హైదరాబాద్: దీపావళి సందర్భంగా.. హైటెక్‌సిటీ ప్రాంతంలో కొందరు యువకులు ఇష్టారీతిన బాణసంచా కాలుస్తూ బైక్‌లపై విన్యాసాలు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీనిపై ఐపీఎస్ అధికారి, టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగపూట ఇదేం వికృతానందమని ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు.
‘‘దీపావళి పండగ పూట ఇదేం వికృతానందం.. ఎటు వెళ్తోందీ సమాజం. ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం దీపావళి. పండగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!?’’ అని సజ్జనార్ ప్రశ్నించారు.
దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం.
దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం.
పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/pYbELJeZAR— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 3, 2024
ఆయన పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందించారు. కొంతమంది యువకులు తాత్కాలిక ఆనందం కోసం తమ జీవితాలను రిస్క్‌లో పెట్టుకుంటున్నారన్నారు. ఈ చేష్టలతో మిగతా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: ఏడాది క్రితం అదృశ్యమై.. ఆధార్‌తో దొరికాడు
Comments
Please login to add a commentAdd a comment