Agartala
-
మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్
గువహాటి: అస్సాంలోని దిమా హసావో జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. అగర్తలా నుంచి ముంబయికి బయలుదేరిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. అస్సాంలోని దిబలోంగ్ స్టేషన్ సమీపంలో ఇంజిన్‌తో పాటు ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి.ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు ప్రమాదం మధ్యాహ్నం 3.55 గంటలకు జరగ్గా, సమాచారం అందగానే సహాయక బృందాలు చేరుకున్నాయి. ప్రమాదం కారణంగా లుమ్డింగ్-బాదర్పూర్ సింగిల్-లైన్ హిల్ సెక్షన్లో రైళ్ల రాకపోకలు నిలివేశారు.ఇదీ చదవండి: వైరల్: ఆసుపత్రిలో కలకలం.. కాటేసిన పామునే మెడలో వేసుకుని.. -
ఆ బాటిల్ తీసి తాగగానే వాంతులు: అప్పుడు మయాంక్ పరిస్థితి ఇదీ!
Mayank Agarwal Shares Update on his health: టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కర్ణాటక జట్టు మేనేజర్ స్పష్టం చేశాడు. మయాంక్‌కు ప్రమాదం తప్పిందని.. విమానంలో జరిగిన ఘటన గురించి అతడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసుకున్నారని తెలిపాడు. కాగా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో కర్ణాటక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మయాంక్ అగర్వాల్.. జట్టుతో పాటు మంగళవారం త్రిపుర నుంచి న్యూఢిల్లీకి బయల్దేరాడు. అయితే, విమానంలో కూర్చున్న కాసేపటికే గొంతులో నొప్పి, మంటతో బాధపడుతున్నట్లు సహచర ఆటగాళ్లకు చెప్పాడు. ఆ తర్వాత వాంతులు కూడా చేసుకున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అగర్తల(త్రిపుర రాజధాని)లోనే నిలిచిపోగా.. మయాంక్ స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించగా.. ప్రస్తుతం అతడు ఆరోగ్యంగానే ఉన్నాడు. మయాంక్‌కు దాహం వేసింది... అప్పుడు ఈ విషయంపై స్పందించిన కర్ణాటక జట్టు మేనేజర్ ఇండియా టుడేతో మాట్లాడుతూ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించాడు. ‘‘కాసేపట్లో విమానం టేకాఫ్ కావాల్సి ఉండగా.. మయాంక్‌కు దాహం వేసింది. దాంతో.. తాను కూర్చున్న సీటు పాకెట్లో ఉన్న బాటిల్ తీసి తాగాడు. వాంతి చేసుకున్నాడు కొన్ని నిమిషాల తర్వాత తన గొంతులో నొప్పి తీవ్రమైందంటూ.. వాష్‌రూమ్‌కి పరిగెత్తుకువెళ్లాడు. కాక్‌పిట్‌కు సమీపంలోనే ఉన్న వాష్‌రూమ్‌లో వాంతి చేసుకున్నాడు. తనకు అస్వస్థతగా ఉందని ఎయిర్ హోస్టెస్‌కు చెప్పడంతో ఆమె వెంటనే ఎమర్జెన్సీ బెల్ కొట్టింది. ప్రథమ చికిత్స అక్కడ కుదరదన్నారు విమానంలో ఎవరైనా డాక్టర్ ఉన్నారేమోనని ఆరా తీశారు. కానీ దురదృష్టవశాత్తూ అక్కడ ఒక్క డాక్టర్ కూడా లేరు. దీంతో పైలట్‌కు మెసేజ్ అందించగా.. ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎయిర్‌పోర్టులో ఉన్న వైద్యులు మయాంక్‌ను పరీక్షించి.. ఇక్కడ ప్రథమ చికిత్స అందించడం కుదరదని.. ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అంబులెన్స్‌ను పిలిపించగా.. హుటాహుటిన మయాంక్‌కు హాస్పిటల్‌కు తీసుకువెళ్లాం’’ అంటూ కొన్ని నిమిషాల పాటు తమకు ఏం అర్థం కాలేదని వాపోయాడు. విచారణ జరపండి ఏదేమైనా మయాంక్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడని.. అందుకు సంతోషిస్తున్నామని తెలిపాడు. కాగా మయాంక్ ఇండిగో ఫ్లైట్ 6E 5177లో ఉండగా ఈ ప్రమాదం బారిన పడగా.. ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా స్పందించింది. తమ విమానంలో ఉన్న ప్యాసింజర్ అనారోగ్యం పాలైన కారణంగా మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఫ్లైట్ కాస్త ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంటుందని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై పోలీసులు మయాంక్ అగర్వాల్ వాంగ్మూలం నమోదు చేశారు. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. ఇందుకు గల కారణాలేమిటో తెలుసుకోవాలని కర్ణాటక జట్టు మేనేజర్ మయాంక్ తరఫున విజ్ఞప్తి చేసినట్లు ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో వెల్లడించింది. నేను బాగున్నాను.. థాంక్యూ ‘‘ఇప్పుడు నా ఆరోగ్యం కాస్త కుదుటపడింది. త్వరలోనే తిరిగి వస్తా. నా కోసం ప్రార్థించిన, నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అని మయాంక్ అగర్వాల్ బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. టీమిండియా తరఫున 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కర్ణాటక బ్యాటర్ మయాంక్ అగర్వాల్ 21 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1488, 86 పరుగులు చేశాడీ ఓపెనర్. ప్రస్తుతం రంజీ టోర్నీతో బిజీగా ఉన్న ఈ కర్ణాటక సారథి ఇప్పటికే రెండు సెంచరీలు, ఓ అర్ధ శతకం సాధించాడు. ఇక మయాంక్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ నికిన్ జోస్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. చదవండి: Ind vs Eng: వ్యక్తిగత కారణాలతో కోహ్లి దూరం.. క్లారిటీ ఇచ్చిన సోదరుడు -
ఐసీయూలో టీమిండియా క్రికెటర్.. ఏం జరిగిందంటే?
టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రంజీ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న మయాంక్.. అగర్తల నుంచి న్యూఢిల్లీకి వెళ్లే విమానంలో అనారోగ్యం బారిన పడ్డాడు. విమానంలో కూర్చున్న తర్వాత మయాంక్ విపరీతమైన గొంతు నొప్పి, మంటతో బాధపడినట్లు తెలుస్తోంది. అదే విధంగా వాంతులు కూడా చేసుకున్నట్లు సమాచారం. అయితే విమానం టేకాఫ్ కాకముందే ఈ ఘటన జరగడంతో హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరిలించారు. మా ప్రస్తుతం అగర్తలలోని ఐఎల్ఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అగర్వాల్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కాగా విమానంలో మయాంక్‌కు ఇలా జరగడానికి గల స్పష్టమైన కారణాలైతే ఇంకా తెలియలేదు. నిలకడగా మయాంక్ ఆరోగ్యం.. అయితే ప్రస్తుతం మయాంక్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. మయాంక్‌కు పెద్దగా ప్రమాదం లేదని, కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే విషయంపై ర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ షావీర్ తారాపూర్ స్పందించారు. షావీర్ మాట్లాడుతూ.. "మయాంక్ అగర్వాల్‌ను అగర్తలలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆకస్మిక అస్వస్థతకు కారణం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఈ ఘటనపై మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తోందని" చెప్పుకొచ్చాడు. -
కాంగ్రెస్ నేతపై దాడి.. ఆరోగ్య పరిస్థితి విషమం
ఉప ఎన్నికల వేళ త్రిపురలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మాన్‌పై ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు. వివరాల ప్రకారం.. ఈ నెల 23వ తేదీన త్రిపురలో రాజధాని అగర్తాల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుదీప్ బర్మాన్.. ఆదివారం రాత్రి ఉజన్ అభోయ్‌నగర్‌లో తన మద్దతుదారులను కలిశారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. అనంతరం కారు, కాంగ్రెస్ పార్టీ జెండాలను ధ్వంసం చేశారు. కాగా, ఈ దాడికి అధికార బీజేపీ పార్టీనే కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకునే ఇలా దాడి చేశారని విమర్శించారు. అంతకుముందు కూడా సుదీప్ రాయ్.. భద్రతా సిబ్బంది, డ్రైవర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా.. సుదీప్ రాయ్ బర్మాన్ ఈ ఏడాది ప్రారంభంలో బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ సర్కార్ పాలనలో ఆయన ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీ అధిష్టానం మంత్రి పదవి నుంచి తొలగించింది. దీంతో గత ఫిబ్రవరి నెలలో బర్మాన్ బీజేపీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, త్రిపురలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జూన్ 23న ఉప ఎన్నికలు జరుగుతుండగా.. జూన్ 26న ఓట్ల లెక్కింపు జరగనుంది. Tripura Bypoll Violene - BJP Gundas attack Agaratala - 6 congress Candidate sudip Roy Barman. pic.twitter.com/ZiREN9gWNz — With Congress (@WithCongress) June 20, 2022 ఇది కూడా చదవండి: సైన్యంలో చేరమని మిమ్మల్ని ఎవరు అడిగారు: మాజీ ఆర్మీ చీఫ్ ఫైర్ -
అగర్తలలో ఉద్రిక్తత: ఆగంతకుల దాడిలో సీపీఎం కార్యాలయానికి నిప్పు
అగర్తల: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) కార్యాలయంపై దుండగులు రెచ్చిపోయారు. రాళ్లు, కర్రలతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. అనంతరం నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా త్రిపుర రాజధాని అగర్తలలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సీపీఎం ప్రధాన కార్యాలయం భాను స్మృతి భవన్‌పై బుధవారం సాయంత్రం కొందరు యువకులు గుంపుగా వచ్చి దాడికి పాల్పడ్డాయి. ఆ భవనంతో పాటు పక్కనే ఉన్న దశరథ్ భవన్‌ను కూడా నిప్పు పెట్టారు. అక్కడ కనిపించిన వాహనాలను కూడా దగ్ధం చేశారు. ఈ ఘటనకు పాల్పడింది బీజేపీ అని సీపీఎం ఆరోపిస్తోంది. బీజేపీ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొంది. అయితే బీజేపీ వాటిని తిప్పికొట్టింది. వారి పార్టీ కార్యాలయాల్లో బాంబులు ఉన్నాయని, అవి పేలడంతో నిప్పు చెలరేగిందిన బీజేపీ ఆరోపిస్తోంది. చదవండి: గద్వాలలో అద్భుత దృశ్యం.. మీరే చూసేయండి -
మమతా బెనర్జీ అల్లుడి కాన్వాయ్‌పై దాడి
-
మమతా బెనర్జీ మేనల్లుడి కాన్వాయ్‌పై దాడి
అగర్తల: టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కాన్వాయ్‌పై దాడి జరిగింది. అది కూడా వేరే రాష్ట్రంలో. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. డైమండ్ హర్బర్ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సోమవారం త్రిపుర అగర్తలలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. బీజేపీ నేతలే కావాలని తనపై దాడి చేయించారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఈ మేరకు అభిషేక్ బెనర్జీ ట్విటర్లో ‘‘బీజేపీ నాయకత్వంలోని త్రిపురలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది. విప్లవ్ దేవ్ మీరు రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు.. మిమ్మల్ని అభినందిస్తున్నాను’’ అంటూ తన కాన్వాయ్‌పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోని ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిలో అభిషేక్ బెనర్జీ ప్రయాణిస్తున్న రోడ్డు పక్కన.. కొందరు వ్యక్తులు నిలుచుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం వీడియోలో చూడవచ్చు. వీరిలో కొందరి చేతిలో బీజేపీ జెండా ఉంది. కాన్వాయ్ అలా ముందుకు వెళ్తుండగా.. ఓ వ్యక్తి కర్రతో అభిషేక్ బెనర్జీ ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశాడు. వేరే రాష్ట్రంలో పర్యటిస్తున్న తమ ఎంపీ కాన్వాయ్‌పై దాడి చేయడాన్ని టీఎంసీ నాయకులు ఖండించారు. ఈ క్రమంలో టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ అభిషేక్ బెనర్జీ కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఖండించడమేకాక ఈ విషయాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అభిషేక్ బెనర్జీ త్రిపురలో పర్యటిస్తుండటంతో.. అగర్తలలో బీజేపీ కార్యకర్తలు తమ పార్టీ పోస్టర్లను చించేశారని టీఎంసీ నాయకులు ఆరోపించారు. -
ఘోరం: ఐదుగురు బీజేపీ కార్యకర్తలు దుర్మరణం
అగర్తల: ప్రచారానికి వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం చెట్టును ఢీకొనడంతో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు దుర్మరణం పాలయ్యారు. మరికొంత మంది తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటన త్రిపురలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ పరిణామం బీజేపీలో తీవ్ర విషాదం నింపింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొని మినీ ట్రక్కులో బీజేపీ కార్యకర్తలు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే దక్షిణ త్రిపురలోని నూతన్‌బజార్‌కు చేరుకోగానే ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పింది. టక్కు చెట్టును ఢీకొని పల్టీ కొట్టి లోతట్టు ప్రాంతంలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై బీజేపీ అధిష్టానం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
భార్య, అత్తను చంపి.. ఆపై పిల్లల ముందే
అగర్తల: త్రిపురలో దారుణం చోటుచేసుకుంది. భార్య, అత్తను పాశవికంగా హతమార్చాడో వ్యక్తి. ఆపై.. పిల్లల ముందే వారి మృతదేహాలను ముక్కలుగా నరికాడు. సోమవారం జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించిన వివరాలు.. పశ్చిమ త్రిపురలోని హపానియాకు చెందిన నిందితుడికి, ధలాయి జిల్లావాసి అయిన మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. గత నాలుగు నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో బాధితురాలు పిల్లలను తీసుకుని కొన్నిరోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో సోమవారం అక్కడికి చేరుకున్న నిందితుడు.. భార్య, ఆమె తల్లిపై దాడి చేసి చంపేశాడు. (చదవండి: విషాదం: కల్తీమద్యం తాగి 11 మంది మృతి) అనంతరం పిల్లల ముందే వారి శవాలను ముక్కలు ముక్కలు చేశాడు. ఆ తర్వాత తాను విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ పరిణామాలతో బెంబేలెత్తి పోయిన పిల్లలు భయంతో కేకలు వేస్తూ ఏడ్వటం మొదలుపెట్టారు. దీంతో ఇరుగుపొరుగు ఇంట్లోకి వచ్చి చూడగా మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉండగా.. వేరే గదిలో నిందితుడు స్పృహ కోల్పోయి ఉండటం గమనించారు. పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు కోలుకుంటున్నాడని, భార్యాభర్తల మధ్య విభేదాలే హత్యలకు కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. పిల్లలను ధలాయి చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్‌కు అప్పగించినట్లు వెల్లడించారు. -
బాలుడిపై ట్యూటర్ లైంగిక వేధింపులు
అగర్తల: విద్యార్థులకు విద్యాభోదన చేయాల్సిన టీచర్లే పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తొమ్మిదేళ్ల బాలుడిపై ఓ ప్రైవేట్ ట్యూటర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన త్రిపురలోని అగర్తలలో చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన దాదాపు పదిరోజుల తర్వాత ప్రైవేట్ ట్యూటర్‌ను ఇంద్రఘోష్(23)ను గుర్తించామని పోలీసులు బుధవారం తెలిపారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు నవంబర్ 30న కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపడుతున్నామని త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామని రామ్ నగర్ అవుట్‌పోస్ట్ ఇన్చార్జి బిస్వాజిత్ దాస్ వెల్లడించారు. నవంబర్ 28న ఈ సంఘటన గురించి తెలుసుకున్న తరువాత చైల్డ్ లైన్ ప్రతినిధులు బాలుడి ఇంటికి వెళ్లారు. బాలుడు ఓ ప్రైవేటు ట్యూటర్ చేత లైంగిక వేధింపులకు గురయ్యాడని తెలుసుకున్నారు. ఈ విషయం గురించి ఎవరితోనై నా చెబితే తరువాత జరిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయని ట్యూటర్ బెదిరించడంతో, బాలుడు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. ఇది జరిగిన వారం రోజుల పాటు బాలుడు ట్యూషన్‌కు వెళ్లకపోవడంతో కారణమేమిటని తల్లిదండ్రులు గట్టిగా అడగడంతో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పినట్లు చైల్డ్ లైన్ సభ్యులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 506 (క్రిమినల్ బెదిరింపులకు శిక్ష), పోక్సో చట్టం సెక్షన్ 5 (ఎమ్)(పీ) కింద పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. -
ఎన్పీఆర్పై త్రిపుర కీలక నిర్ణయం!
అగర్తలా: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)పై నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రిపుర రాష్ట్రం తాజాగా జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)పై కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ జనాభా పట్టికకు సంబంధించిన వివరాలను ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్ ద్వారా సేకరిస్తామని త్రిపుర రాష్ట్ర జనాభా లెక్కల కార్యకలాపాల డైరెక్టరేట్ పీకే చక్రవర్తి శుక్రవారం తెలిపారు. ఎన్పీఆర్ డేటాను సేకరించటం కోసం 11 వేల మంది అధికారులను తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక మొదటి దశలో రాష్ట్రంలో ఉన్న ఇళ్ల జాబితాను తయారు చేసి.. గృహ గణన చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం మే 16 నుంచి అధికారికంగా ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. (మాజీ సీఎం సిద్ధరామయ్య అరెస్ట్) కాగా మొదటిదశ ఎన్‌పీర్ డేటా సేకరణ ఈ ఏడాది జూన్ 29 వరకు కొనసాగుతుందని పీకే చక్రవర్తి తెలిపారు. అదే విధంగా రెండో దశ ఎన్పీఆర్ డేటా సేకరణ కార్యక్రమం వచ్చే ఏడాది ప్రారంభమవుతుందన్నారు. ఈ ఎన్పీఆర్ డేటా సేకరణ ప్రక్రియ పూర్తిగా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే జరుగుతుందని ఆయన తెలిపారు. డేటా సేకరణ కార్యక్రమంలో పాల్గొననున్న 11 వేల మంది అధికారుల్లో దాదాపు 9062 మంది జనాభా లెక్కల అధికారులు, 1556 మంది సూపర్వైజర్లు, తొమ్మిది మంది ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులు ఉన్నారని ఆయన చెప్పారు. పదహారు మాస్టర్ ట్రైనర్లు ఏప్రిల్ 6 నుంచి 10 వరకు 169 మంది ఫీల్డ్ ట్రైనీలకు త్రిపుర రాజధాని అగర్తలలో శిక్షణ ఇస్తారని పీకే చక్రవర్తి తెలిపారు. (డేటింగ్‌లకూ రాజకీయ చిచ్చు) -
సహచరులను చంపి.. జవాన్ ఆత్మహత్య
అగర్తాల: త్రిపురలో ఓ బీఎస్ఎఫ్ జవాన్ దారుణానికి పాల్పడ్డారు. అక్కడే పనిచేస్తున్న ముగ్గురు సహోద్యోగులపై తన సర్వీస్ తుపాకీతో కాల్పులు జరిపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన త్రిపురలోని ఉనాకోటి జిల్లా పరిధిలోని మగురూలి సరిహద్దుల్లో జరిగింది. శిశుపాల్ అనే జవాన్..తన సహోద్యోగి అయిన హెడ్‌కానిస్టేబుల్ బిజోయ్ కుమార్‌పై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. దీంతో బిజోయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అక్కడే ఉన్న మరో ఇద్దరు జవాన్లు రింకూ కుమార్, రాకేశ్ కుమార్ జాదవ్‌లపై కాల్పులు జరిపి, అదే తుపాకీతో తనని తాను కాల్చుకొని చనిపోయాడు. తీవ్ర గాయాలపాలైన ఇద్దరి జవాన్లను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనిపై స్థానిక ఎస్పీ శంకర్ దేవ్నాథ్ మాట్లాడుతూ.. ‘బీఎస్ఎఫ్ జవాను.. హెడ్ కానిస్టేబుల్‌తో సహా మరో ముగ్గురిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ అక్కడికక్కేడ మృతి చెందారు. మిగతావారిని ఉనాకోటిలోని ఆసుపత్రికి తరలించగా అందులో చికిత్స పొందుతూమరణించారు. మృతదేహాలను స్వరాష్ట్రలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాం. ఘటనపై విచారణ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’ అని తెలిపారు. -
యువకుడిగా దొంగతనం చేసి తాతై దొరికాడు
సాక్షి, అగర్తల : దొంగతనం చేసి దాదాపు దశాబ్దాలుగా తప్పించుకు తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. దాదాపు 37 ఏళ్ల తర్వాత పోలీసులకు అతడు దొరికిపోయాడు. అతడిని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. వివరాల్లోకి వెళితే.. త్రిపురలో శిశిర్ ధర్ అనే ఓ 58 ఏళ్ల వ్యక్తిపై రెండు దొంగతనం కేసులు ఉన్నాయి. కేసు నమోదైనప్పటికీ అతడు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతుండటంతో పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి శాశ్వత అరెస్టు వారెంట్లు సిద్ధం చేసి ఉంచారు. తాజాగా పశ్చిమ త్రిపురలో అదుపులోకి తీసుకున్నారు. దాదాపు యువకుడిగా ఉన్నప్పుడు దొంగతనం చేయగా ఇప్పుడు అతడు తాత వయసులో ఉన్నాడు. 1981లో రెండు దొంగతనాలకు శిశిర్ పాల్పడినట్లు పోలీసుల వద్ద కేసు ఉంది. అయితే, ఆ దొంగతనాల తర్వాత కుటుంబ పోషణ కోసం కూలీగా మారి పనిచేసుకుంటున్నట్లు పోలీసులు చెప్పారు. -
అక్కను చూడగానే జీపులోంచి దూకేసింది!
ఒలింపిక్స్‌లో అసమాన పోరాటపటిమను చాటిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు సోమవారం త్రిపుర రాజధాని అగర్తలాలో ఘనస్వాగతం లభించింది. అగర్తలా విమానాశ్రయం నుంచి స్థానిక మైదానం వరకు వేలమంది అభిమానులు ఆమెకు స్వాగతం పలికారు. కోచ్ బిశ్వేష్వర్ నందితో కలిసి ఓపెన్ టాప్ జీపులో ఆమె స్వాగతోత్సవం దాదాపు 12 కిలోమీటర్లు సాగింది. దాదాపు ఐదువేల మంది ఈ ర్యాలీలో పాల్గొని ఆమెకు జయజయధ్వానాలు చేశారు. మైదానంలో ఆమెకు త్రిపుర ప్రభుత్వం ఘనసత్కారం నిర్వహించింది. ఆమె విజయోత్సవ ర్యాలీలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అభిమానులతో కలిసి తనకు స్వాగతం పలుకుతున్న అక్కను చూడగానే దీప హృదయం ఉప్పొంగిపోయింది. వెంటనే ఓపెన్ జీపులో నుంచి అమాంతం కిందకు దూకేసింది. ఎంతైనా టాప్ క్లాస్ జిమ్నాస్ట్ కదా! ఎలాంటి ఇబ్బంది పడకుండా అలవోకగా జీపులోంచి దిగి.. పరిగెత్తుకెళ్లి తన సోదరిని ఆమె హత్తుకుంది. తోబుట్టువుల మధ్య ఉండే ప్రేమానురాగాలను ఈ ఘటన చాటింది. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ విభాగంలో అర్హత సాధించిన తొలి క్రీడాకారిణిగా దీప సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రమాదకరమైన విన్యాసం ప్రోడునోవా విభాగంలో అద్భుత ప్రతిభాపాటవాలు చాటి ఆమె ఫైనల్‌కు వెళ్లింది. కేవలం 0.15 పాయింట్ల తేడాతో పతకం కోల్పోయిన ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. రియో ఒలింపిక్స్‌లో దీప పతకం గెలువకపోయినా.. తన పోరాటస్ఫూర్తితో 120 కోట్ల భారతీయుల హృదయాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు కూడా పలు రాష్ట్ర ప్రభుత్వాలు రివార్డులు ప్రకటిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆమెకు రూ. 50 లక్షల నజరానా ప్రకటించింది. -
కిడ్నాపర్లే డబ్బులు ఇచ్చి వదిలేశారు
అగర్తల : కిడ్నాపర్ల చేతిలో తన్నులు తిన్నాడు. వాళ్లు తిట్టిన తిట్లు భరించాడు. అంతేకాదు వాళ్లు చెప్పిన పనులన్నీ చేశాడు. మంచివాడు మా రాజన్ సాహ. మా మాటే వింటాడోయి... అంటూ కిడ్నాపర్ల చేత శెభాష్ అనిపించుకున్నాడు. అతడిని విడుదల చేయాలని కిడ్నాపర్లు నిర్ణయించారు. అతడికి కొంత నగదు ఇచ్చి మరీ విడిచిపెట్టారు. అదీ కూడా కిడ్నాప్ అయిన 16 ఏళ్లకు. దీంతో రాజన్ బంగ్లాదేశ్‌లోని బంధువుల ఇంటికి చేరుకున్నాడు. అక్కడి నుంచి వారి ద్వారా రాజన్ తన ఇంటికి తిరిగి వచ్చాడు. త్రిపుర రాజధాని అగర్తలాలో జీవిస్తున్న రాజన్ సాహ అనే వ్యక్తికి ముగ్గురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు. ఓ అమ్మాయి. రాజన్ అరటి పళ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆ క్రమంలో 2000 సంవత్సరంలో అగర్తలకు దక్షిణంగా 35 కిలో మీటర్ల దూరంలోని జంపుజాయిలాలో అరటిపళ్లు టోకున కొనుగోలు చేసేందుకు ఎప్పటిలాగా వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న సాయుధలైన నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర తీవ్రవాదులు రాజన్ సాహతోపాటు మరో ఇద్దరు వ్యాపారులను కిడ్నాప్ చేశారు. కళ్లకు గంతలు కట్టి బంగ్లాదేశ్ లోని చిట్టిగాంగ్ పర్వత శ్రేణి ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ అటవీ ప్రాంతంలోని తమ స్థావరాలకు తీవ్రవాదులు తీసుకెళ్లారని... అయితే ఆ ప్రాంతం ఎక్కడ అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పలేనని నాటి సంఘటనలు మంగళవారం తనను కలసిన విలేకర్లకు పూసగుచ్చినట్లు రాజన్ సాహ వివరించారు. తీవ్రవాదుల స్థావరం తన పట్ల ఎంత ఘోరంగా వ్యవహరించిందని... నగదు ఇస్తే వదిలేస్తామంటూ వారు డిమాండ్ చేసేవారని... తన వద్ద నగదు లేదని ఎన్ని సార్లు చెప్పిన వారు వినకుండే చిత్రహింసలు పెట్టేవారని... ఆహారం కూడా సరిపడనంత పెట్టేవారు కాదని.... దీంతో తీవ్ర అనారోగ్యం పాలైయానని... కిడ్నాపర్ల చెరలో ఉన్న సమయంలో అతడు పడిన బాధలను రాజన్ తలచుకుని కన్నీరు మున్నీరు అయ్యాడు. కానీ ఏ రోజూ అక్కడి నుంచి పారిపోవాలని మాత్రం ప్రయత్నించలేదని చెప్పాడు. అయితే ఖాళీ సమయాల్లో మాత్రం వీరి నుంచి విముక్తి కల్పించాలని దేవుని ప్రార్థన చేసేవాడినని చెప్పాడు. తన మొర దేవుడు అలకించాడని... కిడ్నాపర్ల మనస్సు కరిగి... ఇంటికి వెళ్లంటూ కొంత నగదు ఇచ్చి... పంపేశారని రాజన్ చెప్పాడు. కాగా తనతో కిడ్నాప్ చేసిన ఇద్దరు వ్యాపారులను మరో చోటకు తరలించారని రాజన్ గుర్తు చేసుకున్నారు. అయితే తీవ్రవాదుల చెరలో ఉన్న రాజన్‌ను విడిపించేందుకు అతడి కుటుంబం చేయని ప్రయత్నం లేదు. పోలీసు ఉన్నతాధికారులతోపాటు మంత్రులను కూడా కలిశారు. కానీ ప్రయోజనం శూన్యం. చివరికి కోర్టును ఆశ్రయించగా... అతడు మరణించినట్లు అధికారులు కోర్టుకు మరణ ధృవీకరణ ప్రతం అందజేశారు. దీంతో రాజన్‌పై అతడు కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్నారు. ఆ తరుణంలో రాజన్ ఇంటికి రావడం చూసి... కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాజన్ పెద్ద కుమారుడు కోల్‌కత్తాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్న ఒక్కగాని ఒక్క కుమార్తె వివాహం చేసుకుని మెట్టినింట ఆనందంగా ఉంటోంది. దేవుని దయతో తన భర్త ఇంటి క్షేమంగా తిరిగి వచ్చాడని రాజన్ భార్య సుమిత్ర సంతోషంతో తెలిపింది. -
'ఎనిమిదిన్నర లక్షల కోట్లు ఖర్చు చేస్తాం'
అగర్తల: రానున్న ఐదేళ్లలో మొత్తం భారతీయ రైల్వే వ్యవస్థనే సమూలంగా మార్చి వేస్తామని కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా అన్నారు. భారతీయ రైల్వేపై ఐదేళ్లలో రూ.8.5లక్షల కోట్లు ఖర్చుచేస్తామని ఆయన తెలిపారు. బుధవారం అసోం-అగర్తల మధ్య కొత్తగా నిర్మించిన బ్రాడ్ గేజ్ ట్రయల్ రైలును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత అవసరమైన అన్ని అనుమతులు తీసుకొని అధికారికంగా ఈ మార్గంలో రైలు సర్వీసులు ప్రారంభిస్తామని చెప్పారు. బంగ్లా సరిహద్దును పంచుకునే త్రిపుర రైలు మార్గాన్ని ప్రారంభించి త్వరలోనే డిసెంబర్ 2017నాటికి పూర్తి చేస్తామని అన్నారు. -
నీటి మధ్య అద్భుత కట్టడం.. నీర్ మహల్
అగర్తల : త్రిపుర రాజధాని అగర్తలకు 55 కిలోమీటర్ల దూరంలో రుద్రసాగర్ అనే 5.35 చ.కిమీ విస్తీర్ణంలో ఉన్న సరస్సు నడుమ నీర్ మహల్‌ను నిర్మించారు. వేసవి విడిదిలో ఈశాన్య రాష్ట్రాల్లోనే ప్రసిద్ధి గాంచిన విహారం నీర్ మహల్ సందర్శన. హైందవ, ఇస్లాం నిర్మాణ శైలి కలబోతతో మొత్తం 24 గదులతో కూడిన భవనం ఇది. రాజు మాణిక్య బహదూర్.. అప్పటి బ్రిటిష్ కంపెనీకి చెందిన మార్టిన్ బర్న్స అనే సంస్థకు దీని నిర్మాణ బాధ్యతలు అప్పగించాడు. ఈ నిర్మాణం పూర్తి కావడానికి తొమ్మిదేళ్లు పట్టింది. ఇందులో రెండు భాగాలుంటాయి. ఒకటి అండర్ మహల్. ఇది పశ్చిమ భాగంలో ఉంది. ఇందులో రాజవంశీయులు బసచేసేవారట. తూర్పు దిక్కున ఉన్న భాగాన్ని భాహ్యరంగం అంటారు. లలితా కళా విభాగంగా చెప్పుకునే దీంట్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారట. నీర్మహల్ ఫెస్టివల్.. త్రిపురలో ఏటా భాద్రపద మాసంలో నీర్ మహల్ ఫెస్టివల్ జరుపుతారు. నీర్ మహల్ ఉన్న రుద్రసాగర్ జిల్లాలో ఈ పండుగ సందర్భంగా ‘బోట్‌రేస్’ నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ బోట్‌రేస్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పురుషులకు దీటుగా మహిళలు సైతం ఉత్సాహంగా ఈ బోట్‌రేస్‌లో పాల్గొనడం విశేషం. -
అగర్తలా.. కోల్‌కతా వయా బంగ్లాదేశ్!
అగర్తలా: భారత్‌లో ఈశాన్య నగరం అగర్తలా, కోల్‌కతాల మధ్య బంగ్లాదేశ్ మీదుగా నేరుగా బస్సు సర్వీసు నడిపేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా ఖరారయ్యే అవకాశుమంది. భౌగోళికంగా చూస్తే త్రిపుర, పశ్చిమ బెంగాల్ మధ్యలో బంగ్లాదేశ్ ఉంటుంది. త్రిపుర రాజధాని అగర్తలా నుంచి రోడ్డు మార్గాన కోల్‌కతాకు రావాలంటే వేలాది కిలో మీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అంతేగాక ఇతర ఈశాన్య రాష్ట్రాల నుంచి పశ్చిమ బెంగాల్‌కు రావాలన్నా ఇదే పరిస్థితి. ఈ ప్రయాసను తగ్గించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చే నెలలో మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో అగర్తలా, కోల్‌కతాల మధ్య బస్సు సర్వీసు ఖరారు కావచ్చని త్రిపుర కొత్త గవర్నర్ తతాగట రాయ్ చెప్పారు. -
సెల్ ఫోన్లు వాడొద్దన్నందుకు ఆత్మహత్య!
అగర్తలా: సెల్ ఫోన్లు వాడొద్దన్నందుకు ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. త్రిపుర పట్టణంలోని హాస్టల్లో ఉంటూ 10 వ తరగతి చదువుతున్న ఇద్దరు యువతలు తరచు మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూ ఉండటంతో వార్డెన్ వారిని మందలించాడు. హాస్టల్లో మొబైల్ ఫోన్లు వాడకకూడదని వాళ్లకు సూచించాడు. అయినా వారిద్దరూ ఆ మాటలను పెడచెవిన పెట్టడంతో వార్డెన్ ఆ విషయాన్ని ఆ అమ్మాయిల తల్లిదండ్రులకు తెలిపాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసిందన్న కారణంతో వారు గురువారం హాస్టల్ నుంచి పారిపోయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీస్ అధికారి ప్రదీప్ దేయ్ తెలిపారు. -
జంట హత్యల కేసులో మాజీ మంత్రికి జైలు శిక్ష
అగర్తల(ఐఎఎన్ఎస్): జంట హత్యల కేసులో ఆయుధ చట్టాన్ని ఉల్లంఘించిన నేరంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి విరాజిత్ సిన్హాకు త్రిపుర కోర్టు ఒకటి మూడు నెలల జైలు శిక్ష విధించింది. 2004 జూలై 20 జరిగిన ఓ గ్రామ పంచాయతీ ఉప ఎన్నిక సందర్భంగా ఉత్తర త్రిపుర బాబుబజార్ ప్రాంతం వద్ద పెద్ద ఘర్షణ జరిగింది. ఈ ఘటన సీపీఎం, కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య కాల్పులకు దారితీసింది. ఈ కాల్పుల్లో ఓ సీపీఎం కార్యకర్త, సిన్హా వ్యక్తిగత సెక్యూరిటీ గార్డు నిఖిల్ దేవ్ మరణించారు. ఆ రోజు సిన్హా వద్ద లెసైన్స్డ్ పిస్టల్ ఉంది. ‘ఉండాల్సిన తూటాల కంటే సిన్హా వద్ద అదనంగా తూటాలు ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఆయన పిస్టల్ నుంచి తిరుగు కాల్పులు కూడా జరిగాయి..’ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ దేవ్ విలేకరులకు వివరించారు. ఇదే కేసులో సిన్హాకు రెండున్నర నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ ఉనోకోటి జిల్లా, సెషన్స్ జడ్జి గౌతమ్ దేవ్‌నాధ్ సోమవారం తీర్పు చెప్పినట్లు ఆయన తెలిపారు. కాగా ఆ రోజు మరణించిన సీపీఎం కార్యకర్త తండ్రి అబ్దుల్ రహమాన్‌కు అల్లరిమూకను రెచ్చగొట్టిన నేరంపై కోర్టు మూడు నెలల జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధించింది. సిన్హా 1988 నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఏఐసీసీ సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. -
ప్రసాదం తిని 45 మందికి అస్వస్థత
ఉత్తర త్రిపురలోని కంచన్‌పూర్‌లో నిన్న రాత్రి జరిగిన దైవ సంబంధ కార్యక్రమంలో ప్రసాద వితరణలో భాగంగా ప్రసాదం తిని 45 మంది అస్వస్థతకు గురయ్యారని ఆ రాష్ట్ర వైద్యశాఖకు చెందిన ఉన్నతాధికారి మంగళవారం అగర్తలాలో వెల్లడించారు. అస్వస్థతకు గురైన వారందరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అలాగే రెండు వైద్య బృందాలను ఇక్కడ నుంచి ప్రత్యేకంగా పంపినట్లు పేర్కొన్నారు. వైద్యులు రోగులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. వారి కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. అయితే వారిలో 15 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో చిన్నారులు, మహిళలు ఉన్నారని తెలిపారు. ప్రసాదం కలుషితం కావడం వల్లే వారు అస్వస్థతకు గురైనట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. ఆ ప్రసాదం తాలుక నమూనాను ఇప్పటికే సేకరించి, పరిశోధనశాలకు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
కరెన్సీ కట్టలపై కామ్రేడ్!
అగర్తల: ఆయనో కమ్యూనిస్టు నాయకుడు. కాంట్రాక్టరు. నోట్ల కట్టలను పరుపులా పరచి దానిపై నిద్రపోవాలని ఎన్నో రోజుల నుంచీ ఓ కోరిక. ఎట్టకేలకు తీర్చేసుకోవాలనుకున్నాడు. బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. నోట్లను ఇంట్లో పరిచి హాయిగా కునుకు తీశాడు. సెల్‌ఫోన్‌తో ఫొటోలు, వీడియోలు తీసుకుని ముచ్చటపడ్డాడు కూడా. కానీ ఆ దృశ్యాలు గురువారం టీవీ చానల్లో ప్రత్యక్షం కావడంతో ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. త్రిపురలోని జోగేంద్రనగర్ సీపీఎం కమిటీ సభ్యుడైన సమర్ ఆచార్జీ.. సొంత పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించీ పార్టీ ఆగ్రహానికి గురయ్యారు. మిగతా పార్టీ నేతల్లా తాను వంచకుడిని కాదని, వారు సంపదను పోగేసుకున్నారంటూ ఆచార్జీ చేసిన విమర్శలూ టీవీలో ప్రసారం కావడంతో దుమారం రేగింది. దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బిజన్ మాట్లాడుతూ.. పార్టీ తరఫున దర్యాప్తు పూర్తయిందని, ఆచార్జీ స్వయంగా మొబైల్లో తీసుకున్న వీడియో దృశ్యాలు ఆయన స్నేహితుడి ద్వారా టీవీ చానెల్‌కు అందాయన్నారు. పార్టీలో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.