ప్రేక్షకుల్ని భ్రమ పెట్టిన చిత్రాలు! | Bollywood Movies With Fake Locations | Sakshi
Sakshi News home page

ప్రేక్షకుల్ని భ్రమ పెట్టిన బాలీవుడ్‌ చిత్రాలు!

Published Mon, Jul 20 2020 9:30 AM | Last Updated on Mon, Jul 20 2020 12:17 PM

Bollywood Movies With Fake Locations - Sakshi

సినిమాలు అంటే వినోదం, ఆనందం. సినిమా చూస్తుంటే మనకు తెలియని, మనకు సంబంధం లేని ఎన్నో పాత్రల్లో మనం లీనమైపోతూ ఉంటాం. సినిమాలో ఏం చూసినా, ఏం విన్నా అది నిజమే అనుకుంటూ ఉంటాం. పాటల్లో బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే సీనరీలు, మనకు కనిపించే అన్ని ప్రదేశాలు కథకు తగ్గట్టుగానే సినిమాలో చూపించిన ప్రదేశాల్లోనే షూట్‌ చేశారు అనుకుంటాం. కానీ మనం అను​కున్న ప్రదేశాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో చిత్రీకరించి ప్రేక్షకులను భ్రమలో ఉంచిన కొన్ని బాలీవుడ్‌ సినిమాలు ఇప్పుడు చూద్దాం. 

1. ఏ జవానీ హై దివానీ: ఈ సినిమాలో నైనా, బన్నీ ట్రెక్కింగ్‌ చేసిన కొండలను చూసి అవి మనాలీ ఉన్నాయనుకొని మీరు మనాలీకి టికెట్స్‌ బుక్‌ చేసుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. అసలు ఆ షూటింగ్‌ జరిగిన ప్రాంతం గుల్‌మర్గ్. 

మనం షూటింగ్‌ జరిగింది అనుకునే మనాలీ

నిజానికి షూటింగ్‌ జరిగింది గుల్‌మర్గ్‌: 

2.  మేరీ కామ్‌: ప్రముఖ మహిళ బాక్సర్‌ మేరీ కామ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా నటించి మెప్పించిన విషయం తెలిసిందే.  మేరీకామ్‌ మణిపూర్‌కు చెందన వారు కాగా ఈ సినిమాను మాత్రం హిమాచల్‌ప్రదేశ్‌లో షూట్‌ చేశారు. 

మనం షూటింగ్‌ జరిగింది అనుకునే మణిపూర్‌

షూటింగ్‌ జరిగిన ప్రాంంతం హిమాచల్‌ ప్రదేశ్‌ 

3. కుచ్‌ కుచ్‌ హోతా హై: షారుఖ్‌ ఖాన్‌, కాజల్‌, రాణీ ముఖర్జీ నటించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. చాలా సందర్భాలలో ప్రేక్షకుల కంటి నుంచి కన్నీరు పెట్టించింది. ఈ సినిమాలో టీనా, అంజలి, రాహుల్‌ సెయింట్‌ జావియర్‌ కాలేజ్‌లో చదువుకుంటారు. కానీ దానిని యూనివర్శిటీ ఆఫ్‌ మారిషస్‌లో షూట్‌  చేశారు. అదే విధంగా చాలా రోజుల తరువాత రాహుల్‌ అంజలిని కలుసుకోవడానికి సిమ్లా వెళతాడు. కానీ అది సిమ్లాలో షూట్‌ చేయలేదు. తమిళనాడులోని ఊటీలో షూట్‌ చేశారు. 

సినిమా షూటింగ్‌ జరిగింది అనుకునే సిమ్లా, సెయింట్‌ జావియర్‌ కాలేజ్‌

షూటింగ్‌ జరిగిన యూనివర్శీటి ఆఫ్‌ మారిషస్‌ అండ్‌ ఊటీ:

4. కబీ ఖుషీ కబీ గమ్‌: అమితాబ్‌ బచ్చన్‌, జయబచ్చన్‌, షారుఖ్‌, కాజల్‌, హృతిక్‌ రోషన్‌, కరీనా కపూర్‌ నటించిన ఈ చిత్రం ఆద్యాంతం ఎంతో వినోదాన్ని అందించడంతో పాటు చాలా సందర్భాల్లో తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తోంది. ఈ సినిమాలో షూటింగ్‌ మనకు ఢిల్లీలోని చాందీని చౌక్‌లో జరిగినట్లు చూపిస్తారు. కొంత షూటింగ్‌ లండన్‌లో తీసినట్లు ఉంటుంది. నిజానికి  ఈ సినిమాను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో, లండన్‌లో షూట్‌ చేశారు. 

షూటింగ్‌ జరిగింది అనుకునే చాందీనీ చౌక్‌: 

సినిమా తీసింది రామోజీ ఫిల్మ్‌ సిటీలో

5. చైన్నె ఎక్స్‌ప్రెస్‌: షారుఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొనే నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది, నవ్వించింది. చైన్నె ఎక్స్‌ప్రెస్‌ అనే పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమాను చైన్నెలో షూట్‌ చేశారు అనుకుంటే మీరు మరోసారి తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ సిమాను మహారాష్ట్ర పూనేలో ఉన్న వాయ్‌ ప్రాంతంలో తీశారు.

షూటింగ్‌ జరిగింది అనుకునే చెన్నై

నిజంగా షూటింగ్‌ జరిగిన పూనేలోని వాయ్‌ ప్రాంతం

6. ఫనా: అమీర్‌ ఖాన్‌, కాబల్‌ అగర్వాల్‌ నటించిన ఈ సినిమాలో మనం చాలా అద్భుతమైన ప్రాంతాలను చూస్తూ ఉంటాం. వీటిని కథకు తగ్గట్టుగా కశ్మీర్‌ లోయలో చిత్రీకరించినట్లు అనిపిస్తుంది. కానీ నిజానికి ఈ సినిమాను పోలాండ్‌లో తీశారు. 

షూటింగ్‌ జరిగింది అనుకునే కశ్మీర్‌ ప్రాంతం

షూటింగ్‌ జరిగిన పోలాండ్‌


7. బజరంగీ భాయ్‌జాన్‌: ఇక సల్మాన్‌ ఖాన్‌ నటించి సూపర్‌ హిట్‌ అయిన బజరంగీ భాయ్‌జాన్‌ సినిమా పాకిస్తాన్‌ కథాంశంతో తెరకెక్కింది. ఇందులో మున్నీ అనే పాప పాకిస్తాన్‌ నుంచి  ఇండియాకు వస్తుంది. అయితే ఆ సన్నివేశాలన్ని పాకిస్తాన్‌లోని సుల్తాన్‌పూర్‌లోనే తీశారేమో అనుకుంటాం కానీ నిజానికి ఆ చిత్రం షూటింగ్‌ కశ్మీర్‌లోని సోనా మార్గ్‌లో తీశారు. 

షూటింగ్‌ జరిగింది అనుకునే పాకిస్తాన్‌లోని సుల్తాన్‌పూర్‌

షూటింగ్‌ జరిగిన సోనా మార్గ్‌

ఇలా చాలా చిత్రాల్లో  మనం అనుకున్న ప్రాంతాల్లో కాకుండా వేరే చోట షూట్‌ చేసి ప్రేక్షకులను మభ్యపెడుతూ ఉంటారు. కానీ నిజానికి సినిమా హిట్‌ అవ్వాలి అంటే ప్రధానంగా కావల్సింది స్టోరీ లైన్‌.      చదవండి: అలియా సిగ్గు లేకుండా అవార్డు తీసుకుంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement