ఘోరం: ఐదుగురు బీజేపీ కార్యకర్తలు దుర్మరణం | Mini Truck Hit To Tree.. Five BJP Activist Died In Tripura | Sakshi
Sakshi News home page

ఘోరం: ఐదుగురు బీజేపీ కార్యకర్తలు దుర్మరణం

Published Fri, Mar 26 2021 9:40 PM | Last Updated on Fri, Mar 26 2021 9:41 PM

Mini Truck Hit To Tree.. Five BJP Activist Died In Tripura - Sakshi

అగర్తల: ప్రచారానికి వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం చెట్టును ఢీకొనడంతో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు దుర్మరణం పాలయ్యారు. మరికొంత మంది తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటన త్రిపురలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ పరిణామం బీజేపీలో తీవ్ర విషాదం నింపింది.

ఎన్నికల ప్రచారంలో పాల్గొని మినీ ట్రక్కులో బీజేపీ కార్యకర్తలు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే దక్షిణ త్రిపురలోని నూతన్‌బజార్‌కు చేరుకోగానే ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పింది. టక్కు చెట్టును ఢీకొని పల్టీ కొట్టి లోతట్టు ప్రాంతంలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై బీజేపీ అధిష్టానం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement