సాక్షి, న్యూఢిల్లీ: ఆర్టీసీ ఉద్యోగుల తొలగింపుపై జాతీయ బీసీ కమిషన్ శనివారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎండీకి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 25న ఢిల్లీలో జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఆర్టీసీలోని 20 వేలకు పైగా బీసీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించిందని, దీనిపై తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ కల్వకుర్తి ఆర్టీసీ జేఏసీ ....జాతీయ బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
దీనిపై స్పందించిన కమిషన్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, సంబంధిత ఫైళ్లు, కేస్ డైరీలు సహా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజు కూడా కొనసాగింది. ప్రభుత్వం స్పందించకుంటే రానున్న రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment