అగర్తలా.. కోల్కతా వయా బంగ్లాదేశ్!
అగర్తలా: భారత్లో ఈశాన్య నగరం అగర్తలా, కోల్కతాల మధ్య బంగ్లాదేశ్ మీదుగా నేరుగా బస్సు సర్వీసు నడిపేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా ఖరారయ్యే అవకాశుమంది.
భౌగోళికంగా చూస్తే త్రిపుర, పశ్చిమ బెంగాల్ మధ్యలో బంగ్లాదేశ్ ఉంటుంది. త్రిపుర రాజధాని అగర్తలా నుంచి రోడ్డు మార్గాన కోల్కతాకు రావాలంటే వేలాది కిలో మీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అంతేగాక ఇతర ఈశాన్య రాష్ట్రాల నుంచి పశ్చిమ బెంగాల్కు రావాలన్నా ఇదే పరిస్థితి. ఈ ప్రయాసను తగ్గించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చే నెలలో మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో అగర్తలా, కోల్కతాల మధ్య బస్సు సర్వీసు ఖరారు కావచ్చని త్రిపుర కొత్త గవర్నర్ తతాగట రాయ్ చెప్పారు.