తెలుగు సినీ అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి.
హైదరాబాద్: తెలుగు సినీ అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న ఈ ఎన్నికల్లో మొదటిసారి ఇద్దరు మహిళా జూనియర్ ఆర్టిస్ట్‌లు పోటీ పడుతున్నారు. శనివారం అభ్యర్థులు షూటింగ్ లొకేషన్లలో తమకు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారు. ఈ యూనియన్‌లో మొత్తం 2,901 మంది సభ్యులుగా ఉన్నారు.
పోటీలో ఉన్న అభ్యర్థులు..
జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్ష పదవికి ఎం.రజిని, చిలుకూరి సత్యనారాయణ, కె.కృష్ణప్రసాద్, ఎం.డి.ముజహర్‌అలీ
ప్రధాన కార్యదర్శి పదవికి ఎం.రాజశేఖర్, ఎం.డి.గౌస్, కె.రవి, రమేష్ భవానీ, వజనపల్లి ఠాకూర్
కోశాధికారి పదవికి కె.రవిశంకర్, ఎం.సత్యం, వేములపల్లి సరస్వతి అలియాస్ సునయినిలు పోటీ పడుతున్నారు.