constitutional status
-
బహుభార్యత్వం పిటిషన్లపై ఇంప్లీడ్
న్యూఢిల్లీ: ముస్లింలలో బహుభార్యత్వం, నిఖా హలాలా ఆచారాల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి కక్షిదారుగా చేర్చుకోవాలంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ) భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ంది. ముస్లింలలో బహుభార్యత్వం, నిఖా హలాలా ఆచారాలపై దాఖలైన పిటిషన్లను 1997లోనే సుప్రీంకోర్టు కొట్టివేసిందని ఏఐఎంపీఎల్బీ తన ఇంప్లీడ్ పిటిషన్లో పేర్కొంది. బహుభార్యత్వ సంప్రదాయం ప్రకారం...ఒక ముస్లిం వ్యక్తికి నలుగురు భార్యలుండవచ్చు. అదేవిధంగా నిఖా హలాలా..భర్త నుంచి విడాకులు పొందిన ముస్లిం మహిళ మళ్లీ అతడిని వివాహం చేసుకోవాలంటే.. మొదటగా ఆమె మరో వ్యక్తి పెళ్లి చేసుకుని, అతడి కి విడాకులివ్వడం తప్పనిసరి. ఈ రెండు ఆచారాల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఢిల్లీకి చెందిన నఫీసా ఖాన్ అనే మహిళ 2018 సంవత్సరంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. -
రాజ్యాంగ బద్ధతపై విచారిస్తాం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు కారణమైన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) రాజ్యాంగ బద్ధతపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే, ఆ చట్టం అమలుపై స్టే విధించేందుకు నిరాకరించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులను ఎదుర్కొని డిసెంబర్ 31, 2004లోపు భారత్‌కు వలస వచ్చిన హిందూ, క్రిస్టియన్, సిక్, జైన్, పార్శీ, బౌద్ధ మతస్తులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు ఇటీవలే పార్లమెంట్ ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా మారిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనదని, మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. అనంతరం, చట్టం రాజ్యాంగబద్ధతపై విచారణ జరుపుతామని పేర్కొంది. వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను జనవరి 22వ తేదీకి వాయిదా వేసింది. సీఏఏపై ప్రజలకు అవగాహన కల్పించాలని విచారణ సందర్భంగా న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ చేసిన సూచనను ధర్మాసనం సమర్థించింది. ‘చట్టం లక్ష్యాలను, నియమనిబంధనలను, చట్టంలోని కీలకాంశాలను ప్రజలకు వివరించండి. అందుకు దృశ్య, శ్రవణ మాధ్యమాలను ఉపయోగించుకునే అవకాశాన్ని పరిశీలించండి’ అని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను ఆదేశించింది. అందుకు వేణుగోపాల్ అంగీకరించారు. చట్టం అమలును అడ్డుకోవాలని ఒక పిటిషనర్ తరఫు న్యాయవాది జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్ కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనాన్ని కోరారు. అస్సాం ఆందోళనల్లో ఐదుగురు విద్యార్థులు చనిపోయారన్నారు. అయితే, నోటిఫై చేసిన తరువాత చట్టంపై స్టే విధించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత తీర్పులను ప్రస్తావిస్తూ అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్, కపిల్ సిబల్‌లు చట్టం అమలుపై విధివిధానాలు రూపొందలేదని, అమలుపై ఆందోళన అవసరం లేదన్నారు. దాంతో చట్టం అమలుపై స్టే విధించడానికి కోర్టు నిరాకరించింది. ‘పౌర’ ఆందోళనలు చరిత్రలో నిలుస్తాయి: కన్హయ్య పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు కొంత తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ వద్ద జరిగిన ఆందోళనల్లో జేఎన్‌యూ విద్యార్థి సంఘ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ పాల్గొన్నారు. యూనివర్సిటీ 7 వ నెంబర్ గేట్ వద్ద విద్యార్థులు, ఇతర నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగించారు. సీఏఏను వ్యతిరేకిస్తూ జరిపే నిరసనలు ముస్లింలను రక్షించడానికి కాదని, మొత్తం దేశాన్ని రక్షించేందుకని వ్యాఖ్యానించారు. పౌరసత్వ చట్టం కన్నా జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ) మరింత ప్రమాదకరమైందని స్పష్టం చేశారు. ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు రాజ్యాంగాన్ని పరిరక్షించిన వాటిగా చరిత్రలో నిలిచిపోతాయి’ అన్నారు. ‘ఎన్నార్సీని దేశవ్యాప్తంగా అమలు చేస్తే.. మనమంతా నోట్ల రద్దు సమయంలో నిల్చున్నట్లు భారీ లైన్లలో నిల్చుని మన పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది’ అన్నారు. పశ్చిమబెంగాల్లోని దినాజ్‌పూర్ జిల్లాలో సీఏఏ నిరసన ప్రదర్శనపై దుండగులు నాటు బాంబులు విసరడంతో ఐదుగురు గాయపడ్డారు. మద్రాస్ వర్సిటీకి కమల్ హాసన్: మద్రాస్ వర్సిటీలో దర్నా చేస్తున్న విద్యార్థులకు సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ సంఘీ భావం తెలిపారు. క్యాంపస్ లోపలికి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో, వెలుపలి నుంచే విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. జామియా కేసు చీఫ్ జస్టిస్‌కు బదిలీ జామియా మిలియాలో హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు చర్యలు తీసుకోకుండా తాత్కాలికంగా రక్షణ కల్పించాలని ఇద్దరు విద్యార్థినులు పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. జామియా వర్సిటీ విద్యార్థినులు లడీదా ఫర్జానా, ఆయేషా రీనా పెట్టుకున్న పిటిషన్ వేశారు. అయితే, సీఏఏ వ్యతిరేక హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులను హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులే విచారించాలన్న సుప్రీం ఆదేశాలను కేంద్రం తరఫు న్యాయవాది జస్టిస్ విభూ దృష్టికి తెచ్చారు. దాంతో విచారణను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బదిలీ చేస్తూ జస్టిస్ విభూ నిర్ణయం తీసుకున్నారు. ‘పౌరసత్వం’పై నిరసనలు చేపట్టకూడదంటూ కర్ణాటకలోని బెంగళూరు, మంగళూరులలో పోలీసులు ఆంక్షలు విధించారు. బెంగళూరులో గురువారం ఉదయం 6 నుంచి 21 అర్థరాత్రి వరకు అమల్లో ఉంటాయి. దేశాన్ని మంటల్లోకి తోస్తున్నారు కేంద్రంపై నిప్పులు చెరిగిన మమతా బెనర్జీ కోల్‌కతా: ‘దేశంలోని మంటలను ఆర్పాల్సింది పోయి.. దేశాన్ని మంటల్లోకి నెడుతున్నారు. ఇది మీ ఉద్యోగం కాదు’అని హోం మంత్రి అమిత్‌షాపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్..’అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారు కానీ.. దేశంలోని ప్రతి ఒక్కరిని వినాశనాన్ని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. దేశం మంటల్లో కాలిపోకుండా చూడాలని అమిత్‌షాను కోరారు.దేశాన్ని మంటల్లోకి తోసేయడం మీ ఉద్యోగం కాదు.. కానీ మంటలు ఆర్పేయండి చాలు’అని ఎద్దేవా చేశారు. కోల్‌కతాలో కోల్‌కతాలో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. -
‘ఆధార్’ చట్ట బద్ధతపై సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: ఆధార్ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలు తెరవడానికి, మొబైల్ కనెక్షన్లు పొందడానికి వినియోగదారులు స్వచ్ఛందంగా తమ గుర్తింపు పత్రం కింద ఆధార్ నంబర్‌ను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం ఎంతవరకు సరైందన్న అంశాలనూ సుప్రీం విచారించనుంది. ఆధార్ సవరణ చట్టం పౌరుల వ్యక్తిగత భద్రత, గోప్యతకు భంగం వాటిల్లేలా ఉందని, ఇది ప్రాథమిక హక్కుల్ని కాలరాయడమేనని దాఖలైన ప్రజా ప్రయోజనా వ్యాజ్యాన్ని సుప్రీం శుక్రవారం విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ కేంద్రానికి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)లకు నోటీసులు జారీ చేసింది. కొన్ని మినహాయింపులతో ఆధార్ చట్టం రాజ్యాంగబద్ధమేనని గత ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. జూలైలో ఆధార్ సవరణ చట్టం సుప్రీం తీర్పుతో కేంద్రం ఆధార్, ఇతర చట్టాలకు సవరణలు తీసుకువచ్చింది. వినియోగదారులు తమ వ్యక్తిగత వివరాలను అందించడంలో స్వచ్ఛందంగా 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఉపయోగించడానికి వీలు కల్పిస్తూ ఆధార్, ఇతర చట్టాలకు సవరణలు చేసింది. ఈ బిల్లును జూలై 8న పార్లమెంటు ఆమోదించింది. తాజాగా ఆర్మీ మాజీ అధికారి ఎస్జీ వోంబట్కెరె, సామాజిక కార్యకర్త విల్సన్ ఆధార్ (సవరణ) చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ పిల్ దాఖలు వేశారు. దీనిపై కేంద్రానికి, యూఐడీఐఏకు సుప్రీం నోటీసులు పంపింది. -
బీసీ కమిషన్ బిల్లులో ఏముంది?
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లుకు రాష్ట్రపతి సంతకం చేయడమే ఇక తరువాయి. చట్టం అమల్లోకి వస్తుంది. ఈ చట్టానికి సంబంధించిన 123వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ సోమవారం నాడు ఆమోదించిన విషయం తెల్సిందే. లోక్‌సభ అంతకుముందు ఎప్పుడో ఈ బిల్లును ఆమోదించింది. వాస్తవానికి 2017లోనే ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. అప్పటికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాజ్యసభలో పూర్తి మెజారిటీ లేదు. పైగా రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు కావాలి. అప్పట్లో బిల్లుకు కావాల్సిన మెజారిటీని సమీకరించలేక పోవడం బీజేపీ ప్రభుత్వాన్ని కాస్త ఇబ్బందికి గురి చేసింది. అప్పటికే ఆమోదించినట్లయితే నిజంగా బీసీల తరఫున నిలబడేది తామేనంటూ భుజాలు చరుచుకునే అవకాశం ఉండేది. ఇప్పటికైనా మించి పోయిందేమీ లేదుగానీ తమ ప్రభుత్వ విజయంగా దీన్ని చాటుకునేందుకు ఎక్కువ చాటింపు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజ్యసభ ఈ బిల్లును ఒక్క ప్రతికూలమైన ఓటు లేకుండా 156 ఓట్ల మద్దతుతో ఆమోదించడమే. 123వ రాజ్యాంగ సవరణ అంటే ఏమిటీ? 1993లో జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సమాజంలో సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాలను గుర్తించి, వారిని బీసీ జాబితాలో చేర్చుకోవాలా, వద్దా అని నిర్ణయించడం, వాటికి సంబంధించిన ఫిర్యాదులను విచారించడం, ఈ అంశాలకు సంబంధించి అవసరమైన చర్యల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తగిన సిఫార్సులు చేయడం ఈ కమిషన్ బాధ్యతలు. అయితే కమిషన్ సిఫార్సులను అమలు చేయడం, అమలు చేయకపోవడం ప్రభుత్వ విధాన నిర్ణయం పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు 123వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించారు. కొత్తగా వచ్చే అధికారాలేమిటీ? బిల్లులోని 338బీ అధికరణం ప్రకారం ఇతర వెనకబడిన వర్గాలకు కల్పించిన రక్షణ ప్రమాణాలు ఏ మేరకు శక్తివంతంగా ఉన్నాయో తెలుసుకునేందుకు వాటిని పర్యవేక్షించడం, దర్యాప్తు జరిపే అధికారాలు కమిషన్‌కు ఉంటాయి. అందుకోసం సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి. ఈ ఓబీసీలకు సంబంధించి ఎలాంటి విధాన పరమైన నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా ఈ కమిషన్‌ను సంప్రతించాల్సి ఉంటుంది. రాజ్యాంగం మేరకు సామాజికంగా, విద్యాపరంగా బీసీలకు సిద్ధించిన హక్కులు, రక్షణ ప్రమాణాలకు సంబంధించిన ఫిర్యాదులను విచారించే అధికారం కమిషన్‌కు ఇక నుంచి ఉంటుంది. ఈ విషయమై విచారించాల్సిన వ్యక్తి దేశంలో ఎక్కడున్న పిలిపించే హక్కు కమిషన్‌కు ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల నుంచే కాకుండా పోలీసు స్టేషన్, కోర్టుల నుంచి కూడా తమకు అవసరమైన డాక్యుమెంట్లను తెప్పించుకునే అధికారం కమిషన్‌కు ఉంటుంది. అలాగే సామాజికంగా, ఆర్థికంగా ఇతర వెనకబడిన వర్గాల అభ్యున్నతికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను జాతీయ బీసీల కమిషన్ ఏటా సమీక్షించి, వాటిపై తీసుకోవాల్సిన చర్యల గురించి సిఫార్సు చేస్తూ రాష్ట్రపతికి ఓ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రపతి ఆ నివేదికను పరిశీలించి చర్యల నివేదికతోపాటు దాన్ని పార్లమెంట్‌కు సమర్పించాల్సి ఉంటుంది. దానిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది. కమిషన్‌లో ఎవరెవరుంటారు? ఓ చైర్పర్సన్, ఓ వైస్ చైర్పర్సన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. సభ్యుల పదవీకాలాన్నీ, వారి సర్వీసు నియమ నిబంధనలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. కమిటీలోకి తప్పనిసరిగా ఓ మహిళను తీసుకోవాలని ప్రతిపక్షం డిమాండ్ చేయగా, నియమ నిబంధనల ఖరారు సమయంలో దీన్ని పరిశీస్తామని కేంద్ర ప్రబుత్వం హామీనిచ్చింది. ఈ బిల్లు చరిత్రాత్మకమని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వర్ణించగా, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అణచివేతకు గురవుతూ వస్తున్న బీసీలకు ఈ బిల్లు ద్వారా న్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశ జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు బిల్లుతో ప్రయోజనం కలిగించడం ద్వారా బీజేపీ రాజకీయంగా లబ్ధిపొందే అవకాశాలు ఉన్నాయని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎన్సీబీసీ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ (ఎన్సీబీసీ)కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు సోమవారం పార్లమెంటు ఆమోదం లభించింది. దీంతో వెనుకబడిన వర్గాల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన సంపూర్ణాధికారాలు ఎన్సీబీసీకి లభించనున్నాయి. రాజ్యాంగ (123వ సవరణ) బిల్లు–2017పై రాజ్యసభలో చర్చ జరిగిన అనంతరం మూడింట రెండొంతుల ఆధిక్యంతో సభ బిల్లును ఆమోదించింది. జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ చట్టం–1993ను రద్దు చేసిన అనంతరం తాజా బిల్లుకు ఆమోదం లభించింది. సోమవారం చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు మాట్లాడుతూ కులాలవారీ జనగణన లెక్కలను ప్రభుత్వం బయటపెట్టాలనీ, ఆయా కులాల జనాభా ఆధారంగా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడం చరిత్రాత్మకమని ప్రధాని మోదీ అన్నారు. ‘రేప్‌లకు ఉరి’ బిల్లుకూ ఆమోదం 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ శిక్షను విధించేందుకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లుకు లోక్‌సభ జూలై 30నే ఆమోదం తెలిపింది. లోక్‌సభలో ఆందోళన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా త్వరలో నియమితులు కానున్న జస్టిస్ కేఎం జోసెఫ్ సీనియారిటీని ప్రభుత్వం తగ్గించేందుకు ప్రయత్నిస్తోందన్న విషయంపై విపక్షాలు పార్లమెంటులో ప్రభుత్వంపై మండిపడ్డాయి. బిహార్‌లోని ముజఫర్‌పూర్ శరణాలయంలో బాలికలపై లైంగిక దోపిడీ జరిగిన అంశంపైనా కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల సభ్యులు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. పీఏసీ సభ్యుడిగా రమేశ్ పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సభ్యుడిగా టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఎన్నికయ్యారు. విపక్ష ఐక్య కూటమి ఏకగ్రీవంగా రమేశ్‌ను ఎన్నుకుంది. ఎగువసభలో ఆరుసీట్లున్న టీడీపీ.. పీఏసీ సభ్యత్వం కోసం 106 ఓట్లు సాధించింది. మరో సభ్యుడిగా ఎన్నికైన బీజేపీ ఎంపీ భూపేందర్‌కు 69 ఓట్లొచ్చాయి. పీఏసీలో 15 మంది లోక్‌సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులుంటారు. -
ఓబీసీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : ఓబీసీ (సవరణ) బిల్లు, 2017కు సోమవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ (ఎన్సీబీసీ)కి రాజ్యాంగ హోదా కల్పించే ఈ బిల్లును గత వారం లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వెనుకబడిన కులాల సంక్షేమానికి మోదీ సర్కార్ కట్టుబడిందనే సంకేతాలను పంపుతూ ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) ప్రయోజనాలను పరిరక్షించేలా, వారి హక్కులను కాపాడేందుకు పూర్తి అధికారాలను ఎన్సీబీసీకి కట్టబెడుతూ దానికి రాజ్యాంగ హోదా కల్పించే బిల్లును ఆమోదింపచేయడం ప్రభుత్వ విజయంగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా మీడియా సంస్థల్లో జోక్యం చేసుకోవడం ద్వారా కేంద్రం దేశంలో సూపర్ ఎమర్జెన్సీని విధిస్తోందని తృణమూల్ నేతలు ఆరోపిస్తూ పార్లమెంట్ వెలుపల నిరసనలు చేపట్టారు. అసోంలో ఎన్ఆర్సీ అమలును తృణమూల్ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేక కథనాలు ప్రసారం చేసే మీడియా సంస్థలపై బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ పరువు నష్టం కేసులు వేయడం వంటి చర్యలు చేపడుతున్నదని తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ఆరోపించారు. -
‘ఓబీసీ కమిషన్’కు రాజ్యాంగ హోదా!
న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్(ఎన్సీబీసీ)కి రాజ్యాంగబద్ధత కల్పించే కీలక బిల్లును లోక్‌సభ ఆమోదించింది. గురువారం∙చర్చ తర్వాత మూడింట రెండింతలకు పైగా సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. రాజ్యసభ ప్రతిపాదించిన కొన్ని సవరణలను లోక్‌సభ తోసిపుచ్చింది. బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందేందుకు కృషిచేసిన సామాజిక న్యాయం, సాధికారత మంత్రి గెహ్లాట్‌ను ప్రధాని అభినందించారు. 123వ రాజ్యాంగ సవరణ పేరిట తెచ్చిన తాజా బిల్లుపై చర్చ సందర్భంగా ఓబీసీల సంఖ్యను తేల్చడానికి జనాభా లెక్కలు నిర్వహించాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. 2014 నాటి సామాజిక, ఆర్థిక సర్వే వివరాలను బహిర్గతం చేయాలని మరికొందరు కోరారు. ఎన్సీబీసీ సభ్యుల్లో ఒకరు మహిళ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. సొంత ఓబీసీ జాబితా రూపొందించుకుని, దానిలో ఏ కులాన్నైనా చేర్చుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందని చెప్పారు. కేంద్ర జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చాలనుకుంటే కేంద్రాన్ని సంప్రదించాలని గెహ్లాట్ సూచించారు. ఈ బిల్లుకు గతేడాది ఏప్రిల్ 10న లోక్‌సభ ఆమోదం తెలిపి రాజ్యసభకు పంపింది. ప్రతిపక్షాలు సూచించిన కొన్ని సవరణలను చేర్చి అదే ఏడాది జూలై 31న ఆమోదించిన బిల్లును ఎగువ సభ మళ్లీ లోక్‌సభకు పంపింది. ఆ సవరణలను తోసిపుచ్చుతూ తాజాగా లోక్‌సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ల మాదిరిగా ఎన్సీబీసీకి రాజ్యాంగబద్ధత కల్పించాలని ప్రతిపాదించారు. బీసీలకు రాజ్యాంగం కల్పించిన రక్షణల అమలును ఎన్సీబీసీ చూస్తుంది. హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదుల విచారణ సమయంలో సివిల్ కోర్టులకుండే అధికారాలుంటాయి. -
‘తలాక్’పై రాజకీయాలొద్దు
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ బిల్లు వీలైనంత త్వరగా ఆమోదం పొందటం ద్వారా ముస్లిం మహిళలకు స్వేచ్ఛా జీవితాన్ని ఇవ్వగలుగుతామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ అంశంపై రాజకీయాలు చేయకూడదని అన్ని పక్షాలను ఆయన కోరారు. సోమవారం పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్ బిల్లు ఈ సమావేశాల్లో ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2018 నూతన సంవత్సర కానుకగా ముస్లిం సోదరీమణులకు ఈ బిల్లును కానుకగా ఇవ్వాలన్నారు. అంతకుముందు జరిగిన ఎన్డీఏ పక్షాల భేటీలో మోదీ మాట్లాడుతూ.. ఏకకాల ఎన్నికలకు అనుకూల వాతావరణాన్ని నిర్మాణం చేయటంలో కృషిచేయాలని కోరారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా చర్చను ప్రారంభించాలని సూచించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎన్డీయే పక్షాల సభ్యుల పూర్తిస్థాయిలో హాజరవ్వాలని మోదీ కోరారు. ట్రిపుల్ తలాక్ బిల్లు, ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లులను ఆమోదింపజేసుకోవటం కీలకమన్నారు. ముఖ్యమైన అంశాలపై ఈసారి సమావేశంలో చర్చించనున్నందున హాజరు శాతం ఎక్కువగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, ఆసియాన్ సదస్సుల్లో మోదీ ప్రసంగాన్ని అభినందిస్తూ తీర్మానం చేశారు. కాగా సోమవారం ముగ్గురు ఆప్ ఎంపీలు, ఒక బీజేపీ సభ్యుడు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. -
ఎన్సీబీసీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: జాతీయ బీసీ కమిషన్(ఎన్సీబీసీ)కు రాజ్యాంగ బద్ధత కల్పించే బిల్లులో రాజ్యసభ చేసిన సవరణలకు ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం నాడిక్కడ సమావేశమైన కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్సీబీసీ బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెడతారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే ఓబీసీల హక్కుల్ని, ఆసక్తుల్ని రక్షించే అధికారాలు ఎన్సీబీసీకి సమకూరుతాయి. ఓబీసీల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ తరహాలో ఎన్సీబీసీకి రాజ్యాంగ హోదా కల్పించాలని ఇంతకుముందు కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గత పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును లోక్‌సభ యథాతథంగా ఆమోదించగా, రాజ్యసభ కొన్ని సవరణలతో ఆమోదం తెలిపింది. దీంతో బిల్లును మళ్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టాల్సి వచ్చింది. 1993లోనే ఏర్పాటుచేసిన ఎన్సీబీసీకి కేంద్ర జాబితాలో ఏఏ వర్గాలను చేర్చాలో, తొలగించాలో అన్న విషయమై సిఫార్సుచేసే అధికారం మాత్రమే ఉంది. -
బీసీ కమిషన్‌కు ‘హోదా’పై ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ: వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్ (ఎన్సీబీసీ)కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చింది. దీంతో ఈ బిల్లు వచ్చే నెల 17 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదం పొందే అవకాశం ఉంది. ఈ బిల్లును ఇప్పటికే లోక్‌సభ ఆమోదించగా రాజ్యసభలో విపక్షాలు వ్యతిరేకించాయి. దీంతో బిల్లుపై ఏకాభిప్రాయ సాధనకు బీజీపీ ఎంపీ భూపేంద్ర యాదవ్ నేతృత్వంలో శరద్ యాదవ్, రాంగోపాల్ యాదవ్, సతీశ్ మిశ్రా, ప్రఫుల్ పటేల్ తదితర 25 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా కమిటీ బిల్లుపై ఏకాభిప్రాయానికి వచ్చింది. -
జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా
హైదరాబాద్: జాతీయ బీసీ కమిషన్‌కు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించడం పట్ల ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. బీసీ కమిషన్ అధికారాల కోసం 20 ఏళ్లుగా చేసిన కృషికి ఫలితం దక్కిందన్నారు. గతంలో జాతీయ బీసీ కమిషన్‌కు కేవలం కులాల చేర్పు, తొలగింపు అధికారాలు మాత్రమే ఉండేవని చెప్పారు. తాజాగా రాజ్యాంగహోదా కలగడంతో బీసీలపై దాడులు జరిగితే క్షేత్రస్థాయిలో విచారణ జరిపే అధికారం ఉంటుందన్నారు. అంతేకాకుండా రిజర్వేషన్ల అమలులో అక్రమాలు అరికట్టడం, ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించే అధికారం ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా కమిషన్ మాదిరిగానే జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించినందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
జాతీయ బీసీ కమిషన్‌కి రాజ్యాంగహోదా కల్పించాలి
న్యూఢిల్లీ: బీసీలకు న్యాయం జరిగేవిధంగా జాతీయ బీసీ కమిషన్(ఎన్సీబీసీ)కు రాజ్యాంగ హోదా కల్పించేలా ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఒత్తిడి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీ ఎంపీలంతా కృషి చేయాలని ఓబీసీ ఎంపీల పార్లమెంటరీ ఫోరం అభిప్రాయపడింది. అలంకారప్రాయంగా మారిన జాతీయ బీసీ కమిషన్‌కి ఎస్సీ,ఎస్టీ కమిషన్ మాదిరిగా రాజ్యంగ హోదా కల్పించేందుకు ఓబీసీ ఎంపీలంతా పార్టీలకతీతంగా పోరాడాలని నిర్ణయించింది. ఎన్సీబీసీకి రాజ్యాంగ హోదా కల్పించే అంశంపై చర్చించేందుకు ఓబీసీ ఎంపీల పార్లమెంటరీ ఫోరం కన్వీనర్, ఎంపీ వి హనుమంతరావు నేతృత్వంలో ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో బుధవారం సాయంత్రం సమావేశాన్ని నిర్వహించారు. 2 గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో ఓబీసీ ఎంపీలు దత్తాత్రేయ, కె కేశవరావు, బూర నర్సయ్యగౌడ్, వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక, రాపోలు దేవేందర్‌గౌడ్ జేడీయూ అధ్యక్షుడు శరద్యాదవ్తోపాటు అన్ని రాష్ట్రాల నుంచి ఓబీసీ ఎంపీలు హాజరయ్యారు. ఓబీసీలకు వచ్చిన రిజర్వేషన్ల అమలు పర్యవేక్షించే జాతీయ కమిషన్‌కి రాజ్యాంగ హోదా లేకపోవడంతో రిజర్వేషన్ల అమలుపై చర్యలు తీసుకోలేకపోతోందని, దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ.. ఓబీసీల్లో ఆర్థికంగా వెనుక బడి ఉన్న వారికి న్యాయం చేయాల్సి ఉందన్నారు. -
జేఏసీ రాజ్యాంగబద్ధతకు ఓకే
న్యాయ నియామకాల కమిషన్ రాజ్యాంగ సవరణ బిల్లుకు కేబినెట్ పచ్చజెండా వచ్చే సమావేశాల్లో లోక్‌సభ ముందుకు రానున్న బిల్లు భవిష్యత్తులో జేఏసీలో మార్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందే జేఏసీ అమల్లోకి వస్తే ప్రస్తుత ‘కొలీజియం’ వ్యవస్థకు చెల్లు న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకాలు, బదిలీల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టనున్న ‘జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(జేఏసీ)’కు రాజ్యాంగబద్ధత కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ గురువారం పచ్చజెండా ఊపింది. దీంతో ఈ కమిషన్ ఏర్పాటు, పనితీరుపై మరింత స్పష్టత రానుంది. రాజ్యాంగానికి సవరణలు చేసి కొత్తగా 124(ఏ), 124(బి) ఆర్టికల్‌లను చేర్చనున్నారు. జేఏసీ (న్యాయ నియామకాల కమిషన్) కూర్పును ఆర్టికల్ 124(ఏ), పనితీరును 124(బి)లు నిర్వచించనున్నాయి. భవిష్యత్తులో చేయబోయే చట్టాల నుంచి జేఏసీకి రక్షణ కల్పించేందుకు, సభ్యుల నియామకాలను, పనితీరును మార్చకుండా ఉండేందుకు రాజ్యంగబద్ధత కల్పించాలని బీజేపీతోపాటు న్యాయ నిపుణులు కూడా డిమాండ్ చేశారు. జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ బిల్లు-2013పై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా ఇదే విషయాన్ని పేర్కొంటూ సిఫారసు చేసింది. దీంతో జేఏసీకి రాజ్యాంగబద్ధత కల్పించే బిల్లుకు కేంద్రమంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లును రానున్న లోక్‌సభ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు కేబినెట్ భేటీ అనంతరం న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ చెప్పారు. పార్లమెంట్ ఆమోదం తెలిపితే భవిష్యత్తులో జేఏసీలో ఏమైనా మార్పు చేర్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో జడ్జీల నియామకాలకు ప్రస్తుతం అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థను పూర్తిగా రదు ్దచేస్తూ దాని స్థానంలో జేఏసీని తీసువస్తున్న సంగతి తెలిసిందే. జేఏసీ-2013 బిల్లుతోపాటు, రాజ్యాంగ సవరణకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అయితే ఇందులో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) కమిషన్‌కు నేతృత్వం వహించాల్సిన నిబంధనను రాజ్యాంగంలో ప్రస్తావించాలని పలువురు సభ్యులు సూచించారు. దీంతో బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపారు. ఈ సంఘం చేసిన పలు సిఫారసులకు తాజాగా కేబినెట్ ఆమోదం తె లిపింది. జేఏసీలో ఎవరెవరుంటారు? జేఏసీకి భారత ప్రధాన న్యాయమూర్తి చైర్మన్‌గా ఉంటారు. ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలు, న్యాయశాఖమంత్రి, పౌర సమాజానికి చెందిన ఇద్దరు ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. వీరిని ప్రధాని, సీజేఐ, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది. న్యాయ శాఖ కార్యదర్శి జేఏసీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. దేశంలోని 24 హైకోర్టుల్లో జడ్జీల నియామకాలు, బదిలీలను పర్యవేక్షిం చేందుకు రాష్ట్రస్థాయిలో మరో జేఏసీ ఉండాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం చేసిన సిపారసును న్యాయశాఖ తిరస్కరించింది. అలాగే జేఏసీలో పౌర సమాజం నుంచి ముగ్గురిని ఎంపికచేయాలన్న ప్రతిపాదనను కూడా తోసిపుచ్చింది. కేన్సర్‌పై పరిశోధనలకు ఎన్సీఐ హర్యానాలోని జజ్జార్‌లో ఉన్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) క్యాంపస్‌లో ‘జాతీయ కేన్సర్ సంస్థ’ (ఎన్సీఐ) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రూ.2,035 కోట్లు వెచ్చించి, 710 పడకల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. 45 నెలల్లో దీన్ని నిర్మించనున్నారు. దేశంలో ఏటా కొత్తగా 11 లక్షల కేన్సర్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఏడాదికి 5.5 లక్షల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేన్సర్ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలతోపాటు మరిన్ని పరిశోధనలు చే సేందుకు వీలుగా ఎన్సీఐని ఏర్పాటు చేస్తున్నారు. రైతుకు నాణ్యమైన విత్తనాలు స్టేట్ ఫామ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్సీఐ), నేషనల్ సీడ్స్ కార్పొరేషన్(ఎన్ ఎస్సీ) సంస్థలను కలిపి కొత్త సంస్థను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలోని మారుమూల రైతులకు కూడా చౌక ధరలో నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ఈ రెండింటినీ కలిపేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. బీహార్, గుజరాత్ రోడ్లకు నిధులు: బీహార్, గుజరాత్లో రూ.1,912 కోట్లతో రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో బీహార్‌కు రూ.1,408.85 కోట్లు, గుజరాత్‌కు రూ.503.16 కోట్లు వెచ్చించనున్నారు.