వివక్ష బాధితులకు ‘బీసీ’ల్లో చోటు! | Victims of discrimination 'BC' | Sakshi
Sakshi News home page

వివక్ష బాధితులకు ‘బీసీ’ల్లో చోటు!

Published Thu, Apr 9 2015 2:12 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

వివక్ష బాధితులకు ‘బీసీ’ల్లో చోటు!

వివక్ష బాధితులకు ‘బీసీ’ల్లో చోటు!

జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య
కుల వివక్షకు గురవుతున్నవారిని జాబితాలో చేర్చే అంశం పరిశీలన
తెలంగాణ బీసీ జాబితాపై {పజాభిప్రాయ సేకరణ ప్రారంభం
 

హైదరాబాద్:  జాతి, కుల వివక్షకు గురవుతున్న వారిని బీసీ జాబితాలో చేర్చే విషయా న్ని పరిగణనలోకి తీసుకుంటామని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. బీసీలను గుర్తించడానికి నిర్దిష్టమైన ప్రమాణాల్లేవని, అణగారిన వర్గాలను బీసీలుగా గుర్తిస్తున్నామని చెప్పారు. బీసీ కులాలకు సంబంధించి కేంద్ర జాబితాకు, రాష్ట్ర జాబితాకు తేడాలున్నాయని, వాటిని సరిదిద్దడానికి ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో బీసీ కులాలకు సం బంధించిన వివరాలపై మూడు రోజుల ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్ హియరింగ్)ను   కమిషన్ బుధవారం హైదరాబాద్‌లోని ఇం దిరా ప్రియదర్శిని హాల్‌లో ప్రారంభిం చింది. తొలిరోజున బీసీ జాబితాలో ఉన్న కులాలు, ఉపకులాల పేర్లు, వాటిల్లో అచ్చుతప్పులు, ఏయే ప్రాంతాల పరిధిలోకి ఆయా కులాలు వస్తాయి, రాష్ట్ర జాబితా నుంచి తొలగించిన బీసీ కులాలపై ఆయా సంఘాల అభ్యంతరాలు తదితర అంశాలపై పరిశీలన జరిపింది. ఈ   సేకరణలో కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య, సభ్యులు ఎ.కె.సైనీ, ఎస్.కె.కర్వేంతన్, షకీల్ ఉల్‌జమాన్ అన్సారీ, సభ్య కార్యదర్శి ఎ.కె.మంగోత్ర, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్య కార్యదర్శి ఎ.కె.కృష్ణమోహన్, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి టి.రాధ, ఇన్‌చార్జి డెరైక్టర్ కె.ఆలోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 35 బీసీ కులాలకు సంబంధించిన సంఘాల ప్రతినిధులు, నేతలు తమ వినతిపత్రాలను కమిషన్‌కు అందజేశారు. జాబితాలోని తమ కులాల పేర్లను సవరణ, ఇతర పొరపాట్లను కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ బీసీ జాబితాలోంచి తొలగించిన 26 కులాల (ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రధానంగా నివసిస్తున్న కులాల) వారు తమ అభ్యంతరాలను తెలి పారు. స్పందించిన కమిషన్.. ప్రాంతీయత ఆధారంగా తెలంగాణ జాబితా నుంచి తొల గించినా, కేంద్ర జాబితాలో ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఆ కులాలు బీసీ జాబితాలో కొనసాగుతాయని పేర్కొంది.

అణగారిన వర్గాలను గుర్తిస్తున్నాం..

బీసీలను గుర్తించడానికి నిర్దిష్టమైన ప్రమాణాల్లేవని, అణగారిన వర్గాలను బీసీలుగా గుర్తిస్తున్నామని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య చెప్పారు. బీసీకులాలకు సంబంధించి కేంద్ర జాబితాకు, రాష్ట్ర జాబితాకు తేడాలున్నాయని.. వాటిని సరిదిద్దడానికే ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామని ఆయన తెలిపారు. తెలంగాణలో జాతి, కులవివక్షకు గురైన వారిని బీసీ జాబితాలో చేర్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేను అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. ‘‘ఈ సర్వే మంచి ఫలితాలను ఇస్తుంది. బీసీల జనాభా 52శాతం ఉందని ప్రభుత్వం చెబుతోంది. కానీ వివరాలు వెల్లడి కాలేదు. వెల్లడిస్తే దేశవ్యాప్తంగా ఇది ఆదర్శం గా నిలుస్తుంది. దీనిపై సీఎంకేసీఆర్‌తో మాట్లాడుతాం..’’ అని జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు. కులం ఏదైనా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారిని గుర్తించేందుకు పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
 
50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి: ఆర్. కృష్ణయ్య

 
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జాతీయ బీసీ కమిషన్ చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య కోరారు. బుధవారం ఆయన జాతీయ బీసీ కమిషన్ ఎదుట హాజరై బీసీల సమస్యలపై తన వాదనను వినిపించారు. బీసీల జనాభా 56 శాతంగా ఉన్నట్లు చెబుతుండగా, 2010 లెక్కల ప్రకారం బీసీలకు 12 శాతం మాత్రమే రాజకీయ ప్రాతినిధ్యం లభించిందని ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు.
 
 
 ప్రభుత్వ పరిశీలనలో
 వినతులు: టి.రాధ
 తమ కులాలను తెలంగాణ బీసీ జాబితాలో కొనసాగించాలంటూ పలు సంఘాలు సమర్పించిన వినతిపత్రాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని బీసీ సంక్షేమ శాఖ  ముఖ్యకార్యదర్శి టి.రాధ తెలిపారు. కాళిం గ, శెట్టి బలిజ, తూర్పుకాపు, గవర, గొడబ, నాగవంశం, వీరముష్టి, కొప్పుల వెలమ, ఖురేష్ తదితర కులాలకు సం బంధించిన అభ్యంతరాలు కమిషన్ దృష్టికి వచ్చాయని.. వీటిలో కాళింగను చేర్చే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉం దన్నారు. కాగా.. గౌడ కమ్యూనిటీకి ఉప కులంగా ఉన్న శెట్టిబలిజ కులాన్ని తెలంగాణలో బీసీ(బీ)లో కొనసాగించాలని గ్రేటర్ హైదరాబాద్ శెట్టిబలిజ సంక్షేమ సంఘం  నేతలు దొమ్మేటి సత్యనారాయణ తదితరులు విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర సగర (ఉప్పర)సంఘం నేతలు బి.నరసింహ సగర, ఉప్పరి శేఖర్ సగర, తెలంగాణ కాళింగ సంఘం నేతలు పూజారి గణపతిరావు, ఎస్.వెంకటరమణ, నవ తెలంగాణ రజక అభివృద్ధి సంఘం నేత అంజయ్య, వి.శంకర్ తదితరులు తమ వినతిపత్రాలు సమర్పించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement