తేదీ ఖమ్మం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సాయి గణేష్.. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించగా అక్కడ ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయి గణేష్ మృతి చెందాడు. ఆ తర్వాత సాయి గణేష్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.. సాయి గణేష్ మృతికి కారణమైన మంత్రి అజయ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో కూడా నడుస్తోంది. -
20 రోజుల్లో పెళ్లి.. ఇప్పటికే 16 కేసులు.. చార్జిషీట్ కూడా తెరవడంతో
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పోలీసులు తనను కావాలని వేధిస్తున్నారంటూ పురుగుల మందు తాగిన బీజేపీ నేత సామినేని సాయిగణేశ్ (25) మృతిచెంద డం తో.. శనివారం ఖమ్మం జిల్లా కేంద్రం అట్టుడికింది. బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఆందోళనలకు దిగడం, ప్రభుత్వాస్పత్రి అద్దాలు ధ్వంసం చేయడం, మంత్రి పువ్వాడ అజయ్, ఇతర టీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలు, కటౌట్లను దహనం చేయడం, ప్రతిగా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా దాడులకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొందరు బీజేపీ నేతలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాలను నియంత్రించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. (చదవండి: వేధింపు హత్యలు) కేసులు పెట్టి వేధిస్తున్నారని.. బీజేపీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ మజ్దూర్ సంఘ్ జిల్లా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న సామినేని సాయిగణేశ్‌పై ఏడాది కాలంలో ఖమ్మం పట్టణంలోని పలు పోలీస్స్టేషన్లలో 16 కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఆయన నివాసం ఉంటున్న 46వ డివిజన్లోని జూబ్లీక్లబ్ వెనుక బీజేపీ జెండా గద్దెను నిర్మించగా.. స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు దాన్ని కూల్చివేశారు. ఇదేమిటని సాయిగణేశ్ నిలదీయడంతో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆయనపై త్రీటౌన్ పోలీసుస్టేషన్లో మరో కేసు నమోదు చేయడంతోపాటు రౌడీషీట్ తెరిచారు. అయితే పోలీసులు తనను తరచూ స్టేషన్‌కు రావాలంటూ వేధిస్తున్నారని, బయట తిరిగితే ఎవరూ కాపాడలేరంటూ భయపెట్టారని చెప్తూ సాయిగణేశ్ ఆందోళనకు గురయ్యాడు. ఈ నెల 14న త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగాడు. పోలీసులు తొలుత ప్రభుత్వాస్పత్రికి, తర్వాత స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని ఖమ్మంకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు సాయిగణేశ్ మృతదేహం ఆస్పత్రికి చేరుకున్నా.. 3 గంటల వరకు కూడా పోస్టుమార్టం జరగలేదు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు.. పోలీసులు, అధికారపార్టీ నేతల తీరుపై మండిపడుతూ ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. అద్దాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలు, ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. 20రోజుల్లో పెళ్లి ఉండగా.. సాయిగణేశ్ చిన్నతనంలోనే తండ్రి వెంకటేశ్వరరావును కోల్పోయారు. గతేడాది కోవిడ్ సమయంలో తల్లి మంజుల కన్నుమూశారు. ఈ క్రమంలో సాయిగణేశ్‌కు వివాహం కుదిర్చిన బంధువులు.. మే 4న ముహూర్తం ఖరారు చేశారు. వివాహ ఏర్పాట్లలో ఉండగానే అతను తనువు చాలించడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. మంత్రి పువ్వాడ కారణమంటూ.. మరోవైపు సాయిగణేశ్ మృతికి మంత్రి పువ్వాడ అజయ్, కార్పొరేటర్ కన్నం వైష్ణవి భర్త ప్రసన్నకృష్ణ, పోలీసులు కారకులంటూ పట్టణవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళ నకు దిగారు. మంత్రి పువ్వాడ అజయ్, ఇతర నేతల ఫ్లెక్సీలు, కటౌట్లను చించేసి, దహనం చేశారు. ఓ ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీనికి ప్రతిగా టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. దీనితో హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు కార్యకర్తలకూ దెబ్బలు తగిలాయి. పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇక సాయిగణేశ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయి.. అంతిమయాత్ర నిర్వహిస్తుండగా కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ నాయకులపై దాడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లే రోడ్లు, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, కలెక్టరేట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. (చదవండి: కాల్చుకు తిన్నారు! సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలో ఆవేదన) -
బీజేపీ కార్యకర్త మృతి.. ఖమ్మంలో టెన్షన్ టెన్షన్..
సాక్షి, ఖమ్మం: పోలీస్ స్టేషన్లో పురుగుల మందు తాగి అత్మాహత్యాయత్నం చేసిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్ మృతదేహం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. పోస్టుమార్టం పూర్తైన అనంతరం సాయి గణేష్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి భారీగా బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో ఆసుపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా వచ్చే నెల 4వ తేదీన సాయి గణేష్ వివాహం జరగనుంది. ఇంతలోనే ఇలా జరగటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే సాయి గణేష్‌పై పోలీసులు కేసులు పెట్టి వేధించారని బంధువులు ఆరోపిస్తున్నారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లోనే పురుగుల మందు తాగానని తమతో సాయి గణేష్ చెప్పాడనీ బంధువులు చెబుతున్నారు. సంబంధిత వార్త: సాయి గణేష్ మృతి.. అలాంటి పోలీసులను వదిలిపెట్టం: బండి సంజయ్ ఖమ్మంలో టెన్షన్ ఖమ్మం పట్టణంలో టెన్షన్ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్త సాయి గణేష్ మృతి నేపథ్యంలో మంత్రి అజయ్ కుమార్ కార్యాలయం, జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల వల్లే పోలీసులు సాయి గణేష్ పై అక్రమ కేసులు పెట్టారని, దీనిలో భాగంగానే తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రి కార్యాలయం నాలుగు వైపులా భారీ గేట్లను ఏర్పాటు చేసిన పోలీసులు ఎవరిని అనుమతించట్లేదు. -
చంపుతామని బెదిరించారు: బీజేపీ కార్యకర్తలపై ఏఎస్సై ఫిర్యాదు
వీణవంక (హుజూరాబాద్): కరీంనగర్ జిల్లాలో మాజీమంత్రి ఈటల రాజేందర్ పర్యటన సందర్భంగా విధి నిర్వహణపై వెళ్లిన ఏఎస్సై బాపిరెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వీణవంక మండలం వల్భాపూర్ గ్రామంలో సోమవారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఈటల రాజేందర్ పర్యటనలో గొడవలు జరగకుండా చూసేం దుకు విధుల్లో భాగంగా బాపిరెడ్డి వల్భాపూర్ వెళ్లారు. అక్కడ దొమ్మాటి రాజమల్లు ఇంటివద్ద కార్యకర్తలతో ఈటల సమావేశ మయ్యారు. ఈక్రమంలో బాపిరెడ్డి అక్కడ విధులు నిర్వర్తిస్తుండగా బీజేపీ కార్యకర్తలు ఇక్కడికెందుకు వచ్చావ్ అంటూ అతడిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన మోటార్ సైకిల్ ధ్వంసం కాగా, ఆయన వేసుకున్న చొక్కా చిరిగిపోయింది. విధులకు ఆటంకం కలిగించడంతోపాటుగా తనను చంపుతామని బెదిరించినట్లు ఏఎస్సై ఫిర్యా దు చేయగా.. బీజేపీ కార్యకర్తలు జీడి రాజు, దొమ్మాటి రాజమల్లు, నలుబాల మధు, మారముల్ల సదయ్య, నామిని విజేందర్, రాయిని శివయ్య, జీడి మోహన్, దొమ్మాటి శ్రీనివాస్‌లపై కేసు నమోదు చేశారు. -
ఘోరం: ఐదుగురు బీజేపీ కార్యకర్తలు దుర్మరణం
అగర్తల: ప్రచారానికి వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం చెట్టును ఢీకొనడంతో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు దుర్మరణం పాలయ్యారు. మరికొంత మంది తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటన త్రిపురలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ పరిణామం బీజేపీలో తీవ్ర విషాదం నింపింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొని మినీ ట్రక్కులో బీజేపీ కార్యకర్తలు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే దక్షిణ త్రిపురలోని నూతన్‌బజార్‌కు చేరుకోగానే ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పింది. టక్కు చెట్టును ఢీకొని పల్టీ కొట్టి లోతట్టు ప్రాంతంలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై బీజేపీ అధిష్టానం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ఎమ్మెల్యే ఇంటిపై దాడి కేసులో 43 మందికి రిమాండ్
సాక్షి, వరంగల్: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి కేసులో వరంగల్ జిల్లా కోర్టు నిందితులకు రిమాండ్ విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 43 మందికి ఈనెల 15వరకు రిమాండ్‌కు ఆదేశించింది. దీంతో నిందితులను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో ఏ-1గా భాజపా వరంగల్ అర్బన్ అధ్యక్షురాలు రావు పద్మ. ఏ-2గా వరంగల్ రూరల్ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ఉన్నారు. అయోధ్య రామాలయ నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై భాజపా నేతలు, కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. కాగా, ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ పరకాల పట్టణ బందుకు పిలుపునిచ్చింది. -
మోదీ పుట్టిన రోజు వేడుకలో ఒక్కసారిగా మంటలు
సాక్షి, చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా తమిళనాడు బీజేపీ కార్యకర్తలు జరుపుకున్న వేడుకలో అసశృతి చోటుచేసుకుంది. గురువారం ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలో మంటలు చెలరెగడంతో కార్యకర్తలు గాయపడిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వేడుకలో బాణా సంచాలు పేలుస్తూ.. హీలియం బెలూన్లను వదులుతున్న క్రమంలో పేలుడు సంభవించి మంటలు చెలరెగడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీంతో కార్యకర్తలంతా అక్కడి నుంచి పరుగుల తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై బీజేపీ పార్టీ సభ్యుడు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో కొంతమంతి కార్యకర్తలు స్వల్ఫంగా గయపడినట్లు చెప్పాడు. ఈ వేడుకలో బాణసంచాలు హీలియం బెలూన్లు వాడటం వల్లే ప్రమాదం జరిగిందన్నాడు. బాణాసంచాలు హీలియం బెలూన్లను తాకడంతో పేలుడు సంభవించి ఉంటుందని అతడు అభిప్రాయం వ్యక్తి చేశాడు. అయితే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ 5 మందిపైగా గుంపుగా ఉండరాదని ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో పార్టీ కార్యకర్తల ఇలా పదుల సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ నిబంధనలు ఉల్లఘించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి రోజు 6000 వేల కేసులు నమోదవుతుండగా.. చెన్నైలోనే 1000కి పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 5 లక్షలకు చేరుకున్న ఆరోగ్య శాఖ వెల్లడించింది. -
‘4 రోజుల్లో 8 హత్యలు.. వీటిపై స్పందిచరేం’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో వెలుగులోకి వస్తున్న వరుస హత్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఆరెస్సెస్ కార్యకర్త అయిన గోపాల్, ఎనిమిది నెలల గర్భవతి అయిన అతని భార్య, ఆరేళ్ల కుమారుడు అత్యంత దారుణంగా హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనను మర్చిపోకముందే.. మరో హత్య వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ పూజారి గురువారం నది ఒడ్డున శవమై కనిపించాడు. ఇతను కూడా బీజేపీ కార్యకర్త కావడం గమనార్హం. (చదవండి: తల్లిదండ్రులు, చిన్నారి పాశవిక హత్య) వివరాలు.. నాదియా జిల్లాకు చెందిన సుప్రియో బెనర్జీ(42) అనే పూజారి ఈ సోమవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయాడు. దాంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఈలోపు గురువారం ఓ నది ఒడ్డున బెనర్జీ మృతదేహం కనిపించింది. అయితే డబ్బు కోసమే బెనర్జీని హత్య చేసి ఉంటారని అతడి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇంటి నుంచి వెళ్లినప్పుడు బెనర్జీ కొంత డబ్బు తీసుకుని వెళ్లినట్లు తెలిపారు. అయితే బెనర్జీ హత్యపై రాజకీయ దుమారం రేగుతుంది. బీజేపీ కార్యకర్త కావడం మూలానే బెనర్జీని చంపేశారని ఆ పార్టీ ఎంపీ జగన్నాథ్ సర్కార్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మరో బీజేపీ నాయకుడు బాబుల్ సుప్రియో.. ‘సుప్రియో బెనర్జీ బీజేపీ కార్యకర్త కావడం వల్లే అతడిని దారుణంగా చంపేశారు. గడిచిన నాలుగు రోజుల్లో 8 మందిని హత్య చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఓ జోక్‌గా మారింది. బెంగాల్ ప్రజలు వీటన్నింటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. త్వరలోనే వారు ప్రతీకారం తీర్చుకుంటారు. లిబరల్స్‌గా చెప్పుకునే మేథావులు ఈ హత్యలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు. స్పందించడం లేదేందుకు’ అంటూ ట్వీట్ చేశారు. -
ఎస్సై చిత్రహింసలు: ఢిల్లీలో ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ : తమ పార్టీ కార్యకర్తను చిత్రహింసలకు గురి చేస్తున్నారని నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి ఎస్సై వెంకటేష్‌పై జాతీయ బిసి కమిషన్‌కు బీజేపీ నాయకుడు దిలీపాచారి ఫిర్యాదు చేశారు. పక్షపాతం లేకుండా న్యాయంగా వ్యవహరించాల్సిన పోలీసులు టీఆర్ఎస్ నేతల ఆదేశాల మేరకు బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఎస్సైను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దిలీపాచారి ఫిర్యాదును స్వీకరించిన కమిషన్, ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక అందించాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. -
మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్
-
‘మాకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా?’
దిస్పూర్ : సోషల్ మీడియా వేదికగా అస్సాం ముఖ్యమంత్రిపై విమర్శలు చేసిన బీజేపీ కార్యకర్తను గువాహటి పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. మారిగన్ జిల్లాకు చెందిన నీతు బోరా అస్సాం బీజేపీ సోషల్ మీడియా టీంలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సీఎం సర్బానంద సోనోవాల్ పనితీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేశాడు. రాష్ట్రంలో బీజేపీ సర్కారు ముస్లిం వలసదారుల నుంచి స్థానిక ప్రజలను రక్షించడంలో విఫలమైందని ఆరోపించాడు. దీనికి ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కారణమంటూ నీతు బోరా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. అంతేకాక జలుక్ బరి నియోజక వర్గానికి చెందిన హిమంత బిస్వా శర్మను నూతన హోం శాఖ మంత్రిగా నియమించాలని డిమాండ్ చేస్తూ నీతు బోరా ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఇవి కాస్తా వైరల్‌గా మారడంతో పోలీసులు నీతు బోరాతో పాటు మరో ముగ్గురు వ్యక్తులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. అంతేకాక బుధవారం అర్థరాత్రి బీజేపీ ఐటీ సెల్ మెంబర్‌గా పనిచేస్తున్న హేమంత బరువా అనే వ్యక్తి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. అయితే సొంత పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం పట్ల బీజేపీపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే బీజేపీ పెద్దలు వాక్ స్వాతంత్ర్య హక్కును ఎందుకు కాలరాస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్నవారు తమ అసంతృప్తిని వెలిబుచ్చారే తప్ప ఎవరినీ కించపరచలేదంటున్నారు. అరెస్ట్ చేసిన కార్యకర్తల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్‌ను షేర్ చేశారని ఆరోపిస్తూ.. ఢిల్లీకి చెందిన ఓ జర్నలిస్ట్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ప్రేమ్‌కుమార్ హత్య హేయమైనది
మహబూబ్‌నగర్ న్యూటౌన్: దేవరకద్ర మండలం డోకూరులో బీజేపీ కార్యకర్త ప్రేమ్‌కుమార్ హత్య హేయమైనదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు బీజేపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిం చారు. రాజ్యాంగబద్ధంగా నిలువరించేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. గురువారం దేవరకద్ర మండలం డోకూరులో ప్రేమ్‌కుమార్ కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నమ్మి న సిద్ధాంతాల కోసం ఎంపీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పనిచేసిన ప్రేమ్‌కుమార్‌ను అధికార పార్టీ నాయకులు వేట కొడవళ్లతో నరికి చంపారని, దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పెరిగిన ఓటు బ్యాంకు, ఫలితాలు టీఆర్ఎస్ నాయకులకు మింగుడు పడటం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత, సన్నిహితుడు వినోద్ ఓడిపోవడం, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. దొడ్డిదారిన గ్రామాల్లోని బీజేపీ కార్యకర్తలను అణచివేస్తామంటే అది టీఆర్ఎస్ పార్టీ నాయకుల అవివేకమేనన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కితే తిరుగుబాటు తప్పదని, హత్యా రాజకీయాలను నిలువరిస్తామని అన్నారు. ప్రేమ్‌కుమార్ కుటుంబాన్ని ఆదుకుంటాం ప్రేమ్‌కుమార్ కుటుంబాన్ని బీజేపీ ఆదుకుంటుందని, ఇకపై ఆ కుటుంబ బాధ్యతను పార్టీయే తీసుకుంటుందని లక్ష్మణ్ తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి విజయరామారావు, పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయశక్తిగా ఎదుగుతున్నందుకే...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఎదుగుతున్న క్రమంలో భయభ్రాంతులకు గురైన సీఎం కేసీఆర్ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. నారాయణపేట జిల్లా దేవరకద్ర గ్రామంలో బీజేపీ కార్యకర్త ముష్టి ప్రేమ్ కుమార్ హత్యలో టీఆర్ఎస్ అగ్రనాయకుల ప్రమేయముందన్నారు. ప్రేమ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురిని కలిపి సామూహికంగా హత్య చేసేందుకు టీఆర్ఎస్ నాయకత్వం కుట్రపన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, పినరయి విజయన్‌ల మాదిరి రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకత్వం రాజకీయాలకు తెరలేపిందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో దాడులు, హత్యా రాజకీయాలు మితి మీరి పోయే ప్రమాదముందని, వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధంగా ఉందని సంజయ్ హెచ్చరించారు. ప్రేమ్ హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపి హంతకులను, కుట్రకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
స్మృతీ ఇరానీ అనుచరుడి హత్య
అమేథీ: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో బీజేపీ కార్యకర్తపై కాల్పులు కలకలం రేపాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. అమేథీ నుంచి ఎంపీగా ఎంపికైన స్మృతీ ఇరానీ అనుచరుడు, బరూలియా గ్రామ మాజీ సర్పంచ్ సురేంద్ర సింగ్ (50)పై శనివారం అర్థరాత్రి ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. సురేంద్ర అతని స్వగృహంలో నిద్రిస్తున్న సమయంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలపాలైన సురేంద్రను లక్నో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సురేంద్ర కన్నుమూశాడని పోలీసులు వెల్లడించారు. పాత కక్షలు, రాజకీయ శత్రుత్వం వల్లే హత్య జరిగినట్లు భావిస్తున్నామని చెప్పారు. ఘటనకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని.. వీరిని విచారిస్తున్న క్రమంలో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. పాడె మోసిన స్మృతీ ఇరానీ సురేంద్ర మృతి విషయం తెలియగానే స్మృతి ఇరానీ హుటాహుటిన అమేథీకి చేరుకున్నారు. సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించి.. వారిని ఓదార్చారు. రాష్ట్ర మంత్రి మోసిన్ రజా కూడా సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. అంత్యక్రియల్లో భాగంగా స్మృతి, రజాలు సురేంద్ర పాడె మోశారు. సురేంద్ర మృతిపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య విచారం వ్యక్తం చేశారు. -
పోలీసులు తీవ్రంగా హింసించారు
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న, మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గురువారం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మానస్ భవన్లో ఆమె మాట్లాడుతూ విచారణ సమయంలో పోలీసులు తనను ఏవిధంగా హింసించిందీ రోదిస్తూ వివరించారు. ‘పోలీసులు నన్ను అక్రమంగా 13 రోజులు బంధించారు. ఆ సమయంలో వెడల్పైన బెల్టుతో నన్ను కొట్టేవారు. ఒక్క దెబ్బకే శరీరం బాగా వాచేది. రెండో దెబ్బ పడితే చర్చం ఊడివచ్చేది. ఆ దెబ్బలకు కాసేపు నా నాడీ వ్యవస్థ పనిచేసేది కాదు. అసభ్యకరంగా పోలీసులు తిట్టేవారు. తలకిందులుగా వేలాడదీస్తామనీ, వివస్త్రను చేస్తామని బెదిరించేవారు. ఇలాంటి కష్టాలను ఇంకో సోదరి ఎవరూ అనుభవించకూడదని చెబుతున్నాను’ అని కంటతడి పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత దిగ్విజయసింగ్పై ప్రస్తుతం ప్రజ్ఞ పోటీ చేస్తున్నారు. దిగ్విజయ హిందూ, కాషాయ ఉగ్రవాదం వంటి పదాలను వాడి ఓట్లు పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. మాలెగావ్ పేలుళ్లలో తన హస్తం ఉందని ఒప్పుకోవాల్సిందిగా పోలీసులు బలవంతపెట్టారన్నారు. ప్రజ్ఞ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి చతుర్వేది స్పందిస్తూ ఎన్నికల కోసమే ఆమె ఇప్పుడు పోలీసులు తనను హింసించడం గురించి చెబుతున్నారన్నారు. -
దీదీ మార్ఫింగ్ ఫొటోలు.. బీజేపీ నేత అరెస్టు
కోల్‌కతా : బ్రహ్మచారి ముఖ్యమంత్రులను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫొటోలను మార్ఫింగ్ చేయడంతో పాటు, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించినందుకు అతడిపై కేసు నమోదు చేశారు. వివరాలు.. మిడ్నాపూర్‌కు చెందిన బబుయా ఘోష్.. మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ల ఫొటోలను మార్ఫింగ్ చేశాడు. వారిరువురు సన్నిహితంగా ఉన్నట్లుగా ఫొటోలు సృష్టించడంతో పాటుగా వాటికి ఓ పేపర్ ఆర్టికల్‌ను జత చేశాడు. ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ విషయమై ఫిర్యాదు అందడంతో అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆర్టికల్‌లో ఏముందంటే.. నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీల మార్ఫింగ్ ఫొటోలను పోస్ట్ చేసిన బబుయా.. ‘సరైన వయసులో పెళ్లి కాని ఓ ‘అబ్బాయి’ పిచ్చిగా ప్రవర్తిస్తాడని తెలుసు. అయితే సరైన వయసులో పెళ్లి కాని అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలంటే పశ్చిమ బెంగాల్ పరిస్థితి చూస్తే అర్థమవుతోంది’ కదా అంటూ క్యాప్షన్ జత చేశాడు. కాగా ఇటువంటి ఫొటోలను సృష్టించడం బబుయాకు కొత్తేం కాదని.. గతంలో కూడా ఇలాగే ప్రముఖులను కించపరిచే విధంగా పలు పోస్టింగ్‌లు పెట్టాడని పోలీసులు పేర్కొన్నారు. బబుయా ఘోష్ పోస్ట్ చేసిన మార్ఫింగ్ ఫొటో -
నిద్రలో ఉండగానే.. కుటుంబం దారుణ హత్య
నాగ్‌పూర్ : గాఢనిద్రలో ఉన్న ఓ కుటుంబాన్ని గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా వేటకొడవళ్లతో నరికి చంపిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన సోమవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగ్‌పూర్ ఆరాదన నగర్‌కు చెందిన కమలాకర్ పవన్‌కర్(45) భార్య అర్చన(40), కూతురు వేధాంతి(12), అల్లుడు గణేష్ పలట్‌కర్(4), నానమ్మ మీరాబాయ్(70)లు నిద్రలో ఉండగానే దారుణ హత్యకు గురయ్యారు. కమలాకర్ వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ డీలర్. బీజేపీ కార్యకర్తగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. కాగా 10 ఎకరాల స్థలానికి సంబంధించిన విషయంలో కొంతకాలంగా కమలాకర్‌కు కొందరితో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబం మొత్తం హత్యకు గురికావటం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బీజేపీ కార్యకర్త హత్య
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని పురూలియా జిల్లాలో బీజేపీ కార్యకర్త త్రిలోచన్ మహతో(20) బుధవారం తెల్లవారుజామున హత్యకు గురయ్యాడు. నైలాన్ తాడుతో త్రిలోచన్‌ను ఉరితీసిన దుండగులు.. అతని మృతదేహం వద్ద ఓ హెచ్చరిక నోట్‌ను ఉంచారు. అందులో.. ‘18 ఏళ్ల వయసు నుంచి బీజేపీ కోసం పనిచేస్తున్నందుకే చంపేశాం. నీకు ఓటు హక్కు వచ్చినప్పటినుంచి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు కుదిరింది’ అని రాశారు. త్రిలోచన్ ధరించిన షర్ట్‌పైనా ఇదే హెచ్చరికను రాశారు. కాగా, తమ యువకార్యకర్త ఒకరు బెంగాల్లో దారుణహత్యకు గురికావడం తీవ్రంగా కలచివేసిందని బీజేపీ చీఫ్ అమిత్ వ్యాఖ్యానించారు. -
బీజేపీ కార్యకర్త హత్య
శివాజీనగర: నగరంలోని జేసీ నగర పోలీసు స్టేషన్ పరిధిలోని చిన్నప్పగార్డెన్ రెండో ప్రధాన రోడ్డు, 11వ క్రాస్ ఓ బేకరి వద్ద బుధవారం అర్ధరాత్రి బీజేపీ యువమోర్చా కార్యకర్త సంతోష్ (28)కు గురయ్యాడు. ఈ హత్యను ఖండిస్తూ గురువారం ఉదయం బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. సంతోష్ హత్య సమాచారం అందుకున్న తక్షణమే గురువారం ఉదయాన్నే బీజేపీ నాయకులు మాజీ మంత్రి కట్టాసుబ్రమణ్య నాయుడు నేతృత్వంలో నల్ల బ్యాడ్జీలు ధరించి చిన్నప్పగార్డెన్లో ధర్నా చేపట్టి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో చిన్నప్పగార్డెన్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సంతోష్ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇంటి వద్దకు తీసుకురాగా అంబులెన్స్ నుంచి కిందకు దించకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహంచారు. హోమ్‌శాఖ మంత్రి రామలింగారెడ్డి, నగర పోలీసు కమిషనర్ రావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్య నాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయనికి ఈ సంఘటన మరో ఉదాహరణ అని అన్నారు. హిందువులకు రక్షణ కరువైందన్నారు. బీజేపీకి చెందిన 26 మంది హిందువులు హత్యకు గురయ్యారని, సంతోష్ హత్యతో 27కు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 4వ తేదీ పరివర్తనా సమావేశం నిమిత్తం ముందస్తుగా గురువారం ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించటంతో ఈ ప్రాంతంలో బీజేపీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్న సంతోష్‌ను కాంగ్రెస్ నాయకులు హత్య చేయించారని ఆరోపించారు. తక్షణమే హంతకులను అరెస్టు చేయాలని, కుటుంబానికి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సంతోష్ హత్యకు కాంగ్రెస్ నాయకులే కారణం: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత హిందూ సంఘాల కార్యకర్తలు అధికంగా హత్యకు గురయ్యారని, ఇందుకు కాంగ్రెస్ నాయకులే కారణమని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్.అశోక్ ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు రవికుమార్ మాట్లాడుతూ... సంతోష్ హత్యతో శుక్రవారం రాష్ట్రస్థాయిలో ధర్నా చేపట్టేందుకు బీజేపీ నిర్ణయించినట్లు తెలిపారు. సంతోష్ కుటుంబానికి రూ.50 లక్షల నష్ట పరిహారం, భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించటంతో పాటు కుటుంబానికి పూర్తి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. చివరకు పోలీసు కమిషనర్ టీ.సునీల్‌కుమార్ అక్కడకు చేరుకొని బీజేపీ నాయకులతో మాట్లాడి తమ డిమాండ్లను రాష్ట్ర హోమ్‌శాఖ మంత్రి రామలింగారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, సీఎంతో చర్చించి సంతోష్ కుటుంబానికి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఆర్ఎస్ఎస్ నాయకుడు ప్రకాశ్, బీజేపీ ఎమ్మెల్యే ఏ.వై.నారాయణస్వామి, ఎమ్మెల్సీ అజీమ్, మాజీ ఎమ్మెల్యే నిర్మలా సురానా, నాయకులు సంపత్, గోపి, మాధవ, గణేశ్‌రావు మానె, సీ.ఎస్.సూర్యకాంతరావు,సునీల్, ఏ.జెయిరీమ్, కోదండ, ప్రకాష్ తదితరులు సంతోష్ కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నప్పగార్డెన్ ధర్నా నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని పర్యవేక్షించేందుకు బెంగళూరు ఉత్తర డీసీపీ చేతన్ సింగ్ రాథోర్ నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇంటి సమీపంలో బేకరి వద్ద బుధవారం రాత్రి నలుగురు యువకులు సంతోష్‌ను హత్య చేశారని డీసీపీ చేతన్ సింగ్ రాథోర్ తెలిపారు. సమాచారం తెలిసిన తక్షణమే జేసీ నగర పోలీసులు హంతకుల్లో వాసీమ్, పిలిప్స్ను అరెస్టు చేశామని, మరో ఇద్దరు హంతకులైన ఉమ్మర్, ఇర్ఫాన్‌ల కోసం గాలిస్తున్నామని చెప్పారు. సంతోష్ అంత్యక్రియలు పూర్తి : సంతోష్ అంత్యక్రియలు నగరంలోని కాక్స్‌టౌన్ ప్రాంతంలోని కల్లపల్లిలో గురువారం సాయంత్రం జరిగాయి. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
కన్ఫామ్: బీజేపీ కార్యకర్త తీసుకెళ్లింది బీఫ్
నాగ్‌పూర్: గోవు మాంసం (బీఫ్) తీసుకెళ్తున్నాడన్న అనుమానంతో మహారాష్ట్రలో బీజేపీ కార్యకర్తను స్థానికులు చితకబాదిన కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్త సలీమ్ షాహ(34) తన వెంట తీసుకెళ్తున్నది బీఫ్ అని ఫోరెన్సిక్ పరీక్షలలో శనివారం తేలింది. ఈ విషయాన్ని నాగ్‌పూర్ రూరల్ ఎస్పీ శైలేష్ బాల్క్వాడే వెల్లడించారు. గత బుధవారం నాగ్‌పూర్‌లోని భార్‌సింగీలో బైక్‌పై వెళ్తుండగా ఆరుగురు వ్యక్తులు అడ్డగించి బీఫ్ ఎందుకు తీసుకెళ్తున్నావ్ అంటూ కొందరు చితకబాదారు. బీఫ్ కాదని ఎంత మొత్తుకున్నా వినకుండా ఆ వ్యక్తులు బీజేపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. సలీమ్ ఫిర్యాదు మేరకు అతడిపై దాడికి పాల్పడిన నలుగురిని పోలీసులు ఇదివరకు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడి వద్ద ఉన్న మాంసాన్ని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి టెస్ట్ చేయగా బీఫ్ అని తేలింది. చట్ట ప్రకారం గోమాంసంపై నిషేధం ఉన్నందున, ప్రస్తుతం చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్త సలీమ్‌పై చర్యలు తీసుకుంటామని ఎస్పీ శైలేష్ తెలిపారు. ఈ వివాదంపై నాగ్‌పూర్ రూరల్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు రాజీవ్ పొట్డార్ స్పందించారు. మా పార్టీ కార్యకర్త సలీమ్ బీఫ్ ను రవాణా చేస్తున్నాడని తెలిసి షాక్‌కు గురైనట్లు తెలిపారు. చట్ట ప్రకారం అతడిపై చర్యలు తీసుకుంటారు. పార్టీ నుంచి బహిష్కరణ వేటు పడే అవకాశం ఉందన్నారు. అయితే బీఫ్ కలిగిఉన్న వారిపై ఫిర్యాదు చేస్తే చాలని, ప్రజలు అనవసరంగా దాడులకు పాల్పడి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే కేసుల్లో ఇరుక్కుంటారని పేర్కొన్నారు.