Direct bus
-
నేపాల్ నుంచి ఢిల్లీకి డైరెక్ట్ బస్..!
ఖాట్మండుః ప్రయాణీకులకు శుభవార్త..! ఇకపై నేపాల్ నుంచి సరాసరి ఢిల్లీ చేరుకునేందుకు వీలుగా కొత్త డైరెక్ట్ బస్ సేవలను నేపాల్ ప్రవేశ పెట్టింది. ప్రయాణీకుల సౌకర్యార్థం పశ్చిమ నేపాల్ డాంగ్ నగరం నుంచి భారత రాజధాని ఢిల్లీకి ఈ డైరెక్ట్ డీలక్స్ బస్సు ను బస్ ఎంటర్ ప్రెన్యూర్స్ కమిటి అధికారికంగా ప్రారంభించింది. నేపాల్ కు చెందిన రప్తీ జోనల్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బస్ ఎంటర్ ప్రెన్యూర్స్ కమిటి ప్రయాణీకులకు కొత్త సౌకర్యం కల్పించింది. పశ్చిమ నేపాల్ లో నివసించే ప్రజల సౌకర్యం కోసం భలుబ్యాంగ్ లోని డాంగ్ నగరం నుంచి.. భారత రాజధాని నగరం ఢిల్లీని నేరుగా సందర్శించేందకు కొత్త డీలక్స్ బస్ సేవలను ప్రారంభించింది. రెండు దక్షిణాసియా నగరాల మధ్య ఇటువంటి డైరెక్ట్ బస్ సౌకర్యం ప్రవేశ పెట్టడం ఇదే మొదటిసారి అని కమిటీ ఛైర్మన్ సురేష్ హామల్ తెలిపారు. సోమవారం నేపాల్ సమయం ప్రకారం ఉదయం 11.30 సమయంలో డాంగ్ నగరంనుంచి ఢిల్లీకి మొదటి బస్సు ప్రారంభమైనట్లు ఆయన ప్రకటించారు. ప్రతి వారం మూడు బస్సులు డాంగ్ నుంచి ఢిల్లీకి బయల్దేరనున్నట్లు సురేష్ వెల్లడించారు. ఈ బస్సులో నేపాలీలలకు ఒకవైపు ప్రయాణ ఛార్జీలు రూ.2000 అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.1,250 తో సమానంగా ఉంటాయని ఆయన తెలిపారు. -
అగర్తలా.. కోల్‌కతా వయా బంగ్లాదేశ్!
అగర్తలా: భారత్‌లో ఈశాన్య నగరం అగర్తలా, కోల్‌కతాల మధ్య బంగ్లాదేశ్ మీదుగా నేరుగా బస్సు సర్వీసు నడిపేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా ఖరారయ్యే అవకాశుమంది. భౌగోళికంగా చూస్తే త్రిపుర, పశ్చిమ బెంగాల్ మధ్యలో బంగ్లాదేశ్ ఉంటుంది. త్రిపుర రాజధాని అగర్తలా నుంచి రోడ్డు మార్గాన కోల్‌కతాకు రావాలంటే వేలాది కిలో మీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అంతేగాక ఇతర ఈశాన్య రాష్ట్రాల నుంచి పశ్చిమ బెంగాల్‌కు రావాలన్నా ఇదే పరిస్థితి. ఈ ప్రయాసను తగ్గించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చే నెలలో మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో అగర్తలా, కోల్‌కతాల మధ్య బస్సు సర్వీసు ఖరారు కావచ్చని త్రిపుర కొత్త గవర్నర్ తతాగట రాయ్ చెప్పారు.