sarathi
-
సెబీ నుంచి అప్డేటెడ్ మొబైల్ యాప్ సారథి2.0
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పర్సనల్ ఫైనాన్స్‌పై విస్తృత సమాచారంతో సారథి2.0(Saarthi2.0) మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. ఇన్వెస్టర్లకు ఉద్దేశించిన ఈ యాప్‌లో సమీకృత టూల్స్‌కు చోటు కలి్పంచింది. సంక్లిష్టమైన ఫైనాన్షియల్ కాన్సెప్్ట్సను సరళతరం చేయడమే లక్ష్యంగా అప్డేటెడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టినట్లు సెబీ పేర్కొంది. వినియోగదారులకు సులభరీతిలో అర్ధమయ్యే విధంగా సమాచారాన్ని క్రోడీకరించినట్లు తెలియజేసింది. యాప్‌లో ఫైనాన్షియల్ కాల్క్యులేటర్లు, కేవైసీ విధానాలు వివరించే మాడ్యూల్స్, ఎంఎఫ్‌లు, ఈటీఎఫ్లతోపాటు స్టాక్ ఎక్సే్ఛంజీలలో షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు, ఇన్వెస్టర్ల సమస్యల పరిష్కార విధానాలు తదితర పలు అంశాలను చేర్చినట్లు వివరించింది. -
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు సారథి(83) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణావార్తలో టాలీవుడ్లో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి పలువురు తెలుగు సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: విడాకులపై ప్రశ్న.. తొలిసారి ఘాటూగా స్పందించిన చై కాగా హాస్య నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన దాదాపు 372పైగా చిత్రాల్లో నటించారు. అందులో సీతారామ కళ్యాణం, పరమానందయ్య శిష్యుల కథ, భక్త కన్నప్ప, జగన్మోహిని, మన ఊరి పాండవులు, డ్రైవర్ రాముడు వంటి మరెన్నో చిత్రాలతో గుర్తింపు పొందారు. అంతేకాదు తెలుగు చిత్రపరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా ఉన్నారు. చదవండి: పొన్నియన్ సెల్వన్ నుంచి ఫస్ట్‌సాంగ్ అవుట్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్ అంతే కాదు సారధి గారు విజయవంతమైన చిత్రాల నిర్మాత కూడా! ధర్మాత్ముడు ,అగ్గిరాజు,శ్రీరామచంద్రుడు చిత్రాలను నిర్మించారు. నవతా కృష్ణంరాజు గారు నిర్మించిన జమిందార్ గారి అమ్మాయి, పంతులమ్మ,అమెరికా అమ్మాయి, ఇంటింటి రామాయణం, ఓఇంటి భాగోతం చిత్రాల మ్యూజిక్ సిట్టింగ్స్ అన్ని సారధి గారే చూశారు. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో ఉన్న సాన్నిహిత్యంతో గోపికృష్ణ బ్యానర్లో నిర్మించిన చిత్రాలకు ఆయన సాంకేతికంగా చూసుకునేవారు. చిత్రపురి కాలనీ నిర్మాణంలో సారథి గారు కీలక పాత్ర పోషించారు. -
కేంద్రం చంద్రబాబును దొంగలా చూస్తోంది
-
హోదాపై ఇంకా మభ్యపెట్టొద్దు
బోళ్లపాడు(ఉయ్యూరు): సిగ్గు, లజ్జ లేకుండా ఇంకా హోదాపై రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబునాయుడు మభ్యపెడుతున్నారని వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కొలుసు పార్థసార«థి ధ్వజమెత్తారు. గ్రామంలో గడపగడపకూ వైఎస్సార్ శుక్రవారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజాబ్యాలెట్ అందించి చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను వివరించి ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. వైఎస్సార్ సర్కిల్లో జరిగిన బహిరంగ సభలో పార్థసారధి మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మభ్యపెట్టి ఐదు కోట్ల మంది నోట్లో మట్టికొడుతున్నారని ఆరోపించారు. కృష్ణా, గోదావరి పుష్కరాల పేరుతో రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. పుష్కరాల సందర్భంగా ప్రార్థనా మందిరాలను కూల్చడం తప్ప ఆయన చేసిందేమీ లేదని ఎద్దేవ చేశారు. తెలుగు ప్రజలు దైవంగా భావించే వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చిన నీతిమాలిన వ్యక్తి సీఎం అన్నారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్నమైన వ్యక్తి చంద్రబాబని ఓ సర్వే సంస్థ నిజాన్ని బట్టబయలుచేసిందని వివరించారు. చంద్రబాబు శనివారం హోదా కోసం చేపట్టే బంద్‌కు సహకరించి తన నిజాయితీని చాటుకోవాలని సవాల్ విసిరారు. పవన్‌కల్యాణే కాదు ఏ ఒక్కరు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించినా వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తోందని చెప్పారు. కరువు.. చంద్రబాబు కవలలు..! కరువు, చంద్రబాబు కవలలని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక రైతులకు మద్దతు ధర కరువైందన్నారు. పులిచింతల, పోలవరం ప్రాజెక్టులను పక్కనపెట్టి పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టి డెల్టా, రాయలసీమ ప్రాంతాలకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 24 పంప్ సెట్లు ఎందుకు ప్రారంభించలేదో రైతులకు సమాధానం చెప్పాలని కోరారు. మొత్తం పంపు సెట్లు పనిచేస్తే 40 కిలోమీటర్ల పొడవు కాలువ కట్టలు ముక్కలుచెక్కలుగా తెగిపోతాయని సీఎంకు ముందే తెలుసని వివరించారు. సభలో ఎంపీపీ తుమ్మూరు గంగారత్నం, పెనమలూరు పరిశీలకురాలు కైలా జ్ఞానమణి, తుమ్మల చారిట్రబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ పాల్గొన్నారు.