Bajaj Dominar Updated Version Released In India - Sakshi
Sakshi News home page

బైకర్స్‌కి శుభవార్త ! మార్కెట్‌లో బజాజ్‌ డొమినార్‌ 400 అప్‌డేట్‌ వెర్షన్‌

Published Tue, Oct 26 2021 8:25 AM | Last Updated on Tue, Oct 26 2021 1:37 PM

Bajaj Dominar Updated Version Released In India - Sakshi

ముంబై: లాంగ్‌రైడ్‌కి వెళ్లే  బైకర్లకి, మోటోవ్లాగర్లకి శుభవార్త ! దేశీయంగా స్పోర్ట్స్‌ బైక్‌లలో ప్రత్యేక ఫ్యాన్‌ బేస్‌ కలిగిన డోమినార్‌ నుంచి మరో కొత్త వెర్షన్‌ వచ్చింది. బజాజ్‌ ఆటో తన ‘‘బజాజ్‌ డొమినార్‌ 400’’ మోడల్‌ అప్‌డేట్‌ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్‌ షోరూం ధర రూ.2.16 లక్షలుగా ఉంది. ఇందులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్‌ టూరింగ్‌ యాక్ససరీసులతో పాటు టూరింగ్‌ రైడర్లకు కావల్సిన కనీస భద్రతా ఫీచర్లులున్నాయి. 

బీఎస్‌ 6 ప్రమాణాలతో
బీఎస్‌ 6 ప్రమాణాలు కలిగిన 373.3 సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 40 పీఎస్‌ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయగలదు. ‘‘ద్వి చక్ర వాహన విభాగంలో డొమినార్‌ 400 తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. సుధీర్ఘ ప్రయాణాలను చేసే రైడర్లకి ఇప్పుడిది మొదటి ఎంపికగా మారింది’’ బజాజ్‌ ఆటో మార్కెటింగ్‌ హెడ్‌ నారాయణన్‌ తెలిపారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement