ఎస్సై చిత్రహింసలు: ఢిల్లీలో ఫిర్యాదు | National BC Commission Order to Inquire Into SI | Sakshi
Sakshi News home page

ఎస్సై చిత్రహింసలు: ఢిల్లీలో ఫిర్యాదు

Published Fri, Aug 30 2019 7:57 PM | Last Updated on Fri, Aug 30 2019 8:11 PM

National BC Commission Order to Inquire Into SI - Sakshi

సాక్షి, ఢిల్లీ : తమ పార్టీ కార్యకర్తను చిత్రహింసలకు గురి చేస్తున్నారని నాగర్‌ కర్నూల్‌ జిల్లా తెలకపల్లి ఎస్సై వెంకటేష్‌పై జాతీయ బిసి కమిషన్‌కు బీజేపీ నాయకుడు దిలీపాచారి ఫిర్యాదు చేశారు. పక్షపాతం లేకుండా న్యాయంగా వ్యవహరించాల్సిన పోలీసులు టీఆర్‌ఎస్‌ నేతల ఆదేశాల మేరకు బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఎస్సైను తక్షణమే విధుల నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దిలీపాచారి ఫిర్యాదును స్వీకరించిన కమిషన్‌, ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక అందించాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement