బీఎండబ్ల్యూ ‘520 ఎం స్పోర్ట్’ అప్‌డేటెడ్ వెర్షన్.. | BMW launches 520d M Sport in India; priced at Rs 54 lakh : Latest Auto News, News | Sakshi

బీఎండబ్ల్యూ ‘520 ఎం స్పోర్ట్’ అప్‌డేటెడ్ వెర్షన్..

Aug 3 2016 1:23 AM | Updated on Sep 4 2017 7:30 AM

బీఎండబ్ల్యూ ‘520 ఎం స్పోర్ట్’ అప్‌డేటెడ్ వెర్షన్..

బీఎండబ్ల్యూ ‘520 ఎం స్పోర్ట్’ అప్‌డేటెడ్ వెర్షన్..

జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తాజాగా తన ప్రీమి యం సెడాన్ ‘520 ఎం స్పోర్ట్’లో అప్‌డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

ధర రూ.54 లక్షలు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తాజాగా తన ప్రీమి యం సెడాన్ ‘520 ఎం స్పోర్ట్’లో అప్‌డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.54 లక్షలు. కంపెనీ ఈ మోడల్‌ను చెన్నైలోని ప్లాంట్‌లో అసెంబ్లింగ్ చేసింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న బీఎండబ్ల్యూ డీలర్‌షిప్స్ వద్ద వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ , 2.0 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చామని పేర్కొంది. ‘520 ఎం స్పోర్ట్’ కేవలం 7.7 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని, ఇక కారు టాప్ స్పీడ్ గంటకు 233 కిలోమీటర్లని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement