వాట్సాప్‌లో ఎవరైనా మెసేజ్ చేస్తే.. ఎమోజీలు, కొంచెం కష్టపడి జిఫ్ ఫైల్స్‌తో రియాక్షన్ ఇస్తుంటారు చాలామంది. 2017 నుంచి స్టిక్కర్ల వాడకం విపరీతంగా పెరిగింది. అయితే వాట్సాప్ మెసేజ్‌లకు డిఫాల్ట్‌గా రియాక్షన్లు ఇచ్చే ఆఫ్షన్ ఎలా ఉంటుంది? యస్.. త్వరలోనే ఆ ఫీచర్ రాబోతోంది.
మెసేజింగ్-కాలింగ్ యాప్ వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్స్ రాబోతున్నాయి. ఇందులో భాగంగా ముందు అప్‌డేట్‌గా మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ మేరకు ఫీచర్‌కు సంబంధించిన టెస్టింగ్ స్క్రీన్ షాట్స్ కొన్నింటిని వాట్సాప్ సన్నిహిత సంస్థ వాబేటాఇన్ఫో షేర్ చేసింది.
ఇక ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ ఇదివరకే మెసేజ్ రియాక్షన్ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానిని వాట్సాప్‌కు సైతం తేబోతున్నారు. ఇది వాట్సాప్ ఓనర్ కంపెనీ ఫేస్‌బుక్ రియాక్షన్ ఫీచర్ తరహాలో(ఆఫ్షన్స్) ఉండొచ్చని వాబేటాఇన్ఫో అంచనా వేస్తోంది. అతిత్వరలో ఈ ఫీచర్ రానుందని, యాప్ అప్‌డేట్ ద్వారా ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లు వినియోగించుకోవచ్చని వాబేటాఇన్ఫో చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment