సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్.. తన యూజర్లను యాప్ అప్ డేట్ చేసుకోవాలని కోరుతోంది. మరో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు వాట్సాప్ తెలిపింది. టైమ్‌తోపాటు లోకేషన్ స్టికర్లను పంపుకునే వెసులుబాటను కల్పించింది.
ఇంతకు ముందు యూజర్లు గూగుల్ మ్యాపింగ్ ద్వారా లోకేషన్ షేర్ చేసుకునే వారు. అయితే ఆ అవసరం లేకుండా.. ఫోటోలు, వీడియోలు పంపుకునే ఆప్షన్(స్టిక్కర్ల) ద్వారానే లోకేషన్‌ను పంచుకునే వీలు కల్పించింది. అంతేకాదు మీరు ఎక్కడున్నది టైమ్‌తో సహా షేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని వాట్సాప్ ఓ ప్రకటనలో సూచించింది.
దీనివల్ల యూజర్లకు చాలా సమయం కలిసొస్తుందని సంస్థ పేర్కొంది. కాగా, కొద్ది రోజుల క్రితమే పేమెంట్స్ సౌకర్యాన్ని కూడా వాట్సాప్ కల్పించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment