మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌ | 7 Coaches Of Agartala Mumbai Express Derail In Assam | Sakshi
Sakshi News home page

మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌

Published Thu, Oct 17 2024 7:00 PM | Last Updated on Thu, Oct 17 2024 7:39 PM

7 Coaches Of Agartala Mumbai Express Derail In Assam

గువహాటి: అస్సాంలోని దిమా హసావో జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. అగర్తలా నుంచి ముంబయికి బయలుదేరిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. అస్సాంలోని దిబలోంగ్‌ స్టేషన్‌ సమీపంలో ఇంజిన్‌తో పాటు ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి.

ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు ప్రమాదం మధ్యాహ్నం 3.55 గంటలకు జరగ్గా, సమాచారం అందగానే సహాయక బృందాలు చేరుకున్నాయి. ప్రమాదం కారణంగా లుమ్‌డింగ్-బాదర్‌పూర్ సింగిల్-లైన్ హిల్ సెక్షన్‌లో రైళ్ల రాకపోకలు నిలివేశారు.

ఇదీ చదవండి: వైరల్‌: ఆసుపత్రిలో కలకలం.. కాటేసిన పామునే మెడలో వేసుకుని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement