హోదాపై ఇంకా మభ్యపెట్టొద్దు
హోదాపై ఇంకా మభ్యపెట్టొద్దు
Published Fri, Sep 9 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
బోళ్లపాడు(ఉయ్యూరు):
సిగ్గు, లజ్జ లేకుండా ఇంకా హోదాపై రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబునాయుడు మభ్యపెడుతున్నారని వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కొలుసు పార్థసార«థి ధ్వజమెత్తారు. గ్రామంలో గడపగడపకూ వైఎస్సార్ శుక్రవారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజాబ్యాలెట్ అందించి చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను వివరించి ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. వైఎస్సార్ సర్కిల్‌లో జరిగిన బహిరంగ సభలో పార్థసారధి మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మభ్యపెట్టి ఐదు కోట్ల మంది నోట్లో మట్టికొడుతున్నారని ఆరోపించారు. కృష్ణా, గోదావరి పుష్కరాల పేరుతో రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. పుష్కరాల సందర్భంగా ప్రార్థనా మందిరాలను కూల్చడం తప్ప ఆయన చేసిందేమీ లేదని ఎద్దేవ చేశారు. తెలుగు ప్రజలు దైవంగా భావించే వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చిన నీతిమాలిన వ్యక్తి సీఎం అన్నారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్నమైన వ్యక్తి చంద్రబాబని ఓ సర్వే సంస్థ నిజాన్ని బట్టబయలుచేసిందని వివరించారు. చంద్రబాబు శనివారం హోదా కోసం చేపట్టే బంద్‌కు సహకరించి తన నిజాయితీని చాటుకోవాలని సవాల్ విసిరారు. పవన్‌కల్యాణే కాదు ఏ ఒక్కరు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించినా వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తోందని చెప్పారు.
కరువు.. చంద్రబాబు కవలలు..!
కరువు, చంద్రబాబు కవలలని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక రైతులకు మద్దతు ధర కరువైందన్నారు. పులిచింతల, పోలవరం ప్రాజెక్టులను పక్కనపెట్టి పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టి డెల్టా, రాయలసీమ ప్రాంతాలకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 24 పంప్ సెట్లు ఎందుకు ప్రారంభించలేదో రైతులకు సమాధానం చెప్పాలని కోరారు. మొత్తం పంపు సెట్లు పనిచేస్తే 40 కిలోమీటర్ల పొడవు కాలువ కట్టలు ముక్కలుచెక్కలుగా తెగిపోతాయని సీఎంకు ముందే తెలుసని వివరించారు. సభలో ఎంపీపీ తుమ్మూరు గంగారత్నం, పెనమలూరు పరిశీలకురాలు కైలా జ్ఞానమణి, తుమ్మల చారిట్రబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement