బుర్రిలంకలో సినీ సందడి | cinema shooting in burrilanka | Sakshi
Sakshi News home page

బుర్రిలంకలో సినీ సందడి

Published Tue, Aug 9 2016 11:52 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

బుర్రిలంకలో సినీ సందడి - Sakshi

బుర్రిలంకలో సినీ సందడి

నర్సరీల్లో ‘మిక్చర్‌ పొట్లం’
చిత్ర సన్నివేషాలు చిత్రీకరణ
కడియం : మండలంలోని బుర్రిలంకలోని పలు నర్సరీల్లో మంగళవారం సినిమా షూటింగ్‌ సందడి చేసింది. శ్వేతాబసుప్రసాద్‌ ప్రధాన పాత్రలో గోదావరి సినీటోన్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ‘మిక్చర్‌ పొట్లం’ సినిమా షూటింగ్‌ జరిగింది. బుర్రిలంకలోని శ్రీ వెంకటరమణ నర్సరీ గార్డెన్‌లో ఒక పాటలోని పలుసన్నివేశాలను చిత్రీకరించారు. ఎంఎల్‌ సతీష్‌కుమార్‌ దర్శకత్వంలో భానుచందర్‌ కుమారుడు జయంత్‌ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారని చిత్రబృందం తెలిపింది. అలాగే సుమన్, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారన్నారు.
చిత్ర బృందంలో కృష్ణభగవాన్, చిట్టిబాబు, జూనియర్‌ రేలంగి తదితర నటులు నర్సరీ వద్దకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. స్థానిక యువకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని వారితో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు.
ఆద్యంతం హాస్యభరితం ‘మిక్చర్‌పొట్లం’
కంబాలచెరువు : గోదావరి సినీటోన్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘మిక్చర్‌ పొట్లం’ ఆద్యంతం హాస్యభరితంగా సాగుతుందని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన డాక్టర్‌ కంటే వీరన్న చౌదరి అన్నారు. ఆ సినిమా విశేషాలపై రాజమహేంద్రవరం రివర్‌బేలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రముఖ హీరో భానుచందర్‌ కుమారుడు జయంత్‌ హీరోగా, గీతాంజలి హీరోయిన్‌గా నటిస్తున్నారన్నారు. మాధవపెద్ది సురేష్‌ సంగీతానందిస్తుండగా,  కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం సతీష్‌కుమార్‌ వహిస్తున్నారన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement