bikers
-
వెర్రి వేషాలపై వీసీ సజ్జనార్ సీరియస్
హైదరాబాద్: దీపావళి సందర్భంగా.. హైటెక్‌సిటీ ప్రాంతంలో కొందరు యువకులు ఇష్టారీతిన బాణసంచా కాలుస్తూ బైక్‌లపై విన్యాసాలు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీనిపై ఐపీఎస్ అధికారి, టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగపూట ఇదేం వికృతానందమని ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు.‘‘దీపావళి పండగ పూట ఇదేం వికృతానందం.. ఎటు వెళ్తోందీ సమాజం. ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం దీపావళి. పండగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!?’’ అని సజ్జనార్ ప్రశ్నించారు. దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం. దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/pYbELJeZAR— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 3, 2024 ఆయన పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందించారు. కొంతమంది యువకులు తాత్కాలిక ఆనందం కోసం తమ జీవితాలను రిస్క్‌లో పెట్టుకుంటున్నారన్నారు. ఈ చేష్టలతో మిగతా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదీ చదవండి: ఏడాది క్రితం అదృశ్యమై.. ఆధార్‌తో దొరికాడు -
పేషెంట్ క్రిటికల్.. సడన్‌గా ఆగిపోయిన అంబులెన్స్.. బైక్‌లతో నెట్టుతూ
న్యూఢిల్లీ: పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. మెరుగైన చికిత్స కోసం అతడ్ని ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈక్రమంలో రోడ్డు మధ్యలో అంబులెన్స్ సడన్‌గా ఆగిపోయింది. డ్రైవర్‌కు ఏం చేయాలో తోచలేదు. ఇంతలో ఇద్దరు యువకులు బైక్‌లపై వచ్చారు. కాళ్లతో అంబులెన్సును నెట్టుతూ బైక్‌లను వేగంగా ముందుకు పోనిచ్చారు. ఇలా 12 కిలోమీటర్లు ప్రయాణించి రోగిని ఆస్పత్రికి చేర్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీజేపీ నేత తజీందర్ పాల్ బగ్గా ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఢిల్లీ హరినగర్‌లోని డీడీయూ ఆస్పత్రి నుంచి ఆర్ఎంల్ ఆస్పత్రికి ఓ పేషంట్‌ను తరలిస్తుండగా.. అంబులెన్స్ ఆగిపోతే ఇద్దరు సిక్కు యువకులు సాయం చేశారని చెప్పుకొచ్చారు. బైక్‌పై కూర్చొని కాళ్లతో నెట్టుకుంటూ అంబులెన్సును ఆస్పత్రికి తీసుకెళ్లారని కొనియాడారు. While transferring a critical patient from DDU Hospital,Hari Nagar,Delhi to RML Hospital,the Ambulance broke down & was pushed by Two Sikh Motorcyclists for about 12 km at midnight. pic.twitter.com/4P5gs4eCrc — Tajinder Pal Singh Bagga (@TajinderBagga) December 21, 2022 చదవండి: కరోనా బీఎఫ్.7 వేరియంట్.. భయం వద్దు.. జాగ్రత్తలు చాలు -
అందరూ చూస్తుండగానే... మహిళ బ్యాగ్ కొట్టేసిన బైకర్!
న్యూఢిల్లీ: శ్రీనగర్‌కి చెందిన షాహిదా బజాజ్ ఢ్లిలీకి వచ్చి ఒక చేదు అనుభవాన్ని ఎదర్కొంది. ఆమె తన భర్తతో కలిసి ఢిల్లీలోని ఒక మార్కెట్‌కి వెళ్లింది. షాపింగ్ పూర్తి అయిన తదనంతరం వారు తిరిగి తాము ఉంటున్న హోటల్‌కి వెళ్తుండగా..ఆమె పక్క నుంచే బైక్ పై ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. అందులో ఒక వ్యక్తి ఆమె బ్యాగ్‌ని కొట్టేశాడు. సదరు బైకర్లు ఆమెని గమనిస్తూ పక్క నుంచే వెళ్తూ..ఆమె బ్యాగ్‌ని గుంజుకుని పట్టుకుపోయాడు. ఐతే ఆ దొంగ బ్యాగ్‌ని ఆమె నుంచి లాక్కొనే సమయంలో ఆమె ప్రతిఘటించడంతో ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆమె భర్త సాయంతో లేచింది. ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. ఆ దొంగ రద్దీగా ఉండే మార్కెట్లో అదీ కూడా అందురూ చూస్తుండగానే చోరి చేసి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ దొంగ ఆచూకి కోసం గాలిస్తున్నారు. ఐతే ఈ ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. (చదవండి: ఒకే ఇంట్లో ఆరు డెడ్‌బాడీల కలకలం.. ఏం జరిగింది?) -
మోటో వ్లాగర్లకు శుభవార్త..ఐఓసీ అదిరిపోయే బిజినెస్ ఐడియా!
న్యూఢిల్లీ: ఇంధన రిటైలింగ్‌లో పోటీ తీవ్రమవుతుండటంతో ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) కొత్త అవకాశాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా హిమాలయాలకు బైక్‌లపై సాహసయాత్రలు చేసే పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా బైకర్స్ కేఫ్‌లను ఏర్పాటు చేస్తోంది. సిమ్లాలో తొలి కేఫ్‌ను ప్రారంభించామని, త్వరలో చండీగఢ్–మనాలీ రూట్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తామని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సిమ్లా శివార్లలోని షోగి దగ్గర్లో ఒక పెట్రోల్ బంకులో ఖాళీ స్థలం ఉండటంతో దాన్ని బైకర్స్ కేఫ్‌గా మార్చినట్లు పేర్కొన్నారు. ఇందులో వైఫైతో పాటు బైకర్లు విశ్రాంతి తీసుకునేందుకు, మోటర్‌సైకిళ్లను పార్కింగ్ చేసుకునేందుకు, చిన్నపాటి రిపేర్లు మొదలైన వాటికోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. అలాగే, లిప్ గార్డ్, సన్‌స్క్రీన్ లోషన్, గ్లవ్స్, రెయిన్ కోట్లు, టార్పాలిన్ మొదలైన వాటిని కూడా విక్రయిస్తున్నట్లు అధికారి పేర్కొన్నారు. సాధారణంగా బైకర్ల యాత్రలు ఢిల్లీ నుంచి లడఖ్ వరకూ వివిధ మార్గాల్లో ఏటా జూన్ తొలి వారంలో మొదలై అక్టోబర్ ప్రథమార్ధం వరకూ కొనసాగుతుంటాయి. -
Nagin Dance: నడిరోడ్డుపై శ్రీదేవీ పాటకు నాగిని డ్యాన్స్‌తో రచ్చ రచ్చ
Nagin Dance On Truck Horn: పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అనే సామెతకు కొందరు యువకులు తగిన న్యాయం చేశారు. రోడ్డుపై నాగిని డ్యాన్స్‌లు చేస్తూ కేకలు పెడుతూ రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు బైక్ రైడర్స్ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ నాగిని డ్యాన్స్ చేస్తూ హంగామా చేశారు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నార్త్ కర్నాటకలో కొందరు బైక్ రైడర్లు రోడ్డుపై వెళ్తున్నారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఓ ట్రక్కు డ్రైవర్ హారన్ మోగించాడు. ఆ హారన్ నాగిన్ డ్యాన్స్‌కు సంబంధించింది. దీంతో, బైకర్లు రోడ్డు పక్కనే బైకులను పార్కింగ్ చేసి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో డ్రైవర్‌ను సాంగ్ పెట్టమని సైగలు చేశారు. అదే జోష్‌లో ట్రక్కు డ్రైవర్.. శ్రీదేవి నటించిన 'నాగీనా'లోని "మెయిన్ తేరీ దుష్మాన్" సాంగ్‌ను ప్లే చేశాడు. దీంతో, రైడర్లు మరింత రెచ్చిపోయారు. రోడ్డు మీద పడుకుని దొర్లుతూ.. డ్యాన్స్ చేశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. मजे है जैसे में आप ले पाओ वैसे लो 🤣#BachelorNation #party #nagindance pic.twitter.com/d0z9zvYsc1 — नटखट निड 🚩 (@natkhatnids) July 12, 2022 ఇది కూడా చదవండి: లైవ్‌లో కుర్రాడి దవడ పగలగొట్టిన రిపోర్టర్.. ఎట్టకేలకు ఆమె స్పందన -
అమానుషం: అందరు చూస్తుండగా.. రోడ్డుపై యువతిని బైక్‌తో ఈడ్చుకెళ్లి..
న్యూఢిల్లీ: బైకుపై వచ్చిన కొందరు దుండగులు మహిళ చేతిలోని ఫోన్‌ని లాకెళ్లడంతో పాటు ఆమెను బైకుతో కొంత దూరం ఈడ్చుకెళ్లారు. ఈ అమానవీయ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. రోడ్డుపై ఓ మహిళ చేతిలో ఫోన్ పట్టుకుని నిల్చుని ఉంది. ఇదంతా గమనించిన ఇద్దరు వ్యక్తులు వేగంగా ఆమె వైపు బైకు నడుపుకుంటూ మహిళ చేతిలోని ఫోన్‌ని లాక్కొన్నారు. దీన్ని ప్రతిఘటించిన ఆమె వెంటనే బైకుపై ఉన్న ఓ వ్యక్తి చొక్కాను గట్టిగా పట్టుకుంది. దీంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ఆ దొంగలు ప్రయత్నించారు. ఈ క్రమంలో మహిళను రోడ్డుపై 150 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లారు. చివరకు ఆ ప్రాంతం నుంచి ఆగంతకులు పారిపోగా , ఘటనా స్థలంలో ఉన్న కొందరు ఆమెను రక్షించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చదవండి: లీనా నాయర్ సీఈవో ఘనత.. తన శైలిలో మహీంద్రా స్పందన -
బైక్‌ల మీదకు దూసుకెళ్లిన లగ్జరీ కారు.. భయంకర దృశ్యాలు వైరల్
-
బైక్‌ల మీదకు దూసుకెళ్లిన లగ్జరీ కారు.. భయంకర దృశ్యాలు వైరల్
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఓ లగ్జరీ కారు బీభత్సం సృష్టించింది. వివరాలు జోధ్‌పూర్‌లోని రహదారిపై డ్రైవర్ అదుపు తప్పడంతో.. పలు ద్విచక్ర వాహనాల మీదకు కారు దూసుకెళ్లింది. బైకుల మీదకు దూసుకెళ్లిన కారు చివరికి రోడ్డు పక్కనున్న దుకాణాన్ని ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జోధ్‌పూర్‌లోని మధురదాస్ మాథుర్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: వైరల్: తొలిసారి పిజ్జా తిన్న బామ్మ.. ‘అబ్బే బాలేదురా మనవడా’.. ఈ ఘటనకు సంబంధించిన భయంకర దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ ఘటన దురదృష్టకరమని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను పరామర్శించేందుకు ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా ఎయిమ్స్‌కు చేరుకున్నారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడని సీఎం వెల్లడించారు. మృతులకు సీఎం గెహ్లాట్ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదం బాధాకరమని, క్షతగాత్రులకు సరైన వైద్యం అందిస్తామని భరోసానిచ్చారు. చదవండి: చికెన్ కర్రీ అదరగొట్టిన రణు మండల్ .. వీడియో వైరల్ -
బైకర్స్‌కి శుభవార్త ! మార్కెట్లో బజాజ్ డొమినార్ 400 అప్డేట్ వెర్షన్
ముంబై: లాంగ్‌రైడ్‌కి వెళ్లే బైకర్లకి, మోటోవ్లాగర్లకి శుభవార్త ! దేశీయంగా స్పోర్ట్స్ బైక్‌లలో ప్రత్యేక ఫ్యాన్ బేస్ కలిగిన డోమినార్ నుంచి మరో కొత్త వెర్షన్ వచ్చింది. బజాజ్ ఆటో తన ‘‘బజాజ్ డొమినార్ 400’’ మోడల్ అప్డేట్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్ షోరూం ధర రూ.2.16 లక్షలుగా ఉంది. ఇందులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ టూరింగ్ యాక్ససరీసులతో పాటు టూరింగ్ రైడర్లకు కావల్సిన కనీస భద్రతా ఫీచర్లులున్నాయి. బీఎస్ 6 ప్రమాణాలతో బీఎస్ 6 ప్రమాణాలు కలిగిన 373.3 సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 40 పీఎస్ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయగలదు. ‘‘ద్వి చక్ర వాహన విభాగంలో డొమినార్ 400 తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. సుధీర్ఘ ప్రయాణాలను చేసే రైడర్లకి ఇప్పుడిది మొదటి ఎంపికగా మారింది’’ బజాజ్ ఆటో మార్కెటింగ్ హెడ్ నారాయణన్ తెలిపారు. -
రాంగ్ రూట్.. ఇకపై ఫుల్ టైట్
నేరేడ్మెట్(హైదరాబాద్): పక్కనే రాంగ్ రూట్.. కాస్త దూరం వెళ్తే యూటర్న్.. కానీ కొంత మంది రాంగ్రూట్నే ఎంచుకుంటున్నారు. ఓవైపు వేగంగా వచ్చే వాహనాలు.. మరోవైపు రాంగ్రూట్లో వెళ్లే వాహనాలతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కల్పించినా కొందరిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఇప్పటికే రాంగ్రూట్లో వెళ్లే వారికి అనేక చలాన్లు సైతం వేశారు. ట్రాఫిక్ పోలీసులు లేని సమయంలో రయ్యిమంటూ వాహనాలకు ఎదురెళ్తున్నారు. అటునుంచి వేగంగా వచ్చే వాహనాలకు అడ్డుగా వెళ్లడంతో ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడక్కడా ఉండే సీసీ కెమెరాల్లో కనిపించకుండా నంబర్ప్లేట్లను చెరిపేస్తున్నారు. కొంతమంది ఆకతాయిలు నంబర్ ప్లేట్లకు మాస్కులు కట్టి నంబర్ కనిపించకుండా తప్పించుకుంటున్నారు. అలాంటి వారికిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మొదటిసారి అవగాహన కల్పిస్తూ.. రెండోసారి వాహనదారులు చిక్కితే చలాన్లు విధిస్తున్నారు. హెల్మెట్ లేకుండా.. నంబర్ ప్లేట్ కనిపించకుండా ఉన్న వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ► మల్కాజిగిరి ట్రాఫిక్ ఠాణా పరిధిలోని నేరేడ్మెట్లో రాంగ్ రూట్ డ్రైవింగ్‌లు అధికంగా ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ► ఇందులో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులే షార్ట్‌కట్‌లో గమ్యస్థానాలకు వెళ్లడానికి రాంగ్రూట్లో ప్రయాణిస్తున్నట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. ► నేరేడ్మెట్–ఈసీఐఎల్ ప్రధాన మార్గంలో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ► ఈ మార్గంలో నేరేడ్మెట్ క్రాస్ రోడ్డు, జేజేనగర్ చౌరస్తా, సైనిక్‌పురి చౌరస్తాల్లోనే యుటర్న్‌లు ఉన్నాయి. ► డిఫెన్స్ కాలనీ, వాయుపురి, సైనిక్పురితోపాటు పలు కాలనీలు ఉన్నాయి. ► ఆయా కాలనీల అంతర్గత రోడ్ల నుంచి ప్రధాన రోడ్ల మీదికి వచ్చే వాహనదారులు రాంగ్రూట్లో ప్రయాణిస్తున్నారు. ► దాంతో ఎదురుగా వస్తున్న పాదచారులు, ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ► గడిచిన నెలలో 10 వరకు రాంగ్‌రూట్ ప్రయాణం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు గాయపడినట్లు పోలీసులు చెబుతున్నారు. ► ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు రాంగ్‌రూట్ డ్రైవింగ్ నియంత్రణకు కఠినంగా వ్యవహరిస్తున్నారు. చదవండి: బైక్‌పై 65 చలాన్లు.. అవాక్కైన పోలీసులు.. ఇక్కడో ట్విస్టు కూడా.. -
కాల్ చేస్తామని ఫోన్ కొట్టేసి బైక్‌తో ఈడ్చుకెళ్లారు, వైరల్ వీడియో
తిరువనంతపురం: కేరళలోని కోజిగోడ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఫోన్‌కాల్ చేసుకుంటామని చెప్పి మొబైల్‌ఫోన్ కొట్టేయడమే కాకుండా అడ్డు వచ్చిన సదరు వ్యక్తిని బైక్‌తో కొద్దిదూరం పాటు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. వివరాలు.. బిహార్‌కు చెందిన అలీ అక్బర్ కోజిగోడ్‌కు పనినిమిత్తం వచ్చారు. తన పని ముగించుకొని రోడ్డుపై వెళుతుండగా.. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. తమ ఫోన్ పాడైందని.. అర్జెంటుగా ఒక కాల్ చేసుకుంటామని చెప్పి అక్బర్‌ను అడిగారు. వారి మాటలు నమ్మిన అక్బర్ తన ఫోన్‌ను వారి చేతిలో పెట్టగానే యువకులిద్దరు వెంటనే బైక్‌ను స్టార్ట్ చేసి అక్కడినుంచి పారిపోయేందుకు యత్నించారు. అయితే బైకును అక్బర్ పట్టుకొని ఉండడంతో అతన్ని అలాగే రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ క్రమంలో అలీతో పాటు బైకుపై వెనకాల కూర్చున్న దొంగ కూడా కిందపడిపోయాడు. ఆ తర్వాత అక్బర్ బైకును వెంబడించినా ప్రయోజనం లేకపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అక్బర్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. కాగా అక్బర్ వద్ద ఫోన్ దొంగలించిన ఇద్దరు యువకులను సాను కృష్ణన్, షమ్నాస్ అబ్దురాహిమాన్‌లుగా గుర్తించారు. అయితే దుండగులకు చెందిన ఒక ఫోన్ అక్కడపడిపోగా స్థానికులు దానిని పోలీసులకు అందించారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
‘ఇళ్లల్లోకి వెళ్లండి, రోడ్లపై కనిపిస్తే కాల్చిపడేస్తాం’
భోపాల్: ఆకతాయిలు వీరంగం సృష్టించారు. పట్టపగలే బైకులపై తిరుగుతూ తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ‘రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. రోడ్లమీద కనిపిస్తే కాల్చిపడేస్తాం’ అంటూ కొందరు ఆకతాయిలు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటన మొరెనా జిల్లా బంఖండి ప్రాంతం కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గుర్తు తెలియని 25మంది దుండగులు మాస్క్ ధరించి గన్స్‌తో వీరంగం సృష్టించారు. బైక్‌పై డ్రైవ్ చేసుకుంటూ 100 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. తుపాకీ గుళ్ల శబ్దంతో ఉలిక్కిపడ్డ ప్రజలు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ఇళ్లు, బస్సులు ద్వంసమయ్యాయి. పలువురు గాయపడ్డారు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న అడిషనల్ ఎస్పీ రాయ్ సింగ్ నార్వారియా పరిస్థితిని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. కాల్పులకు పాల్పడ్డ నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. అయితే, పోలీసుల వెర్షన్ ఇలా ఉంటే స్థానికుల వెర్షన్ మరోలా ఉంది. ఈ కాల్పులు లాక్డౌన్ నిబంధనల్ని పాటించనందుకు కాదు. ఓ యువతి ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్ట్ వల్ల రెండు సామాజిక వర్గాల మధ్య అగ్గిరాజేసిందని చెప్తున్నారు. ఓ వర్గం మరో వర్గంవారిని టార్గెట్ చేస్తూ కాల్పులకు దిగిందని అంటున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో ఇదే అంటూ స్థానికులు ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలాఉండగా.. మధ్యప్రదేశ్‌లో కరోనావైరస్ విజృంభిస్తుండడంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా కేసుల్ని కట్టడి చేయాలంటే లాక్డౌన్ ఒక్కటే శరణ్యం.. అందుకే రాష్ట్రంలో మే15 వరకు జనతాకర్ఫ్యూ పేరుతో లాక్డౌన్ విధిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. #CoronaCurfew not in Morena! dozens masked riding mobikes openly firing targeting the other caste over a social media post! @GargiRawat @ndtv @ndtvindia pic.twitter.com/B7GG8tXAa1 — Anurag Dwary (@Anurag_Dwary) May 8, 2021 -
సోషల్ డిస్టెన్స్ అంటే ఇలా కాదురా అబ్బాయిలు!
న్యూఢిల్లీ: ఆనంద్ మహీంద్ర.. పరిచయం అక్కర్లేని పేరు. దేశీ ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న వ్యాపార దిగ్గజం. ఆయన ఇతర వ్యాపార ప్రముఖుల కంటే భిన్నంగా ఆలోచిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకు తగ్గట్లు సమయం, సందర్భాన్ని బట్టి నెటిజన్లతో తన అభిప్రాయాల్ని పంచుకుంటుంటారు. అభిప్రాయల్ని పంచుకోవడమే కాదు ఆపన్న హస్తం అందించేందుకు ఎప్పుడూ ముందుంటారు. అయితే దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు కరోనా నిబంధల్ని పాటించాలని ప్రచారం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయంలో శానిటైజర్లను వినియోగించడం, మాస్క్‌లు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తున్నారు. తాజాగా కరోనా పరిస్థితులకు ఆపాదిస్తూ 2017 నాటి ఓ ఫోటోను ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. ఆ ఫోటోలో ఇద్దరు ద్విచక్ర వాహన దారులు నిచ్చెన రెండు చివర్లలో తలల్ని దూర్చి దాన్ని తరలిస్తున్నారు. ఆఫోటోను నెటిజన్లతో పంచుకున్న ఆనంద్ మహీంద్ర .. 'ఈ ఫోటో నవ్వుతెప్పిస్తుంది. సామాజిక దూరం అంటే ఇలా ప్రమాదకరమైన స్టంట్లు కాదు. ఇలాంటి అనుకోని ప్రమాదాల్ని తెచ్చి పెడుతుంటాయి జాగ్రత్త’ అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పోస్టు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా, దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నా సంగతి తెలిసిందే. సిలిండర్ల కొరతను అధిగమించేందుకు ఆనంద్ మహింద్రా తన వంతుగా పలు సేవా కార్యక్రమాల్ని ప్రారంభించారు. 'ఆక్సిజన్ వీల్స్' పేరుతో ప్రధాన నగరాలకు చెందిన 13 ఆస్పత్రులకు 61 జంబో సిలిండర్లను మహీంద్రా వాహనాల్లో తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలనే యోచనలో ఉన్నట్లు ఆనంద్ మహీంద్ర ఇటీవల తెలిపారు. -
మహిళా సంఘం నేత దారుణ హత్య
మహారాష్ట్రలొ మహిళా సంఘం నేత హత్యోదంతం కలకలం రేపింది. స్వల్ప వివాదం కారణంగానే మహిళ ఎన్‌సిపి కార్యకర్త, స్థానికంగా మహిళా హక్కులకోసం పనిచేస్తున్న మహిళా సంఘం నేత రేఖ భూసాహెబ్ జారేపై సోమవారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎటాక్ చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం బాధితురాలు రేఖ పూణే నుంచి అహ్మద్‌నగర్‌కు కారులో వెళుతున్నారు. ఆమెతోపాటు, తల్లి, కొడుకు, స్నేహితుడు కూడా కారులో ఉన్నారు. ఈ క్రమంలో ఒక బైక్‌ను క్రాస్ చేసిన ముందుకెళ్లడమే ఆమె చేసిన నేరం. ఆగ్రహంతో రగిలిపోయిన ఇద్దరు నిందితులు తమ బైక్‌వేగం పెంచి కారుకంటే ముందుకు దూసుకెళ్లారు. రోడ్డు మధ్యలో బైక్ నిలిపి ఈమెను అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. కారులోని ఇతర కుటుంబ సభ్యులు జోక్యం చేసుకొని, సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఇంతలోనే ఒక దుండగులు అకస్మాత్తుగా కత్తి దూసి, రేఖ గొంతు కోసి అక్కడినుంచి ఉడాయించారు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. హుటాహుటిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా ఈ ఘటనలో అహ్మద్‌నగర్ సుపా పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులపై హత్య కేసు నమోదైందని, ఈ దాడి వెనుక ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు అధికారి వెల్లడించారు. -
లోయలో పడ్డ కుక్క.. చిరు తిండి చూపించి!
సాటి మనిషి కష్టాల్లో ఉంటే అయ్యో పాపం అనే మనసు అందరికి ఉంటుంది. కానీ సాయం చేసే మంచి మనసు చాలా అరుదు. పక్కనున్న వారినే పట్టించుకోవడంలేని నేటి సమాజంలో ప్రాణం పోయే స్థితిలో ఉన్న కుక్కను రక్షించి మానవత్వాన్ని చాటుకున్నాడు ఓవ్యక్తి. అయితే ఆ వ్యక్తి కుక్కను రక్షించిన విధానం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు. వివరాలు.. కొందరు సభ్యులతో కూడిన బృందం నార్త్ కరోలినా ప్రాంతంలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో పక్కన ఉన్న లోయలో ఓ కుక్క పడిపోయి ఉండటాన్ని గమనించారు. దాదాపు 30 అడుగుల లోతు ఉన్న లోయలో కుక్క చిక్కుకొని చాలా రోజులవుతున్నట్లు తెలుస్తోంది. (వైరల్: ఈ కుక్క పిల్ల చాలా తెలివైంది) అయితే దానిని బయటకు తీసేందుకు ఆలోచించిన బైకర్లు వెంటనే సహాయం కోసం బుర్కే కౌంటీ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాన్ని పిలిచారు. అనంతరం వారంతా కుక్క చిక్కుకున్న లోయ వద్దకు వెళ్లి దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఆకలితో ఉన్న కుక్కకు ఆహారం చూపిస్తే ఉత్సాహంతో పరుగులు పెడుతుంది అనుకొని స్క్యూవర్స్ లోయ లోపలికి వెళ్లి కుక్కకు మాంసం, స్నాక్స్ ప్యాకెట్స్ చూపించారు. తర్వాత జీను సాయంతో దానిని సురక్షితంగా బయటకు తీశారు. కుక్కు ఎలాంటి గాయాలు కాలేదని, అయితే చాలా రోజుల నుంచి ఆకలితో ఆలమటిస్తుందని వారు తెలిపారు. కుక్కను రక్షించిన విధానాన్ని రెస్క్యూవర్స్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కుక్కకు సింకర్ అని పేరు పెట్టారు. దీని యజమానులు దొరక్కపోతే ఎవరైనా కుక్కను దత్తత తీసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. (ఆ సూట్‌కేస్‌ను చూడకపోతే ఏం జరిగేది?) -
టీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. కొత్తకోణం
సాక్షి, విజయవాడ: నగరంలో తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్‌ను చితకబాదిన కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఆర్టీసీ డ్రైవర్‌ను చితకబాదిన నలుగురు యువకులపై ఇప్పటికే పలు పాత కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌పై దాడి చేసిన నిందితులైన సాజిద్, దుర్గా రాజేశ్‌పై దోపిడీ కేసులు ఉన్నాయి. అదేవిధంగా మరో ఇద్దరు నిందితులపై దొంగతనం కేసులు ఉండగా.. రాజేష్‌పై పేకాట కేసులు కూడా ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసి.. రూ. 25వేలతో పరారైనట్టు పోలీసులు తేల్చారు. ఈ మేరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గత శనివారం అర్ధరాత్రి విజయవాడ భవానీపురంలో అల్లరిమూకలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తమ బైక్‌లకు దారి ఇవ్వలేదంటూ ఆర్టీసీ బస్సుపై కొందరు దాడికి పాల్పడ్డారు. బైకులపై బస్సును వెంబడించిన 50 మందికి పైగా యువకులు గొల్లపూడి సెంటర్ వద్ద బస్సును నిలిపివేశారు. అనంతరం బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా బస్సు డ్రైవర్‌ను చితకబాదడంతో పాటు, కండక్టర్ వద్ద నుంచి 25 వేల రూపాయలు లాకెళ్లారు. ఈ చర్యతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై బస్సు డ్రైవర్ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
విజయవాడలో రెచ్చిపోయిన పోకిరీలు
సాక్షి, విజయవాడ : నగరంలోని భవానీపురంలో అర్దరాత్రి అల్లరిమూకలు బీభత్సం సృష్టించాయి. తమ బైక్‌లకు దారి ఇవ్వలేదని ఆర్టీసీ బస్సుపై పోకిరీలు దాడికి పాల్పడ్డారు. బైకులపై బస్సును వెంబడించిన 50 మందికి పైగా యువకులు గొల్లపూడి సెంటర్ వద్ద బస్సును నిలిపివేశారు. అనంతరం బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా బస్సు డ్రైవర్‌ను చితకబాదడంతో పాటు, కండక్టర్ వద్ద నుంచి 25 వేల రూపాయలు లాకెళ్లారు. ఈ చర్యతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై బస్సు డ్రైవర్ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కొందరు యువకులని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. బస్సులోని ప్రమాణికులు తీసిన వీడియోల ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పోకిరీల దాడిలో గాయపడ్డ డ్రైవర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
క్షణాల్లో కళ్లముందుంటారు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఏ నగరానికెళ్లినా, ఎక్కడో అక్కడ ఆడపిల్లలను అల్లరిపెడుతూ ఆకతాయులు అగుపడుతూనే ఉంటారు. రైల్లే స్టేషన్లలో, బస్టాండుల్లోనే కాకుండా మాల్స్ ముందు, వీధి చివరన మాటువేసి అల్లరి పెట్టే కొత్త తరం ఆకతాయులు తయారయ్యారు. వారిలో ఆడపిల్లలను కట్టు బొట్టు దగ్గరి నుంచి కామెంట్ చేసి ఇబ్బంది పెట్టడమే కాకుండా కనుగీటి ఏడిపించే ముదురులు కూడా ఉంటున్నారు. అయితే రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరంలో వీరి ఆటలు ఇప్పుడు అంతగా సాగడం లేదు. ఆడపిల్లలను ఏడిపిస్తున్నారని ఏ మాత్రం అనుమానం వచ్చినా నీలి రంగు దుస్తుల్లో, నెత్తిన హెలిమెట్లతో బైక్‌పై ఇద్దరు మహిళా పోలీసులు కన్నుమూసి తెరిచే లోపల కళ్ల ముందు ప్రత్యక్షం అవుతున్నారు. ఏడిపించే ఆకతాయులు ఎవరైనా, ఎంతటి వారైనా సమీపంలోని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి సముచిత రీతిన సత్కరిస్తున్నారు. ఏడిపిస్తున్న తీరు, స్థాయినిబట్టి ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారు. ఆకతాయులు అల్లరి చేస్తూ కనిపిస్తే రోడ్డుపై జిగ్‌జాగ్‌గా కూడా బైకులు నడుపుతూ వెళ్లి అమ్మాయిలకు రక్షణగా నిలబడుతున్నారు. రౌడీలను, ఆకతాయిలను, నేరస్థులను సివిల్ దుస్తుల్లో చూసినప్పుడు తమకూ భయం వేసేదని, ఒక్కసారి యూనిఫామ్ చేసుకున్నాక తమకు భయం అంటూ లేకుండా పోయిందని నిర్మలా, ప్రమీలా అనే మహిళా పోలీసులు తెలిపారు. కొత్తలో 30 రోజుల్లోనే 256 టీజింగ్ కేసులను నమోదు చేశామని ఇప్పుడు వారి సంఖ్య భారీగా తగ్గిపోయిందని వారు తెలిపారు. ముఖ్యంగా ఒక్కసారి పట్టుబడిన వారు మళ్లీ అల్లరి చేయక పోవడం విశేషమని వారు చెప్పారు. నగర వీధుల్లో తిరుగుతూ ఆడపిల్లలను అల్లరిపెట్టే ఆకతాయులపై చర్య తీసుకోవడం కోసమే ఈ మహిళా పోలీసు బైకర్లు ఉన్నారు. నిర్మలా, ప్రమీలాను కలుపుకొని నగరంలో మొత్తం 52 మంది మహిళా బైకర్లు ఉన్నారు. అయితే వీరి సంఖ్య సరిపోవడం లేదని వీరి సంఖ్యను వందకు పెంచాలనుకుంటున్నామని అడిషనల్ పోలీసు కమిషనరల్ గౌరవ్ శ్రీవాత్సవ తెలిపారు. ప్రస్తుతం ఇలాంటి మహిళా దళాలు దేశంలో ఢిల్లీ, జైపూర్‌లతోపాటు ఉధయ్‌పూర్ నగరాల్లో ఏర్పాటు చేశారు. ఢిల్లీలో రఫ్తార్ స్క్వాడ్ పేరిట ఇలాంటి మహిళా దళాన్ని 2017, మే నెలలో ఏర్పాటు చేశారు. వారి వద్ద తుపాకులు, స్టెన్గన్లతోపాటు పెప్పర్ స్ప్రేలు ఉంటాయి. ప్రస్తుత జైపూర్ మహిళా పోలీసుల వద్ద లాఠీలు మాత్రమే ఉన్నాయి. పోలీసుల్లోకి మహిళలు రావడానికి ఇప్పటికీ అంతగా ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యకరమని పోలీసు అధికారి శ్రీవాత్సవ అన్నారు. పోలీసు ఉద్యోగాల్లో కూడా మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు ఉండగా పది శాతానికి మించి మహిళలు రావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో మహిళల పట్ల లైంగిక వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో మహిళా పోలీసుల ఆవశ్యకత ఎంతో ఉందని ఆయన చెప్పారు. నేడు భారత్‌లో ప్రతి 13 నిమిషాలకు ఒక రేప్ జరుగుతోంది. 2016లో రోజుకు ఆరుగురు మహిళలపై గ్యాంగ్ రేప్‌లు జరిగాయి. కట్నం కోసం ప్రతి 69 నిమిషాలకు ఓ పెళ్లి కూతురు హత్యకు గురవుతున్నారు. 2012లో ఢిల్లీలో నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య జరిగిన తర్వాత కొన్ని కఠిన చట్టాలను తీసుకొచ్చినా, సాధ్యమైనంత వరకు త్వరిత గతిన శిక్షలు విధిస్తున్నా మహిళలపై అత్యాచారాలు ఆశించినంతగా తగ్గడం లేదు. ఆడపిల్లల అల్లరి కేసుల్లో ఆకతాయిలను అరెస్ట్ చేసి కేసులు పెట్టడం కన్నా వారికి కౌన్సిలింగ్ క్లాసులను నిర్వహిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. -
హెల్మెట్ పెట్టుకోలేదని...
-
వైరల్ : హెల్మెట్స్ పెట్టుకోలేదని షూ విసిరారు
ఇటీవల కాలంలో కొంతమంది పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహం, వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. తాజాగా ఇద్దరు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోలేదని బెంగళూరుకు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ షూస్ విసిరారు. ఇదంతా కెమెరాలో బంధించిన ఒకతను, యూట్యూబ్‌లో పోస్టు చేయడంతో, ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అంతే వెంటనే ఆ కానిస్టేబుల్ పోస్టు కూడా ఊడి, సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే...రోడ్డుకు పక్కన ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు వేచిచూస్తూ ఉన్నారు. వారి పక్క నుంచే హెల్మెట్స్ పెట్టుకోకుండా ఇద్దరు బైకర్లు వెళ్తూ కనిపించారు. వారిని చూసిన ఒక ట్రాఫిక్ పోలీసాఫీసర్ షూ తీసి, వారిపైకి విసిరారు. బైకర్లలో ఒకరికి ఈ షూ తగిలింది. అయినా వాళ్లిద్దరూ ఆగకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. ఈ సంఘటన్నంతటినీ ద్విచక్ర వాహనదారుల వెనుకాలే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న రిషబ్ ఛటర్జీ అనే వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న బీఈఎల్ రోడ్డులో ఈ ఘటన జరిగినట్టు రిషబ్ పేర్కొన్నాడు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను తాము ప్రేమిస్తామని, కానీ ఇటు పోలీసులు, అటు బైకర్లు ఇలా చేయడం చాలా ప్రమాదకరమని ఈ పోస్టుకు ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల ఎఫ్బీకి కూడా దీన్ని షేర్ చేయాలని కోరాడు. నెంబర్ ప్లేట్‌ను నమోదు చేసుకుని, వారికి జరిమానా విధించవచ్చు కదా అని యూజర్లంటున్నారు. చట్టాలను చేతుల్లోకి తీసుకుని, బైకర్ల జీవితాలకు ప్రమాదం తెచ్చే బదులు, జరిమానా కోసం నోటీసులు పంపవచ్చని పేర్కొంటున్నారు. బైకర్లపైకి షూస్ విసిరే హక్కులు పోలీసులకు లేవన్నారు. కానిస్టేబుల్ ఈ పరిస్థితిని మరింత సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉండాల్సి ఉండేదని యూట్యూబర్ కూడా అన్నాడు. ‘ఈ సంఘటనను సమర్థవంతంగా నిర్వహించాలంటే ఫోటో తీసి, జరిమానా విధించాలి. బెంగళూరులో చాలా మంది పోలీసులు వద్ద డిజిటల్ కెమెరాలు ఉన్నాయి. నిబంధనలను ఉల్లంఘించే వారిని రికార్డు చేయవచ్చు. పలు మార్గ కూడలిలో ఏర్పాటు చేసిన కెమెరాలతో వాహన నెంబర్‌ను ట్రాక్ చేయవచ్చు’ అని యూట్యూబర్ పేర్కొన్నాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోతో, ఆ పోలీసు కానిస్టేబుల్ పదవి పోవడమే కాకుండా.. జలహాలి ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే బైక్‌పై వెళ్లిన ఆ ఇద్దరు యువకులు మాత్రం కానిస్టేబుల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఫిర్యాదు దాఖలు చేయలేదు. -
హెల్మెట్ లేకపోతే అరకిలోమీటర్ నడవాల్సిందే!
ఆగ్రా : హెల్మెట్ లేకుండా ప్రయాణించే ద్విచక్రవాహనదారులకు ఉత్తరప్రదేశ్ పోలీసులు వింత శిక్షలను విధిస్తున్నారు. ఎన్ని ఫైన్లు విధించినా ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో మార్పురాకపోవడంతో ఆగ్రా పోలీసులు వినూత్న కార్యాచరణను రూపోందించారు. హెల్మెట్ లేకుండా పట్టుబడ్డ వారిని, బైక్ తో సహా 500 మీటర్లు(అరకిలోమీటర్) నడవాలని సూచిస్తున్నారు. ఈ విధానంపై ఇప్పటికే పలు ప్రచార కార్యక్రమాలను చేపట్టిన పోలీసులు గత బుధవారం నుంచి అమల్లోకి తెచ్చారు. ఈ చర్యతో వారి ఆరోగ్యం బాగుండటమే కాకుండా బైకర్స్‌లో మార్పు వస్తుందని, ఇది శిక్ష కాదని ఆగ్రా సీనియర్ ఎస్పీ అమిత్ పథక్ తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఇప్పటికే హెల్మెట్ ధరించినవారికే పెట్రోల్ పోయాలని ఆదేశించిన పోలీసులు.. రోడ్డుభద్రతా ప్రమాణాలపై పాఠశాల, కాలేజీల్లో అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఆగ్రాలోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ ప్రమాదాలను తగ్గించేందు పోలీసులు కృషి చేస్తున్నారు. -
రెండు పులులు మీచుట్టూ ప్రదక్షిణ చేస్తే..
సాక్షి, మహారాష్ట్ర : కొన్ని సంఘటనలు చూస్తే చావు అనేది నిజానికి ముందే రాసిపెట్టి ఉంటుందేమో అని అనిపిస్తుంటుంది. ఒక్కోసారి పెద్ద కారణం లేకుండానే ప్రాణాలు పోవడం మరోసారి ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ప్రాణాలు నిలవడంవంటి సంఘటనలు ఈ అనుమానాలకు కారణాలుగా ఉంటాయి. సాధారణంగా పులి ఎదురుపడిందంటేనే ఇక ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవచ్చు. ఒక వేళ కారులాంటి వాహనాల్లో ఉంటే సురక్షితంగా ఉండొచ్చేమోగానీ, ఖర్మకు నడిచి వెళుతున్న సమయంలో బైక్‌పై వెళ్లే సమయంలో ఎదురైతే ఇక అంతే మరి. కానీ, మహారాష్ట్రలో ఓ ఇద్దరు వ్యక్తులు పులులకు ఎదురై ప్రాణాలతో బయటపడ్డారు. ఎదురవడమంటే అదేదో దూరంగా కాదు.. ఆ పులులు గుడిచుట్టూ ప్రదక్షిణ చేసినట్లుగా వారి చుట్టూ తిరిగాయి కూడా. మహారాష్ట్రలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఓ చోట ఆగి ఉండగా అనూహ్యంగా రెండు పెద్ద పులులు వారి దగ్గరకు వచ్చాయి. వాటిని చూడగానే భయంతో వారు బిగుసుకుపోయారు. బహుశా! అవి అప్పటికే ఆహారం పూర్తి చేసుకొని ఉన్నాయనుకుంటా.. ఓ పులి తనకెందుకులే అన్నట్లు బైక్పక్కనే కూర్చొగో మరో పులి మాత్రం వారి బైక్ చుట్టూ తిరుగుతూ వారిని ఎగాదిగా చూసింది. ఆ చూపుకే వారికి గుండెలు జారిపోయాయి. ఇదంతా దూరంగా ఉండి చూస్తున్న కారులోని వ్యక్తులు బైక్‌పై ఉన్న వారిని ఎటు కదలొద్దని, ఏంచేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. దాదాపు నాలుగు నిమిషాలపాటు ఆ పులులు చేసిన పనికి వారికి ముచ్చెమటలుపట్టి ప్రాణాలు గాల్లోనే పోయాయ్ అన్నంతలా మారిపోయారు. అదృష్టం కొద్ది ఆ పులులు కాస్తంత దారివ్వగానే వేగంగా కారులో వాళ్లు వారిని సమీపించి కారులో ఎక్కించుకొని భద్రంగా తీసుకెళ్లారు. బహుశా భూమ్మీద నూకలున్నాయంటే ఇదేనేమో! -
వీళ్లు మామూళోల్లు కాదు.. ఏకంగా సింహాలతోనే..!
-
వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సింహాలతోనే..!
అహ్మదాబాద్: సింహాలను చూస్తేనే చాలామంది దడుసుకొని ఆమడ దూరం పారిపోతారు. కానీ కొందరు యువకులు మాత్రం సింహాలను చూసి వెర్రిగా ప్రవర్తించారు. సింహాలను బైకుల మీద వెంటాడే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో కలకలం రేపుతోంది. గుజరాత్‌లోని ప్రముఖ గిరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురు బైకర్లు సింహాలను వెంటాడుతూ ఆ దృశ్యాలను తమ సెల్ఫోన్లో బంధించారు. మీదమీదకు వస్తున్న బైకర్ల నుంచి తప్పించుకునేందుకు ఓ సింహం, ఓ ఆడసింహం అడవిలోకి పారిపోయాయి. అమ్రేలి జిల్లాలోని అడవిలో చిత్రీకరించినట్టు భావిస్తున్న 34 సెకన్ల వీడియోను సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫేస్బుక్లో, యూట్యూబ్‌లో ఈ వీడియోను హల్చల్ చేస్తున్న నేపథ్యంలో గుజరాత్ అటవీశాఖ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. బైకర్ల వివరాలు తెలుసుకొని.. వీడియో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. వీడియోలో ఒక బైక్ నంబర్ కనిపించడంతో ఈ వివరాల ఆధారంగా విచారణ చేపడుతున్నారు. -
రెచ్చిపోయిన బీజేపీ నేత కుమారుడు
-
రెచ్చిపోయిన బీజేపీ నేత కుమారుడు
రాయ్‌పూర్: తన తండ్రికి రాజకీయ పలుకుబడి ఉందని ఓ బీజేపీ నేత కుమారుడు రెచ్చిపోయాడు. తన ముందు వెళుతున్న రెండు బైక్‌లను క్రాస్ చేసేందుకు ప్రయత్నించి అలా చేయలేక ఆ బైక్ లపై వెళుతున్న వారిపై దాడికి పాల్పడ్డాడు. స్నేహితులతో కలిసి ఆ బైకిస్టులను బురదరోడ్డులో పొర్లించి కొట్టారు. అంతేకాదు తాను చేసిన ఈ ఘనకార్యాన్ని వీడియో రికార్డు చేయడమే కాకుండా దానిని సోషల్ మీడియాలో స్వయంగా పెట్టాడు. ఈ వీడియో ఆధారంగా ఆ నేత కొడుకు, అతడి స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి ఈ ఘటన గత నెలలోనే జరిగింది. వివరాల్లోకి వెళితే గత ఆగస్టు 15న ఖేర్ కట్టా ప్రాంతంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న మాంథురాం పవార్ కుమారుడు నన్ను పవార్ ఎస్యూవీ వాహనంపై వెళుతున్నాడు. అతడు వెళుతున్న మార్గంలోనే సాధారణంగా ఓ ఇద్దరు యువకులు బైక్ లపై వెళ్లారు. అలా వెళుతున్నవారిని క్రాస్ చేసేందుకు స్నేహితులతో కలిసి వేగంగా ప్రయత్నించినప్పటికీ తొలుత అది వీలుకాలేదు. దీంతో మరోసారి వారిని క్రాస్ చేసి తమనే దాటి ముందుకు వెళతారా అంటూ రెచ్చిపోయిన నన్ను పవార్ బైకర్స్‌పై దాడి చేసి స్నేహితులతో దాడిచేయించాడు. స్వయంగా దీనిని వీడియో తీసి చివరకు అడ్డంగా బుక్కయ్యాడు. -
గుండె ఆగినంత పనైంది!
కళ్ల ముందే క్రూర జంతువు కంట పడితే ఎవరికైనా గుండె ఆగినంత పనౌతుంది. ఎక్కడి నుంచో అమాంతంగా వన్య మృగం మన ముందు ఉరికితే పైన ప్రాణాలు పైనే పోతాయి. ఊహించడానికే భయంగా ఉన్న ఇలాంటి అనుభవమే రష్యాలో ఇద్దరు మోటార్ సైక్లిస్టులకు ఎదురైంది. ఎలుగుబంటి దాడి నుంచి వీరిద్దరూ తృటిలో తప్పించుకున్నారు. ఇర్ కట్క్స్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన తాలుకూ ఫొటోలు బయటకు వచ్చాయి. ఇద్దరు మోటార్ సైక్లిస్టులు ఒక దారిలో వెళుతుండగా అమాంతంగా ఒక ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. దాన్ని చూసి ఇద్దరు బైకర్లలో ఒకరు వెంటనే ఆగిపోయారు. మరోవ్యక్తి ఆగేలోగా బైకు ముందు నుంచి ఎలుగుబంటి పరిగెత్తుకుంటా వెళ్లిపోయింది. ఎలుగుబంటి తమపై ఎక్కడ దాడి చేస్తోందనని భయపడి అప్పటివరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మోటార్ సైక్లిస్టులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. రష్యాలో ఎలుగుబంటి దాడులు సర్వసాధారణంగా మారాయి. ఆహార లభ్యత తగ్గిపోవడంతో ఎలుగుబంట్లు తరచుగా అటవీ సమీప ప్రాంతాలోకి చొచ్చుకు వస్తున్నాయి. జనంపై దాడులు చేస్తున్నాయి. లచిగొర్క్సీ ప్రాంతంలో గత ఆగస్టులో ఎలుగు బంటి దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. జవాసాల్లోకి చొచ్చుకు వస్తున్న వన్య మృగాలను వేటాడి చంపుతుండడంతో వాటి సంఖ్య తగ్గుతోంది. ఇర్ కట్క్స్ ప్రాంతంలోని నాలుగు గ్రామాల్లో 1968 నుంచి 270 ఎలుగుబంట్లను చంపినట్టు రికార్డులు చెబుతున్నాయి. -
మహిళా ఏఎస్ఐ గొలుసునే తెంపేశారు
కోల్‌కతా: గొలుసు దొంగల ఆగడాలకు హద్దూ అదుపు లేకుండా పోతోంది. ఈ చైన్ స్నాచర్లు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. మమతా బెనర్జీ లాంటి ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రులున్న కోల్‌కతాలో కూడా రెచ్చిపోతున్నారు. సామాన్య మహిళలతో పాటూ, మహిళా పోలీసులను టార్గెట్ చేశారు. ఏకంగా ఓ మహిళా ఏఎస్ఐ గొలుసునే తెంపుకెళ్లిపోయారు. కోల్‌కతాలోని తిల్జాలా పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళా ఏఎస్ఐ నిర్మలారాయ్ విధులు నిర్వర్తించుకుని ఇంటికి తిరిగెళ్తున్న సమయంలో బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లారు. పిక్నిక్ గార్డెన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కచ్చితంగా ఎవరో స్థానికులే చేసి ఉంటారని నిర్మల తెలిపారు. వారిని త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు. లాల్ బజార్ నేర పరిశోధక విభాగం దీనిపై దృష్టి పెట్టింది. పాత నేరస్తుల వివరాలను సేకరిస్తున్నామని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదిస్తామని తెలిపారు. బైక్ వివరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. -
వ్యక్తిని పరుగులు పెట్టించిన భారీ ఏనుగు
-
రేసులకు పాల్పడ్డ బైకర్స్ అరెస్ట్
-
బైక్ రేసింగ్‌లు.. 80మంది అరెస్ట్
-
బైకర్లూ ఖబడ్దార్!
సాక్షి, న్యూఢిల్లీ: షబ్ ఏ బారాత్‌ను పురస్కరించుకుని శుక్ర వారం నగర రోడ్లపై స్వైరవిహారం చేసే బైకర్లను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ గురువారం తీవ్రంగా హెచ్చరించారు. యువత బాధ్యతా రహితంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తుందని అన్నారు. ప్రతి ఏడాది షబ్ ఏ బారాత్ సందర్భంగా బైకర్లు శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు శ్రుతి మించుతుండడం తో, యువతను అదుపులో పెట్టాలని జంగ్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. షబ్ ఏ బారాత్‌ను పురస్కరించుకుని శాంతి భద్రతలకు, ట్రాఫిక్‌కు ఎలాంటి సమస్య సృష్టించరాదని నజీబ్ జంగ్ యువతను కోరారు. సమస్యలు సృష్టించే వారెవరైనా వయస్సుతో నిమిత్తం లేకుండా కఠిన చర్య చేపట్టవలసిందిగా పోలీసులను ఆదేశించారు. షబ్ ఏ బారాత్ ప్రార్థనలతో గడపాల్సిన రోజని, మృతులకు నివాళులు సమర్పించాల్సిన రోజని నజీబ్ జంగ్ తెలిపారు. ఇదిలా ఉండగా, బైకర్లను అదుపులో పెట్టడం కోసం పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. బైకర్లు శాంతి భద్రతలకు అంతరాయం సృష్టించకుండా ఉండడం కోసం పలుచోట్ల బారికేడ్లు అమర్చారు. గత సంవత్సరం షబ్ ఏ బారాత్ సందర్భంగా వందల మంది యువకులు మోటారుబైకులపై రాత్రి వేళ రోడ్లపైకి, ముఖ్యంగా ఇండియా గేట్ వద్దకు వచ్చి ఫీట్లు చేస్తూ, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. వారి అల్లరిచేష్టలు తెల్లవారుఝామువరకు కొనసాగాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈ సంవత్సరం వారిని అదుపులో పెట్టాలని నిర్ణయించారు. ఐటీఓ వద్ద బహదూర్షా మార్గ్ నుంచే బారికేడ్లను అమర్చి బైకర్లు గుంపులు గుంపులుగా ఇండియా గేట్ సి హెక్సాగన్ వద్దకు చేరుకోకుండా చూడాలని నిర్ణయించారు. శుక్రవారం రాత్రి బారికేడ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులను కూడా మోహరిస్తామని, సరైన పత్రాలు కలిగి హెల్మెట్లు ధరించిన బైకర్లను మాత్రమే బారికేడ్లు దాటి వెళ్లేందుకు అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. పాత ఢిల్లీ ప్రాంతంలో మత పెద్దలతో కూడా ఈ విషయమై మాట్లాడి వారిని జాగరూకులను చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారులు బీట్ కానిస్టేబుళ్లను ఆదేశిం చారు.