locations
-
అడవుల్లో రాజమౌళి హంటింగ్.. ఆ సినిమా కోసమేనా?
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం వేకేషన్లో చిల్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్యాప్ ఎక్కువగా రావడంతో ఆఫ్రికాలో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం కెన్యాలోని అడవుల్లో వన్య ప్రాణలను చూస్తూ సేద తీరుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ప్రాంతంలో సినిమా షూటింగ్ లోకేషన్స్ కోసమే రాజమౌళి వెళ్లినట్లు తెలుస్తోంది. అడవుల్లో తిరుగుతున్న ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు దర్శకధీరుడు. (ఇది చదవండి: ఆ సమయంలో అవార్డ్ తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది: మెగాస్టార్)మరోవైపు ప్రిన్స్ మహేశ్‌బాబుతో తన తదుపరి చిత్రం తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమైంది. ఈ సినిమాను ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో రూపొందించనున్నారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్ అడ్వెంచరస్ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో కథ ఉంటుందని ఇప్పటికే హింట్ కూడా ఇచ్చారు. అందువల్లే ఆఫ్రికాలోని దట్టమైన అడవుల లోకేషన్స్ కోసమే రాజమౌళి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాదిలో ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. #TFNReels: Maverick Director @ssrajamouli is currently scouting locations in Kenya, Africa for #SSMB29!!🌎🔥#MaheshBabu #SSRajamouli #TeluguFilmNagar pic.twitter.com/ABq6DxfVOg— Telugu FilmNagar (@telugufilmnagar) October 29, 2024 View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) -
Google: గూగుల్ కీలక నిర్ణయం
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు సమాచారం గోపత్య విషయంలో కీలక ప్రకటన చేసింది. గూగుల్ వినియోగదారులు అబార్షన్ క్లినిక్‌లు, గృహ హింస షెల్టర్స్, ప్రైవసీ కోరుకునే ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు వారి లోకేషన్ హిస్టరీనీ తొలగిస్తామని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రదేశాల్లో ఎవరైనా వినియోగదారులు సందర్శించినట్టు తమ సిస్టమ్స్ గుర్తిస్తే వెంటను ఆ ఎంట్రీలను తొలగిస్తామని గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెన్ ఫిట్జ్‌పాట్రిక్ వెల్లడించారు. రాబోయే కొన్ని వారాల్లో ఇది అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇక.. సంతానోత్పత్తి కేంద్రాలు, పలు వ్యసనాల్లో కౌన్సెలింగ్ కేంద్రాలకు సంబంధించి చికిత్స తీసుకునే ప్రదేశాలు, బరువు తగ్గించే క్లినిక్స్‌కు వెళ్లిన డేటాను కూడా సేవ్‌లో ఉండదని ఆయన తెలిపారు. అయితే, అగ్రరాజ్యం అమెరికాలో అబార్షన్‌కు రాజ్యాంగ రక్షణ కల్పించే చట్టాన్ని అమెరికా సుప్రీం కోర్టు రద్దు చేసిన తర్వాత గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, మే నెలలో డెమోక్రటిక్ చట్టసభ సభ్యుల బృందం గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్(సీఈవో) సుందర్ పిచాయ్‌కు లేఖ రాశారు. సంతానోత్పత్తి కేంద్రాలకు వెళ్లే వారి స్మార్ట్‌ఫోన్ లొకేషన్ డేటాను బహిర్గతం చేయకుండా నిలిపివేయాలని వారు ఆ లేఖలో కోరినట్టు సమాచారం. #abortionishealthcare More good news related to tech and abortions. Google said Friday that it would delete its users’ location history whenever they visit an abortion clinic, domestic violence shelter or other similarly-sensitive…https://t.co/kLFFTLsVMZ https://t.co/ipM5X5gN5c — Regina Phelps 🇺🇦 (@ReginaPhelps) July 1, 2022 -
అద్భుతమైన షూటింగ్ స్పాట్లు.. అవి ఎక్కడ ఉన్నాయంటే?
తెనాలి(గుంటూరు జిల్లా): హొయలొలికే కృష్ణానదీ పరవళ్లు.. అబ్బురపరిచే ‘సంద్రమా’శ్చర్యాలు.. ఒంపుసొంపులతో కట్టిపడేసే సాగర్ కాలువలు.. మడమ తిప్పనియ్యని మడ అడవులు.. అద్భుత శిల్పకళతో అలరారే చారిత్రక ఆలయాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..ఎన్నెన్నో సుమనోహర ప్రాంతాలు ఉమ్మడి గుంటూరు జిల్లా సొంతం. ప్రకృతి రమణీయతకు ఈ జిల్లా పెట్టింది పేరు. సినిమా షూటింగ్‌లకు అనువైన వేదిక. అందుకే గతంలో ఎందరో సినీప్రముఖులు తమ చిత్రాలను ఈ ప్రాంతంలో చిత్రీకరించి తరించారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతోపాటు పర్యాటక సొగసులద్దుకున్న లొకేషన్లు సినీ పరిశ్రమకు సుహాసినీ సుమాలతో ఆహ్వానం పలుకుతున్నాయి. ఫలితంగా షూటింగ్‌లు మరింత విస్తృతమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన తెలుగు సినిమా రాష్ట్ర విభజన అనంతరం అక్కడే కార్యకలాపాలు సాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోనూ సినిమాల చిత్రీకరణను ప్రోత్సహిస్తోంది. లోకేషన్లలో ఉచితంగా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడమే కాక రాయితీలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మన రాష్ట్రంలోనూ సినిమా షూటింగులు విస్తృతమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులకు గుంటూరు జిల్లాలోని సుందర ప్రాంతాలు మొదటి చాయిస్ అవుతాయనడంలో సందేహం లేదు. ఎవర్గ్రీన్ లొకేషన్లు పరవళ్లు తొక్కే కృష్ణ, చంద్రవంక, నాగులేరు నదుల ఒడ్డున, నాగార్జునసాగర్ కాలువల మధ్య అందంగా ఒదిగిపోయిన గుంటూరు జిల్లాలోని సహజ అందాలు, పుణ్యక్షేత్రాలు, కొండ శిఖరాలు సినిమా షూటింగులకు ఎవర్గ్రీన్ లోకేషన్లు. కృష్ణానది ఒడ్డున విజయవాడ నుంచి అమరావతి వరకు, ఇటుపక్క రేపల్లె తీరం వరకు పంటపొలాలు, పూలతోటలు, వాణిజ్యపంటలతో ఏడాదంతా పచ్చదనం పరుచుకుని ఉంటుంది. ఆయా మార్గాల్లోని పడవల రేవులు, సమీప లంకల్లో సహజమైన గ్రామీణ వాతావరణం అందరినీ ఆకట్టుకుంటుంది. సూర్యలంక బీచ్, అక్కడి రిసార్టులు, నిజాంపట్నం హార్బర్, పెనుమూడి రేవు, పరిసరాల్లోని బ్యాక్ వాటర్స్... షూటింగులకు అనువైన ప్రదేశాలు. మూడేళ్లుగా మళ్లీ.. గత మూడేళ్లుగా మళ్లీ జిల్లాలో షూటింగులు కొనసాగుతున్నాయి. జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ‘రా...కిట్టూ’ సినిమాని చిత్రీకరించారు. దూరదర్శన్ సప్తగిరి చానల్ ‘జై బోలో’ సీరియల్ కూడా ఇక్కడ తీసిందే. తెనాలికే చెందిన సినీ దర్శకుడు దిలీప్‌రాజా ఎంతోకాలంగా ఇక్కడి పరిసరాల్లోనే టీవీ చిత్రాలు తీస్తున్నారు. గతేడాది ఆలీ హీరోగా ‘పండుగాడి ఫొటో స్టూడియో’ సినిమానూ జిల్లాలోనే చిత్రీకరించారు. దూరదర్శన్‌లో ప్రసారమైన 100 ఎపిసోడ్ల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ టెలీఫిలింను దర్శకుడు దిలీప్‌రాజా ఇక్కడే తీర్చిదిద్దారు. మంచి విజయం సాధించిన ‘మిడిల్‌క్లాస్ మెలోడీస్’ సినిమా కొలకలూరు, గుంటూరులోనే చిత్రీకరించారు. శేఖర్‌వర్మ, వైభవీరావ్ హీరోహీరోయిన్లుగా నటించిన, ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ చేసుకుంటున్న ‘కల్యాణమస్తు’లోని రెండు పాటలకు ఇక్కడి లోకేషన్లను వినియోగించారు. ‘నేను అను’, నాగశార్య ‘ఛలో’, రమేష్ చౌహాన్–మౌనికల రామ్‌నాయక్ వంటి సినిమాల్లో కొన్ని సన్నివేశాలను జిల్లాలోనే తీశారు. అందాల అమరావతి.. అద్భుత కొండవీడు.. పంచారామాల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కి జిల్లాకు మణిహారంగా ఉన్న అమరావతి పుణ్యక్షేత్రం పరిసరాలు ఇప్పటికే పలు సినిమాల్లో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఘాట్‌రోడ్డు నిర్మాణంతో సహా అభివృద్ధి చేసిన కొండవీడు దుర్గంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆనాటి యుద్ధతంత్ర నైపుణ్యానికి నిదర్శనంగా 30 మైళ్ల చుట్టుకొలత గల ఈ దుర్గం పర్యాటకంగా మరింత సొబగులద్దుకుంది. ఈ నేపథ్యంలో ఈ లోకేషన్లు అందరినీ సంభ్రమాశ్చర్యాలల్లో ముంచెత్తుతున్నాయి. ఇక ఉండవల్లి గుహలు, అక్కడి అనంత పద్మనాభ ఆలయం, అజంతా అందాలను తలపించే శిల్పకళ చూపరులను కళ్లు తిప్పుకోనివ్వవంటే అతిశయోక్తి కాదు. మంగళగిరి కొండపై పానకాలస్వామి ఆలయం ప్రకృతి రమణీయతకు ఆలవాలం. ఇక ఎత్తిపోతల సోయగాలు, కృష్ణానదిలో బోటింగ్ గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఇవన్నీ సినీ షూటింగులకు అనువైనవే. ఏఎన్నార్ కాలం నుంచీ చిత్రీకరణలు సినిమా షూటింగులు జిల్లాకు కొత్త కాదు. ఎప్పుడో అక్కినేని నాగేశ్వరరావు నటించిన సిపాయి చిన్నయ్య సినిమాలో ‘నా జన్మభూమి’ అనే పాటను తెనాలి సమీపంలోని దుగ్గిరాలలో చిత్రీకరించారు. తెనాలి పక్కనున్న బుర్రిపాలెం సూపర్‌స్టార్ కృష్ణ జన్మస్థలమని తెలిసిందే. ఈ ప్రాంతంలోని సుందర దృశ్యాలను ఆయన తన సినిమాల్లో వినియోగించుకున్నారు. ప్రజారాజ్యం, బుర్రిపాలెం బుల్లోడు, సావాసగాళ్లు, పచ్చని సంసారం సినిమాలను ఇక్కడి పరిసరాల్లోనే చిత్రీకరించారాయన. శోభన్‌బాబు, విజయశాంతి నటించిన దేవాలయం సినిమా తోపాటు సప్తపది చిత్రంలోని పాటలను అమరావతిలోని అమరేశ్వర ఆలయంలో చిత్రీకరించారు. గోపీకృష్ణా మూవీస్ కృష్ణవేణి సినిమాలో కీలక సన్నివేశాలనూ కృష్ణానదీ పాయలో తీశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో జిల్లాలోని లోకేషన్లు, పుణ్యక్షేత్రాలు కనువిందు చేశాయి. -
సెట్లో అక్కినేని సుమంత్ బర్త్ డే సెలబ్రెషన్స్
-
సెలవుల్లో ఇలా ఎగిరిపోదామా?
మనిషి సోషల్ యానిమల్. మనసు ఫ్లయింగ్ బర్డ్! ఉండేందుకు ఒక చోటు లేకున్నా బతికేయొచ్చు. ఒకేచోట ఉండిపోతే... పంజరమే మానవజన్మ. 2020లో మానవపక్షులన్నీ నాలుగు గోడల మధ్యే ఉండిపోయాయి. 2021లో కొద్దిగా ఆశలు చిగురిస్తున్నాయి. బస్సెక్కి, రైలెక్కి, విమానమెక్కి.. నాలుగడుగులు వేస్తే ఎంత బాగుంటుంది! సెలవులున్నాయి. ఈవెంట్స్ ఉన్నాయి. బండి దిగొచ్చేవారి కోసం..పన్నెండు నెలలూ వేచి చూస్తున్నాయి. రుతువులొచ్చాయి. మనిషి జాడ లేకనే వెళ్లిపోయాయి. ఎవరి కోసం పూయాలి? ఎవరి కోసం ‘కుహూ..’ మని కూయాలి? నిరుడంతా ప్రకృతికి నిరుత్సాహం. కరోనా కర్ర పట్టుకుని నిలుచుంటే బయటికేం వస్తాం? చైత్ర వైశాఖ జ్యేష్ట ఆషాడ శ్రావణ భాద్రపద ఆశ్వయుజ కార్తీక మార్గశిర మాసాలు (పుష్య మాఘ పాల్గుణాల తర్వాతే కరోనా గృహ ప్రవేశం చేసింది), వసంత గ్రీష్మ వర్ష శరద్ హేమంతాలు (శిశిరం తర్వాతే కరోనా కుడికాలు పెట్టింది) మానవ స్పర్శ లేకనే నిష్క్రమించాయి. అప్పటికీ చైనా ధైర్యం చేసింది. శరత్ రుతువులో బయటికి వచ్చింది. ‘రివెంజ్ ట్రావెల్’ పేరుతో (కరోనాపై రివెంజ్) జాతీయ దినం అక్టోబర్ 1 నుంచి పది రోజులు నేషనల్ హాలిడే ప్రకటించుకుంది. ‘ప్రజలారా ఇళ్లలోంచి రండి. బయట విహరించండి. కరోనాను ధిక్కరించండి’ అని పిలుపునిచ్చింది. అప్పటి వరకు క్వారెంటైన్లతో, లాక్డౌన్లతో, రిస్ట్రిక్షన్లతో.. బయటి తిండి కోసం, బయట తిరగడం కోసం అలమటించి ఉన్నవారు కదా.. తక్షణం శృంఖలాలు తెంచుకున్నారు. పిల్లల్ని, ట్రావెల్ బ్యాగ్‌లను భుజాన వేసుకుని బయటికి వచ్చారు. ఆ పది రోజుల్లో 55 కోట్ల మంది చైనావాళ్లు వాళ్ల దేశమంతటా విహంగాలై పర్యటించారు. ఆగస్టు నాటికి ఇండియాలో ‘తెగింపు’ వచ్చేసింది. ఒక బ్యాచ్ 70 రోజుల పాటు, 20 కి.మీ. దూరం ఢిల్లీ టు లండన్.. మయన్మార్, థాయిలాండ్, లావోస్, చైనా, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలెండ్, చెక్, జర్మనీ, బెల్జియం.. మొత్తం 18 దేశాల పర్యటనకు బయల్దేరింది! తైవాన్ రాజధాని తాయ్ పే లోనైతే జూలైలో సాంగ్షాన్ అంతర్జాతీయ విమానాశ్రయం కిటకిటలాడింది. చెక్–ఇన్, పాస్ పోర్ట్ కంట్రోల్, సెక్యూరిటీ, బోర్డింగ్.. ప్రతి చోట.. విమానాలు బయలుదేరక ముందే ప్రయాణీకులు ఎయిర్‌పోర్ట్‌కి లగేజ్‌లు, బ్యాగేజ్లు వేసుకొచ్చేశారు. ఫ్లయిట్ ఎక్కి కూర్చున్నారు. కాక్‌పిట్ నుంచి అనౌన్స్మెంట్ వినిపిస్తే సీట్ బెల్ట్‌లు కూడా బిగించుకున్నారు. ఆ తర్వాత అసలు గాల్లోకే లెయ్యని విమానం నుంచి నిచ్చెన మీదుగా నేలపైకి ల్యాండ్ అయ్యారు! మిగతా ఫ్లయిట్స్ కూడా అంతే. అవి ఎక్కడికీ వెళ్లలేదు. కూర్చున్నవాళ్లే.. ఎక్కడికో వెళ్లొచ్చినట్లు విమానాలు దిగేశారు. అంటే అన్నీ ఫేక్ విమానాలు, ఫేక్ ప్రయాణ అనుభూతులు. ఏదో ఒకటిలే ఇల్లు కదిలితే చాలు ప్రజలు టికెట్లు కొనేశారు. కొత్త సంవత్సరం కొంచెం ‘నాన్–కరోనాటిక్’గా కనిపిస్తోంది. వ్యాక్సిన్లు కూడా వచ్చేశాయి. టూరిస్ట్ స్పాట్లను శుభ్రం చేసి రెడీగా ఉంచారు. గత ఏడాదంతా అలికిడే లేని పర్యాటక కేంద్రాలలో సందడి మొదలవుతోంది. ప్రయాణ ఆంక్షలు దాదాపుగా తొలగిపోయాయి. సెలవుల్ని చక్కగా ప్లాన్ చేసుకోవడమే ముందున్న కాలమంతా. ఈ న్యూ ఇయర్లో ఐదు రోజులే కదా గడిచింది. ముందింకా ఎన్నో రోజులు. ఎన్నో పండుగలు. తిలకించేందుకు ఎన్నో ప్రకృతి మహత్యాలు, సాంస్కృతిక వైభవాలు! వాటిని చూడడానికి ముందుగా.. ఏ నెలలో ఎన్ని రోజులు సెలవులున్నాయో, చూడవలసినవి ఏవి ఉన్నాయో చూద్దాం. చూడ్డమే ఈ ఏడాదంతా మనం చేయవలసిన పని. ఇంకో పని కూడా చేయాలి. ఆదివారం కలిసొచ్చేలా శనివారం; శనీ ఆదివారాలు కలిసొచ్చేలా శుక్రవారం సెలవు పెట్టడం. వీలైతేనే. విధిగా కాదు. ఉద్యోగమనే విధికి అడ్డు తగలకుండా చూసుకోవాలి. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్(అహమ్మదాబాద్) జనవరి 14 సంక్రాంతి. 15 శుక్రవారం సెలవు పెడితే 16, 17 శని, ఆదివారాలు. 23, 24 మళ్లీ శని, ఆదివారాలు. 26 రిపబ్లిక్ డే. 25 సెలవు పెడితే 24 ఆదివారం. వరుసగా మూడు రోజులు. ఇవి చూడొచ్చు :అహమ్మదాబాద్‌లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్; బికనీర్, రాజస్థాన్‌లలో బికనీర్ కామెల్ ఫెయిర్ (జనవరి 12–13); శ్రీనగర్, జమ్ము–కశ్మీర్; ఉత్తరాఖండ్‌లోని ఆలీకి స్కీయింగ్ ట్రిప్, కచ్ గుజరాత్లో వైట్ డెజర్ట్. ఆ ఉప్పు ఎడారిని సూర్యకిరణాలు పడుతున్నప్పుడు చూడాలి. కళ్లు జిగేల్మంటాయి. జిరంగ నేషనల్ పార్క్ (అస్సాం) ఫిబ్రవరి 13, 14 శని, ఆదివారాలు. 15 సెలవు పెడితే 16 వసంత పంచమి. ఇవి చూడొచ్చు : ఎప్పుడూ పార్టీలు జరుగుతుండే గోవా, తాజ్‌మహల్ (ఆగ్రా), కజిరంగా నేషనల్ పార్క్ (అస్సాం), ఉదయ్‌పూర్, జైసల్మేర్, జో«ద్‌పూర్ (రాజస్థాన్), పురాతన నగరం వారణాసి; ఖజురహో–హెరిటేజ్ టూర్ (మధ్యప్రదేశ్). బృందావనంలో హోలీ మార్చి 11 మహా శివరాత్రి. 12 శుక్రవారం సెలవు పెడితే 13, 14 శని, ఆదివారాలు. 26 శుక్రవారం సెలవు పెడితే 27, 28 శని, ఆదివారాలు. 29 హోలీ. ఇవి చూడొచ్చు : హోలీకి బృందావనం (మధుర), ప్రకృతి దృశ్యాల కోసం ఊటీ, వన్యప్రాణుల కోసం రాజస్థాన్‌లోని రంథంబోర్, మానసిక సాంత్వన కోసం సిక్కిం, యాత్రా స్థలంగానైతే మౌంట్ అబూ. చారిత్రక శిథిల కట్టడాలకు హంపీ. గుల్మార్గ్ స్కీయింగ్ (కశ్మీర్) ఏప్రిల్ 2 గుడ్ ఫ్రైడే. 3, 4 శని, ఆదివారాలు. ఈ నెలలో ఇంతే. శని ఆదివారాలకు కలిసొచ్చేవి లేవు. ఇవి చూడొచ్చు : చల్లదనం కోసం జమ్ము–కశ్మీర్. పెంచ్ నేషనల్ పార్క్ (మధ్యప్రదేశ్), ఉదయ్‌పూర్, ట్రెక్కింగ్ కోసం కొడైకెనాల్, స్కీయింగ్‌కి గుల్మార్గ్, వైన్ యార్డ్ చూడాలంటే నాసిక్. నీలాకాశ వీక్షణకు, బీచ్‌లకు లక్షద్వీపాలు, స్వచ్ఛమైన గాలి కోసం కూర్గ్. ధర్మశాలలో క్రికెట్ స్టేడియం మే 13 ఈదుల్ ఫిత్ర్. 14 సెలవు పెడితే 15, 16 శని, ఆదివారాలు. ఇవి చూడొచ్చు :రిషికేశ్, ముస్సోరి (ఉత్తరాఖండ్), కొడైకెనాల్ (తమిళనాడు), స్పితీ వ్యాలీ (హిమాచల్ ప్రదేశ్), కాలింపాంగ్ (పశ్చిమ బెంగాల్), వేయనాడ్ (కేరళ), ధర్మశాల (హిమాచల్ ప్రదేశ్) అల్మోరా, ఉత్తరాఖండ్ జూన్ జూన్‌లో శని, ఆది వారాలకు కలిసొచ్చే సెలవు రోజులు లేవు. తెలంగాణ ఆవిర్భావం దినోత్సవమైన జూన్ 2 ఈ ఏడాది బుధవారం వచ్చింది. ఇక వేళ రెండు మూడు రోజులు సెలవు దొరికితే.. ఇవి చూడొచ్చు : చిక్మగళూర్ (కర్ణాటక), లడఖ్, అండమాన్; గాంగ్టక్ (సిక్కిం), అల్మోరా (ఉత్తరాఖండ్). ఈ నెలలో ఈ ప్రదేశాలలోని వాతావరణం సమ శీతల ఉష్ణస్థితిలో ఆహ్లాదంగా ఉంటుంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ (ఉత్తరాఖండ్) జూలై 10, 11 శని, ఆదివారాలయ్యాయి. 12 రథయాత్ర. 17, 18 శని, ఆదివారాలు. 19 సెలవు పెడితే 20 బక్రీద్. ఇవి చూడొచ్చు : పూరి రథయాత్ర (ఒడిశా), వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ (ఉత్తరాఖండ్), శివస్థలి అమర్నాథ్. మౌంట్ అబు (రాజస్థాన్) ఆగస్ట్ 28, 29 శని, ఆదివారాలు. 30 జన్మాష్టమి. ఇవి చూడొచ్చు : జన్మాష్టమి ఉత్సవాల కోసం బృందావనం, కూనూరు (తమిళనాడు), చిరపుంజీ (మేఘాలయ), జిమ్ కార్బెట్ (ఉత్తరాఖండ్), మౌంట్ అబూ (రాజస్థాన్) హర్మందిర్ సాహిబ్ (అమృత్సర్) సెప్టెంబర్ 10 వినాయక చవితి. 11, 12 శని, ఆదివారాలు. ఇవి చూడొచ్చు: అమృత్సర్, కేరళ, శ్రీనగర్, కూర్గ్, పాండిచ్చేరి, ముంబై, మహాబలేశ్వర్, గుజరాత్‌లోని విల్సన్ హిల్స్. నైరుతి రుతుపవనాలు తిరుగుముఖంలో ఉండి, వాతావరణం తడిపొడి సమ్మేళనంగా ఉల్లాసభరితంగా ఉంటుంది కనుక పర్యాటనకు అనువైన ప్రదేశాలలో ఇవి కొన్ని. కులు దసరా సంబరాలు అక్టోబర్ 15 దసరా. 16, 17 శని, ఆదివారాలు. ఇవి చూడొచ్చు :దసరా సంబరాలకు కులు (హిమాచల్ ప్రదేశ్), రివర్ రాఫ్టింగ్‌కి రిషికేశ్, దుర్గాపూజకు కోల్‌కతా, వన్యప్రాణి వైవిధ్య వీక్షణకు మానస్ నేషనల్ పార్క్ (అస్సాం), జాపపద సంస్కృతుల కోసం జో«ద్‌పూర్; మైసూరు. భరత్పూర్ (రాజస్థాన్) పక్షుల ఆవాసం నవంబర్ 19 గురు నానక్ జయంతి. 20, 21 శని, ఆదివారాలు ఇవి చూడొచ్చు : ఫుష్కరోత్సవాలు (రాజస్థాన్), నైట్ లైఫ్ కోసం గోవా, పక్షుల్ని చూడటానికి భరత్పూర్ (రాజస్థాన్); రాయల్ బెంగాల్ టైగర్లను చూడ్డానికి సుందర్బాన్ (పశ్చిమ బెంగాల్), మంచుకొండల కోసం మనాలీ (హిమాచల్ ప్రదేశ్) కబిని అభయారణ్యం (కర్ణాటక) డిసెంబర్ 24 సెలవు పెడితే 25 క్రిస్మస్, 26 ఆదివారం. ఇవి చూడొచ్చు : కబిని వన్యప్రాణి అభయారణ్యం (కర్ణాటక), స్కీయింగ్‌కి ఆలీ (ఉత్తరాఖండ్), కచ్ (గుజరాత్). -
ప్రేక్షకుల్ని భ్రమ పెట్టిన చిత్రాలు!
సినిమాలు అంటే వినోదం, ఆనందం. సినిమా చూస్తుంటే మనకు తెలియని, మనకు సంబంధం లేని ఎన్నో పాత్రల్లో మనం లీనమైపోతూ ఉంటాం. సినిమాలో ఏం చూసినా, ఏం విన్నా అది నిజమే అనుకుంటూ ఉంటాం. పాటల్లో బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే సీనరీలు, మనకు కనిపించే అన్ని ప్రదేశాలు కథకు తగ్గట్టుగానే సినిమాలో చూపించిన ప్రదేశాల్లోనే షూట్ చేశారు అనుకుంటాం. కానీ మనం అనుకున్న ప్రదేశాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో చిత్రీకరించి ప్రేక్షకులను భ్రమలో ఉంచిన కొన్ని బాలీవుడ్ సినిమాలు ఇప్పుడు చూద్దాం. 1. ఏ జవానీ హై దివానీ: ఈ సినిమాలో నైనా, బన్నీ ట్రెక్కింగ్ చేసిన కొండలను చూసి అవి మనాలీ ఉన్నాయనుకొని మీరు మనాలీకి టికెట్స్ బుక్ చేసుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. అసలు ఆ షూటింగ్ జరిగిన ప్రాంతం గుల్మర్గ్. మనం షూటింగ్ జరిగింది అనుకునే మనాలీ నిజానికి షూటింగ్ జరిగింది గుల్మర్గ్: 2. మేరీ కామ్: ప్రముఖ మహిళ బాక్సర్ మేరీ కామ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. మేరీకామ్ మణిపూర్‌కు చెందన వారు కాగా ఈ సినిమాను మాత్రం హిమాచల్‌ప్రదేశ్‌లో షూట్ చేశారు. మనం షూటింగ్ జరిగింది అనుకునే మణిపూర్ షూటింగ్ జరిగిన ప్రాంంతం హిమాచల్ ప్రదేశ్ 3. కుచ్ కుచ్ హోతా హై: షారుఖ్ ఖాన్, కాజల్, రాణీ ముఖర్జీ నటించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. చాలా సందర్భాలలో ప్రేక్షకుల కంటి నుంచి కన్నీరు పెట్టించింది. ఈ సినిమాలో టీనా, అంజలి, రాహుల్ సెయింట్ జావియర్ కాలేజ్‌లో చదువుకుంటారు. కానీ దానిని యూనివర్శిటీ ఆఫ్ మారిషస్‌లో షూట్ చేశారు. అదే విధంగా చాలా రోజుల తరువాత రాహుల్ అంజలిని కలుసుకోవడానికి సిమ్లా వెళతాడు. కానీ అది సిమ్లాలో షూట్ చేయలేదు. తమిళనాడులోని ఊటీలో షూట్ చేశారు. సినిమా షూటింగ్ జరిగింది అనుకునే సిమ్లా, సెయింట్ జావియర్ కాలేజ్ షూటింగ్ జరిగిన యూనివర్శీటి ఆఫ్ మారిషస్ అండ్ ఊటీ: 4. కబీ ఖుషీ కబీ గమ్: అమితాబ్ బచ్చన్, జయబచ్చన్, షారుఖ్, కాజల్, హృతిక్ రోషన్, కరీనా కపూర్ నటించిన ఈ చిత్రం ఆద్యాంతం ఎంతో వినోదాన్ని అందించడంతో పాటు చాలా సందర్భాల్లో తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తోంది. ఈ సినిమాలో షూటింగ్ మనకు ఢిల్లీలోని చాందీని చౌక్‌లో జరిగినట్లు చూపిస్తారు. కొంత షూటింగ్ లండన్‌లో తీసినట్లు ఉంటుంది. నిజానికి ఈ సినిమాను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో, లండన్‌లో షూట్ చేశారు. షూటింగ్ జరిగింది అనుకునే చాందీనీ చౌక్: సినిమా తీసింది రామోజీ ఫిల్మ్ సిటీలో 5. చైన్నె ఎక్స్‌ప్రెస్: షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది, నవ్వించింది. చైన్నె ఎక్స్‌ప్రెస్ అనే పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమాను చైన్నెలో షూట్ చేశారు అనుకుంటే మీరు మరోసారి తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ సిమాను మహారాష్ట్ర పూనేలో ఉన్న వాయ్ ప్రాంతంలో తీశారు. షూటింగ్ జరిగింది అనుకునే చెన్నై నిజంగా షూటింగ్ జరిగిన పూనేలోని వాయ్ ప్రాంతం 6. ఫనా: అమీర్ ఖాన్, కాబల్ అగర్వాల్ నటించిన ఈ సినిమాలో మనం చాలా అద్భుతమైన ప్రాంతాలను చూస్తూ ఉంటాం. వీటిని కథకు తగ్గట్టుగా కశ్మీర్ లోయలో చిత్రీకరించినట్లు అనిపిస్తుంది. కానీ నిజానికి ఈ సినిమాను పోలాండ్‌లో తీశారు. షూటింగ్ జరిగింది అనుకునే కశ్మీర్ ప్రాంతం షూటింగ్ జరిగిన పోలాండ్ 7. బజరంగీ భాయ్‌జాన్: ఇక సల్మాన్ ఖాన్ నటించి సూపర్ హిట్ అయిన బజరంగీ భాయ్‌జాన్ సినిమా పాకిస్తాన్ కథాంశంతో తెరకెక్కింది. ఇందులో మున్నీ అనే పాప పాకిస్తాన్ నుంచి ఇండియాకు వస్తుంది. అయితే ఆ సన్నివేశాలన్ని పాకిస్తాన్‌లోని సుల్తాన్పూర్లోనే తీశారేమో అనుకుంటాం కానీ నిజానికి ఆ చిత్రం షూటింగ్ కశ్మీర్‌లోని సోనా మార్గ్‌లో తీశారు. షూటింగ్ జరిగింది అనుకునే పాకిస్తాన్‌లోని సుల్తాన్పూర్ షూటింగ్ జరిగిన సోనా మార్గ్ ఇలా చాలా చిత్రాల్లో మనం అనుకున్న ప్రాంతాల్లో కాకుండా వేరే చోట షూట్ చేసి ప్రేక్షకులను మభ్యపెడుతూ ఉంటారు. కానీ నిజానికి సినిమా హిట్ అవ్వాలి అంటే ప్రధానంగా కావల్సింది స్టోరీ లైన్. చదవండి: అలియా సిగ్గు లేకుండా అవార్డు తీసుకుంది -
లొకేషన్ సెర్చ్
అక్కడికి, ఇక్కడికి ఎక్కడ బాగుందంటే అక్కడికి వెళ్తున్నారట రాజమౌళి. ఏం బాగుండాలి అంటే ప్లేస్ విశాలంగా ఉండాలట. ఎందుకు? అంటే..‘ఆర్ఆర్ఆర్’ మూవీ సెట్ కోసం. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘బాహుబలి’ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ఈ సినిమాకు ‘ఆర్ఆర్ఆర్’ అనే వర్కింగ్ టైటిల్‌ను అనుకుంటున్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్ వేసేందుకు కెమెరామెన్ సెంథిల్ కుమార్‌తో కలిసి లొకేషన్స్ సెర్చ్ చేస్తున్నారు రాజమౌళి. రీసెంట్గా హైదరాబాద్‌కు సమీపంలోని కొల్లూరు గ్రామ పరిసర ప్రాంతాలను టీమ్ పరిశీలించారని సమాచారం. ప్రస్తుతం బోయపాటి సినిమాతో రామ్‌చరణ్, త్రివిక్రమ్ సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. అక్టోబర్‌లో ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంది. రామ్‌చరణ్ సినిమా కూడా అక్టోబర్ నాటికి ఓ కొలిక్కి వస్తుంది. సో.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నవంబర్‌లో మొదలయ్యే అవకాశాలు ఉంటాయని ఊహించవచ్చు. -
వాట్సాప్ అప్ డేట్ చేస్కోండి
సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్.. తన యూజర్లను యాప్ అప్ డేట్ చేసుకోవాలని కోరుతోంది. మరో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు వాట్సాప్ తెలిపింది. టైమ్తోపాటు లోకేషన్ స్టికర్లను పంపుకునే వెసులుబాటను కల్పించింది. ఇంతకు ముందు యూజర్లు గూగుల్ మ్యాపింగ్ ద్వారా లోకేషన్ షేర్ చేసుకునే వారు. అయితే ఆ అవసరం లేకుండా.. ఫోటోలు, వీడియోలు పంపుకునే ఆప్షన్(స్టిక్కర్ల) ద్వారానే లోకేషన్‌ను పంచుకునే వీలు కల్పించింది. అంతేకాదు మీరు ఎక్కడున్నది టైమ్‌తో సహా షేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం యాప్‌ను అప్డేట్ చేసుకోవాలని వాట్సాప్ ఓ ప్రకటనలో సూచించింది. దీనివల్ల యూజర్లకు చాలా సమయం కలిసొస్తుందని సంస్థ పేర్కొంది. కాగా, కొద్ది రోజుల క్రితమే పేమెంట్స్ సౌకర్యాన్ని కూడా వాట్సాప్ కల్పించిన విషయం తెలిసిందే. -
దేశవ్యాప్తంగా ఐటీ,ఈడీ సోదాలు
-
‘స్థానిక’ ఉప ఎన్నికలకు నగారా
నోటిఫికేషన్ విడుదల చేసినరాష్ట్ర ఎన్నికల సంఘం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న మండల ప్రాదేశిక నియోజకర్గాలకు, సర్పంచ్, వార్డుసభ్యుల స్థానాల ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌తోపాటు షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. ఈ నెల 26న ఎన్నికల నోటీసు, ఓటర్ల జాబితాలను ప్రకటించనుంది. నామినేషన్ల స్వీక రణ గడువు 29న సాయంత్రం ఐదు గంటల వర కు ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు సెప్టెంబర్ 3వ తేదీ వరకు విధించారు. 8న ఉద యం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం రెండు గం టల నుంచి సర్పంచ్, వార్డు స్థానాలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. 10 తేదీన ఉదయం 8 గంటల నుంచి ఎంపీటీసీ స్థానాల ఓట్లను లెక్కిస్తారు. ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలకు సంబంధించి సదరు మండల ప్రజాపరిషత్ ప్రాంతం, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి సదరు పంచాయతీ ప్రాంతం వరకు ఎన్నికల నియమావళి శనివారం నుంచే అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. అన్ని పార్టీలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు దీనికి లోబడి పనిచేయాలని ఆదేశించింది. ఈ ఉప ఎన్నికలకు అవసరమైన సన్నాహాలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రారంభించింది. -
షూటింగుల్లో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం
హైదరాబాద్: తెలుగు సినీ అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న ఈ ఎన్నికల్లో మొదటిసారి ఇద్దరు మహిళా జూనియర్ ఆర్టిస్ట్‌లు పోటీ పడుతున్నారు. శనివారం అభ్యర్థులు షూటింగ్ లొకేషన్లలో తమకు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారు. ఈ యూనియన్‌లో మొత్తం 2,901 మంది సభ్యులుగా ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు.. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్ష పదవికి ఎం.రజిని, చిలుకూరి సత్యనారాయణ, కె.కృష్ణప్రసాద్, ఎం.డి.ముజహర్అలీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎం.రాజశేఖర్, ఎం.డి.గౌస్, కె.రవి, రమేష్ భవానీ, వజనపల్లి ఠాకూర్ కోశాధికారి పదవికి కె.రవిశంకర్, ఎం.సత్యం, వేములపల్లి సరస్వతి అలియాస్ సునయినిలు పోటీ పడుతున్నారు.