దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం వేకేషన్‌లో చిల్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్యాప్ ఎక్కువగా రావడంతో ఆఫ్రికాలో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం కెన్యాలోని అడవుల్లో వన్య ప్రాణలను చూస్తూ సేద తీరుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ప్రాంతంలో సినిమా షూటింగ్ లోకేషన్స్ కోసమే రాజమౌళి వెళ్లినట్లు తెలుస్తోంది. అడవుల్లో తిరుగుతున్న ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు దర్శకధీరుడు.
(ఇది చదవండి: ఆ సమయంలో అవార్డ్ తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది: మెగాస్టార్)
మరోవైపు ప్రిన్స్ మహేశ్‌బాబుతో తన తదుపరి చిత్రం తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమైంది. ఈ సినిమాను ఎస్ఎస్‌ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో రూపొందించనున్నారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్ అడ్వెంచరస్ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో కథ ఉంటుందని ఇప్పటికే హింట్ కూడా ఇచ్చారు. అందువల్లే ఆఫ్రికాలోని దట్టమైన అడవుల లోకేషన్స్ కోసమే రాజమౌళి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాదిలో ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
#TFNReels: Maverick Director @ssrajamouli is currently scouting locations in Kenya, Africa for #SSMB29!!🌎🔥#MaheshBabu #SSRajamouli #TeluguFilmNagar pic.twitter.com/ABq6DxfVOg
— Telugu FilmNagar (@telugufilmnagar) October 29, 2024
Comments
Please login to add a commentAdd a comment