సాక్షి, చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా తమిళనాడు బీజేపీ కార్యకర్తలు జరుపుకున్న వేడుకలో అసశృతి చోటుచేసుకుంది. గురువారం ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలో మంటలు చెలరెగడంతో కార్యకర్తలు గాయపడిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వేడుకలో బాణా సంచాలు పేలుస్తూ.. హీలియం బెలూన్లను వదులుతున్న క్రమంలో పేలుడు సంభవించి మంటలు చెలరెగడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీంతో కార్యకర్తలంతా అక్కడి నుంచి పరుగుల తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీనిపై బీజేపీ పార్టీ సభ్యుడు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో కొంతమంతి కార్యకర్తలు స్వల్ఫంగా గయపడినట్లు చెప్పాడు. ఈ వేడుకలో బాణసంచాలు హీలియం బెలూన్లు వాడటం వల్లే ప్రమాదం జరిగిందన్నాడు. బాణాసంచాలు హీలియం బెలూన్‌లను తాకడంతో పేలుడు సంభవించి ఉంటుందని అతడు అభిప్రాయం వ్యక్తి చేశాడు. అయితే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ 5 మందిపైగా గుంపుగా ఉండరాదని ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో పార్టీ కార్యకర్తల ఇలా పదుల సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ నిబంధనలు ఉల్లఘించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి రోజు 6000 వేల కేసులు నమోదవుతుండగా.. చెన్నైలోనే 1000కి పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 5 లక్షలకు చేరుకున్న ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment