న్యూఢిల్లీ: జాతీయ బీసీ కమిషన్(ఎన్‌సీబీసీ)కు రాజ్యాంగ బద్ధత కల్పించే బిల్లులో రాజ్యసభ చేసిన సవరణలకు ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం నాడిక్కడ సమావేశమైన కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్‌సీబీసీ బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెడతారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే ఓబీసీల హక్కుల్ని, ఆసక్తుల్ని రక్షించే అధికారాలు ఎన్‌సీబీసీకి సమకూరుతాయి.
ఓబీసీల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ తరహాలో ఎన్‌సీబీసీకి రాజ్యాంగ హోదా కల్పించాలని ఇంతకుముందు కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గత పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును లోక్‌సభ యథాతథంగా ఆమోదించగా, రాజ్యసభ కొన్ని సవరణలతో ఆమోదం తెలిపింది. దీంతో బిల్లును మళ్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టాల్సి వచ్చింది. 1993లోనే ఏర్పాటుచేసిన ఎన్‌సీబీసీకి కేంద్ర జాబితాలో ఏఏ వర్గాలను చేర్చాలో, తొలగించాలో అన్న విషయమై సిఫార్సుచేసే అధికారం మాత్రమే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment