National BC Commission
-
స్థానికతనూ పరిగణించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపులో సీనియారిటీతో పాటు స్థానికతను తప్పకుండా పరిగణించాలని జాతీయ బీసీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉద్యోగుల కేటాయింపులో స్థానికతను పాటించకపోవడం, విభజన ప్రక్రియ పూర్తికాకముందే కేటాయింపులు జరపడం వంటి అవకతవకలు జరిగాయంటూ పలువురు ఉద్యోగులు జాతీయ బీసీ కమిషన్‌ను ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిపిన కేటాయింపులను నిలిపివేయాలని కోరారు. దీనిపై స్పందించిన జాతీయ బీసీ కమిషన్ (ఎన్సీబీసీ) సోమవారం విచారణ చేపట్టింది. ఎన్సీబీసీ సభ్యుడు తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో విచారణ సాగింది. పలువురు ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు హాజరు కాగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్‌రోస్ హాజరయ్యారు. విచారణ అనంతరం ఎన్సీబీసీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఉద్యోగుల కేటాయింపులో సీనియారిటీ మాత్రమే కాకుండా వయసు, స్థానికతను కూడా ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. పదవీ విరమణకు దగ్గరున్న ఉద్యోగులను అక్కడే కొనసాగించాలన్నారు. అటవీ, గిరిజన ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగుల స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా వారిని మైదాన ప్రాంతాలకు, మైదాన ప్రాంతాల్లో పనిచేసే వారిని ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీ చేయడం వల్ల సమస్యలు తలెత్తుతాయన్నారు. ఉద్యోగుల వినతులను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్దేశించిన చోట చేరాలని బలవంతం చేయడం సరికాదన్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికాకముందే ఉద్యోగ కేటాయింపులు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమన్నారు. -
బీసీలకు న్యాయం జరిగేవరకు పోరాడుతాం: ఆర్. కృష్ణయ్య
సాక్షి, గుంటూరు: బీసీలకు న్యాయం జరిగేవరకు కోర్టులో పోరాడుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. గుంటూరు పర్యటనలో భాగంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. ' బీసీలకు రిజర్వేషన్ కావాలని రాజ్యసభలో బిల్లు పెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. జనాభా లెక్కల్లో బీసీలను విడిగా లెక్కించి రిజర్వేషన్ ప్రకియలో.. న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం' అంటూ తెలిపారు. -
ఆచారిపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడింది అంటూ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ భరత్ కుమార్ మాట్లాడుతూ.. ఈరోజు ఎన్నికల సంఘానికి రెండు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. బీజేపీ నాయకత్వం చట్టాన్ని ఉల్లంఘించింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి మీటింగ్‌లు, సభలు పెట్టరాదు అంటూ హై కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికి.. తేజస్వీ సూర్య అక్కడ మీటింగ్ పెట్టారు. ఇది చట్ట విరుద్ధం. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల్ కమిషన్ని కోరడం జరిగింది’ అన్నారు. ( సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్:రాములమ్మ) ‘బీజేపీ వాళ్లు మేము ఇలానే రెచ్చగొడుతాం అంటున్నారు. శాంతియుతంగా ఉన్న హైదరాబాద్‌లో అల్లర్లు చేద్దాం అని చూస్తున్నారు. నేషనల్ బీసీ కమిషన్ మెంబర్ ఆచారి బీజేపీ తరఫున ప్రచారం చేస్తూ.. అధికార దుర్వినియోగం చేస్తున్నారు. దీనిపై కూడా పిర్యాదు చేశాం. రాష్ట్రపతికి కూడా పిర్యాదు చేస్తాం. మా దగ్గర అతను ప్రచారం చేసినదానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి. బీసీ కమిషన్ మెంబెర్ ప్రచారంలో పాల్గొనకుండ చూడాలి’ అని ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేశామన్నారు. -
ఆర్టీసీ సమ్మె: సీఎస్, ఆర్టీసీ ఎండీకి నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్టీసీ ఉద్యోగుల తొలగింపుపై జాతీయ బీసీ కమిషన్ శనివారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎండీకి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 25న ఢిల్లీలో జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఆర్టీసీలోని 20 వేలకు పైగా బీసీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించిందని, దీనిపై తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ కల్వకుర్తి ఆర్టీసీ జేఏసీ ....జాతీయ బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన కమిషన్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, సంబంధిత ఫైళ్లు, కేస్ డైరీలు సహా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజు కూడా కొనసాగింది. ప్రభుత్వం స్పందించకుంటే రానున్న రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. చదవండి: ఆర్టీసీ సమ్మె : 23న ఓయూలో బహిరంగ సభ -
ఎస్సై చిత్రహింసలు: ఢిల్లీలో ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ : తమ పార్టీ కార్యకర్తను చిత్రహింసలకు గురి చేస్తున్నారని నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి ఎస్సై వెంకటేష్‌పై జాతీయ బిసి కమిషన్‌కు బీజేపీ నాయకుడు దిలీపాచారి ఫిర్యాదు చేశారు. పక్షపాతం లేకుండా న్యాయంగా వ్యవహరించాల్సిన పోలీసులు టీఆర్ఎస్ నేతల ఆదేశాల మేరకు బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఎస్సైను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దిలీపాచారి ఫిర్యాదును స్వీకరించిన కమిషన్, ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక అందించాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. -
హాజీపూలో పర్యటించిన జాతీయ బీసీ కమిషన్ సభ్యులు
-
ఒక మహిళ తప్ప సభ్యులంతా నేరస్థులే
హైదరాబాద్: జాతీయ బీసీ కమిషన్‌లో ఒక మహిళా సభ్యురాలు తప్ప మిగతా వారంతా నేరస్థులేనని బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్యగౌడ్ ఆరోపించారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన క్రాంతి మోర్చా తెలంగాణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పరివర్తన యాత్ర ముగింపు సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. బీసీ కమిషన్‌లో ఉన్న సభ్యుల వల్ల హక్కులు రక్షించబడతాయనే నమ్మకం లేకుండా పోయిందని చెప్పారు. బీసీ కమిషన్‌ను నిర్వీర్యం చేసి ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలకు ఉపాధి కల్పిస్తున్నారని విమర్శించారు. విద్య, ఆరోగ్యం ప్రైవేటు సంస్థల చేతుల్లో మగ్గుతున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 4 శాతం ఉన్న అగ్రకులాల వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని.. దీని వల్ల బలహీన వర్గాల వారికి పూర్తిగా అన్యా యం జరుగుతుందని మండిపడ్డారు. మెడికల్ సీట్లలో బీసీలకు 13 శాతం రిజర్వేషన్లు కూడా అమలు కావడం లేదన్నారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ఎన్నికలు చట్టబద్ధంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసు యంత్రాంగమే ప్రభుత్వానికి అనుకూలంగా డబ్బులు పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. బహుజన క్రాంతి మోర్చా జాతీయ కోఆర్డినేటర్ వామన్ మేస్రామ్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బొమ్మకు మురళి తదితరులు పాల్గొన్నారు. -
బీసీ జనాభా లెక్కలు వెల్లడించాలి
హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు నిలుపుకోవాలంటే ముందుగా వారి జనాభా లెక్కలు వెల్లడించాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలందరికీ న్యాయం జరిగేలా ఏబీసీడీ వర్గీకరణ చేయాలన్నా జనాభా లెక్కలే ప్రామాణికమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ బీసీ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపు – భవిష్యత్ కార్యాచరణ’ అనే అంశంపై ఆదివారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో పలువురు బీసీ సంఘాల నేతలు, సామాజికవేత్తలు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 24 ఏళ్లుగా బీసీలకు 34%గా ఉన్న రిజర్వేషన్లను 24శాతానికి కుదించడం సరికాదన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రశ్నించలేని దుస్థితిలో బీసీ కమిషన్ ఉండటం శోచనీయమన్నారు. సమగ్ర కుటుంబ సర్వేను ఒక్కరోజులో పూర్తిచేయగలిగిన ప్రభుత్వానికి బీసీ జనాభా లెక్కలను వెలికి తీయడం ఎంతసేపని ప్రశ్నించారు. బీసీలు 52% కన్నా తక్కువగా లేరని, వారిని ఏబీసీడీలుగా వర్గీకరిస్తేనే పంచాయతీ ఎన్నికల్లో సమన్యాయం జరుగుతుందని సూచించారు. అధికారులే నిర్వీర్యం చేస్తున్నారు ఈ సమావేశంలోనే బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా ఎన్నికైన జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ...స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారులు, ఎన్నికల శాఖ అధికారులు రిజర్వేషన్లను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో అడిషనల్ ఏజీపీతో వాదనలు వినిపించడం వల్లే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. న్యాయనిపుణులు, సామాజిక ఉద్యమకారులతో చర్చించి రిజర్వేషన్ల పంచాయతీకి శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. రిజర్వేషన్ల పరిరక్షణకు అవసరమైతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. సామాజిక విశ్లేషకులు ఉ.సాంబశివరావు మాట్లాడుతూ.. బీసీ లెక్కలు లేకపోవడానికి పాలకులే కారణమన్నారు. బీసీలకు 54% రిజర్వేషన్లు ఇవ్వాలని పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు పాలూరి రామకృష్ణయ్య, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కె.గణేశ్‌చారి, ఎంబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బంగారు నర్సింహ్మ సగర, బీసీ,ఎస్సీ,ఎస్టీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, ప్రొఫెసర్ రమ, ఎస్.లక్ష్మి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా పట్ల హర్షం
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగబద్ధమైన జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని గత 25 ఏళ్లుగా ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో జరిగిన ఉద్యమాలు ఫలించాయని బీసీ, ఉద్యోగ, విద్యార్థి, యువజన సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. శుక్రవారం బీసీ భవన్లో జరిగిన సమావేశంలో ఆర్.కృష్ణయ్యను 45 సంఘాల నేతలు సత్కరించారు. బిల్లుకోసం ఆర్.కృష్ణయ్య 40 రోజులుగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, 36 జాతీయ పార్టీలను కలసి చర్చించారన్నారు. కృష్ణయ్య చొరవ వల్లే బిల్లుకు లోక్‌సభలో మద్దతు లభించిందని జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ కొనియాడారు.Üమావేశంలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, కోట్ల శ్రీనివాస్, రామలింగం, గుజ్జ రమేష్, భూపేష్ సాగర్, రామకృష్ణ, జైపాల్‌తో సహా 45 సంఘాల నేతలు పాల్గొన్నారు. కాగా బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తూ పార్లమెంట్లో చరిత్రాత్మక బిల్లును పాస్ చేసినందుకు ప్రధాని మోదీకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృతజ్ఞతలు తెలిపింది. అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడాన్ని స్వాగతించింది. -
‘చట్టసభల్లోకి వెళ్తెనే బీసీలకు న్యాయం’
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ అధికారంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని హైకోర్టు రిటైర్డ్ జడ్జి, జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. చట్టసభల్లోకి వెళితేనే సమన్యాయం జరుగుతుందని పేర్కొనారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఓబీసీ జాతీయ జాయింట్ కమిటీ సమావేశంలో 27 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. జస్టిస్ ఈశ్వరయ్యను జాతీయ ఓబీసీ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం, సమానత్వం రావాలంటే పార్లమెంట్, అసెంబ్లీలో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, క్రిమీలేయర్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఓటర్ల గణన శాస్త్రీయంగా జరగలేదని, పంచాయతీ రాజ్ ఎన్నికలవరకల్లా సమగ్ర కుటుంబ సర్వేను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓబీసీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు యాక్షన్ కమిటీ కృషిచేస్తుందని పేర్కొన్నారు. యాక్షన్ కమిటీకి తోడుగా మండల స్థాయివరకూ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ, పార్లమెంట్, కోర్టుల్లో ప్రజాస్వామ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటును అమ్ముకోకుండా, ప్రలోభాలకు లొంగకుండా బీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
బీసీలను చంద్రబాబు అణగదొక్కుతున్నారు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): సీఎం చంద్రబాబు బీసీలను అణగదొక్కుతున్నారని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఆయన కులానికి చెందిన వారికి మాత్రమే న్యాయం జరుగుతోందని మండిపడ్డారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అబద్ధాలకు పరిమితి లేకుండా పోయిందన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో బాబు వ్యవహరించిన తీరు బీసీలను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు. కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు రాసిన లేఖ హైకోర్టు న్యాయమూర్తుల కోసం ఇద్దరు బీసీలు(అమర్నాథ్గౌడ్, అభినవకుమార్ చావల్లి)తో పాటు ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ కులానికి చెందిన డీవీ సోమయాజులు, కమ్మ కులానికి చెందిన విజయలక్ష్మి, వెలమ కులానికి చెందిన కేశవరావును సిఫార్సు చేస్తే.. అమర్నాథ్గౌడ్, అభినవకుమార్, గంగారావు, డీవీ సోమయాజులపై లేనిపోని ఆరోపణలు చేస్తూ 2017 మార్చి 21న చంద్రబాబు తప్పుడు నివేదిక పంపించారని ఆరోపించారు. హైకోర్టు జడ్జిగా అమర్నాథ్ గౌడ్ పనికిరారంటూ పలు ఆరోపణలు చేస్తూ పంపిన లేఖ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ తప్పుడు నివేదిక అందజేసి మోకాలడ్డేందుకు యత్నించారని ఆరోపించారు. అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో విచారణ చేపట్టి ఆ నలుగురిపై చంద్రబాబు ఇచ్చిన నివేదికలో వాస్తవం లేదని తేల్చడంతో వారు జడ్జీలుగా నియమితులయ్యారని చెప్పారు. తన వద్ద సాక్ష్యాలున్నాయంటూ.. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు చంద్రబాబు రాసిన లేఖలను ఆయన మీడియాకు విడుదల చేశారు. బీసీలను ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ పార్టీ పెట్టారని.. కానీ ఆ విలువలకు చంద్రబాబు తిలోదకాలిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు జడ్జిలుగా అభినవ్‌కుమార్, గంగారావు పనికిరారంటూ ఆరోపణలు చేస్తూ చంద్రబాబు పంపిన లేఖ స్వర్ణాంధ్రప్రదేశ్ చంద్రబాబు జాతి కులానికేనా? అని ప్రశ్నించారు. బాబు కులానికి చెందిన వారికి తప్ప ఇతర వర్గాలకు ఎలాంటి ప్రాజెక్టులు గానీ.. పనులు గానీ దక్కడం లేదన్నారు. రాష్ట్రంలో బీసీ మంత్రులున్నప్పటికీ వారికి ఎలాంటి అధికారాలు లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో ప్రజా రక్షకుడిగా ఉన్న వ్యక్తే భక్షకుడిగా మారారని దుయ్యబట్టారు. బాబుకు వత్తాసు పలికిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తి డీవీ సోమయాజులుపై కేంద్ర న్యాయశాఖ మంత్రికి చంద్రబాబు పంపిన లేఖ -
‘బీసీ బిల్లును’ పార్లమెంట్లో ఆమోదించాలి
సాక్షి, హైదరాబాద్: జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించే బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్ర సామాజిక న్యాయసాధికార శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, జి.రమేష్ తదితరులు కలిసి డిమాండ్ చేశారు. 16 డిమాండ్లతో వినతిపత్రం పార్లమెంట్లో బీసీ బిల్లుపెట్టి చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కృష్ణయ్య కోరారు. లక్ష కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, కేంద్రంలో బీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో సాచురేషన్ పద్ధతిలో ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ స్కీం ప్రవేశపెట్టాలన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీం, విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లను 25 నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు. మొత్తం 16 డిమాండ్లతో వినతి పత్రం ఇచ్చారు. ఫిబ్రవరిలో బిల్లు పెడతాం: గెహ్లాట్ ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సెషన్లో బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి, ఆమోదం పొందే విధంగా చూస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. కేంద్రంలో ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలి కేంద్రంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. అదేవిధంగా జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇచ్చే బిల్లును సైతం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆమోదింపజేయాలని కోరారు. -
ఎన్సీబీసీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: జాతీయ బీసీ కమిషన్(ఎన్సీబీసీ)కు రాజ్యాంగ బద్ధత కల్పించే బిల్లులో రాజ్యసభ చేసిన సవరణలకు ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం నాడిక్కడ సమావేశమైన కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్సీబీసీ బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెడతారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే ఓబీసీల హక్కుల్ని, ఆసక్తుల్ని రక్షించే అధికారాలు ఎన్సీబీసీకి సమకూరుతాయి. ఓబీసీల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ తరహాలో ఎన్సీబీసీకి రాజ్యాంగ హోదా కల్పించాలని ఇంతకుముందు కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గత పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును లోక్‌సభ యథాతథంగా ఆమోదించగా, రాజ్యసభ కొన్ని సవరణలతో ఆమోదం తెలిపింది. దీంతో బిల్లును మళ్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టాల్సి వచ్చింది. 1993లోనే ఏర్పాటుచేసిన ఎన్సీబీసీకి కేంద్ర జాబితాలో ఏఏ వర్గాలను చేర్చాలో, తొలగించాలో అన్న విషయమై సిఫార్సుచేసే అధికారం మాత్రమే ఉంది. -
రిజర్వేషన్ల వర్గీకరణతో సమన్యాయం
క్రీమీలేయర్‌ను తొలగించాలి: ఆర్.కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: ఓబీసీ రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై టీ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో ఓబీసీ జాబితాలో ఉన్న 2,600 కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీ కులాల్లో కూడా హెచ్చుతగ్గుల వ్యత్యాసాలు ఉన్నాయని, ఇప్పుడు వర్గీకరణ చేయడంతో అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుందని వివరించారు. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించినందుకు, ఓబీసీ రిజర్వేషన్లను వర్గీకరించినందుకు అక్టోబర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని సన్మానించాలని నిర్ణయించామని తెలిపారు. గురువారం సచివాలయం మీడియా పాయింట్లో కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రం 2011 జనాభా లెక్కలు తీసుకున్నా ఇంతవరకు కులాలవారీ లెక్కలు ప్రకటించలేదని, లెక్కలు ప్రకటిస్తేనే వర్గీకరణ పూర్తిగా జరుగుతుందన్నారు. గ్రూప్‌లలో చేర్చే కులాల జనాభా తెలిస్తే దాని ప్రకారం గ్రూపుల రిజర్వేషన్ల శాతం నిర్ణయించడానికి అవకాశం ఉంటుందని, అప్పుడే వర్గీకరణ శాస్త్రీయంగా, హేతుబద్ధంగా జరుగుతుందని తేల్చి చెప్పారు. క్రీమీలేయర్ ఆదాయ పరిమితి పెంచడం కాదని, పూర్తిగా తొలగించాలన్నారు. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయా లన్నారు. గుజ్జ కృష్ణ, గుజ్జ రమేశ్, నీల వెంకట్, కె.నరసింహగౌడ్, రాజేందర్, చీపురు మల్లేష్ యాదవ్, జి.కృష్ణయాదవ్ పాల్గొన్నారు. -
వివక్ష బాధితులకు ‘బీసీ’ల్లో చోటు!
జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య కుల వివక్షకు గురవుతున్నవారిని జాబితాలో చేర్చే అంశం పరిశీలన తెలంగాణ బీసీ జాబితాపై {పజాభిప్రాయ సేకరణ ప్రారంభం హైదరాబాద్: జాతి, కుల వివక్షకు గురవుతున్న వారిని బీసీ జాబితాలో చేర్చే విషయా న్ని పరిగణనలోకి తీసుకుంటామని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. బీసీలను గుర్తించడానికి నిర్దిష్టమైన ప్రమాణాల్లేవని, అణగారిన వర్గాలను బీసీలుగా గుర్తిస్తున్నామని చెప్పారు. బీసీ కులాలకు సంబంధించి కేంద్ర జాబితాకు, రాష్ట్ర జాబితాకు తేడాలున్నాయని, వాటిని సరిదిద్దడానికి ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో బీసీ కులాలకు సం బంధించిన వివరాలపై మూడు రోజుల ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్ హియరింగ్)ను కమిషన్ బుధవారం హైదరాబాద్‌లోని ఇం దిరా ప్రియదర్శిని హాల్లో ప్రారంభిం చింది. తొలిరోజున బీసీ జాబితాలో ఉన్న కులాలు, ఉపకులాల పేర్లు, వాటిల్లో అచ్చుతప్పులు, ఏయే ప్రాంతాల పరిధిలోకి ఆయా కులాలు వస్తాయి, రాష్ట్ర జాబితా నుంచి తొలగించిన బీసీ కులాలపై ఆయా సంఘాల అభ్యంతరాలు తదితర అంశాలపై పరిశీలన జరిపింది. ఈ సేకరణలో కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య, సభ్యులు ఎ.కె.సైనీ, ఎస్.కె.కర్వేంతన్, షకీల్ ఉల్‌జమాన్ అన్సారీ, సభ్య కార్యదర్శి ఎ.కె.మంగోత్ర, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్య కార్యదర్శి ఎ.కె.కృష్ణమోహన్, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి టి.రాధ, ఇన్చార్జి డెరైక్టర్ కె.ఆలోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 35 బీసీ కులాలకు సంబంధించిన సంఘాల ప్రతినిధులు, నేతలు తమ వినతిపత్రాలను కమిషన్‌కు అందజేశారు. జాబితాలోని తమ కులాల పేర్లను సవరణ, ఇతర పొరపాట్లను కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ బీసీ జాబితాలోంచి తొలగించిన 26 కులాల (ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రధానంగా నివసిస్తున్న కులాల) వారు తమ అభ్యంతరాలను తెలి పారు. స్పందించిన కమిషన్.. ప్రాంతీయత ఆధారంగా తెలంగాణ జాబితా నుంచి తొల గించినా, కేంద్ర జాబితాలో ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఆ కులాలు బీసీ జాబితాలో కొనసాగుతాయని పేర్కొంది. అణగారిన వర్గాలను గుర్తిస్తున్నాం.. బీసీలను గుర్తించడానికి నిర్దిష్టమైన ప్రమాణాల్లేవని, అణగారిన వర్గాలను బీసీలుగా గుర్తిస్తున్నామని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య చెప్పారు. బీసీకులాలకు సంబంధించి కేంద్ర జాబితాకు, రాష్ట్ర జాబితాకు తేడాలున్నాయని.. వాటిని సరిదిద్దడానికే ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామని ఆయన తెలిపారు. తెలంగాణలో జాతి, కులవివక్షకు గురైన వారిని బీసీ జాబితాలో చేర్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేను అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. ‘‘ఈ సర్వే మంచి ఫలితాలను ఇస్తుంది. బీసీల జనాభా 52శాతం ఉందని ప్రభుత్వం చెబుతోంది. కానీ వివరాలు వెల్లడి కాలేదు. వెల్లడిస్తే దేశవ్యాప్తంగా ఇది ఆదర్శం గా నిలుస్తుంది. దీనిపై సీఎంకేసీఆర్‌తో మాట్లాడుతాం..’’ అని జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు. కులం ఏదైనా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారిని గుర్తించేందుకు పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి: ఆర్. కృష్ణయ్య చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జాతీయ బీసీ కమిషన్ చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య కోరారు. బుధవారం ఆయన జాతీయ బీసీ కమిషన్ ఎదుట హాజరై బీసీల సమస్యలపై తన వాదనను వినిపించారు. బీసీల జనాభా 56 శాతంగా ఉన్నట్లు చెబుతుండగా, 2010 లెక్కల ప్రకారం బీసీలకు 12 శాతం మాత్రమే రాజకీయ ప్రాతినిధ్యం లభించిందని ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రభుత్వ పరిశీలనలో వినతులు: టి.రాధ తమ కులాలను తెలంగాణ బీసీ జాబితాలో కొనసాగించాలంటూ పలు సంఘాలు సమర్పించిన వినతిపత్రాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధ తెలిపారు. కాళిం గ, శెట్టి బలిజ, తూర్పుకాపు, గవర, గొడబ, నాగవంశం, వీరముష్టి, కొప్పుల వెలమ, ఖురేష్ తదితర కులాలకు సం బంధించిన అభ్యంతరాలు కమిషన్ దృష్టికి వచ్చాయని.. వీటిలో కాళింగను చేర్చే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉం దన్నారు. కాగా.. గౌడ కమ్యూనిటీకి ఉప కులంగా ఉన్న శెట్టిబలిజ కులాన్ని తెలంగాణలో బీసీ(బీ)లో కొనసాగించాలని గ్రేటర్ హైదరాబాద్ శెట్టిబలిజ సంక్షేమ సంఘం నేతలు దొమ్మేటి సత్యనారాయణ తదితరులు విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర సగర (ఉప్పర)సంఘం నేతలు బి.నరసింహ సగర, ఉప్పరి శేఖర్ సగర, తెలంగాణ కాళింగ సంఘం నేతలు పూజారి గణపతిరావు, ఎస్.వెంకటరమణ, నవ తెలంగాణ రజక అభివృద్ధి సంఘం నేత అంజయ్య, వి.శంకర్ తదితరులు తమ వినతిపత్రాలు సమర్పించారు. -
జాతీయ బీసీ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ ఈశ్వరయ్య
ఢిల్లీలో బాధ్యతల స్వీకరణ సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: జాతీయ బీసీ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ వంగాల ఈశ్వరయ్య గురువారం ఢిల్లీలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఈశ్వరయ్య రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తిం చారు. నల్లగొండ జిల్లా, వలిగొండ మండలం, నెమిలి కాల్వలో 1951, మార్చి 10న జన్మించిన ఈశ్వరయ్యు అక్కడే ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయుశాస్త్రంలో డిగ్రీ పొందారు. 1978లో న్యాయవాదిగా నమోదయ్యారు. 1999లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2000 సంవత్సరంలో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యూరు. తరువాత రెండుసార్లు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. క్రియాశీల రాజకీయాల్లో ఈశ్వరయ్య కుటుంబం జస్టిస్ ఈశ్వరయ్య కుటుంబ సభ్యులు రాజకీయాల్లో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఆయున హైకోర్టు న్యాయమూర్తి కాకముందు ఆయన భార్య వంగాల శ్యామలాదేవి నల్లగొండ జిల్లా వలిగొండ నుంచి టీ డీపీ తరఫున జెడ్పీటీసీగా ఎన్నికై, దాదాపు ఐదేళ్లు ఆ పదవిలో కొనసాగారు. అంతకుముందు, తెలుగుదేశం పార్టీ మహిళావిభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు. జస్టిస్ ఈశ్వరయ్య కుటుంబ సభ్యులు పలువురు ఇప్పటికీ నల్లగొండ జిల్లా టీ డీపీలో పలు పదవుల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఈశ్వరయ్య అల్లుడు 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. జస్టిస్ ఈశ్వరయ్య తండ్రి వంగాల అంజయ్యగౌడ్. ఆయనకు నలుగురు కుమారులు. బాలనర్సయ్య గౌడ్, స్వామిగౌడ్, ఈశ్వరయ్యగౌడ్, వాసుగౌడ్. బాలనర్సయ్య గౌడ్ టీడీపీ వలిగొండ మండల శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. మరో సోదరుడు స్వామిగౌడ్ గ్రామంలోనే వ్యవసాయం, ఇతర పనులు చూసుకునేవారు. జస్టిస్ ఈశ్వరయ్యకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఒక కుమారుడు రామచంద్రగౌడ్ హైకోర్టులో న్యాయవాది. ఈశ్వరయ్యు చివరి సోదరుడు వాసుగౌడ్ నెమలికాల్వ నుంచి టీడీపీ తరఫున ఎంపీటీసీగా గెలిచారు. ఇటీవల పదవీకాలం ముగిసేదాకా అదే పదవిలో ఉన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య పెద్దనాన్న కుమారుడి పేరు కూడా వంగాల స్వామిగౌడ్. ఆయున టీడీపీ నల్లగొండ జిల్లా కన్వీనర్‌గా ఉన్నారు. ఆయున 2004 ఎన్నికల్లో మిర్యాలగూడనుంచి టీడీపీ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు.