
తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని లేటెస్ట్ మూవీ 'జాట్'. ప్రముఖ హిందీ హీరో సన్నీ డియోల్ ఇందులో నటించాడు. టాలీవుడ్ కి చెందిన మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించాయి. ఇదివరకే టీజర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తొలి గీతాన్ని విడుదల చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
మాస్ పాటో, మెలోడీ సాంగ్ కాకుండా ఐటమ్ పాటని విడుదల చేశారు. టచ్ కియా అంటే సాగే ఈ పాటలో ఊర్వశి రౌతేలా హస్కీ స్టెప్పులేసింది. తమన్ ఈ చిత్రానికి సంగీతమందించాడు. ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీలో సయామీ ఖేర్, రెజీనా హీరోయిన్లు కాగా.. రణదీప్ హుడా కీలక పాత్రలో నటించాడు.
(ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి)