అక్క పెళ్లి.. బావ పిలిచి మరీ కొట్టాడు, నా ప్రియుడికి రక్తమొచ్చేలా..: నటి | Gori Nagori Physically Assaulted by Brother in Law at Sister Wedding | Sakshi
Sakshi News home page

నా అక్క పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌.. నా ప్రియుడిని కొట్టి, నా జుట్టు లాగి: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

Published Sun, May 28 2023 6:04 PM | Last Updated on Sun, May 28 2023 6:19 PM

Gori Nagori Physically Assaulted by Brother in Law at Sister Wedding - Sakshi

బిగ్‌బాస్‌ బ్యూటీ, నటి, డ్యాన్సర్‌ గోరి నగోరికి చేదు అనుభవం ఎదురైంది. సొంత సోదరి పెళ్లికి వెళ్లిన గోరిపై ఆమె బావ(పెద్దక్క భర్త) స్నేహితులతో కలిసి దాడి చేశాడు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో వెల్లడిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. మే 22న గోరి నగోరి చిన్నక్క యశ్మిన్‌ వివాహం కిషణ్‌గర్‌లో జరిగింది. ఈ పెళ్లికి రావాలని, వస్తే అన్ని ఏర్పాట్లు చూసుకుంటానని ఆమె పెద్దక్క భర్త జావేద్‌ హుస్సేన్‌ ఫోన్‌ చేశాడు.

జుట్టు పట్టుకుని లాగి పడేసి..
దీంతో ఆమె కిషణ్‌గర్‌లో అక్క పెళ్లికి తన ప్రియుడు, టీమ్‌తో పాటు కలిసి వెళ్లింది. వివాహం బాగానే జరిగింది. కానీ బరాత్‌లోనే అసలు గొడవ మొదలైంది. మొదట తన ప్రియుడిపై దూషించిన కొందరు వ్యక్తులు ఉన్నట్టుండి అతడిపై, అతడి వెంట ఉన్న బౌన్సర్‌పై దాడి చేయడం ప్రారంభించారు. వాళ్లను ఆపడానికి ప్రయత్నించిన గోరి జుట్టు పట్టుకుని లాగి పడేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన డ్యాన్సర్‌ ఇప్పటికీ ఆ షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నానంటోంది.

ఫిర్యాదు చేయడానికి వెళ్తే సెల్ఫీ
'నేను మా అక్క పెళ్లికి వచ్చాను. అందరం సంతోషంగా ఉన్నాం. నా బాయ్‌ఫ్రెండ్‌ సన్నీతో పాటు మరికొందరు బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తున్నారు. ఇంతలో మా బావ వాళ్ల ఫ్రెండ్స్‌తో వచ్చి సన్నీతో గొడవపడ్డాడు. సన్నీని, మా బౌన్సర్‌ రాజేశ్‌ను రక్తం వచ్చేలా కొట్టారు. ఆ గొడవను ఆపేందుకు వెళ్లిన నన్ను జుట్టు పట్టుకుని లాగి పడేశారు. నేనిప్పటికీ షాక్‌లోనే ఉన్నాను. ఈ ఘటనపై నా సోదరుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే వాళ్లసలు పట్టించుకోలేదు. ఇది మీ ఇంటిసమస్య, మీరు మాట్లాడుకుంటే సరిపోతుందని సలహా ఇచ్చారు. పైగా చాలాసేపు నన్ను వెయిట్‌ చేయించి చివర్లో మాత్రం అతడు సెల్ఫీ తీసుకున్నాడు' అని ఆవేదన వ్యక్తం చేసింది గోరి నగోరి.

చదవండి: అప్పుడేమో వరకట్న కేసు.. ఇప్పుడేమో ఆ మాజీ భర్తతోనే షికార్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement