
కెన్యాలో లొకేషన్ వేట ఆరంభించారు రాజమౌళి. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ ఆఫ్రికన్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసిన రాజమౌళి లొకేషన్స్‌ను ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్‌లో రాజమౌళి ఉన్నారు. కెన్యా, ఆఫ్రికా లొకేషన్స్‌లో కొన్ని లొకేషన్స్‌ని ఎంపిక చేసి, తొలి షెడ్యూల్‌ని అక్కడే ఆరంభిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాకు ‘మహారాజా’, ‘మహారాజ్’ అనే టైటిల్స్‌ను అనుకుంటున్నారని, 18వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఓ నిధి అన్వేషణతో ఈ సినిమా ఉంటుందనీ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment