
‘‘బోల్ బేబీ బోల్...’’ పాట గుర్తుందా? ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ... ఒకప్పుడు యూత్ మొత్తాన్ని ఊపేసిన బాలీవుడ్ పాట ఇది! పాటెలా ఉన్నా.. దానికి స్టెప్పులేసిన జావేద్ జాఫ్రీ... ఒక్కదెబ్బకు బాగా పాపులర్ అయిపోయాడు కూడా! ఆ తరువాత ఎన్నో సినిమాల్లో ఆర్టిస్ట్‌గా, టీవీ షో జడ్జిగా పనిచేసిన జావేద్ జాఫ్రీ.. ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాడు. ఎందుకంటే.. 61 ఏళ్ల వయసులోనూ యూత్‌కు కిర్రాక్ తెప్పించే స్థాయిలో బ్రేక్‌డ్యాన్స్ ఆడేశాడు మరి! నమ్మకం కుదరకపోతే.. @yoursJoee హ్యాండిల్ ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేసిన వీడియో కింద చూసేయండి!
జావేద్ జాఫ్రీ తన నటనా జీవితాన్ని 1985లో మేరీ జంగ్ (Meri Jung) చిత్రంతో ప్రారంభించాడు. ఈ చిత్రంలోని "బోల్ బేబీ బోల్ రాక్ అండ్ రోల్" పాటలో అతని అద్భుతమైన నృత్యం అతనికి తక్షణ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ పాటలో అతను విక్రమ్ ఠాక్రాల్ అనే పాత్రలో కనిపించాడు. తన డ్యాన్స్ స్టైల్‌తో 80వ దశకంలో యువతను ఆకర్షించాడు.
javed jaffrey’s moves at 61... unreal, absolute LEGENDARY stuff! pic.twitter.com/w5Y06VJvho
— Joe (@YoursJoee) April 1, 2025
చదవండి: లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు