నేపాల్ నుంచి ఢిల్లీకి డైరెక్ట్ బస్..! | Direct bus starts between western Nepal town and Delhi | Sakshi
Sakshi News home page

నేపాల్ నుంచి ఢిల్లీకి డైరెక్ట్ బస్..!

Published Mon, Aug 29 2016 8:48 PM | Last Updated on Sat, Oct 20 2018 6:40 PM

నేపాల్ నుంచి ఢిల్లీకి డైరెక్ట్ బస్..! - Sakshi

నేపాల్ నుంచి ఢిల్లీకి డైరెక్ట్ బస్..!

ఖాట్మండుః ప్రయాణీకులకు శుభవార్త..! ఇకపై నేపాల్ నుంచి సరాసరి ఢిల్లీ చేరుకునేందుకు వీలుగా కొత్త డైరెక్ట్ బస్ సేవలను నేపాల్ ప్రవేశ పెట్టింది.  ప్రయాణీకుల సౌకర్యార్థం పశ్చిమ నేపాల్  డాంగ్ నగరం నుంచి భారత రాజధాని ఢిల్లీకి ఈ డైరెక్ట్ డీలక్స్ బస్సు ను బస్ ఎంటర్ ప్రెన్యూర్స్ కమిటి అధికారికంగా  ప్రారంభించింది.

నేపాల్ కు చెందిన రప్తీ జోనల్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బస్ ఎంటర్ ప్రెన్యూర్స్ కమిటి ప్రయాణీకులకు కొత్త సౌకర్యం కల్పించింది. పశ్చిమ నేపాల్ లో నివసించే ప్రజల సౌకర్యం కోసం భలుబ్యాంగ్ లోని డాంగ్ నగరం నుంచి.. భారత రాజధాని నగరం ఢిల్లీని నేరుగా సందర్శించేందకు కొత్త డీలక్స్ బస్ సేవలను ప్రారంభించింది. రెండు దక్షిణాసియా నగరాల మధ్య ఇటువంటి డైరెక్ట్ బస్ సౌకర్యం ప్రవేశ పెట్టడం ఇదే మొదటిసారి అని కమిటీ ఛైర్మన్ సురేష్ హామల్ తెలిపారు. సోమవారం నేపాల్ సమయం ప్రకారం ఉదయం 11.30 సమయంలో డాంగ్ నగరంనుంచి ఢిల్లీకి  మొదటి బస్సు ప్రారంభమైనట్లు ఆయన ప్రకటించారు. ప్రతి వారం మూడు బస్సులు డాంగ్ నుంచి ఢిల్లీకి బయల్దేరనున్నట్లు సురేష్ వెల్లడించారు. ఈ బస్సులో నేపాలీలలకు ఒకవైపు ప్రయాణ ఛార్జీలు రూ.2000 అంటే  భారత కరెన్సీ ప్రకారం రూ.1,250 తో సమానంగా ఉంటాయని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement