బీఎండబ్ల్యూ నుంచి  అప్‌డేటెడ్‌ మినీ వెర్షన్లు | Updated mini versions from BMW | Sakshi
Sakshi News home page

బీఎండబ్ల్యూ నుంచి  అప్‌డేటెడ్‌ మినీ వెర్షన్లు

Published Fri, May 25 2018 1:14 AM | Last Updated on Fri, May 25 2018 1:14 AM

Updated mini versions from BMW - Sakshi

న్యూఢిల్లీ: బీఎండబ్ల్యూ తాజాగా మినీ హ్యాచ్, మినీ కన్వర్టబుల్‌లలో అప్‌డేటెడ్‌ వెర్షన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధర రూ.29.7 లక్షలు– రూ.37.1 లక్షల (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) శ్రేణిలో ఉంది. డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన మినీ 3 డోర్‌ కూపర్‌ డి ధర రూ.29.7 లక్షలు. అదే ఇందులో పెట్రోల్‌ వెర్షన్‌ ధర రూ.33.2 లక్షలు. 

మరొకవైపు డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన మినీ 5 డోర్‌ కూపర్‌ డి ధర రూ.35 లక్షలుగా, మినీ కన్వర్టబుల్‌ కూపర్‌ ఎస్‌ ధర రూ.37.1 లక్షలుగా ఉన్నాయి. అన్ని ధరలు ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌వి. ఈ మోడల్స్‌ అన్నీ మినీ డీలర్ల వద్ద కంప్లీట్‌ బిల్ట్‌–అప్‌ (సీబీయూ) యూనిట్ల రూపంలో జూన్‌ నుంచి అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలియజేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement