![In Tripura, Man Arrested For Theft After 37 Years - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/12/policegenic_1.jpg.webp?itok=Xvs6LPro)
సాక్షి, అగర్తల : దొంగతనం చేసి దాదాపు దశాబ్దాలుగా తప్పించుకు తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. దాదాపు 37 ఏళ్ల తర్వాత పోలీసులకు అతడు దొరికిపోయాడు. అతడిని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.
వివరాల్లోకి వెళితే.. త్రిపురలో శిశిర్ ధర్ అనే ఓ 58 ఏళ్ల వ్యక్తిపై రెండు దొంగతనం కేసులు ఉన్నాయి. కేసు నమోదైనప్పటికీ అతడు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతుండటంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి శాశ్వత అరెస్టు వారెంట్‌లు సిద్ధం చేసి ఉంచారు. తాజాగా పశ్చిమ త్రిపురలో అదుపులోకి తీసుకున్నారు. దాదాపు యువకుడిగా ఉన్నప్పుడు దొంగతనం చేయగా ఇప్పుడు అతడు తాత వయసులో ఉన్నాడు. 1981లో రెండు దొంగతనాలకు శిశిర్ పాల్పడినట్లు పోలీసుల వద్ద కేసు ఉంది. అయితే, ఆ దొంగతనాల తర్వాత కుటుంబ పోషణ కోసం కూలీగా మారి పనిచేసుకుంటున్నట్లు పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment