న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పర్సనల్ ఫైనాన్స్‌పై విస్తృత సమాచారంతో సారథి2.0(Saarthi2.0) మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. ఇన్వెస్టర్లకు ఉద్దేశించిన ఈ యాప్‌లో సమీకృత టూల్స్‌కు చోటు కలి్పంచింది. సంక్లిష్టమైన ఫైనాన్షియల్ కాన్సెప్‌్ట్సను సరళతరం చేయడమే లక్ష్యంగా అప్‌డేటెడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టినట్లు సెబీ పేర్కొంది.
వినియోగదారులకు సులభరీతిలో అర్ధమయ్యే విధంగా సమాచారాన్ని క్రోడీకరించినట్లు తెలియజేసింది. యాప్‌లో ఫైనాన్షియల్ కాల్‌క్యులేటర్లు, కేవైసీ విధానాలు వివరించే మాడ్యూల్స్, ఎంఎఫ్‌లు, ఈటీఎఫ్‌లతోపాటు స్టాక్ ఎక్సే్ఛంజీలలో షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు, ఇన్వెస్టర్ల సమస్యల పరిష్కార విధానాలు తదితర పలు అంశాలను చేర్చినట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment