updated version
-
సెబీ నుంచి అప్డేటెడ్ మొబైల్ యాప్ సారథి2.0
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పర్సనల్ ఫైనాన్స్‌పై విస్తృత సమాచారంతో సారథి2.0(Saarthi2.0) మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. ఇన్వెస్టర్లకు ఉద్దేశించిన ఈ యాప్‌లో సమీకృత టూల్స్‌కు చోటు కలి్పంచింది. సంక్లిష్టమైన ఫైనాన్షియల్ కాన్సెప్్ట్సను సరళతరం చేయడమే లక్ష్యంగా అప్డేటెడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టినట్లు సెబీ పేర్కొంది. వినియోగదారులకు సులభరీతిలో అర్ధమయ్యే విధంగా సమాచారాన్ని క్రోడీకరించినట్లు తెలియజేసింది. యాప్‌లో ఫైనాన్షియల్ కాల్క్యులేటర్లు, కేవైసీ విధానాలు వివరించే మాడ్యూల్స్, ఎంఎఫ్‌లు, ఈటీఎఫ్లతోపాటు స్టాక్ ఎక్సే్ఛంజీలలో షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు, ఇన్వెస్టర్ల సమస్యల పరిష్కార విధానాలు తదితర పలు అంశాలను చేర్చినట్లు వివరించింది. -
స్పోర్టియస్ట్ డిజైన్‌తో హ్యుందాయ్ సొనాటా సరికొత్తగా
సాక్షి,ముంబై: ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ సరికొత్త హ్యుందాయ్ సొనాటాకారును ఆవిష్కరించింది. లాంచ్ చేసింది. మిడ్ సెగ్మెంట్లో 8వ జెనరేషన్ సొనాటాను కొత్త బ్యాడ్జ్, లాంగ్ హుడ్, ఫ్రంట్-ఎండ్ లేఅవుట్‌తో స్పోర్టియస్ట్ డిజైన్‌తో పరిచయం చేసింది. స్పోర్ట్, స్టాండర్డ్ , N లైన్ వేరియంట్లలో మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. హ్యుందాయ్ సొనాటా వెర్నా, కోనా ఎలక్ట్రిక్, స్టారియా పోలిన స్టయిల్‌తోపాటు, డ్రైవర్-సెంట్రిక్ ఇంటీరియర్ లేఅవుట్‌తో ఆల్ న్యూ హ్యుందాయ్సొనాటా రానుంది. ముఖ్యంగా హ్యుందాయ్ మోడల్లో తొలిసారిగా సొనాటా డ్రైవర్ ఇన్ఫర్మేషన్ క్లస్టర్లు, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో కర్వ్డ్ డిస్ప్లేను జోడించింది. సిగ్నేచర్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ బార్, రియర్ ఎల్ఈడీ టెయిల్‌లైట్ స్ట్రిప్, బ్లాక్ బార్, మధ్యలో హ్యుందాయ్ లోగో, డిఫరెంట్ గ్రిల్‌తో దీన్ని అప్డేట్ చేసింది. అలాగే స్పోర్టియర్ ఎక్స్టీరియర్ ఇమేజ్‌తో ఆధునిక జీవనశైలికి మద్దతుగా భవిష్యత్ మొబిలిటీ సెన్సిబిలిటీతో దీన్ని తీర్చిదిద్దింది. 12.3 ఇంచ్ ట్విన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫుల్లీ ఎక్స్టెండెడ్ ఎయిర్ వెంట్స్, న్యూ సెంట్రల్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, న్యూ 3 స్పోక్ స్టీరింగ్ వీల్ మార్పులు కూడా చేసింది. ఇంజీన్ 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 2.5 లీటర్ టర్బో ఇంజిన్ ఆప్షన్స్ తో ఇది రానుంది. అలాగే ఎన్ లైన్లో మరొకటి వస్తోంది. ఈ ఇంజీన్ 285హెచ్‌పీ పవర్, 422 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. మార్చి 30నుంచి ఏప్రిల్ 9 వరకు జరగనున్న 2023 సియోల్ మొబిలిటీ షోలో దీన్ని ఆవిష్కరించనుంది. #Hyundai #SONATA inherits the identity of the 4-door coupe with Absolute Sportiness. And its futuristic and progressive interior is completed with our new technology, Panoramic Curved Display. On March 30th, #ThenewSONATA will be fully unveiled.#HyundaiDesign #SONATADesign pic.twitter.com/1r91CvNBIQ — Hyundai Motor Group (@HMGnewsroom) March 26, 2023 -
200 కోట్ల యూజర్లకు పెను ప్రమాదం..! గూగుల్ హెచ్చరిక..!
Google Warns 2 Billion Users Of Update That Could Break Websites Worldwide: ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల క్రోమ్ యూజర్లకు పెనుప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని గూగుల్ హెచ్చరించింది. రాబోయే క్రోమ్ బ్రౌజర్ అప్డేట్ ప్రపంచవ్యాప్తంగా అనేక వెబ్సైట్లను విచ్ఛిన్నం చేసే అవకాశం ఉందని గూగుల్ యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. అంతుచక్కని సమస్య.! పరిష్కారమే లేదు..! టెక్ దిగ్గజం గూగుల్ తన క్రోమియంబగ్ ట్రాకర్ బ్లాగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. రాబోయే అనిశ్చితికి ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారమే లేకపోవచ్చునని గూగుల్ అభిప్రాయపడింది. కాగా తన వంతుగా సమస్యను పరిష్కరించేందుకు గూగుల్ ప్రయత్నాలను చేస్తోనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఏ వెబ్సైట్లకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయనే విషయం అస్పష్టంగా ఉంది. అలర్ట్‌గా ఉండడమే..! సమస్య పరిష్కారమయ్యేంత వరకు క్రోమ్ యూజర్లు ఇతర బ్రౌజర్స్‌ను వాడాలని ఫోర్బ్స్ తన నివేదికలో పేర్కొంది. క్రోమ్ యూజర్లు అలర్ట్‌గా ఉండడమే మంచిదని తెలిపింది. వచ్చే నెలలో క్రోమ్ యూజర్లకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెర్షన్స్‌తో సమస్య..! ఫోర్భ్స్ ప్రకారం...గూగుల్ క్రోమ్ వెర్షన్స్‌లో సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రోమ్ బ్రౌజర్ 96 వెర్షన్లో ఉంది. అయితే గూగుల్ మరిన్ని ఫీచర్స్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు ‘క్రోమ్ కానరీ’ బ్రౌజర్‌ను గూగుల్ టెస్ట్ చేస్తోంది. ఇది ప్రారంభ యాక్సెస్ డెవలపర్ బిల్డ్. ఇప్పుడు ఇది వెర్షన్ 99లో ఉంది. ఎప్పుడైతే బ్రౌజర్ వెర్షన్ 100కి చేరుకుంటే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ గ్లిచ్‌తో ప్రభావితమైన వెబ్సైట్లు స్పష్టంగా లోడ్ అవడం ఆగిపోతాయని ఫోర్బ్స్ పేర్కొంది. దీనికి కారణం ఈ వెబ్సైట్లు యూజర్లు సైట్‌ను సందర్శించే సమయంలో క్రోమ్ వెర్షన్‌ను తనిఖీ చేస్తాయి. అయితే ప్రోఫెషనల్ వెబ్సైట్ డిజైనర్ డూడా వంటి డిజైన్ సాఫ్ట్వేర్ మొదటి రెండు అంకెలను మాత్రమే తనిఖీ చేస్తుంది. ఈ సమయంలో క్రోమ్ బ్రౌజర్ వెర్షన్ 100కు యాక్సెస్ ఉండే అవకాశాలు తక్కువగా ఉండనున్నాయి. గూగుల్ ప్రయత్నాలు..! ఈ గ్లిచ్ ప్రభావాలను నివారించడానికి హ్యాకింగ్ వంటి ప్రక్రియలతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ ప్రయత్నాలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఆయా వెబ్సైట్లను సందర్శించేటప్పడు వెర్షన్ 100 స్థానంలో రెండంకెల వెర్షన్ పొందేలా గూగుల్ ప్రయోగాలు చేస్తోంది. చదవండి: అమెరికా టెక్ దిగ్గజాలకు చుక్కలు చూపిస్తున్న రష్యా..! -
గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక..!
గూగుల్ క్రోమ్ వాడే యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేసే ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్‌లో అధిక తీవ్రతతో కూడిన సమస్య ఉన్నట్లు గుర్తించింది. CERT-In ప్రకారం గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్లో అనేక దుర్బలత్వాలు ఉన్నాయని పేర్కొంది. వీటితో యూజర్లపై సైబర్ దాడులు సులువుగా జరిగే అవకాశం ఉందని సెర్ట్-ఇన్ వెల్లడించింది.గూగుల్ క్రోమ్ V8 టైప్ కన్ఫ్యూజన్ కారణంగా అనేక సమస్యలను ఉన్నట్లు తేలింది. దీంతో హ్యాకర్లు యూజర్ల వ్యక్తిగత డేటాకు యాక్సెస్ పొందవచ్చని, వారిని లక్ష్యంగా చేసుకొని కంప్యూటర్లో మాల్వేర్ను ఇంజెక్ట్ చేసేందుకు సులువుగా ఉంటుందని సెర్ట్-ఇన్ తెలిపింది. గూగుల్..నివారణ చర్యలు..! గూగుల్ క్రోమ్ వెబ్‌బ్రౌజర్‌లో సమస్యలు ఉన్నట్లు గూగుల్ కూడా గుర్తించింది. అందుకోసం నివారణ చర్యలను కూడా చేపట్టింది. గూగుల్ క్రోమ్ అప్డేట్డ్ వెర్షన్‌ను విడుదల చేసింది. యూజర్లు వీలైనంత త్వరగా క్రోమ్ బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. సుమారు 22 రకాల భద్రతా పరిష్కారాలను అందించినట్లు సాఫ్ట్వేర్ దిగ్గజం గూగుల్ తెలిపింది.గూగుల్ ఇటీవల ప్రకటించినట్లుగా విండోస్, మ్యాక్, లైనెక్స్ కోసం విస్తృతంగా ఉపయోగించే క్రోమ్ బ్రౌజర్ వెర్షన్‌ను 96.0.4664.93 రిలీజ్ చేసింది. మీ క్రోమ్ బ్రౌజర్‌ని ఇలా అప్డేట్ చేయండి • Google Chrome బ్రౌజర్‌ని ఒపెన్ చేయండి. • కుడి ఎగువ మూలలో, మూడు చిన్న చుక్కలపై క్లిక్ చేయండి •హెల్ఫ్‌పై క్లిక్ చేయండి. మీకు బ్రౌజర్ వెర్షన్‌ను చూపుతుంది. అప్డేట్ అప్షన్‌పై క్లిక్ చేయండి. ఇలా కాకుండా మీరు నేరుగా గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి..మై యాప్స్‌లో గూగుల్ క్రోమ్‌పై క్లిక్ చేసి అప్డేట్ అప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. చదవండి: జియో కమాల్: ప్రపంచంలోనే చీపెస్ట్ ఇంటర్నెట్ ప్యాక్.. కస్టమర్లకు పండగే! -
బైకర్స్‌కి శుభవార్త ! మార్కెట్లో బజాజ్ డొమినార్ 400 అప్డేట్ వెర్షన్
ముంబై: లాంగ్‌రైడ్‌కి వెళ్లే బైకర్లకి, మోటోవ్లాగర్లకి శుభవార్త ! దేశీయంగా స్పోర్ట్స్ బైక్‌లలో ప్రత్యేక ఫ్యాన్ బేస్ కలిగిన డోమినార్ నుంచి మరో కొత్త వెర్షన్ వచ్చింది. బజాజ్ ఆటో తన ‘‘బజాజ్ డొమినార్ 400’’ మోడల్ అప్డేట్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్ షోరూం ధర రూ.2.16 లక్షలుగా ఉంది. ఇందులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ టూరింగ్ యాక్ససరీసులతో పాటు టూరింగ్ రైడర్లకు కావల్సిన కనీస భద్రతా ఫీచర్లులున్నాయి. బీఎస్ 6 ప్రమాణాలతో బీఎస్ 6 ప్రమాణాలు కలిగిన 373.3 సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 40 పీఎస్ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయగలదు. ‘‘ద్వి చక్ర వాహన విభాగంలో డొమినార్ 400 తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. సుధీర్ఘ ప్రయాణాలను చేసే రైడర్లకి ఇప్పుడిది మొదటి ఎంపికగా మారింది’’ బజాజ్ ఆటో మార్కెటింగ్ హెడ్ నారాయణన్ తెలిపారు. -
WhatsApp: వాట్సాప్ మెసేజ్‌లకు ‘రియాక్ట్’ అవుతారా?
వాట్సాప్‌లో ఎవరైనా మెసేజ్ చేస్తే.. ఎమోజీలు, కొంచెం కష్టపడి జిఫ్ ఫైల్స్‌తో రియాక్షన్ ఇస్తుంటారు చాలామంది. 2017 నుంచి స్టిక్కర్ల వాడకం విపరీతంగా పెరిగింది. అయితే వాట్సాప్ మెసేజ్‌లకు డిఫాల్ట్‌గా రియాక్షన్లు ఇచ్చే ఆఫ్షన్ ఎలా ఉంటుంది? యస్.. త్వరలోనే ఆ ఫీచర్ రాబోతోంది. మెసేజింగ్-కాలింగ్ యాప్ వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్స్ రాబోతున్నాయి. ఇందులో భాగంగా ముందు అప్డేట్గా మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ మేరకు ఫీచర్‌కు సంబంధించిన టెస్టింగ్ స్క్రీన్ షాట్స్ కొన్నింటిని వాట్సాప్ సన్నిహిత సంస్థ వాబేటాఇన్ఫో షేర్ చేసింది. ఇక ట్విటర్, ఇన్స్టాగ్రామ్ ఇదివరకే మెసేజ్ రియాక్షన్ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానిని వాట్సాప్‌కు సైతం తేబోతున్నారు. ఇది వాట్సాప్ ఓనర్ కంపెనీ ఫేస్బుక్ రియాక్షన్ ఫీచర్ తరహాలో(ఆఫ్షన్స్) ఉండొచ్చని వాబేటాఇన్ఫో అంచనా వేస్తోంది. అతిత్వరలో ఈ ఫీచర్ రానుందని, యాప్ అప్డేట్ ద్వారా ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లు వినియోగించుకోవచ్చని వాబేటాఇన్ఫో చెబుతోంది. చదవండి: వాక్సిన్ కోసం వాట్సాప్.. ఇలా ఉపయోగించుకోండి -
పబ్జీ సరికొత్త వెర్షన్; వారి పరిస్థితేంటో..!
ప్రాణాంతక పబ్జీ గేమ్‌ను ఇష్టపడే వాళ్లకు దాని సృష్టికర్తలు శుభవార్త చెప్పారు. పబ్జీ మొబైల్ గేమ్ రెండేళ్ల సెలబ్రేషన్స్ సందర్భంగా మరో సరికొత్త అప్డేట్ వెర్షన్ తీసుకొస్తున్నట్టు తెలిపారు. తొలుత టైమ్‌పాస్ బాటిల్ గేమ్‌గా మొదలైన పబ్జీ సూపర్ సక్సెస్ కావడంతో ఇప్పటికే ఎన్నో అప్డేటెడ్ వెర్షన్లు వచ్చాయి. ఆయుధాలే ప్రధానంగా సాగే ఈ ఆటలో.. తాజా పన్నెండో వెర్షన్లో మరిన్ని నూతన ఆయుధాలను ప్రవేశపెట్టనున్నారు. బీటా వెర్షన్లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్ గేమ్ అప్డేటెడ్ వెర్షన్ 0.17.0 గా రానుంది. (చదవండి : అర్ధనగ్నంగా రోడ్డుపైకి వచ్చి గలాటా) ఇక బాటిల్ గ్రౌండ్లో శత్రువులను ఎదుర్కొనే క్రమంలో గేమర్ ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. 12 వ సీజన్లో కీలకమైన డెత్ రీప్లే అవకాశం కల్పిస్తున్నారు. శత్రువుల దాడిలో గేమర్ ఎలా చనిపోయాడో తెలుసుకునేందుకు డెత్ రీప్లే ఆప్షన్ తోడ్పడుతుంది. చేసిన పొరపాట్లేవో తెలుసుకుని, మరోసారి గేమర్ చనిపోకుండా కాపాడుకునేందుకు ఈ ఆప్షన్ సహకరిస్తుంది. ఇక పబ్జీ గేమ్‌తో మొబైల్స్‌కు అతుక్కుపోయే వారిని ఈ వెర్షన్ ఇంకెలా మారుస్తుందో మరి..! గంటల తరబడి పబ్జీలో మునిగి ప్రాణాలు కోల్పోయిన వారి గురించి, మానసిక రుగ్మతలు కొని తెచ్చుకున్న వారి గురించి తెలిసే ఉంటుంది..! (చదవండి : ప్రాణం తీసిన పబ్జీ.. యువకుడికి బ్రైయిన్ స్ట్రోక్) -
బీఎండబ్ల్యూ నుంచి అప్డేటెడ్ మినీ వెర్షన్లు
న్యూఢిల్లీ: బీఎండబ్ల్యూ తాజాగా మినీ హ్యాచ్, మినీ కన్వర్టబుల్లలో అప్డేటెడ్ వెర్షన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధర రూ.29.7 లక్షలు– రూ.37.1 లక్షల (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) శ్రేణిలో ఉంది. డీజిల్ ఇంజిన్ కలిగిన మినీ 3 డోర్ కూపర్ డి ధర రూ.29.7 లక్షలు. అదే ఇందులో పెట్రోల్ వెర్షన్ ధర రూ.33.2 లక్షలు. మరొకవైపు డీజిల్ ఇంజిన్ కలిగిన మినీ 5 డోర్ కూపర్ డి ధర రూ.35 లక్షలుగా, మినీ కన్వర్టబుల్ కూపర్ ఎస్ ధర రూ.37.1 లక్షలుగా ఉన్నాయి. అన్ని ధరలు ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌వి. ఈ మోడల్స్ అన్నీ మినీ డీలర్ల వద్ద కంప్లీట్ బిల్ట్–అప్ (సీబీయూ) యూనిట్ల రూపంలో జూన్ నుంచి అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలియజేసింది. -
వాట్సాప్ అప్ డేట్ చేస్కోండి
సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్.. తన యూజర్లను యాప్ అప్ డేట్ చేసుకోవాలని కోరుతోంది. మరో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు వాట్సాప్ తెలిపింది. టైమ్తోపాటు లోకేషన్ స్టికర్లను పంపుకునే వెసులుబాటను కల్పించింది. ఇంతకు ముందు యూజర్లు గూగుల్ మ్యాపింగ్ ద్వారా లోకేషన్ షేర్ చేసుకునే వారు. అయితే ఆ అవసరం లేకుండా.. ఫోటోలు, వీడియోలు పంపుకునే ఆప్షన్(స్టిక్కర్ల) ద్వారానే లోకేషన్‌ను పంచుకునే వీలు కల్పించింది. అంతేకాదు మీరు ఎక్కడున్నది టైమ్‌తో సహా షేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం యాప్‌ను అప్డేట్ చేసుకోవాలని వాట్సాప్ ఓ ప్రకటనలో సూచించింది. దీనివల్ల యూజర్లకు చాలా సమయం కలిసొస్తుందని సంస్థ పేర్కొంది. కాగా, కొద్ది రోజుల క్రితమే పేమెంట్స్ సౌకర్యాన్ని కూడా వాట్సాప్ కల్పించిన విషయం తెలిసిందే. -
భీమ్ యాప్ తెలుగులో..
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులకు ఉపయోగపడే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (భీమ్) యాప్‌నకు సంబంధించి అప్డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) వెల్లడించింది. అప్డేటెడ్ వెర్షన్ 1.2లో కొత్తగా తెలుగు, తమిళం, కన్నడం సహా ఏడు ప్రాంతీయ భాషలు కూడా చేర్చినట్లు పేర్కొంది. ఇప్పటిదాకా ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే ఇది లభిస్తోంది. డిసెంబర్ 30న ప్రవేశపెట్టినప్పట్నుంచీ భీమ్ యాప్‌నకు ఇది రెండో అప్డేట్. లబ్ధిదారు బ్యాంక్ ఖాతాతో అనుసంధానించిన ఆధార్ నంబరుకు నగదు బదిలీ చేసే విధంగా పే టు ఆధార్ నంబర్ ఫీచర్‌ను ఇందులో చేరుస్తున్నట్లు ఎన్పీసీఐ పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల నిబంధనలపై కసరత్తు వినియోగదారుల వివరాల భద్రతకు ప్రాధాన్యమిస్తూ.. డిజిటల్ చెల్లింపు లావాదేవీలను సురక్షితం చేసే దిశగా మార్గదర్శకాల రూపకల్పనపై కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో వర్తకులనూ భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులకు సంబంధించి నిర్దిష్ట మార్గదర్శకాలు గానీ నియంత్రణ వ్యవస్థ గానీ లేదు. పెద్ద నోట్ల రద్దుతో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెర గడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. -
హోండా కార్స్ నుంచి అప్డేటెడ్ బ్రియో
ప్రారంభ ధర రూ.4.69 లక్షలు న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా తాజాగా తన హ్యాచ్‌బ్యాక్ బ్రియోలో కొత్త అప్డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.4.69-రూ.6.81 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఇది ఈ ఎంటీ, ఎస్ ఎంటీ, వీఎక్స్ ఎంటీ, వీఎక్స్ ఏటీ అనే నాలుగు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ప్రత్యేకతలు.. కంపెనీ తాజా అప్డేటెడ్ బ్రియోలో పలు కొత్త ఫీచర్లను పొందుపరిచింది. ఇందులో ప్రధానంగా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 5 స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, స్పోర్టీ ఎక్స్టీరియర్స్, ప్రీమియం ఇంటీరియర్స్, సరికొత్త ఇన్స్ట్రూమెంట్ ప్యానెల్, నూతన టెయిల్ ల్యాంప్, అడ్వాన్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఏబీఎస్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, డిజిటల్ ఏసీ కంట్రోల్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ వివరించింది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్లు వరుసగా లీటరుకు 18.5 కిలోమీటర్లు, 16.5 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తాయని పేర్కొంది. నూతన బ్రియో ఒక ఆల్‌రౌండర్ హోండా ఇంజినీరింగ్ నైపుణ్యాలకు, తయారీ విలువలకు బ్రియో నిదర్శనంగా నిలిచిందని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో యొచిరొ యుఎనొ తెలిపారు. ‘బ్రియో ఒక ఆల్‌రౌండర్ లాంటిది. విశాలవంతంగా, సౌకర్యవంతంగా, చూడటానికి చక్కగా ఉంటుంది. అలాగే మైలేజ్, ఇంజిన్, పనితీరు.. ఇలా ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న కూడా బ్రియోతో కస్టమర్ సంతృప్తిపడతాడు’ అని పేర్కొన్నారు. కాగా కంపెనీ బ్రియోను 2011లో మార్కెట్లోకి తెచ్చింది. -
బీఎండబ్ల్యూ ‘520 ఎం స్పోర్ట్’ అప్డేటెడ్ వెర్షన్..
ధర రూ.54 లక్షలు న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తాజాగా తన ప్రీమి యం సెడాన్ ‘520 ఎం స్పోర్ట్’లో అప్డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.54 లక్షలు. కంపెనీ ఈ మోడల్‌ను చెన్నైలోని ప్లాంట్‌లో అసెంబ్లింగ్ చేసింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న బీఎండబ్ల్యూ డీలర్షిప్స్ వద్ద వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ , 2.0 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చామని పేర్కొంది. ‘520 ఎం స్పోర్ట్’ కేవలం 7.7 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని, ఇక కారు టాప్ స్పీడ్ గంటకు 233 కిలోమీటర్లని వివరించింది. -
జనరల్ మోటార్స్ ఎంజాయ్.. కొత్త వేరియంట్
ధరలు రూ.6.24-8.79 లక్షల రేంజ్లో న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్ కంపెనీ మల్టీ పర్పస్ వెహికల్ ఎంజాయ్‌లో అప్డేటెడ్ వెర్షన్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ వేరియంట్ ధరలను రూ.6.24 లక్షల నుంచి రూ.8.79 లక్షల(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్లో నిర్ణయించామని జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ అరవింద్ సక్సేనా చెప్పారు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, డోర్ ఆర్మ్‌రెస్ట్‌లపై గ్లాసీ బ్లాక్ ఫినిష్ వంటి వివిధ ఫీచర్లతో ఈ వేరియంట్లను రూపొందించామని వివరించారు. -
టాటా సఫారి స్టార్మ్‌లో కొత్త వేరియంట్
ధరలు రూ.9.99 లక్షల నుంచి... న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) సఫారి స్టార్మ్‌లో అప్డేటెడ్ వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్ ధరలు రూ.9.99 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. టాటా మోటార్స్ హొరైజన్ నెక్స్ట్వ్యూహాంలో భాగంగా ఈ కొత్త సఫారి స్టార్మ్‌ను అందిస్తున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) గిరీష్ వాఘ్ చెప్పారు. ఈ కొత్త సఫారి స్టార్మ్‌లో ఎక్స్టీరియర్స్ను, ఇంటీరియర్స్‌ను కొత్తగా డిజైన్ చేశామని, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, డ్యుయల్ ఎయిర్-కండీషనింగ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లున్నాయని వివరించారు. 1998లోనే సఫారి ఎస్‌యూవీని మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటివరకూ 1.2 లక్షల యూనిట్లను విక్రయించామని పేర్కొన్నారు.